Ysrcpnettv
YSR Congress Party Twitter YS Jagna Twitter

YSR Congress

Flash News >>>>
             చంద్ర‌బాబు ముస్లింల ద్రోహి: ఎమ్మెల్యే ముస్త‌ఫా                               బీజేపీ, టీడీపీలు ఏపీ ప్ర‌జ‌ల‌ను మోసం చేశాయి: మ‌ల్లాది విష్ణు                               కేంద్రంపై పోరాటం చేసే ద‌మ్ము, ధైర్యం చంద్ర‌బాబుకు ఉందా?: వెల్లంప‌ల్లి శ్రీ‌నివాస్‌                               వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని రాజకీయంగా ఎదుర్కోలేక తప్పుడు ఆరోపణలు చేస్తూ టీడీపీ నేత‌లు పైశాచిక ఆనందం పొందుతున్నారు: వాసిరెడ్డి పద్మ                               ప్ర‌త్యేక హోదా సాధ‌న‌కు ఎమ్మెల్యే ప‌ద‌వికి రాజీనామా చేసేందుకు సిద్ధమే: ఆదిమూల‌పు సురేష్‌                               బీజేపీ, టీడీపీల‌కు కాంగ్రెస్ గ‌తే ప‌డుతుంది: అంబ‌టి రాంబాబు                               హజీజ్‌పురం గ్రామంలో పొగాకు రైతులు వైయ‌స్ జ‌గ‌న్‌ను కలిసి వారి సమస్యలను చెప్పుకున్నారు.                               రామపురంలో దివ్యాంగులు వైయ‌స్ జ‌గ‌న్‌ను క‌లిసి త‌మ స‌మ‌స్య‌లు చెప్పుకున్నారు.                                వైయ‌స్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు వైయ‌స్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర 95వ రోజు పెద్దఅలవలపాడు శివారు నుంచి ప్రారంభ‌మైంది.                 
    Show Latest News
వన్‌ సైడ్‌ అసెంబ్లీ

Published on : 10-Nov-2017 | 15:18
 

– ప్రతిపక్షం లేకుండా సమావేశాలు ప్రారంభం
– వైయస్‌ఆర్‌సీపీ డిమాండ్‌ను పట్టించుకోని ప్రభుత్వం 
– ఫిరాయింపులపై కోర్టుకెళ్లారంటూ దాటవేసిన స్పీకర్‌ 

ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ సమావేశాలు ఈరోజు నుంచి ప్రారంభమయ్యాయి. పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేలను సస్పెండ్‌ చేయకుండా అసెంబ్లీ నిర్వహిస్తే  హాజరుకాబోమని ప్రతిపక్షం స్పష్టంగా తెలియజేసినా... ప్రతిపక్షం లేకుండానే సమావేశాలు నిర్వహించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించకపోవడమే కాకుండా నలుగురు ఎమ్మెల్యేలను మంత్రిగా చేర్చుకుని రాజ్యాంగాన్ని అపహాస్యం చేసింది. ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వ వైఖరికి నిరసనగా అసెంబ్లీ సమావేశాల్ని బాయ్‌కాట్‌ చేసింది వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ. 

స్పీకర్‌ అప్పుడలా.. ఇప్పుడిలా
పార్టీ ఫిరాయింపులు మొదలై దాదాపు రెండేళ్లవుతున్నా ఇప్పటికీ చర్యలు తీసుకోలేదు. ఇప్పటికి మొత్తం 21 మంది ఎమ్మెల్యేలు పార్టీలు ఫిరాయించారు. మొదటి ఫిరాయింపు జరిగినప్పుడే అనర్హుడిగా ప్రకటించి ఉంటే ఈరోజు ప్రతిపక్షం అసెంబ్లీని బాయ్‌కాట్‌ చేయాల్సిన అవసరం ఉండేది కాదు. అయితే, ’నేను చర్యలు తీసుకోకముందే, ప్రతిపక్షం తొందరపడి న్యాయస్థానాల్ని ఆశ్రయించింది గనుక, నేను చెయ్యగలిగిందేమీ లేదు..’ అని స్పీకర్‌ కోడెల శివప్రసాద్, బుకాయించే ప్రయత్నం చేయడం దారుణమని పార్టీ నేతలు అంటున్నారు.  

అసెంబ్లీ అధికారిక వెబ్‌సైటులో అసెంబ్లీ సెక్రటరీ స్పీకర్‌ ఆమోదించిన పార్టీ బలాబలాలు ఏ పార్టీకి ఎంతమంది సభ్యులు ఉన్నారని బులెటిన్‌ రిలీజ్‌ చేసారు. అందులో వైయస్‌ఆర్‌సీపీకి 66 మంది అని ఉంది. కానీ అందులో 21 మంది పార్టీ ఫిరాయించి అధికార పార్టీలోకి వెళ్లారు, వాళ్లలో నలుగురు మంత్రులు అయ్యారు. స్పీకర్ సమక్షంలో ఇంత దారుణంగా నడుస్తున్న సభ ఇదేనని పార్టీ నేతలు విమర్శిస్తున్నారు. 


– ఎమ్మెల్యే రోజాని సస్పెండ్‌ చేసినప్పుడు సుప్రీం కోర్ట్‌ ఆమెను సభలో కి తీసుకోండి అంటే కోర్టులు అసెంబ్లీ స్పీకర్‌ని శాసించలేవు స్పీకర్‌ నిర్ణయమే సుప్రీమ్‌ అన్నారు. 

– ప్రతిపక్ష ఎమ్మెల్యేలకు అధికార పార్టీ తోపాటు సీట్లు కేటాయించి అక్కడ కూర్చోవడం రాజ్యాంగ విరుద్ధం కాదా ?? అది అడ్డుకోవాల్సిన బాధ్యత స్పీకర్‌దే అయినా స్పందన లేదా అని ప్రశ్నిస్తున్నారు. 

– జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి నేను రాజీనామా ఇచ్చేశాను.. స్పీకర్‌ ఆమోదించడం లేదు అంటాడు... సభ్యుడు స్పీకర్‌ ఫార్మాటులో రాజీనామా చేస్తే ఎందుకు ఆమోదించలేదని ప్రతిపక్ష సభ్యులు నిలదీస్తున్నారు. 

– నంద్యాల ఉప ఎన్నికల సమయంలో ఎమ్మెల్సీగా ఉన్న శిల్పా చక్రపాణిరెడ్డి వైయస్‌ఆర్‌సీపీలోకి రావాలని నిర్ణయించుకున్నారు. పార్టీ అధినేత వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సూచనల మేరకు అందరి సమక్షంలో టీడీపీలో ఉండగా గెలిచిన ఎమ్మెల్సీ పదవికి రాజీనమా సమర్పించారు. ఈ రాజీనామాను మాత్రం వారం పదిరోజుల్లోనే చంద్రబాబు ఆమోదింపజేసుకున్నారు. 

సంబంధిత వార్తలు

Home  |  News  |  Downloads  |  Gallery  |  Contact Us  |   Sitemap  

Official Website of YSR Congress Party
Copyright © 2011 ysrcongress.com