Ysrcpnettv
YSR Congress Party Twitter YS Jagna Twitter

YSR Congress

Flash News >>>>
             ‘నాపై జరిగిన హత్యాయత్నంలో చంద్రబాబుకు ఎలాంటి ప్రమేయం లేకపోతే.. స్వతంత్ర దర్యాప్తు సంస్థతో కేసు విచారణ చేయించొచ్చు కదా’ : వైయ‌స్ జ‌గ‌న్‌                                చంద్రబాబు రాజ్యాంగ వ్యవస్థలను నిర్వీర్యం చేస్తున్నారు: ఆనం రామనారాయణ రెడ్డి                               ఏ విచారణకైనా సిద్ధమని చెప్పే ధైర్యం చంద్రబాబుకు ఉందా ?: అంబటి రాంబాబు సవాల్‌                                పచ్చచొక్కాల కోసమే ప్రభుత్వ పథకాలు: వైవీ సుబ్బారెడ్డి                               చిన్నరాయుడుపేట నుంచి వైయ‌స్ జ‌గ‌న్ 298వ రోజు ప్రజాసంకల్పయాత్ర ప్రారంభం                               బిడ్డ పుట్టి ఓటు హక్కు వచ్చిన తర్వాత తనకే ఓటు వేస్తారని చంద్రబాబు పేర్కొనడం హాస్యాస్పదం: పేర్నినాని                               వైయ‌స్ జ‌గ‌న్ బాలల దినోత్సవ శుభాకాంక్షలు                                మాజీ మంత్రి సి.రామ‌చంద్ర‌య్య వైయ‌స్ జ‌గ‌న్ స‌మ‌క్షంలో వైయ‌స్ఆర్‌సీపీలో చేరిక‌                               నాలుగేళ్లుగా దళితుల సమస్యలపై చంద్రబాబు స్పందించలేదని, ఎన్నికలకు 6 నెలల ముందు ఎస్టీలకు మంత్రి పదవి ఇచ్చారు: టీజేఆర్ సుధాక‌ర్‌బాబు                 
    Show Latest News
కుయ్ కుయ్‌లు రాత్రుళ్లు వ‌ద్ద‌ట‌

Published on : 17-Aug-2018 | 17:40
 


పగలు తిప్పండి.. రాత్రి ఆపాల‌ని ఆదేశాలు 
108 వాహనాలకు నిర్వహణ సంస్థ కొత్త నిబంధనలు
ఐదు కిలోమీటర్ల లోపు అయితేనే వెళ్లండి
మీడియాతో మాట్లాడితే ఉద్యోగం నుంచి తీసేస్తాం
తమను బెదిరిస్తున్నారంటున్న ఉద్యోగులు
439 వాహనాల్లో తిరుగుతున్నవి 342 వాహనాలే


మ‌హానేత హ‌యాంలో 108 అంబులెన్సు అంటే ప్రాణాలు కాపాడే సంజీవ‌ని అని అంతా కీర్తించేవారు. ఆప‌ద‌లో ఉన్నామ‌ని ఫోన్ చేసిన అర‌గంట‌లో చేరుకునేలా ప‌ని చేసి ఎందరో  ప్రాణాలు నిల‌బెట్టాయి. అలాంటి అంబులెన్సులు ఇప్పుడు డీజిల్ లేవ‌నే కార‌ణంతో మూల‌న‌ప‌డుతున్నాయి. ఇకపై రాత్రి పూట ఫోన్‌ చేస్తే 108 రాదు. ఎందుకంటే ఉన్న వాహనాలను పగలు మాత్రమే తిప్పండి, రాత్రి నిలిపివేయండి అంటూ 108 అంబులెన్సుల నిర్వహణా సంస్థ తమ ఉద్యోగులకు ఆదేశాలు జారీచేయడమే కారణం. రాష్ట్రంలో 439 వాహనాలుండగా 422 వాహనాలు తిరుగుతున్నాయని ముఖ్యమంత్రి కోర్‌డాష్‌ బోర్డులో సమాచారం ఉంది. కానీ ప్రస్తుతం 342 వాహనాలు మాత్రమే తిరుగుతున్నాయని నిర్వాహణ సంస్థ జీవీజీ ఉద్యోగులు చెబుతున్నారు.

ఐదు కిలోమీట‌ర్ల వ‌ర‌కేన‌ట‌

వాహనాలను పగలు మాత్రమే తిప్పాలని, ఐదు కిలోమీటర్ల దూరం అయితేనే వెళ్లాలని, అంతకుమించి దూరంలో సంఘటన స్థలం ఉంటే బిజీగా ఉన్నామని చెప్పాలని ఉద్యోగులకు ఆదేశాలు వెళ్లాయి. దీంతో చాలా ప్రాంతాల్లో రోడ్డు ప్రమాదానికో, ఇతరత్రా ఆపదలో ఉన్న పేదలు 108కు ఫోన్‌ చేస్తే బిజీగా ఉన్నామని జవాబు వస్తోంది. వాహనాలు తిరగడం లేదని ఉద్యోగులెవరైనా మీడియాకు చెబితే అలాంటి వారిని ఉద్యోగం నుంచి తొలగిస్తామని సంస్థ బెదిరిస్తోందని ఉద్యోగులు వాపోతున్నారు. కొన్ని వాహనాల్లో ఆక్సిజన్‌ సిలెండర్లు లేవు, 90 శాతం వాహనాల్లో మందులు లేవు, మెజార్టీ వాహనాలకు టైర్లు అరిగిపోయి తిరగడం లేదు..ఇలాంటి పరిస్థితుల్లో ఇటీవలే ఉద్యోగులు సమ్మె నోటీసు ఇచ్చిన విషయం తెలిసిందే. దీనిపై రెండు దఫాలుగా చర్చలు జరిగినా ఫలితం లేదు. అయితే తాము ఇచ్చిన సమ్మె నోటీసును వెనక్కి తీసుకోలేమని, ఏ క్షణంలో అయినా సమ్మెలోకి వెళతామని ఉద్యోగులు హెచ్చరించారు. 

108 వాహనాల సమస్యలు ఇవీ..

- సకాలంలో ఇంజన్‌ ఆయిల్‌ మార్చకపోవడంతో ఇంజన్లు సీజ్‌ అవుతున్నాయి
- హెడ్‌లైట్‌లు పనిచేయకపోవడంతో రాత్రి సమయంలో ప్రమాదానికి గురవుతున్నాయి
- సైరన్, బార్‌లైట్స్, బ్లింకర్స్, బ్యాటరీ హారన్‌ పనిచేయడంలేదు. టైర్లు పూర్తిగా అరిగిపోయి వందల వాహనాలు తిరగలేని పరిస్థితిలో ఉన్నాయి
- బ్రేకులు, బ్యాటరీలు పనిచేయడం లేదు
- వైఫర్స్‌ పనిచేయకపోవడంతో వర్షంలో తిరగడం కష్టంగా ఉంటోంది. వాహనాల్లో మల్టీచానల్‌ మానిటర్, సెక్షన్‌ ఆపరేటర్స్, డిఫ్రిబ్యులేటర్, వెంటిలేటర్, పల్సాక్సీ మీటర్లు లేవు
- కనీసం బీపీ ఆపరేటర్, స్టెతస్కోప్, గ్లూకోమీటర్, ధర్మామీటర్‌లు కూడా లేవు
- చాలా అంబులెన్సుల్లో ఆక్సిజన్‌ అందుబాటులో లేదు
- క్షతగాత్రులకు అవసరమైన కాటన్, డ్రెస్సింగ్‌ ప్యాడ్స్, సెరిలైజ్డ్‌ దూది, అయోడిన్, స్ట్రెచర్‌ కూడా లేవు
- పాముకాటు సమయంలో ఇవ్వాల్సిన ఏఎస్‌వీ,టీటీ ఇంజక్షన్‌లు లేవు

ఉద్యోగుల సమస్యలు..

- ప్రతినెలా ఉద్యోగుల వేతనాల్లో కారణం లేకుండా కోత వేస్తున్నారు
- రోజుకు 8 గంటలు కాకుండా 12 గంటలు పనిచేయిస్తున్నారు
- వేతనం పెంచుతామని హామీ ఇచ్చినా ఇప్పటికీ పెంచలేదు
- గత 6 నెలలుకు సంబంధించిన రిలీవింగ్‌ బిల్లులు చెల్లించలేదు
- వాహనాలకు మైనరు రిపేర్లు, పంక్చర్స్, ఎయిర్, హెడ్‌లైట్లకు సంబంధించిన బిల్లులు ఉద్యోగుల మీద వేస్తున్నారు. 
- వాహనాలు ఆగిపోతే ఆ సిబ్బందికి ప్రత్యామ్నాయం చూపించకపోగా వేతనాలు కూడా ఇవ్వడంలేదు. సిబ్బంది ప్రమాదానికి గురైతే ఎలాంటి వైద్య బీమా లేదు 

సంబంధిత వార్తలు

Home  |  News  |  Downloads  |  Gallery  |  Contact Us  |   Sitemap  

Official Website of YSR Congress Party
Copyright © 2011 ysrcongress.com