Ysrcpnettv
YSR Congress Party Twitter YS Jagna Twitter

YSR Congress

Flash News >>>>
             పారాది నుంచి వైయ‌స్ జ‌గ‌న్ 290వ రోజు ప్ర‌జా సంక‌ల్ప యాత్ర ప్రారంభం                               గుంటూరు జిల్లా టీడీపీ మాజీ అధ్యక్షుడు మల్లాది శివన్నారాయణ, చిలకలూరిపేట టీడీపీ మాజీ అధ్యక్షుడు శివయ్య, జి.వెంకట్రావు, కె.కాంతారావులు వైయ‌స్ఆర్‌సీపీలో చేరిక‌                               దేశంలో, రాష్ట్రంలో ఇలాంటి అబద్ధపు ముఖ్యమంత్రి ఎక్కడా లేరని, గల్ఫ్‌ దేశాల్లో ఇలాంటి అబద్ధాల ముఖ్యమంత్రిని ఎప్పుడో ఉరి తీసేవారు: ఎమ్మెల్యే ర‌వీంద్ర‌నాథ్‌రెడ్డి                               చంద్రబాబు..నీకిదే ముఖ్యమంత్రిగా చివరి అవకాశం...నిన్ను దగ్గరగా గమనించిన మనిషిగా చెబుతున్నా: త‌మ్మినేని సీతారాం                               శ్రీకాకుళం ఉద్యమాల పురిటిగడ్డ...ఎంతమందిపై కేసులు పెడతావ్. : త‌మ్మినేని సీతారాం                               నీళ్లో రామచంద్ర అని అడుగుతున్నవారికి వారి దాహార్తి తీరుస్తారే కాని వారిని సైతం బుల్డోజర్‌ తో తొక్కిస్తా అని అనగల ధైర్యం చంద్రబాబుకే ఉంది: భూమ‌న క‌రుణాక‌ర్‌రెడ్డి                               వైయ‌స్ జ‌గ‌న్‌ను క‌లిసిన మ‌ధువాడ అన్న‌దాత‌లు                               టీడీపీ తోక పత్రికలో 108 దుస్థితిపై వచ్చిన కథనాలను ఏమంటారు.. అది నిజం కాకపోతే ఆ వార్తలను ఎందుకు ఖండించలేదు: సుధాక‌ర్‌బాబు                               - విజ‌య‌న‌గ‌రం జిల్లా చీపురుప‌ల్లి నియోజ‌క‌వ‌ర్గంలోని ఆనంద‌పురం క్రాస్ వ‌ద్ద 3100 కిలోమీట‌ర్ల వ‌ద్ద వేప మొక్క‌ను నాటిన వైయ‌స్ జ‌గ‌న్‌                 
    Show Latest News
పార్లమెంట్‌ వేదికగా రసవత్తర నాటకం

Published on : 18-Jul-2018 | 15:59
 

 – టీడీపీ అవిశ్వాస తీర్మానాన్ని ఆమోదించిన స్పీకర్‌ 

– పార్లమెంట్‌లో మళ్లీ ఒక్కటైన టీడీపీ, బీజేపీ 

– రాజ్యసభ డిప్యూటీ చైర్మన్‌ ఎన్నికలే లక్ష్యంగా ముందుకు 

– గతంలోనే అవిశ్వాసం ఎందుకని ప్రశ్నించిన చంద్రబాబు

– కుదిరితే బీజేపీ, లేదంటే కాంగ్రెస్‌కు మద్దతిచ్చే యోచనలో టీడీపీ..!

అక్కర గడుపుకుని తక్కెడ పొయ్యిలో పెట్టినట్లు.. నాలుగేళ్లు అధికారం వెలగబెట్టిన టీడీపీ, బీజేపీలు ఎన్నికలకు ముందిచ్చిన హామీలు నెరవేర్చలేదని జనం నిలదీస్తుంటే... సమాధానం చెప్పలేక ఒకరిపై ఒకరు రాళ్లేసుకుని వేరు కాపురం పెట్టారు. ఏపీకి ప్రత్యేక హోదా రాకపోవడానికి బీజేపీనే కారణమని టీడీపీ.. అసలు టీడీపీ ప్రత్యేక హోదా గురించే మమ్మల్ని ఎప్పుడూ అడగలేదని బీజేపీ.. ఒకరిపైఒకరు విమర్శలు చేసుకుంటూ వస్తున్నారు. ఈలోపు 2019 ఎన్నికలకు సమయం దగ్గరపడేకొద్దీ బీజేపీకి దూరం జరిగిన టీడీపీ.. కాంగ్రెస్‌ చేయందుకోవడానికి ప్రయత్నించి కర్నాటక ఎన్నికలను అందుకు వేదికగా మలచుకుంది. పరస్పర అవగాహనతో ముందుకెళదామని ఆ రెండు పార్టీలు నిర్ణయించుకున్నట్టు ప్రచారం జరుగుతోంది. రాష్ట్రాన్ని అశాస్త్రీయంగా విభజించారని కాంగ్రెస్‌ వాళ్లను నాలుగేళ్లు ఆడిపోసుకున్న చంద్రబాబు.. ఎన్నికల్లో పొత్తు కోసం వెంపర్లాడుతున్నాడు. సొంతంగా పోటీ చేసి గెలిచే ధైర్యం లేక కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకుని లబ్ధిపొందాలని నానా పాట్లు పడుతున్నాడు చంద్రబాబు. బీజెపీతో తెగతెంపులు చేసుకున్న తర్వాత ఎక్కిన వేదిక.. దిగిన వేదిక లేకుండా మైకు దొరికిన ప్రతిసారీ ఆ పార్టీని ఆడిపోసుకుంటూ వస్తున్నాడు. దాదాపు మూడు నెలలుగా ఈ తంతు కొనసాగుతూ వస్తోంది. జనమంతా ఆ రెండు పార్టీలు విడిపోయాయని నమ్మారు కూడా. 

 టీడీపీ, బీజేపీ యుద్ధం పైపైనే ... 

అయితే అదంతా పైపైకే అని ఈ రోజు టీడీపీ ఇచ్చిన అవిశ్వాస తీర్మానానికి స్పీకర్‌ ఆమోదం తెలపడం చూసి జనానికి అర్థమైంది. గతంలోనే ప్రత్యేక హోదా కోసం వరుసగా 11 రోజులు వైయస్‌ఆర్‌సీపీ అవిశ్వాస నోటీసులిచ్చినా పట్టించుకోని స్పీకర్‌.. ఎంపీలు రాజీనామా చేసేసినా పిలిచి మాట్లాడారు, తప్ప చర్చకు స్వీకరించలేదు. ఇంతలో రాజ్యసభ డిప్యూటీ చైర్మన్‌ పదవికి ఎన్నికలు రావడంతో బీజేపీ వైఖరిలో మార్పొచ్చింది. బీజేపీకి మళ్లీ దగ్గరయ్యే అవకాశం కోసం ఎదురుచూస్తున్న టీడీపీకి ఇదొక సువర్ణావకాశంలా కనిపించింది. ఏపీలో రాజకీయ పరిణామాలు చకచకా మారిపోయాయి. ఈ మధ్యనే అమిత్‌షా హైదరాబాద్‌కు రావడం చంద్రబాబు మద్దతుదారులైన మీడియా అధినేతను కలవడం...గడ్కరీ పోలవరం సమీక్ష పేరుతో అమరావతి వెళ్లి చంద్రబాబును కలవడం జరిగిపోయాయి. ఇంతలో పార్లమెంట్‌ సమావేశాలు మొదలయ్యాయి. నిన్నటి దాకా తిట్టిన తిట్టు తిట్టకుండా టీడీపీని తిట్టిన బీజేపీ.. ఆ పార్టీపై ప్రేమ ఒలకబోసింది. ఆంధ్రాలో ప్రతిపక్ష వైయస్‌ఆర్‌సీపీని ఇబ్బంది పెట్టడం ద్వారా టీడీపీని ప్రసన్నం చేసుకోవాలని వ్యూహ రచన చేశారు. త్వరలో జరగబోయే రాజ్యసభ డిప్యూటీ చైర్మన్‌ ఎన్నికల్లో బీజేపీకి వ్యతిరేకంగా ఓటేయాలని నిర్ణయించిన వైయస్‌ఆర్‌సీపీని టార్గెట్‌ చేశారు. తద్వారా టీడీపీకి దగ్గరై వారి ఓట్లేయించుకోవాలనేది బీజేపీ వ్యూహం. 

ఇప్పడు ‘బాలు’ చంద్రబాబు కోర్టులో ఉంది. కాంగ్రెస్, బీజేపీలలో ఎవరికి ఓటేయాలనేది టీడీపీ చేతుల్లో ఉంది. ఈ విషయంలో తన వైఖరి ఏమిటో ఇంతవరకు చంద్రబాబు ప్రకటించలేదు. దొంగలు దొంగలు ఊళ్లు పంచుకున్నట్టు రాష్ట్రాన్ని విభజించిన కాంగ్రెస్, బీజేపీలు.. విభజనకు లేఖ ఇచ్చిన టీడీపీ..అన్ని పార్టీలు కలిసి ఆంధ్ర ప్రదేశ్‌ను పంచుకుతింటున్నాయి. 

 

Labels : YSRCP, YS Jagan, NCBN, TDP

సంబంధిత వార్తలు

Home  |  News  |  Downloads  |  Gallery  |  Contact Us  |   Sitemap  

Official Website of YSR Congress Party
Copyright © 2011 ysrcongress.com