Ysrcpnettv
YSR Congress Party Twitter YS Jagna Twitter

YSR Congress

Flash News >>>>
             కొయ్యాన‌పేట నుంచి వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి 296వ రోజు ప్ర‌జా సంక‌ల్ప యాత్ర ప్రారంభం                               నాలుగేళ్లుగా దళితుల సమస్యలపై చంద్రబాబు స్పందించలేదని, ఎన్నికలకు 6 నెలల ముందు ఎస్టీలకు మంత్రి పదవి ఇచ్చారు: టీజేఆర్ సుధాక‌ర్‌బాబు                               వైయ‌స్ జ‌గ‌న్ స‌మ‌క్షంలో రాజ‌మండ్రికి చెందిన బీసీ సంఘం రాష్ట్ర అధ్య‌క్షుడు మార్గాని నాగేశ్వ‌ర‌రావు, భ‌ర‌త్ వైయ‌స్ఆర్ సీపీలో చేరిక‌                               కేంద్ర మంత్రి అనంత్‌కుమార్ మృతికి వైయ‌స్ జ‌గ‌న్ సంతాపం                               వైయ‌స్‌ జగన్ ప్ర‌జా సంక‌ల్ప యాత్ర 295వ రోజు సాలూరు నియోజకవర్గం, పాయకపాడు నుంచి ప్రారంభం                               వైయ‌స్ జగన్ ప్ర‌జా సంక‌ల్ప యాత్ర‌ పున:ప్రారంభం                               చంద్రబాబు ముందు రాష్ట్రం సంగతి చూడు.. తర్వాత దక్షిణాది రాష్ట్రాల పర్యటన చేద్దువు: ఎస్సీ సెల్‌ రాష్ట్ర అధ్యక్షుడు మేరుగ నాగార్జున                                వైయ‌స్‌ జగన్‌పై హత్యాయత్నంలో కుట్ర ఉంది.. ఏపీ ప్రభుత్వం, పోలీసుల అజమాయిషీ లేని విచారణ సంస్థల చేత దర్యాప్తు జరిపించాలి: వైయ‌స్‌ జగన్‌ తరపు న్యాయవాది                               కత్తి మెడపై తగిలి ఉంటే వైయ‌స్‌ జగన్‌ ప్రాణాలే పోయి ఉండేవి: వైయ‌స్‌ జగన్‌ తరపు న్యాయవాది ఆందోళన                  
    Show Latest News
ప్రజా సంకల్ప యాత్ర @ 2500 KM

Published on : 08-Jul-2018 | 17:34
 

 ఆ అడుగుల వేగానికి మైళ్లు తరిగిపోతున్నాయి. ఆ అడుగుల అదురుకు అవినీతి గుండెలు చెదిరిపోతున్నాయి. ఆ అడుగులు కోట్ల కుత్తుకల నినాదాలై ఎగిసి పడుతున్నాయి. ఆ అడుగులు కోట్లాది తెలుగు వారి గుండెచప్పుళ్లైతున్నాయి. ఆ అడుగులు నేడు 2500 కిలోమీటర్ల మైలురాయిని చేరుకుంటున్నాయి. ప్రజా సంకల్ప యాత్రలో వైయస్ జగన్ మోహన్ రెడ్డి వేస్తున్న అడుగులు నవశకానికి నాంది పలుకుతున్నాయి.

ప్రతి జిల్లా అభిమానుల ఖిల్లా

ఊళ్లకు ఊళ్లే తరలివచ్చే దృశ్యం. వేలాదిగా ప్రజలు కలిసి వస్తున్న దృశ్యం. దారులు, గట్టులు, చెట్లు, చేమలు, ఇళ్లు, మిద్దెలు ఎక్కడ చూసినా జగనాభిమాన సంద్రం పరవళ్లు తొక్కుతోంది. ఒక్క ఊరు, ఒక్క మండలం, ఒక్క నియోజకవర్గం, ఒక్కజిల్లా అని చెప్పడానికి లేదు. ఆయన అడుగులను ఆత్మీయంగా స్వాగతించేందుకు తెలుగు నేలపై ప్రతి ఊరూ ఓ తోరణమై ఎదురుచూస్తోంది. ఆ నాయకుడిని ఒక్కసారి కలవాలని, తమ వినతులు చెప్పాలని, ఒక్కసారి చేయి కలపాలని, కలిసి నడవాలని, తమ గోడు చెప్పుకోవాలని, కొండంత భరోసాను ఆ చేతి నుంచి అందుకోవాలని ప్రతి ఒక్కరిదీ ఒక్కో ఆశ. ఆ జననేతను కలిసేందుకు ఎక్కడెక్కడి నుంచో వస్తున్న వారున్నారు. ఓ చోట కలవలేకపోతే వెనుతిరగక, మరోచోటకు, ఇంకోచోటకు వెళ్లి మరీ అతడిని కలుసుకుంటున్నవారెందరో.

అందరివాడు

రైతుల వెతలను అతడు వింటున్నాడు. కూలీల కష్టాలను తెలసుకుంటున్నాడు. రిక్షాకార్మికుని కష్టసుఖాలు అడుగుతున్నాడు. ఆటో డ్రైవర్ తో కలిసి టీ తాగుతున్నాడు. నేతన్నకు అండగా ఉంటానని మాటిస్తున్నాడు. అక్కచెల్లెళ్లను పిల్లల చదువుల గురించి బెంగపడద్దని భరోసా ఇస్తున్నాడు. వృద్ధుల వాత్సల్యానికి ప్రతిగా తన బాధ్యత నెరవేరుస్తానంటున్నాడు. అనారోగ్యం పాలై వైద్యం అందక అల్లాడుతున్నవారికి ఆసరా కల్పిస్తానని, దివ్యాంగులకు చేయూతనిచ్చి ఆదుకుంటానని, నిరుద్యోగులకు ఉద్యోగపర్వం అందిస్తానని వాగ్దానం చేస్తున్నాడు. మనలో ఒకడు, మనతో ఒకడు, వైఎస్ జగన్ మన అందరి వాడు అని ప్రతి ఒక్కరూ అనుకుంటున్నారు.

వ్యథలు కథలూ ఎన్నో

ప్రజా సంకల్స యాత్ర ఆరంభమై ఎనిమిది నెలలు దాటింది. ఆ పాదయాత్రికుని యాత్ర ఇప్పటికి పది జిల్లాలను దాటుకుని పోతోంది. లక్షలాది మంది కష్టజీవుల కన్నీళ్లను తుడిచి, అక్కచెల్లెమ్మలకు ఆసరాగా నిలుస్తానని భరోసా ఇస్తూ సాగుతోంది. ఓ జిల్లాలో కరువు, మరో జిల్లాలో కలుషిత నీరు, ఓ జిల్లాలో చేనేతల ఆక్రందనలు, మరో చోట రైతుల గుండె కోతలు…అడుగడుగునా అధికారం చేసిన అరాచక విధ్వంసం కళ్లకు కనబడుతోంది. కన్నీటితో తమ ఆవేదనలను అర్జీలుగా తెస్తున్నవారిని చూసి ఆ యువనేత గుండె బరువెక్కుతోంది. ఆరోగ్యశ్రీ అందడం లేదని, రేషను ఇవ్వడం లేదని, ఉపాధి లేకుండా పోయిందని, రక్షణ కరువైందని ప్రతిపక్ష నేతకు చెప్పుకుంటున్నారు. అన్నా నువ్వొస్తేనే మా బతుకులు బాగౌతాయన్నా అని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. గతంలో బాబు మాయ మాటలు నమ్మి మోసపోయిన వర్గాలు వస్తున్నాయి. బాబు చేసిన మోసాన్ని వివరంగా ఆ నాయకుడి ముందుంచుతున్నాయి. నువ్వే న్యాయం చేయాలన్నా అని అర్థిస్తున్నాయి. బాబును నమ్మి ఓటేస్తే నేడు మా గతి చూడన్నా అంటూ ఆవేదన చెందుతున్న గొంతులెన్నో. వారందరికీ వైయస్ జగన్ ఓ ఆశా జ్యోతి. మాటతప్పని నాయకుడు, మంచి కోరుకునే మహానేత వారసుడు, తమలాగే కష్టాన్ని ఎరిగిన వాడు, కన్నీళ్లకు ఎదురేగినవాడని తెలుసుకునే ఊరూరూ ఆ యువనేత వెంట అడుగులేస్తోంది. తమ కష్టం చూడటానికి వచ్చిన నాయకుడికి తామే గొడుగై నిలుస్తామంటోంది. ఎండవాన, రాయిరప్పా ఏదీ ఆ నాయకుడి దారికి అడ్డంగా కాలేకపోతున్నాయి. విమర్శలు, అవరోధాలూ అతడిని ఆపలేకపోతున్నాయి. జగన్నినాదమై సాగుతున్న ప్రజా సంకల్ప యాత్ర నాటి ప్రజా ప్రస్థానాన్ని గుర్తు చేస్తోంది. రాబోయే స్వర్ణయుగానికి అంకురార్పణ చేస్తోంది.

 

Home  |  News  |  Downloads  |  Gallery  |  Contact Us  |   Sitemap  

Official Website of YSR Congress Party
Copyright © 2011 ysrcongress.com