Ysrcpnettv
YSR Congress Party Twitter YS Jagna Twitter

YSR Congress

Flash News >>>>
             పారాది నుంచి వైయ‌స్ జ‌గ‌న్ 290వ రోజు ప్ర‌జా సంక‌ల్ప యాత్ర ప్రారంభం                               గుంటూరు జిల్లా టీడీపీ మాజీ అధ్యక్షుడు మల్లాది శివన్నారాయణ, చిలకలూరిపేట టీడీపీ మాజీ అధ్యక్షుడు శివయ్య, జి.వెంకట్రావు, కె.కాంతారావులు వైయ‌స్ఆర్‌సీపీలో చేరిక‌                               దేశంలో, రాష్ట్రంలో ఇలాంటి అబద్ధపు ముఖ్యమంత్రి ఎక్కడా లేరని, గల్ఫ్‌ దేశాల్లో ఇలాంటి అబద్ధాల ముఖ్యమంత్రిని ఎప్పుడో ఉరి తీసేవారు: ఎమ్మెల్యే ర‌వీంద్ర‌నాథ్‌రెడ్డి                               చంద్రబాబు..నీకిదే ముఖ్యమంత్రిగా చివరి అవకాశం...నిన్ను దగ్గరగా గమనించిన మనిషిగా చెబుతున్నా: త‌మ్మినేని సీతారాం                               శ్రీకాకుళం ఉద్యమాల పురిటిగడ్డ...ఎంతమందిపై కేసులు పెడతావ్. : త‌మ్మినేని సీతారాం                               నీళ్లో రామచంద్ర అని అడుగుతున్నవారికి వారి దాహార్తి తీరుస్తారే కాని వారిని సైతం బుల్డోజర్‌ తో తొక్కిస్తా అని అనగల ధైర్యం చంద్రబాబుకే ఉంది: భూమ‌న క‌రుణాక‌ర్‌రెడ్డి                               వైయ‌స్ జ‌గ‌న్‌ను క‌లిసిన మ‌ధువాడ అన్న‌దాత‌లు                               టీడీపీ తోక పత్రికలో 108 దుస్థితిపై వచ్చిన కథనాలను ఏమంటారు.. అది నిజం కాకపోతే ఆ వార్తలను ఎందుకు ఖండించలేదు: సుధాక‌ర్‌బాబు                               - విజ‌య‌న‌గ‌రం జిల్లా చీపురుప‌ల్లి నియోజ‌క‌వ‌ర్గంలోని ఆనంద‌పురం క్రాస్ వ‌ద్ద 3100 కిలోమీట‌ర్ల వ‌ద్ద వేప మొక్క‌ను నాటిన వైయ‌స్ జ‌గ‌న్‌                 
    Show Latest News
అవిశ్వాసం కంటితుడుపేకేనా ?

Published on : 19-Jul-2018 | 18:11
 

– ప్రభుత్వాన్ని పడగొట్టడానికి కాదంటున్న సుజనా
– విప్‌ ఉన్నా ఓటేసే ప్రసక్తే లేదంటున్న జేసీ
– అవిశ్వాసంతో చక్రం తిప్పుతానంటున్న బాబు 
– కాలక్షేపంతో పక్కదోవ పట్టిస్తున్న టీడీపీ

‘అంతనాడు లేదు ఇంతనాడు లేదు.. సంతనాడు కట్టింది ముంతంత కొప్పు’ అని నాలుగేళ్లు రాష్ట్ర సమస్యలపై నోరు మెదపని చంద్రబాబు ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్దీ బీజేపీపై నోరు లేపుతున్నాడు. పైపై నాటకాలకు తెరదీశాడు. పోరాడాల్సినంత కాలం కేంద్రానికి సాగిలా పడి స్వలాభాలు నెరవేర్చుకుని ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని తొండాటకు తెరతీశాడు. రాష్ట్ర సమస్యలు, ఆంధ్రప్రదేశ్‌ ప్రయోజనాలంటే టీడీపీకి నవ్వులాటగా తయారైంది.  కేంద్రంపై ఎప్పట్నుంచో అవిశ్వాసం పెడదాం కలిసి రమ్మని వైయస్‌ఆర్‌సీపీ ఎన్నిసార్లు పిలిచినా నోరు మెదపని చంద్రబాబు.. హోదాతో ఏమొస్తుందని... ప్యాకేజీ బాగుందని ప్రచారం చేశాడు. మీడియా కూడా ప్యాకేజీ గురించే ప్రచారం చేయాలని సూచించాడు. గడిచిన పార్లమెంట్‌ సమావేశాల్లో ప్రత్యేక హోదా కోరుతూ వైయస్‌ఆర్‌సీపీ 13 సార్లు అవిశ్వాసం పెట్టింది. టీడీపీ కూడా కలిసి రావాలని అడిగింది. మొదట అంగీకరించిన చంద్రబాబు.. వైయస్‌ఆర్‌సీపీకి మైలేజీ రావడం ఇష్టం లేక వెనక్కి తగ్గాడు. ప్రత్యేక హోదా కోసం వైయస్‌ఆర్‌సీపీ ఎంపీలు ఆమరణ దీక్షకు దిగితే మద్దతు కూడగడతామంటూ కాంగ్రెస్‌తో పొత్తు కోసం చర్చలు చేసొచ్చిన ఘనత చంద్రబాబుది. ప్రతి పనిలోనూ ఆదాయాలు, లాభాలు వెతుక్కునే అలవాటున్న చంద్రబాబు.. రాష్ట్రం కోసం పోరాడాల్సిన ప్రతి సందర్భంలోనూ నోరెత్తకుండా మిన్నకుండిపోయి బలం తగ్గిపోయిన సందర్భంలో అవిశ్వాసమంటూ సొంత క్రెడిట్‌ కోసం పాకులాడుతున్నాడు. మీరు అవిశ్వాసం పెట్టినా మద్దతిస్తామని వైయస్‌ఆర్‌సీపీ అధ్యక్షుడు వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చెప్పినా చంద్రబాబు పట్టించుకోలేదు. తీరా వైయస్‌ఆర్‌సీపీ ఎంపీల రాజీనామాల లేఖలను స్పీకర్‌ ఆమోదించాక.. కాంగ్రెస్‌తో కలిసి వచ్చి అవిశ్వాసం పేరుతో పార్లమెంట్‌లో చంద్రబాబు నాటకాలు ఆడుతున్నారు. మొదట్లోనే అవిశ్వాస తీర్మాణాన్ని స్పీకర్‌తో ఆమోదింపజేసుకునేలా చేసుంటే.. వైయస్‌ఆర్‌సీపీ ఎంపీలు కూడా అవిశ్వాసానికి సహకరించేవారే. ఆనాడే జగన్‌ చెప్పినట్టు ఎంపీలంతా మూకుమ్మడి రాజీనామాలు చేసి ఉంటే కేంద్రం దిగిరాక తప్పని పరిస్థితి ఉండేది. 

టీడీపీ నవ్వులాట..

ఒకవైపు ఏపీ ప్రజలంతా ప్రత్యేక హోదా కోసం ఎదురుచూస్తున్నారు. అవిశ్వాసం పెట్టి మోడీ ప్రభుత్వాన్ని వణికిస్తామని చంద్రబాబు డాంభికాలు పోతున్నారు. కానీ టీడీపీ ఎంపీ సుజనా చౌదరి వెర్షన్‌ మాత్రం మరోలా ఉంది. అవిశ్వాసం పెట్టినంత మాత్రాన మోడీ ప్రభుత్వ కూలిపోతుందా?.. వారికి స్పష్టమైన మెజారిటీ ఉందని చాలా ఎగతాళిగా చెప్పడం ప్రజలను నివ్వెరపోయేలా చేస్తోంది. చంద్రబాబేమో ఢిల్లీలో చక్రం తిప్పుతానని చెబుతంటే సుజనా మాత్రం తీరిగ్గా వడియాలు ఎండబెట్టినట్టు మాట్లాడుతున్నాడు. వీళ్ల సంగతిలా ఉంటే మరో టీడీపీ ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి మాత్రం విప్‌ లేదు.. పప్పులేదు.. పార్లమెంట్‌కు వచ్చేది లేదు.. ఓటేసిది లేదని ఖరాఖండిగా చెబుతున్నాడు. వీరేదో హోదా సాధించుకొస్తారని ప్రజలెంత సీరియస్‌గా ప్రయత్నిస్తున్నా... టీడీపీ నాయకులు మాత్రం టైంపాస్‌ నిరసనలతో జనాన్ని తప్పుదోవ పట్టిస్తున్నారు. 
Labels : YSRCP, YS Jagan, NCBN, TDP

సంబంధిత వార్తలు

Home  |  News  |  Downloads  |  Gallery  |  Contact Us  |   Sitemap  

Official Website of YSR Congress Party
Copyright © 2011 ysrcongress.com