Ysrcpnettv
YSR Congress Party Twitter YS Jagna Twitter

YSR Congress

Flash News >>>>
             35వ రోజు ప్ర‌జా సంక‌ల్ప యాత్ర ప్రారంభం                               నాటా మహాసభలకు వైయ‌స్‌ జగన్‌కు ఆహ్వానం                               వైయస్‌ జగన్‌ను కలిసిన కీలు గుర్రం కళాకారులు                               ఇమామ్‌లకు నెలకు రూ.10 వేలు ఇస్తాం- వైయస్ జగన్ మోహన్ రెడ్డి                               రాష్ట్ర విభజన జరుగకూడదని చంద్రబాబు ఎప్పుడైనా అన్నారా? - బొత్స సత్యనారాయణ                               చ‌ంద్ర‌బాబు జీవితం అంతా వెన్నుపోటు రాజకీయమే- తమ్మినేని సీతాారాం                               ప్రజా సంకల్ప యాత్ర నుంచి దృష్టి మళ్లించడానికి అధికార పార్టీ కుయుక్తులు- వాసిరెడ్డి పద్మ                               సంక్షేమ హాస్టళ్లను మూసి వేస్తున్నారు-వైయస్ జగన్                               బాబును సీఎం కుర్చీ నుంచి దించితేనే మంచి రోజులు-వైయస్ జగన్                 
    Show Latest News
నిధులా నిమ్మకాయలా..నాన్నారు నన్ను పీకేస్తారు?

Published on : 21-Sep-2017 | 16:41
 

  • కేంద్రం నుంచి నిధులు రాబడతాం అన్న చంద్రబాబు
  • తర్వాత నిధులు ఇవ్వడం లేదని నిట్టూర్పులు
  • నాన్న ఏదైనా చేస్తారన్న లోకేష్
  • ఇప్పుడు నిధులు కావాలంటే మోడీని వెళ్లి అడగమంటున్న చినబాబు
  • ప్రశ్నలు వేయకండి – నన్ను ఈ శాఖ నించి పీకేస్తారన్న పప్పుబాబు
పూటకో మాట, గంటకో లెక్క చంద్రబాబు తీరిది. ప్రభుత్వ అధినేత చంద్రబాబు ఇవాళ చెప్పింది రేపు చెప్పరు. రేపు చెప్పింది ఎల్లుండి ఒప్పరు. మరి ఆయన వారసత్వమేగా మిస్టర్ పప్పేష్. మరోలా ఎందుకుంటారు…? తండ్రికి తగ్గ తనయుడని పేరు సార్థకం చేసుకుంటున్నారు. దొడ్డిదారిలో పంచాయితీ రాజ్, ఐటి మంత్రిగా ఉన్న లోకేష్ తన శాఖల పనితీరును సమీక్షించే సాహసం కూడా చేసేశారు. శ్రీకాకుళంలో పంచాయితీ రాజ్ శాఖ ప్రగతిపై ఉన్నత అధికారులు మంత్రులతో సమీక్షా సమావేశం నిర్వహించిన పప్పుగారు… ఏం అడిగినా అంతా ప్రధానమంత్రే చేశారనడంతో వినేవారికి బొమ్మరిల్లు సినిమా డైలాగు గుర్తొచ్చిందట. పంచాయితీ రాజ్ లో మార్పులకు మోదీనే కారణమని, నిధులు కావాలంటే మీరు ఆయన్నే అడగండి అని చెప్పిన లోకేష్, నిధులకోసం నాన్నగారు అన్ని ప్రయత్నాలు చేస్తున్నారంటూ బాజా కూడా వాయించాడట. ఇక ఇంటింటా తెలుగుదేశం కార్యక్రమం గురించి కూడా ఆరా తీసిన పప్పుకి మంత్రి అచ్చెన్నాయుడు, చీఫ్ విప్ రవికుమార్, కొంతమంది ఎమ్మెల్యేలు తమ బాధలు ఏకరువుపెట్టారట. ఎక్కడికెళ్లినా ప్రజలు ఎదురు ప్రశ్నిస్తున్నారని, రెండు మూడేళ్లుగా పెండింగ్ లో ఉన్న బిల్లులు చెల్లించాలని పట్టుబడుతున్నారని, వాళ్లు వేస్తున్న ప్రశ్నలకు ఏం సమాధానం చెప్పాలో తెలియడంలేదని పచ్చ బ్యాచ్ మొత్తం లోకేష్ ముందు బోరుమన్నారట. దాంతో ఏమీ అర్థంకాని లోకేష్ ఒక్కసారిగా ప్లేటు ఫిరాయించి… ‘ఇలా సమస్యలు చెప్పుకుంటూ పోతే మన సమావేశం ఉద్దేశ్యం తప్పుదారిపడుతుంది. వాటిగురించి ఇక నా దగ్గర ప్రస్తావించకండి. నాన్నగారు ఈ విషయాలు విన్నారంటే నా శాఖ కూడా మార్చేస్తారు’ అన్నాడట. అంతే  అందరూ ఒక్కసారిగా ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారట. బాబంటే ఆ మాత్రం భయం ఉండాలి మరి. స్వలాభం పక్కనపెట్టి, అవినీతికి సహకరించకుండా ఎవరైనా ప్రజాసమస్యల గురించి ఎక్కువగా చర్చిస్తే వారి ఉద్యోగం ఊడిపోవడం ఖాయం. ఇది చంద్రబాబు నైజం. ఆ చెట్టు కొమ్మే కాబట్టి అది బాగా తెలిసిన లోకేష్ ముందుగానే జాగ్రత్తపడి సమీక్షలో ప్రజాసమస్యల ప్రస్థావన రాకుండా జాగ్రత్తపడ్డాడు. బాబుకి తగ్గ బాబు అనిపించుకున్నాడు. తన పుత్రరత్నం ప్రజలగురించి ఆలోచించి తప్పుదారిలో పడకుండా ఇంచక్కా తాను కోరుకునే పప్పు దారిలోనే ఉన్నందుకు బాబుకి పుత్రోత్సాహం పొంగుకొచ్చిందని టాక్. 

సంబంధిత వార్తలు

Home  |  News  |  Downloads  |  Gallery  |  Contact Us  |   Sitemap  

Official Website of YSR Congress Party
Copyright © 2011 ysrcongress.com