Epaper      Ysrcpnettv
YSR Congress Party Twitter YS Jagna Twitter

YSR Congress

Flash News >>>>
             బాబు అధికారంలోకి వచ్చి మూడేళ్లవుతున్నా రాజధానిలో ఇంతవరకు ఒక్క ఇటుక కూడ పడలేదుః వైయస్సార్సీపీ                               అసెంబ్లీలో చంద్రబలి సినిమా..అరచేతిలో వైకుంఠంలా పవర్ పాయింట్ ప్రజంటేషన్ః వైయస్సార్సీపీ ఎమ్మెల్యేలు                               రాజధాని నిర్మించే సామర్థ్యం వైయస్ జగన్ కే ఉందిః వైయస్ జగన్                               బీసీ సంక్షేమంపై చర్చకు పట్టుబట్టిన వైయస్సార్సీపీ                               ఏపీ అసెంబ్లీ సోమవారానికి వాయిదా                               వీఆర్ఏల ఆందోళనకు వైయస్ జగన్ మద్దతు                               ప్రభుత్వ తీరును నిరసిస్తూ వైయస్సార్సీపీ వాకౌట్                               ఆడియో టేపుల్లో రికార్డైన మనవాళ్లు భ్రీపుడ్ మీ వాయిస్ తనదో కాదో బాబు చెప్పాలిః వైయస్సార్సీపీ ఎమ్మెల్యేలు                               ఓటుకు కోట్లు కేసులో చంద్రబాబు అడ్డంగా దొరికిపోయారుః వైయస్సార్సీపీ ఎమ్మెల్యేలు                 
    Show Latest News
స్పీకర్‌ కు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి లేఖ

Published on : 24-Dec-2016 | 17:02
Share    

హైదరాబాద్‌: శాసనసభ హక్కుల కమిటీ గౌరవాన్ని కమిటీ సభ్యులే కించపర్చడం శోచనీయమని వైయస్సార్‌ కాంగ్రెస్‌ శాసనసభాపక్ష ఉప నాయకుడు, హక్కుల కమిటీ సభ్యుడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పేర్కొన్నారు.  ఈ మేరకు పెదిరెడ్డి స్పీకర్‌ కోడెల శివప్రసాదరావుకు లేఖ రాశారు. లేఖ సారాంశం ఇదీ..

‘గౌరవనీయులైన సభాపతి గారికి,
ఆర్యా!
ఈ నెల 22న అసెంబ్లీ కమిటీ హాలులో జరిగిన శాసనసభా హక్కుల కమిటీ సమావేశంలో గత సెప్టెంబర్‌లో శాసనసభ లోపల జరిగిన పరిణామాలపై నోటీసులు అందుకున్న కొందరు సభ్యులను పిలచి విచారించారు. నోటీసులు అందుకున్న వారు తమ అభిప్రాయాలను చెబుతున్నప్పుడు,  మధ్యలో.. నాతోపాటు సభ్యులుగా ఉన్న శ్రావణ్‌కుమార్, కె.రామకృష్ణ గారు మధ్యలో కలుగజేసుకొని మీరు చెప్పేది ఊరునంతా గజదొంగలు దోచుకుని.. ఎందుకు దొంగతనం చేశారు అంటే.. రాష్ట్ర శ్రేయస్సు కోసం, ప్రజల కోసం మేము చేశాము అని చెప్పినట్లు ఉంది మీరు చెప్పేది అని వ్యాఖ్యానించారు. తోటి కమిటీ సభ్యులు అలా మధ్యలో కలుగజేసుకొని మాట్లాడటం బాధాకరం. నోటీసులు అందుకున్న సభ్యుడు తన వివరణ ఇస్తుండగా.. మధ్యలో కలుగజేసుకొని మీరు తప్పుచేసి కమిటీ ముందుకు వచ్చారు అని చెప్పడం.. చాలా విచారకరం.
తోటి శాసనసభ్యులను బందిపో టు దొంగలంటూ పరోక్షంగా మాట్లాడటం కమిటీ గౌరవాన్ని కించపరిచేలా ఉన్నాయి. కమిటీ సభ్యులుగా ఉన్న వ్యక్తులు హుందాగా, పెద్దతరహాగా ఉండాలి కానీ, ఇలా మాట్లాడటం భావ్యంకాదు. కమిటీకి గౌరవం కూడా కాదు. కావున తమరు దయచేసి ఇకపై నోటీసులు అందుకున్న తోటి సభ్యులు తమ వివరణ ఇస్తున్నప్పడు ఇలా మధ్యలో కలుగజేసుకొని, వారిని అగౌరవ పరిచేలా మాట్లాడవద్దని కమిటీలో సభ్యులుగా ఉన్న వారికి మీరు గట్టిగా సూచించవలసిదిగా కోరుతున్నాము.’

సంబంధిత వార్తలు

Home  |  News  |  Downloads  |  Gallery  |  Contact Us  |   Sitemap  

Official Website of YSR Congress Party
Copyright © 2011 ysrcongress.com