Ysrcpnettv
YSR Congress Party Twitter YS Jagna Twitter

YSR Congress

Flash News >>>>
             రాష్ట్ర విభజన జరుగకూడదని చంద్రబాబు ఎప్పుడైనా అన్నారా? - బొత్స సత్యనారాయణ                               చ‌ంద్ర‌బాబు జీవితం అంతా వెన్నుపోటు రాజకీయమే- తమ్మినేని సీతాారాం                               ప్రజా సంకల్ప యాత్ర నుంచి దృష్టి మళ్లించడానికి అధికార పార్టీ కుయుక్తులు- వాసిరెడ్డి పద్మ                               సంక్షేమ హాస్టళ్లను మూసి వేస్తున్నారు-వైయస్ జగన్                               బాబును సీఎం కుర్చీ నుంచి దించితేనే మంచి రోజులు-వైయస్ జగన్                               తూ.గో డీసీసీ మాజీ అధ్యక్షుడు వైయ‌స్ఆర్‌సీపీలో చేరిక‌                               ప్రజల సమస్యలన్నింటినీ అధికారంలోకి వచ్చాక పరిష్కరిస్తాం..మీడియా తో వైయస్ జగన్ మోహన్ రెడ్డి                               హోదా కోసం నిస్వార్థంగా పోరాడుతున్నాం-ఎంపి వైవీ సుబ్బారెడ్డి                               ఎవరు ఏ సమస్య చెప్పినా..వినడానికి నేను సిద్ధం..వైయస్ జగన్                 
    Show Latest News
ప్లీనరీ గ్రాండ్‌ సక్సెస్‌

Published on : 11-Jul-2017 | 14:47
 

– నవ రత్నాల్లాంటి హామీలతో పార్టీ శ్రేణుల్లో ఫుల్‌ జోష్‌
– ఆశించిన దానికంటే భారీగా తరలివచ్చిన కార్యకర్తలు
– కూర్చీలు లేకపోయినా అసంతృప్తికి లోను కాకుండా 
ఆసాంతం నిలబడే ప్రసంగాలు ఆలకించిన అభిమానులు
– జన సముద్రాన్ని తలపించిన ప్లీనరీ
– సీఎం సహా టీడీపీ శ్రేణుల్లో నిరుత్సాహం 
– పార్టీ ఫిరాయింపులపై టీడీపీలో అంతర్మథనం 

వైయస్‌ఆర్‌సీపీ అధ్యక్షుడు వైయస్‌ జగన్‌ ప్లీనరీ సందర్భంగా ప్రకటించిన హామీలపై ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చలు ప్రారంభమయ్యాయి. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల వేడి రాజుకుంది. రెండేళ్లు ముందుగానే పార్టీల్లో, ఆయా పార్టీల కార్యకర్తల్లో, జనాల్లో ఎన్నికల గురించే చర్చలు ప్రారంభమయ్యాయి. వైయస్‌ జగన్‌  ఎన్నికలకు ముందే  ప్లీనరీలో తొమ్మిది హామీలు ఇచ్చి సంచలనం నమోదు చేశారు. దేశంలో ఒక కొత్త సంస్కృతికి శ్రీకారం చుట్టి అధికార పార్టీలకు వెన్నులో వణుకుపుట్టించే ప్రజాకర్షక పథకాలతో హామీలు గుప్పించారు.

నవరత్నాల్లాంటి హామీలు..
ఏయే అంశాల్లో అధికార పార్టీ ప్రధానంగా విఫలమైందో వాటినే వైయస్‌ జగన్‌ ప్రధాన అస్త్రాలుగా సంధించారు. ప్రధానంగా రైతులు, డ్వాక్రా మహిళలు, విద్యార్థులు, నిరుద్యోగులకు అండగా నిలవడంతోపాటు ఆరోగ్యశ్రీ పథకాన్ని గతంలో మాదిరిగా అమలు చేసి చూపిస్తామని చెప్పి జనాల్లో ఆశ పుట్టించారు. ఎన్నో వేల కుటుంబాలకు ఆరోగ్యం ప్రసాదించిన ఆరోగ్యశ్రీ వైయస్‌ఆర్‌ మరణం తర్వాత ఎంత భ్రష్టు పట్టిందో జనమంతా చూస్తూనే ఉన్నారు. అలాంటి పథకాన్ని సక్రమంగా అమలు చేస్తామని హామీ ఇవ్వడంతోపాటు రాష్ట్రంలో నానాటికీ తీవ్రమవుతున్న కిడ్నీ, ఫ్లోరైడ్‌ బాధితుల సమస్యలను దృష్టిలో ఉంచుకుని వారికి కూడా పింఛన్‌ ఇస్తామని చెప్పి కొత్త విధానానికి శ్రీకారం చుట్టి ఆయా కుటుంబాలకు నైతిక భరోసా కల్పించారు. వీటన్నింటితోపాటు ఐదేళ్లలో 25 లక్షల ఇళ్లు కట్టిస్తామని చెప్పి పేదోడి సొంతింటి కలను నిజం చేస్తామని ధైర్యం చెప్పాడు. గతంలో వైయస్‌ఆర్‌ సీఎంగా ఉన్నప్పుడు అవిభాజ్య ఆంధ్రప్రదేశ్‌లో 45 లక్షల ఇళ్లు నిర్మించి ఇస్తే.. ఒక్క ఆంధ్రప్రదేశ్‌లో(13 జిల్లాలలో కలిపి) 23 లక్షల ఇళ్లు నిర్మించి ఇచ్చారు. ఇప్పుడు వైయస్‌ జగన్‌ అదేవిధంగా 25 లక్షల ఇళ్లు నిర్మించి ఇవ్వడమే కాకుండా.. వాటిని మహిళల పేరుతో రిజిస్ట్రేషన్‌ చేసి పావలా వడ్డీకే రుణాలు ఇప్పిస్తామని చెప్పడం పేదలకు భరోసా కల్పించేదే. విద్యార్థులకు ఒకటో తరగతి నుంచి ఇంటర్‌ వరకు ఉచిత విద్య అందించడంతోపాటు వారి నెలవారీ ఖర్చుల నిమిత్తం స్లాబుల వారీగా వెయ్యి వరకు ఇవ్వడం చదువులకు దూరమవుతున్న విద్యార్థులను బడికి పంపించడానికి ఉపయోగపడేదే. పింఛన్లు వెయ్యి రూపాయల నుంచి రెండు వేలకు పెంచుతూ తీసుకున్న నిర్ణయం ద్వారా ఎంతోమందికి లబ్ధి చేకూరనుంది. అన్నింటికీ మించి మద్య నిషేధం అమలు చేయడం సాహోసోపేత నిర్ణయం. నిజానికి చంద్రబాబు అధికారంలోకి రాకుముందు ఎన్టీఆర్‌ మద్యపాన నిషేధాన్ని అమలు చేస్తే తదనంతర ప్రభుత్వాలు ఆ విధానాన్నే కొనసాగిస్తూ వచ్చాయి. ప్రభుత్వ ఖజానాకు ఎక్కువ మొత్తంలో నిధులు చేకూరేది మద్యం ద్వారానే. కానీ అలాంటి మద్యం విధానాన్ని రద్దు చేయడానికి ఏ ప్రభుత్వానికైనా ధైర్యం కావాలి. కేవలం మద్యనిషేధాన్ని అమలు చేసి చేతులు దులిపేసుకోకుండా బాధితులకు ఆరోగ్య సమస్యలు రాకుండా వైద్యుల పర్యవేక్షణలో వారికి చికిత్స చేయించే బాధ్యతను కూడా తానే తీసుకుంటానని చెప్పి వైయస్‌ జగన్‌ మద్యం మత్తులో కూలిపోతున్న కుటుంబాలకు ఆసరాగా నిలబడతానని భరోసా ఇచ్చారు. 

మినీ మేనిఫెస్టోతో సంచలనం
ప్లీనరీ సందర్భంగా వైయస్‌ఆర్‌సీపీ అధినేత ప్రకటించింది తొమ్మిది హామీలే అయినప్పటికీ సరైన సమయంలో ప్రకటించి రాజకీయ వర్గాల్లో సంచలనం నమోదు చేశారు. తొమ్మిది హామీల్లోనే అన్ని వర్గాలను సంతృప్తి పరుస్తూ తీసుకున్న నిర్ణయాలతో అధికార టీడీపీలో వణుకు మొదలైంది. ఏదో ఆషామాషీగా ముగిసిపోతుందని లైట్‌ తీసుకున్న టీడీపీకి అక్కడికొచ్చిన జనాన్ని చూసి మైండ్‌ బ్లాంక్‌ అయ్యింది. అనుకున్నదానికంటే రెట్టింపు స్థాయిలో అభిమానులు, కార్యకర్తలు ప్లీనరీకి తరలిరావడం చూసి దేశవ్యాప్తంగా ఉన్న జగన్‌ అభిమానుల్లో సంతోషం పెల్లుబికింది. జన నాయకుడి ప్రసంగానికి కార్యకర్తల్లో నుంచి వస్తున్న ప్రతిస్పందన చూస్తే ఎన్నికల సమరాన్ని తలపించింది. జగన్‌ ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకార సభగా మారిపోయినంత ఉత్సాహం కలిగింది పార్టీ శ్రేణులకు. ఒకవైపు అధికారంలో ఉండీ జనాలను తరలిస్తున్నా.. మీడియాతో ప్రచారం చేస్తున్నా చంద్రబాబు సభలకు కుర్చీలు నిండటమే కష్టమవుతుంటే వైయస్‌ఆర్‌సీపీ ప్లీనరీకి మాత్రం కుర్చోవడానికి ఖాళీ లేకపోయినా అభిమానులు మాత్రం రోజంతా నిలబడే కార్యక్రమాన్ని జయప్రదం చేయడం చూసి టీడీపీ నాయకులు ఆత్మవిమర్శలు చేసుకోవడంలో మునిగిపోయారు. పైకి డాంభికాలు ప్రదర్శిస్తున్నా లోలోపల మాత్రం పార్టీకి ఎక్కడ డ్యామేజీ జరుగుతుందోనని.. పార్టీ ఫిరాయింపుదారులు ఎవరైనా ఉన్నారా అనే కోణంలో విశ్లేషణలు చేసుకుంటుండటం కొసమెరుపు. పాదయాత్ర కూడా మొదలైతే వైయస్‌ఆర్‌సీపీలోకి భారీగా చేరికలు ఉండబోతున్నాయనేది సుస్పష్టం. ఈ విషయం బాబుకు కూడా తెలియనిది కాదు. 

సంబంధిత వార్తలు

Home  |  News  |  Downloads  |  Gallery  |  Contact Us  |   Sitemap  

Official Website of YSR Congress Party
Copyright © 2011 ysrcongress.com