Ysrcpnettv
YSR Congress Party Twitter YS Jagna Twitter

YSR Congress

Flash News >>>>
             ఆంధ్రప్రదేశ్‌కి ప్రత్యేక హోదా కల్పించాలని కోరుతూ పార్లమెంట్ వద్ద వైయ‌స్ఆర్‌ సీపీ ఎంపీలు ధర్నా                               క్రిష్ణాపురం నుంచి వైయ‌స్ జ‌గ‌న్ 320వ రోజు ప్రజాసంకల్పయాత్ర ప్రారంభం                               ప్రజలకు ఎన్ని అబద్దాల చెప్పినా వింటారనే నాయకులకు తెలంగాణ ప్రజలు గట్టిగా బుద్ది చెప్పారు : వైయ‌స్ జ‌గ‌న్‌                               లగడపాటి రాజకీయ విశ్లేషకుడు ఎప్పుడు అయ్యాడా? అని ఆశ్చర్యం వేసింది: వైయ‌స్ జ‌గ‌న్‌                               కాంగ్రెస్‌, టీడీపీ జిమ్మిక్కులను ప్రజలను తిప్పికొట్టారు: వైయ‌స్ జ‌గ‌న్‌                               చంద్రబాబు, కాంగ్రెస్ అనైతిక పొత్తుకు ప్రజలు వ్యతిరేకంగా తీర్పు ఇచ్చారు: వైయ‌స్ జ‌గ‌న్                                భస్మాసురుడు చేయి పెట్టినా.. చంద్రబాబు కాలు పెట్టినా అంతా బుడిదే: వైయ‌స్ జ‌గ‌న్‌                               హిందూపురం టీడీపీ మాజీ ఎమ్మెల్యే అబ్దుల్‌ గని వైయ‌స్ఆర్‌సీపీలో చేరిక‌                               ప‌వ‌న్‌కు చిత్త‌శుద్ది ఉంటే చంద్ర‌బాబు అవినీతిపై నిల‌దీయాలి: ఎమ్మెల్యే ఆదిమూల‌పు సురేష్‌                 
    Show Latest News
నక్క ఎవరో మళ్లీ తేలిపోయింది..!

Published on : 08-Oct-2018 | 19:40
 ’నాకు, జగన్ కు నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది’ ఆ మధ్యన అసెంబ్లీలోనే బాబుగారు నోట వచ్చిన ముత్యంలాంటి మాట ఇది. బాబు చెప్పే విధానంలోనే నక్క ఎవరో తేలిపోయింది, ఆయన కరెక్టుగానే చెప్పారంటే ప్రతిపక్షంకూడా బాహాటంగా చెప్పి సంతోషించింది. పోలిక చెప్పేటపుడు ముందు వెనకలు ఆలోచించుకోకుండా తానే నక్కనని బాబు ఒప్పుకున్నట్టయింది. అది విని బాధపడిన పచ్చ సైన్యానికి ఇప్పుడు నిప్పుగారు చేస్తున్న పనులు చూస్తే... వైయస్ జగన్ కి బాబుకి ఎంత తేడా ఉందో నిజంగానే అర్థమవుతోందట. అసలు విషయానికి వస్తే... విజయనగరం జిల్లాలో పాదయాత్ర బహిరంగ సభ జరుగుతోంది. వైయస్ జగన్ సభ అంటే ఆ పరిసరాలు జనసంద్రంగా మారిపోతాయనేది టిడిపితో సహా అందరికీ తెలిసిన వాస్తవమే. అలాంటి జనసంద్రంలో ఒక ఆటో పేషెంట్ ను తీసుకువెళ్లడానికి దారి లేకపోవడం గమనించిన జగన్... వెంటనే తన ప్రసంగం ఆపి ’ఆటో అంబులెన్స్ కి దారివ్వండి’ అంటూ ప్రజలకు పదే పదే విన్నవించారు. దాంతో ఆ ప్రజా వెల్లువ రెండుగా చీలిపోయే నాయకుడి చెప్పినట్టుగా దారిచ్చారు. పేషెంట్ ఉన్న ఆటో ముందుకు వెళ్లిపోయింది. అంతా అయిపోయిన తర్వాత వైయస్ జగన్ మాట్లాడుతూ.. 108 ఉండి ఉంటే ఈ దుస్థితి వచ్చేదా? ఆస్పత్రికి వెళ్లే దారిలో పేషెంట్ కి ఎలాంటి ప్రమాదం జరగకుండా కాపాడే వ్యవస్థ ఉండేది. ఇప్పుడు ఆ పథకం ఎంత దుస్థితికి చేరిందో చెప్పడానికి ఈ ఆటోనే ఉదాహరణ’ అంటూ ప్రజల్లో చైతన్యం నింపే ప్రయత్నం చేశారు. రాజకీయాలను పక్కన పెట్టి వైయస్ జగన్ చేసిన ఆ పని పార్టీలకతీతంగా అందరినీ ఆకర్షించింది, ఆలోచింపజేసింది. అదే బాబుగారికి నచ్చలేదు. ఎలాగైనా తాను జగన్ కంటే గొప్ప మానవతావాదినని చెప్పుకోడానికి స్కెచ్ వేశాడు. టిడిపి సభ జరుగుతున్న చుట్టుపక్కల అంబులెన్స్ తిరిగేలా చూడమని తమ్ముళ్లకు ఆర్డర్ వేశాడు. ఇంకేముంది.. పేషెంట్ తో పనిలేకుండా కుయ్ కుయ్ మంటూ ఒక అంబులెన్స్ అక్కడే తిరుగుతోంది. చివరకు ప్రజలు కూడా ఇది గమనించేసరికి ఒక పచ్చ కార్యకర్తను అందులో ఎక్కించి, గాయాలయ్యాయి అంటూ నమ్మించే ప్రయత్నం చేశారు. ఇంతజరిగాక కూడా... బాబుకి వైయస్ జగన్ కి నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా ఉందంటే ఎవరు నమ్మరు చెప్పండి. చివరకు పులిని చూసి వాతపెట్టుకుంటున్న నిప్పులాంటి నక్కను చూసి తమ్ముళ్లు కూడా తల జెండాకేసి కొట్టుకుంటున్నారట.  

 
Labels : chandra babu, ys jagan, ap,
Home  |  News  |  Downloads  |  Gallery  |  Contact Us  |   Sitemap  

Official Website of YSR Congress Party
Copyright © 2011 ysrcongress.com