Ysrcpnettv
YSR Congress Party Twitter YS Jagna Twitter

YSR Congress

Flash News >>>>
             కాకినాడ జేన్‌టీయూ సెంటర్‌ నుంచి వైయ‌స్ జ‌గ‌న్ 217వ రోజు ప్ర‌జా సంక‌ల్ప యాత్ర ప్రారంభం                               ఏపీకి అన్యాయం చేస్తున్న కేంద్ర వైఖరికి నిరసనగా మంగళవారం ఏపీ బంద్‌: వైయ‌స్ జ‌గ‌న్‌                               పార్లమెంట్‌ ఆవరణలోని గాంధీ విగ్రహం వద్ద వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నేతల‌ ధర్నా                                వైయ‌స్‌ జగన్‌ 216వ రోజు పాదయాత్ర ప్రారంభం                               కాకినాడ న‌గ‌రంలో సాయంత్రం వైయ‌స్ జ‌గ‌న్ బ‌హిరంగ స‌భ‌                               అవిశ్వాసానికి అనుమతివ్వడం టీడీపీ-బీజేపీ మ్యాచ్‌ ఫిక్సింగ్‌కు నిదర్శనం: మాజీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి                               బీజేపీ అధ్యక్షుడు అమిత్‌షా, టీడీపీ రాజగురువుతో ఎందుకు చర్చలు జరిపారు, వాటి వెనుక ఉన్న రహష్యాన్ని బయటపెట్టాలి: అంబ‌టి రాంబాబు                               క‌ర‌కుదురు నుంచి వైయ‌స్ జ‌గ‌న్ 214వ రోజు ప్రజాసంకల్పయాత్ర ప్రారంభం                               ఎన్నిక‌ల‌కు సిద్ద‌మా చంద్ర‌బాబు?: వైయ‌స్ఆర్‌సీపీ నాయ‌కుడు పార్థ‌సార‌ధి                 
    Show Latest News
పొలిటికల్ హీరో

Published on : 14-May-2018 | 12:46
 

వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. ఒకే ఒక్కడు. రాజకీయ రణరంగంలో మహా మహులను మట్టి కరిపిస్తున్న యోధుడు. తలపండిన వారితో తలపడి గెలిచిన ధీరుడు. కుట్రలు, కుతంత్రాలను ఛేధించుకుని వస్తున్న అభిమన్యుడు. సంగ్రామంలో వెన్నుచూపని అర్జునుడు. రణ తంత్రాన్ని ఔపోసన పడుతున్న అభినవ రాజకీయ యువ నాయకుడు. తాను ప్రతిపక్షంలో ఉన్నా ప్రత్యర్థిని గడగడ లాడించే సత్తా ఉన్న ఉస్తాద్ వైఎస్ జగన్. యువనేత తన సిద్ధాంతాలతో, విధానాలతో, ఆచరణలతో, పోరాటాలతో ప్రత్యర్థుల్లో వణుకు పుట్టిస్తున్నాడు. రాజకీయాల్లో సరికొత్త స్టేటజిక్ పొలిటీషయన్ ఇతనొక్కడే అని ప్రతి ఒక్కరితో అనిపిస్తున్నాడు.

బాబును ఆడిస్తున్న రింగ్ మాస్టర్

చంద్రబాబుకున్నంత రాజకీయ అనుభవం లేదు. కుట్రలు, వ్యూహాలు పన్నటం ఇష్టం లేదు. కేవలం మాటకు కట్టుబడి ఉండటం అనే ఒకే విధానాన్ని అనుసరించి ప్రజాక్షేత్రంలో వైఎస్ జగన్ హీరో అయ్యాడు. చంద్రబాబు రాజకీయ జీవితంలో మర్రిచెన్నారెడ్డి, కోట్ల విజయభాస్కర్ రెడ్డి, నేదురుమల్లి జనార్థన రెడ్డి, చివరకి వైఎస్ రాజశేఖర్ రెడ్డి వంటి ఉద్దండ ప్రతిపక్ష ప్రత్యర్థులను చూసాడు...కానీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి లాంటి ప్రత్యర్థిని మాత్రం తన 40ఏళ్ల రాజకీయ జీవితంలో చూసి ఉండడు. ముక్కు సూటి తత్వంతో, ముందుకు దూసుకు వస్తున్న మిసైల్ లాంటి యువ నాయకుడి ధాటికి చంద్రబాబు కోట బీటలు వారుతోంది. చంద్రబాబును అవినీతి చక్రవర్తిగా, పూటకో మాట మార్చే ఊసరవెల్లిగా, మాట మీద నిలకడలేని వ్యక్తిగా, అవకాశవాదిగా, అసమర్థుడిగా ప్రజల ముందు నిరూపించడంలో వైఎస్ జగన్ సెంట్ పర్సంట్ సక్సెస్ అయ్యాడు. తన స్టేటజీతో ప్రభుత్వం ప్రతిపక్షం చెప్పినట్టల్లా చేసే పరిస్థితిని కల్పించాడు. జగన్ నడిచే బాటలో నడవక తప్పని పరిస్థితి టిడిపికి తీసుకువచ్చాడు. చంద్రబాబుతో వారానికో వేషం వేయాల్సిన గత్యంతరం కల్పించాడు.

హోదాకి కట్టుబడ్డ ఒకేఒక్కడు

కేంద్ర ప్రభుత్వం ఎపికి ప్రత్యేక హోదా ఇచ్చేది లేదని తెగేసి చెప్పినా సరే, పట్టు వదలకుండా హోదా సాధనకు పోరు బాట పట్టింది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీయే. ప్రత్యేక హోదా విషయంలో వైఎస్ జగన్ ఒకే మాట మీద నిలబడ్డారు. పోరాటాన్ని ముందుకు తీసుకువెళ్లారు. సింగిల్ గా కాదు రాష్ట్రం మొత్తాన్నీ కదిలించి, చైతన్యపరిచి, యువతను కడగట్టి హోదా కోసం ముందుకు దూకేలా చేసారు. ఇతర ప్రతిపక్షాలను కూడా హోదా పోరాటంలో భాగస్వాములను చేసారు. చివరికి హోదా అక్కర్లేదన్న చంద్రబాబును హోదా కోసం దీక్షకు కూర్చోబెట్టాడు.

స్పెషల్ స్టేటస్, విభజన హామీల విషయంలో చంద్రబాబు నిజస్వరూపాన్ని వైఎస్ జగన్ బట్టబయలు చేసాడు. 15 ఏళ్లు హోదా కావాలన్న నోటితో హోదా కంటే ప్యాకేజీ బెస్టు అంటూ, హోదా ఉద్యమం చేసిన వారిపై కేసులు పెట్టాడు చంద్రబాబు. మోదీ ప్రభుత్వం ఎపికి అన్ని రాష్ట్రాలకంటే ఎక్కువే ఇచ్చిందని అన్నాడు. ఈ విషయాన్ని ప్రజల్లోకి చొచ్చుకుపోయేలా చేసారు వైఎస్ జగన్. హోదా అంటే జైలుకే అన్న బాబుతో హోదాకు జైకొట్టించారు, కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధుల లెక్కలు, బాబు వాటికి పెట్టిన కన్నాలు బైట పెట్టించారు. హోదా ఉన్న రాష్ట్రాలు ఏం బాగుపడ్డాయి అన్న చంద్రబాబుతో హోదా కోసం సైకిల్ యాత్ర చేయించిన క్రెడిట్ కూడా జగన్ దే. కేంద్రాన్ని అవిశ్వాసంతో ఢీకొట్టి, రాజీనామలతో నిరసించి, నిరాహారదీక్షతో నిద్దర పట్టకుండా చేసిన జగన్, ఇటు రాష్ట్రంలో చంద్రబాబును కూడా ఉరుకులు పరుగులు పెట్టించారు. సింగిల్ డే దీక్ష, టిడిపి సైకిల్ ర్యాలీ, తిరుపతి సభలు, రాష్ట్రవ్యాప్త దీక్షలు అన్నీ వైఎస్ జగన్ వేగాన్ని అందుకోడానికి బాబు పడ్డ పాట్లే.  జగన్ ఏ వైపు మొగ్గితే భయంతో బాబు ఆ వైపు పరుగులు తీయడాన్ని చూసి ప్రజలు నవ్వుకునే పరిస్థితి వచ్చింది. వైఎస్ జగన్ పేరు చెబితే టిడిపి నేతల గుండెల్లో గుబులు మొదలౌతోంది. ప్రజా సంకల్ప పాదయాత్రలో ఎప్పుడు ఎలాంటి హామీలు వస్తాయో, ఎప్పుడు ఎలాంటి నిర్ణయాలు ప్రకటిస్తాడో, దానికి ప్రతిగా తామేం చేయాలో అర్థం కాక చంద్రబాబు అండ్ కో జుట్టు పీక్కుంటున్నారు. మొత్తానికి ఎపి పాలిటిక్స్ లో ఏకైక రియల్ హీరోలా ఒక్క వైఎస్ జగన్ మాత్రమే కనిపిస్తున్నాడు. అధికార పక్షం అవినీతి, అసమర్థతలను ప్రజా సంకల్ప యాత్రలో ఫుడ్ బాల్ ఆడేస్తున్నాడు. 

Home  |  News  |  Downloads  |  Gallery  |  Contact Us  |   Sitemap  

Official Website of YSR Congress Party
Copyright © 2011 ysrcongress.com