Ysrcpnettv
YSR Congress Party Twitter YS Jagna Twitter

YSR Congress

Flash News >>>>
             35వ రోజు ప్ర‌జా సంక‌ల్ప యాత్ర ప్రారంభం                               నాటా మహాసభలకు వైయ‌స్‌ జగన్‌కు ఆహ్వానం                               వైయస్‌ జగన్‌ను కలిసిన కీలు గుర్రం కళాకారులు                               ఇమామ్‌లకు నెలకు రూ.10 వేలు ఇస్తాం- వైయస్ జగన్ మోహన్ రెడ్డి                               రాష్ట్ర విభజన జరుగకూడదని చంద్రబాబు ఎప్పుడైనా అన్నారా? - బొత్స సత్యనారాయణ                               చ‌ంద్ర‌బాబు జీవితం అంతా వెన్నుపోటు రాజకీయమే- తమ్మినేని సీతాారాం                               ప్రజా సంకల్ప యాత్ర నుంచి దృష్టి మళ్లించడానికి అధికార పార్టీ కుయుక్తులు- వాసిరెడ్డి పద్మ                               సంక్షేమ హాస్టళ్లను మూసి వేస్తున్నారు-వైయస్ జగన్                               బాబును సీఎం కుర్చీ నుంచి దించితేనే మంచి రోజులు-వైయస్ జగన్                 
    Show Latest News
కాపు రిజర్వేషన్లు కట్టు కథే

Published on : 02-Dec-2017 | 14:51
 

– సాధ్యం కాదని తెలిసీ మోసం చేసే ఎత్తుగడలో బాబు
– బీసీల రిజర్వేషన్లతో కలిపి అమలు చేయాలని వ్యూహం..!
– బీజేపీ మీదకు నెట్టేసి తప్పుకుందామని ఎత్తుగడ 
– కాపుల రిజర్వేషన్లు అమలు కావడం దాదాపు అసాధ్యమే.. 

సమస్యను సమస్యతోనే ఢీకొట్టించడం తప్ప పరిష్కారం వెతికే అలవాటు చంద్రబాబు లేనే లేదు. ఏదైనా సమస్య వచ్చినప్పుడు పరిష్కరించడం మాని మరో కొత్త సమస్యను సృష్టించి వదలడం బాబు మార్కు రాజకీయం.  బాధ్యతల నుంచి తప్పించుకోవడం కోసం ఎదుటి వారి మీద బురద చల్లి కడుక్కోమనడం చంద్రబాబు అనుసరించే వ్యూహం. దేనికీ సూటిగా సమాధానం చెప్పరు.. ఏ సమస్యనూ పరిష్కరించరు.. సమస్య దేనికదే విసుగుపుట్టి పరారవ్వాల్సిందే లేదా బాధితులే విసుగుచెంది ఆశలు వదుకోవాల్సిందే తప్ప ఆయనేం చేయరు. కాపు రిజర్వేషన్ల విషయంలో  చంద్రబాబు అలాంటి మరో ఎత్తుగడకు తెరలేపారు. నాలుగేళ్లుగా నలుగుతున్న కాపు రిజర్వేషన్ల రగడను కేంద్రం మీదకు నెట్టేసి తప్పుకునేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు పథక రచన చేసినట్టుగా స్పష్టంగా కనపడుతోంది. 

2014 ఎన్నికలకు ముందు కాపులను బీసీల్లో చేరుస్తామని ఆశ కల్పించి సీఎం అయిన చంద్రబాబు పథకం ప్రకారం ఈ నాలుగేళ్లుగా లాక్కొచ్చారు. పోలీసులను పురమాయించి కాపుల ధర్నాలు ఆపడం, ప్రలోభాలకు గురిచేసి నిరసన కారులను తన పక్కకు తిప్పుకోవడం, కేసులతో బెదిరించి లొంగదీసుకోవడం.. కారణమేదైతేనేం నాలుగేళ్లు గడిచిపోయాయి. మంజునాథన్‌ కమిషన్‌ పేరుతో రెండున్నరేళ్లు కాలం వెళ్లదీశారు. ప్రభుత్వం ఏపీకి మారడంతో నివేదిక సమర్పించడం కుదరలేదని.. డాక్యుమెంట్లన్నీ హైదరాబాదులో ఉన్నాయని ఇన్నాళ్లు చెప్పుకొచ్చారు. అయితే దీనిని ఇంకెన్నాల్లో దాచలేమని అనుకున్నాడో.. వైయస్‌ జగన్‌ పాదయాత్ర నేపథ్యంలో జనం దృష్టిని తన వైపు తిప్పుకోవాలని అనుకున్నాడో కానీ.. మొత్తానికి కాపులకు 5 శాతం  రిజర్వేషన్లు కల్పిస్తామని చెప్పుకొచ్చాడు. కాపులను బీసీ ఎఫ్‌లుగా చేరుస్తామని అసెంబ్లీలో ప్రకటించాడు. కాపుల కలను నెరవేర్చిన యోధుడిలా అసెంబ్లీలో కలరింగ్‌ ఇచ్చుకున్నాడు. షరామామూలుగానే భజన బృందాలతో పొగిడించుకున్నాడు.. పచ్చ పత్రికల నిండా మొదటి పేజీల్లో అచ్చేయించుకున్నాడు. అసెంబ్లీ తీర్మాణం చేసి పంపుతున్నామని డాబులు చెప్పకున్నాడు. అసెంబ్లీ తీర్మాణంతోనే కాపుల రిజర్వేషన్లు రావని.. అసలది జరిగే పనికాదని అందరికంటే చంద్రబాబుకే బాగా తెలుసు. అయితే ఈ కాపు రిజర్వేషన్ల అడకత్తెరలో బీజేపీని వ్యూహాత్మకంగా ఇరికించేందుకు పక్కా ప్రణాళికతో ముందుకు పోతున్నాడు బాబు. నిజానికి అసెంబ్లీలో టీడీపీ ప్రభుత్వం చేసిన తీర్మాణాన్ని ఆమోదించే పరిస్థితులు కనిపించడం లేదు. కాపు రిజర్వేషన్లపై మేము ముందడుగేశామని.. బీజేపీనే ఒప్పుకోవడం లేదని నమ్మించే ప్రయత్నమే తప్ప దీనివలన కాపులకు ఒరిగేదేం లేదు. 
రిజర్వేషన్లు అమలు అంత వీజీ కాదు..
1. రిజర్వేషన్లు అంటేనే సామాజిక, ఆర్థిక అసమానతలను రూపుమాపేందుకు ప్రవేశపెట్టినవి. అలాంటప్పుడు రాజకీయ రిజర్వేషన్లు ఎందుకు కల్పించరు.
2. కేంద్రం కూడా ఈ మధ్య స్పష్టంగా చెప్పింది 50 శాతం రిజర్వేషన్లు సుప్రీం అంగీకరించడం లేదని.. అందుకుని ఆ పరిమితి రిజర్వేషన్లు సాధ్యం కావని తేల్చేసింది. ఎలాగూ అంగీకరించని రిజర్వేషన్లు కాబట్టే హామీ ఇచ్చేస్తే ఒరిగేదేముందని బాబు ముందడుగేశారు. ఇప్పటికే 50 శాతం కోటా దాటిపోయింది. ఇలాంటప్పుడు మళ్లీ కాపులకు 5 శాతం అంటే కుదిరేపనికాదు. అలాగని బీసీల్లో ఇప్పటికే ఉన్నవారి రిజర్వేషన్లు తగ్గించాల్సి వస్తే రణరంగమే. 
3. 9వ షెడ్యూల్‌లో పెడితే చాలు.. రిజర్వేషన్లు అవుతాయనే భ్రమల్ని చంద్రబాబు ప్రజల్లో పెంచుతున్నారు. నిజానికి సుప్రీంకోర్టు ఆ 9వ షెడ్యూల్‌ స్ఫూర్తినే సమీక్షించబోతున్నది. 
4. నిజానికి మంజునాథ కమిషన్‌ ఎక్కడా బీసీలకు ఎక్కడా కాపులకు 5 శాతం రిజర్వేషన్లు ఇవ్వాలని ఎక్కడా నివేదించలేదు. అయితే చంద్రబాబు రాజకీయ కోణంలో ఆలోచించి మెజారిటీ సభ్యుల పేరిట విడివిడి నివేదికల్ని తీసుకుని ఆమోదించినట్టు ప్రకటించేశాడు. 
5. 22 నెలలుగా మంజునాథ కమిషన్‌ రిపోర్టు ఇవ్వడం లేదు.. ఇందులో కొంతకాలం అధ్యయనం, ప్రజల నుంచి అభిప్రాయాల సేకరణకు ఖర్చయినా.. రిజర్వేషన్లకు సంబంధించి ఏకాభిప్రాయం కుదరకపోవడం ఒక కారణం. అయితే హైదరాబాదులో ఆఫీసు, తరువాత విజయవాడకు మారినా సరే ఫైళ్లు హైదరాబాదులో ఉండటం ఈ జాప్యానికియ కారణం అంటూ తన అనుకూల మీడియాలో రాయించుకోవడం కూడా చంద్రబాబు తరహా రాజకీయమే. జాప్యానికి నేను కారణం కాదని జనాన్ని నమ్మించడమే ఇలాంటి కట్టుకథలు అల్లి ప్రచారం ప్రారంభించారు. 
6. గతంలో ముస్లింలకు 5 శాతం రిజర్వేషన్లు వైయస్‌ సంకల్పించినప్పడు ఇలాగే 0 శాతం రిజర్వేషన్లు దాటిపోయాయని తెలిసి ఒక శాతం తగ్గించి 4 శాతం అమలు చేశారు. 
7. ఇప్పుడు కాపుల రిజర్వేషన్లకు సంబంధించి చంద్రబాబుకు ఆ అవకాశం కూడా లేదు. ఇప్పటికే రిజర్వేషన్లు 50 శాతం దాటిపోయాయి. అయినా ఇవ్వాలనుకుంటే బీసీల రిజర్వేషన్లతో కలిపి ఇవ్వాలి. అలా చేస్తే రణరంగమే. 
అందుకే తన మెడలో పడాల్సిన కాపుల వ్యతిరేక గండాన్ని మోడీ మెడలో వేసి చంద్రబాబు తప్పించుకోవాలని చూస్తున్నాడు. 

సంబంధిత వార్తలు

Home  |  News  |  Downloads  |  Gallery  |  Contact Us  |   Sitemap  

Official Website of YSR Congress Party
Copyright © 2011 ysrcongress.com