Epaper      Ysrcpnettv
YSR Congress Party Twitter YS Jagna Twitter

YSR Congress

Flash News >>>>
             నారాయణరెడ్డి హత్య కేసుపై సీబీఐ విచారణ జరిపించాలిః వేణుగోపాలకృష్ణ                               ప్రజల మన్ననలు పొందలేక చంద్రబాబు ప్రత్యర్థులను అంతమొందించాలని చూస్తున్నాడుః వేణుగోపాలకృష్ణ                               కరువు నివారణ చర్యలు చేపట్టడంలో బాబు సర్కారు విఫలమైందిః కాకాని గోవర్ధన్ రెడ్డి                               పట్టిసీమ ప్రాజెక్ట్ వల్ల బాబు, లోకేష్ ల గ్రోత్ రేటు పెరిగిందే తప్ప రైతులు, ప్రజల గ్రోత్ రేటు పెరగలేదుః కన్నబాబు                               అవినీతి, హత్యల్లో చంద్రబాబు ఏపీని నంబర్ వన్ చేశాడుః దాడిశెట్టి రాజా                               నష్టాల్లో ఉందని ఆర్టీసీని మూసేస్తారా..? ప్రభుత్వ ఆస్తులను అమ్మేస్తారా బాబుః పద్మ                               ప్రభుత్వ పాఠశాలలను నారాయణ విద్యాసంస్థలకు కట్టబెట్టే ప్రయత్నం జరుగుతోందిః వాసిరెడ్డి పద్మ                               అధికారం కోసం బాబు ఎంతకైనా తెగిస్తాడు..సొంత కుటుంబాన్నే సర్వనాశనం చేశాడుః భూమన                               రాజారెడ్డిని హత్య చేయించింది చంద్రబాబేః భూమన కరుణాకర్ రెడ్డి                 
    Show Latest News
మ‌హా సంక‌ల్పం

Published on : 29-Mar-2017 | 12:43
 

విశాఖ ప్ర‌త్యేక రైల్వే జోన్ సాధ‌న‌కు వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరుబాట‌
ఈ నెల 30 నుంచి గుడివాడ అమ‌ర్‌నాథ్ పాద‌యాత్ర‌
250 కిలోమీట‌ర్ల యాత్ర‌కు స‌ర్వం సిద్ధం
పాద‌యాత్ర విజయ‌వంతం చేసేందుకు పార్టీ శ్రేణులు స‌న్నద్ధం

 విశాఖపట్నం:  రైల్వే జోన్ కోసం దశాబ్దాలుగా విశాఖ‌వాసులు ఉద్యమాలు చేస్తున్నా ప్ర‌భుత్వాల‌లో చ‌ల‌నం రావ‌డం లేదు. జోన్‌ వస్తే యువతకు ఉపాధి లభించడంతోపాటు కుటుంబాలు బాగుపడతాయన్న వారి ఆశలకు వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ప్రతిపక్ష నేత వైయ‌స్‌ జగన్‌ మోహన్‌రెడ్డి ఒక్కరే బాసటగా నిలిచారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో అలుపెరుగని పోరాటం చేస్తున్నారు. తమ నాయకుడిని ఆదర్శంగా తీసుకుని, ఆయన సూచనల మేరకు వైయ‌స్ఆర్ కాంగ్రెస్  పార్టీ జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్‌నాథ్ ఈ నెల 30 నుంచి మ‌హా పాద‌యాత్ర‌కు సిద్ధ‌మ‌వుతున్నారు. ప్ర‌త్యేక రైల్వే జోన్ సాధ‌న‌కు గతేడాది ఏప్రిల్‌ 14న గుడివాడ అమ‌ర్‌నాథ్ ఆమరణ నిరాహారదీక్ష చేశారు. విశాఖ ప్రజలతో పాటు చుట్టు పక్కల జిల్లాల నుంచి పార్టీలకు అతీతంగా నాయకులు, ప్రజలు తండోపతండాలుగా తరలివచ్చి ఆయన దీక్షకు సంఘీభావం తెలిపారు. ఆ ప్రభంజనాన్ని తట్టుకోలేక రాష్ట్ర ప్రభుత్వం దీక్షను భగ్నం చేశారు.వైయ‌స్ జ‌గ‌న్ మాట‌లే పాద‌యాత్ర‌కు అంకురార్ప‌ణ‌
గుడివాడ అమ‌ర్‌నాథ్ చేస్తున్న ఆమ‌ర‌ణ నిరాహార‌దీక్ష‌ను ప్ర‌భుత్వం భ‌గ్నం చేసిన స‌మ‌యంలో వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్షులు వైయ‌స్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి స్పందించారు. స్వ‌యంగా ఆయ‌న విశాఖ వ‌చ్చి అమర్‌ను పరామర్శించి ధైర్యం చెప్పారు. పోరాటం ఇక్కడితో ఆగిపోదని, మరింత ఉధృతం చేద్దామని స్ఫూర్తి నింపారు. అధినేత‌ మాటలే నేటి పాదయాత్ర ఆలోచనకు అంకురార్పణ చేశాయి.సామాన్యుడి గుండె చప్పుడు వినేందుకు ఇడుపులపాయ నుంచి ఇచ్ఛాపురం వరకూ పాదయాత్ర చేసిన మహానేత దివంగత డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖరరెడ్డి చూపిన బాటలో.. నాయకుడంటే జనం గుండెల్లో నిలిచేవాడేనని ఆయన చెప్పిన మాటల స్ఫూర్తితో.. విశాఖ ప్రజల చిరకాల కల అయిన రైల్వే జోన్‌ కోసం వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ మరో బృహత్తర యజ్ఞానికి అంకురార్పణ చేయనుంది. ప్రజల కష్టాలను పాలకుల దృష్టికి తీసుకువెళ్లి ప్రభుత్వం కన్ను తెరిపించడం కోసం విశాఖ‌ జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్‌నాథ్‌ పాదయాత్ర చేయనున్నారు. ఈనెల 30వ తేదీన పాదయాత్రను ప్రారంభించి 250 కిలోమీటర్లు సాగించేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. యాత్ర‌ను విజ‌య‌వంతం చేసేందుకు పార్టీ శ్రేణులు స‌న్న‌ద్ధ‌మ‌వుతున్నారు. ప్ర‌జ‌ల ఆకాంక్ష‌ను ప్ర‌భుత్వాల‌కు వినిపించేలా పోరాటం చేసేందుకు పార్టీ నాయ‌కులు స‌మ‌ష్టిగా ఉద్య‌మించేందుకు సిద్ధం అవుతున్నారు.

పాద‌యాత్ర విజ‌య‌వంతానికి బీచ్‌వాక్‌
రైల్వే జోన్ సాధ‌న కోసం వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ విశాఖ జిల్లా అధ్య‌క్షుడు గుడివాడ అమ‌ర్‌నాథ్ చేస్తున్న పాద‌యాత్ర‌ను విజ‌య‌వంతం చేయాల‌ని కోరుతూ ఈ నెల 26న వైయ‌స్ఆర్‌సీపీ రాజ్య‌స‌భ స‌భ్యుడు ఎంపీ విజ‌య‌సాయిరెడ్డి ఆధ్వ‌ర్యంలో బీచ్‌వాక్ చేప‌ట్టారు. ఆదివారం ఉదయం సాగర తీరంలో పార్టీ నాయకులతో క‌లిసి ఎంపీ విజ‌య‌సాయిరెడ్డి ప్ర‌ద‌ర్శ‌న చేప‌ట్టి‘ఈస్ట్‌కోస్ట్‌ హటావో వాల్తేర్‌ బచావ్‌’ అంటూ నినాదాలు చేస్తూ వైఎంసీఏ నుంచి ఆర్కే బీచ్‌ వరకు ఈ వాక్‌ సాగింది. ప్రత్యేక రైల్వే జోన్‌ ఆవశ్యకతను వాకర్స్‌కు వివరిస్తూ ఫ్లకార్డులను ప్రదర్శించారు. ఈ సందర్భంగా విజయసాయిరెడ్డి మాట్లాడుతూ విశాఖ రైల్వే జోన్‌తో ఉత్తరాంధ్ర ప్రజల జీవితాలు ముడిపడి ఉన్నా, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్య వైఖరి కారణంగా భవిష్యత్‌ ఆగమ్యగోచరంగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైల్వే జోన్‌పై చూపిస్తున్న నిర్లక్ష్య ధోరణకి నిరసనగా పార్టీ జిల్లా అధ్యక్షుడు అమర్‌నాథ్‌ ఈ నెల 30 నుంచి 11 రోజుల పాటు పాదయాత్ర చేపడతారని చెప్పారు. ఈ యాత్ర‌ను విజ‌యవంతం చేయాల‌ని విజ‌య‌సాయిరెడ్డి కోరారు.

సంబంధిత వార్తలు

Home  |  News  |  Downloads  |  Gallery  |  Contact Us  |   Sitemap  

Official Website of YSR Congress Party
Copyright © 2011 ysrcongress.com