Ysrcpnettv
YSR Congress Party Twitter YS Jagna Twitter

YSR Congress

Flash News >>>>
             క‌నిగిరి నియోజ‌క‌వ‌ర్గంలోకి ప్ర‌వేశించిన ప్ర‌జా సంక‌ల్ప యాత్ర‌..వైయ‌స్ జ‌గ‌న్‌కు ఘ‌న స్వాగ‌తం                               ప్ర‌త్యేక హోదా రాక‌పోవ‌డానికి చంద్ర‌బాబు విల‌న్ నంబ‌ర్ వ‌న్‌: వైయ‌స్ఆర్‌సీపీ అధికార ప్ర‌తినిధి పార్థ‌సార‌ధి                               కె. అగ్ర‌హారంలో వైయ‌స్ జ‌గ‌న్‌కు ఘ‌న స్వాగ‌తం                               ఎవ‌రు ముందుకు వ‌చ్చినా.. రాక‌పోయినా తాము మాత్రం కేంద్ర ప్ర‌భుత్వంపై మార్చి 21న అవిశ్వాస తీర్మానం పెడ‌తాం: వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియ‌ర్ నాయ‌కుడు పెద్దిరెడ్డి రామ‌చంద్రారెడ్డి                                చెరువుకొమ్ముపాలెం చేరుకున్న వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి                               తిమ్మపాలెం శివారు నుంచి 94వ రోజు ప్రజాసంకల్పయాత్ర ప్రారంభం.                                చంద్ర‌బాబు, ప‌వ‌న్ క‌ళ్యాణ్ డ్రామాల‌ను ప్ర‌జ‌లు గ‌మ‌నిస్తున్నారు: శిల్పా చ‌క్ర‌పాణిరెడ్డి                               చంద్రబాబుపై పోరాడాల్సింది పోయి.. ప్రతిపక్షాన్ని ప్రశ్నించటంలో ఆంతర్యమేంటి?- అంబ‌టి రాంబాబు                               చౌటపాలెంలో పార్టీ జెండా ఆవిష్కరించిన వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి                 
    Show Latest News
టిడిపికి మైండ్ బ్లాక్

Published on : 21-Aug-2017 | 16:22
 

తాను వలచింది రంభ, తాను మునిగింది గంగ అనుకుంటారు టిడిపి నేతలు. అందుకే వారు చేసేవన్ని సత్కార్యాలు, ప్రతిపక్షం నోరు మెదిపితే అన్యాయాలుగా కనిపిస్తున్నాయి.
డ్యూటిని సక్రమంగా చేసినందుకు, అధికార పార్టీ నాయకుల ఇసుక మాఫియాకు అడ్డు పడ్డందుకు, మహిళా ఎమ్మార్వోను జుట్టుపట్టుకుని ఈడ్చిన ఘనులున్న పార్టీ టిడిపి. కాల్ మనీ దందాతో మహిళలను లైంగిక వేధింపుకులకు గురి చేసిన తెరచాటు నాయకులకు అడ్డా టిడిపి పార్టీ.మహిళా ఎమ్మెల్యేలు, అధికారులపై చేయి వేసే కీచకులున్న పార్టీ టిడిపి పార్టీ. అటువంటి పార్టీ నాయకులనించి మంచి మాటలు ప్రజలెప్పుడూ ఎక్స్ పెక్ట్ చేయలేరు. నంద్యాల ఉప ఎన్నికల ప్రచారం చివరి రోజున టిడిపి ఎమ్మెల్యే బోండా ఉమ మరోసారి ఆ దుర్యోధన, దుశ్వాశన నాయకుల జాబితాలో తన పేరు కూడా చేర్చుకున్నారు. 

ఎన్నికల్లో గెలుపు ఓటములు, వాటి కోసం నాయకుల సవాళ్లూ జరగడం సాధారణమే. కాని ఒక మహిళ గురించి మాట్లాడుతున్నామన్న కనీస సృహ కూడా మరిచి బోండా ఉమ మాట్లాడిన విషయాలను విని మహిళలంతా టిడిపి పార్టీని, ఆ నాయకులని ఛీదరించుకుంటున్నారు. ‘’నువు గుండు కొట్టించుకో’’ అంటూ ఒక ప్రతిపక్ష పార్టీ మహిళా నాయకురాలికి సవాల్ విసరడం ఒక్క టిడిపి నేతలకే సాధ్యం. మంచి, చెడు విచక్షణ అనేది పూర్తిగా కోల్పోయి, ఏం మాట్టాడుతున్నారో కూడా అర్థం కానంతగా దిగజారిపోయిన ఈ నేతలను చూసి ప్రజలు అసహ్యంతో తల తిప్పుకుంటున్నారు. గత పదిరోజులుగా ప్రచారంలో జగన్ అడుగు పెట్టిన ప్రతిచోటా జన ప్రభంజనమే. టిడిపి నేతలకు ప్రచారం కంటే, ప్రజలను వైఎస్ జగన్ రోడ్ షోకి రాకుండా దాచి పెట్టుకోవడంతోనే సరిపోయింది. అంత చేసినా ఇంటింటి నుండీ సైనికులై కదలి వచ్చారు నంద్యాలు ప్రజలు. ఉప ఎన్నిక దగ్గర పడటంతో ప్రచారానికై నంద్యాల వచ్చిన చంద్రబాబుకు బోసిరోడ్ల స్వాగతం లభించింది. కార్యక్తలు, సిఎమ్ భద్రతా సిబ్బంది తప్ప రోడ్డు మీద కన్నెత్తి చూసేందుకైనా జనం కనిపించలేదు.

నోటికొచ్చినట్టు మాట్లాడటం, ప్రతిపక్షాన్ని అకారణంగా దూషించడం, పచ్చి అబద్ధాలను అలవోకగా చెప్పేయడం, మహిళలను కూడా కనీస గౌరవం లేకుండా మాట్లాడటం, చివరకు ప్రజలనే బెదిరించి, భయపెట్టడం చేస్తున్న టిడిపి కి ప్రజలు వీలనంత దూరంగా ఉండాలనుకుంటున్నారు. ప్రతిపక్ష పార్టీలో ఉన్న జగన్ తన ఎమ్మెల్యేలు అధికార పార్టీలోకి మారినా వారిని రాజీనామా చేయించి ఎన్నికల్లో నిలబడమని చెప్పండి అంటూ ఎంతో హుందాగా ముఖ్యమంత్రిని కోరారు తప్ప, పార్టీ మారారు అన్న కక్షతో ఎవ్వరిపైనా ఆరోపణలు గుప్పించలేదు. కాని టిడిపి ఎమ్మెల్యేలు పార్టీమారిన నేతల గురించి కూసే కారు కూతలు వింటే వారి బుద్ధి బురదగుంటలో పడి దొర్లుతోందని అర్థం అవుతుంది. శిల్పామోహన్ రెడ్డి నిన్నటి వరకూ టిడిపిలో ఉన్నప్పుడు వారిపై ఎలాంటి ఆరోపణా లేదు. వైసిపిలో అడుగు పెట్టగానే ఆయనపై లెక్కలేనన్ని ఆరోపణలు, ప్రచారాలు చేయిస్తున్నారు చంద్రబాబు. నిజంగా శిల్పా మోహన్ రెడ్డి చెడ్డవాడైతే మూడేళ్లుగా బాబు ఎందుకు ఆయన్ను పక్కనే ఉంచుకున్నాడంటే సమాధానం లేదు.
ఇక విపక్షాన్ని తిట్టించడానికి బఫూన్లను డబ్బిచ్చిమరీ పిలిపించుకుంటోంది టిడిపి. ఇష్టం వచ్చినట్టు వాగే ఆ బఫూన్లను ప్రజలు చూసి నవ్వుకుంటారే కాని, ఆ అబద్ధపు మాటలను పట్టించుకోరని టిడిపికి ఎప్పుడు అర్థం అవుతుందో. నంద్యాల చేజారిపోయిందని అర్థం కాగానే టిడిపి నేతలు విషప్రచారం జోరైంది. ఇంకా కొన్నిగంటలే ఈ అబద్ధాల జాతర. బాలెట్ పై ఓటుతో టిడిపిని ఫైర్ చేసేయడానికి కౌంట్ డౌన్ స్టార్ట్ అయిపోయింది.
 
 
Labels : #YSRCP, #TDP, #NANDYAL

సంబంధిత వార్తలు

Home  |  News  |  Downloads  |  Gallery  |  Contact Us  |   Sitemap  

Official Website of YSR Congress Party
Copyright © 2011 ysrcongress.com