Ysrcpnettv
YSR Congress Party Twitter YS Jagna Twitter

YSR Congress

Flash News >>>>
             హిందూ సంప్రదాయాలకు గండికొట్టి, దైవ సమానులైన అర్చక కుటుంబాలను స్వామి సేవల నుంచి దూరం చేస్తున్నారు: భూమ‌న                                ఆంధ్రప్రదేశ్‌లో కులాల మధ్య చిచ్చు పెట్టిన విధంగానే, అర్చకుల కుటుంబాల మధ్య చంద్రబాబు చిచ్చు పెడుతున్నారు: భూమన కరుణాకర్‌రెడ్డి                                తాడేపల్లిగూడెం మార్కెట్‌ నుంచి వైయ‌స్ జ‌గ‌న్ 168వ ప్ర‌జా సంక‌ల్ప యాత్ర ప్రారంభం                               వైయ‌స్‌ జగన్‌మోహన్‌ రెడ్డి చేప‌ట్టిన ప్రజాసంకల్పయాత్ర 167వ రోజు వెంకటరామన్న గూడెం శివారు నుంచి ప్రారంభం                               కుటుంబంలో ఒక ఆత్మీయుడిని కోల్పోయాం: వైయ‌స్ భార‌తి                               వైయ‌స్ఆర్‌ కాం‍గ్రెస్‌ పార్టీ రాజకీయ వ్యవహారాల మండలి సభ్యుడు డీఏ సోమయాజులు భౌతికకాయానికి వైయ‌స్ జ‌గ‌న్ నివాళులు                               వైయ‌స్ఆర్‌ కాం‍గ్రెస్‌ పార్టీ రాజకీయ వ్యవహారాల మండలి సభ్యుడు డీఏ సోమయాజులు మృతి పట్ల వైయ‌స్‌ జగన్‌మోహన్‌ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి                                వైయ‌స్ఆర్‌ కాం‍గ్రెస్‌ పార్టీ రాజకీయ వ్యవహారాల మండలి సభ్యుడు డీఏ సోమయాజులు ఆదివారం తెల్లవారుజామున క‌న్నుమూత‌                               ర‌మ‌ణ దీక్షితులు లేవ‌నెత్తిన అంశాల‌పై సీబీఐ విచార‌ణ జ‌రిపించాల‌ని: ఎమ్మెల్యే కోన ర‌ఘుప‌తి                 
    Show Latest News
దుష్టపాలనకు చివరి రోజులు

Published on : 04-Aug-2017 | 15:03
 

మూడేళ్ల అవినీతి పాలనకు చరమగీతం పాడే రోజులు దగ్గరలోనే ఉన్నాయిని నంద్యాల బహిరంగసభకు హాజరైన జన సునామీ చెప్పకనే చెబుతోంది. చంద్రబాబు నిరంకుశ పాలనతో విసిగిపోయిన ప్రజలు వైయస్ జగన్ రాకకోసం ఎంత ఆతృతగా ఎదురు చూస్తున్నారో ఈ సభకు అశేషంగా తరలివచ్చిన ప్రజాశక్తి తెలియజేస్తోంది. గత కొద్ది రోజులుగా నంద్యాలలో ఎటు చూసినా టిడిపి నాయకుల హల్ చల్ కనిపించేది. ఏ మూల చూసినా ఆంధ్రా అసెంబ్లీ నంద్యాల నడిబొడ్డునే ఉందేమో అనిపించేలా చంద్రబాబు తన బలగాలని నంద్యాల నలు చెరగులా మొహరించాడు. సిసిరోడ్డు, బిటి రోడ్డు, తాగునీరు, ఇళ్లమంజూరు, రోడ్ల విస్తరణ వీటికోసం శంకుస్థాపనలు అబ్బో ఒకటి కాదు మరోసారి ప్రజలను మోసగించే రీతిలో వందల కోట్ల వరాలు ప్రకటించేశాడు. బాబు ఎలక్షన్ స్టంట్ ను కొద్ది రోజుల పాటు చూసిన ప్రజలు...వైయస్సార్సీపీ బహిరంగ సభ వేదికగా టీడీపీకి  షాక్ ఇచ్చారు. తామంతా వైయస్ జగన్ వెంటే అని చాటిచెప్పారు. దీంతో, చంద్రబాబుకు దిమ్మతిరిగి బొమ్మ కనబడింది. 

ఈ సభలో వైయస్ జగన్.... బాబు అవినీతి, బంధుప్రీతి, ఎన్నికల కోసం చేసే నీచ రాజకీయాల గురించి ప్రజలను మరోసారి మేలుకొల్పారు.  ఇదే చంద్రబాబు మూడేళ్ల క్రితం కర్నూలుకు వచ్చి ఇచ్చిన హామీలను గుర్తు చేసారు. ఎయిర్ పోర్టు, ఉర్దూ యూనివర్సిటీ, స్మార్ట్ సిటీగా కర్నూల్, ఇండస్ట్రియల్ సిటీ, పారిశ్రామిక కారిడర్, ట్రిపుల్ ఐటి, సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అంటూ కోతలు కోసిన చంద్రబాబు వాటిలో ఏ ఒక్క హామీ అయినా నెరవేర్చాడా అని ప్రశ్నించారు. ఎలక్షన్ల ముందు వచ్చి మసి పూయడం చంద్రబాబుకు ఎప్పుడూ ఉన్న అలవాటే అన్నారు వైయస్ జగన్. చంద్రబాబు స్కీమ్ లన్నీ సొంత జేబు నింపుకునే బినామీ ఐడియాలే అని స్పష్టం చేసారు. కాపులు కడుపుకాలి కంచాలను కొడితే చంద్రబాబు అమరావతిలో లంచాలను మేస్తూ కూర్చున్నాడు. ముస్లింలు, మైనారటీలు అంటూ కబుర్లు చెబుతున్న బాబు కేబినెట్ లో ఒక్క ముస్లింకూడా మంత్రిగా లేడు. రాష్ట్ర చరిత్రలోనే ఇది ఇంతవరకూ జరగని వివక్ష. 

అవసరానికి వాడుకుని తర్వాత వదిలేయడం చంద్రబాబుకు అలవాటు. సొంత పార్టీని, సొంత మామను ముంచిన ఘనుడు చంద్రబాబు. పార్టీలో స్థానం ఇచ్చి, జీవితం ఇచ్చిన మామగారి నుంచి పార్టీ గుర్తును, ఆయన ప్రాణాన్ని కూడా లాగేసాడు చంద్రబాబు. అలాంటి మనిషికి ప్రజలను మోసం చేయడం పెద్ద విషయమేం కాదు. ఒక చేత్తో గారడీ చేస్తూ రేండో చేత్తో జేబు కత్తిరించడం బాబు నైజం. పాలన అంతా అమరావతే అన్నట్టు వ్యవహరించే చంద్రబాబు ఆంధ్రప్రదేశ్ లోని ఇతర ప్రాంతాలను ఏనాడూ పట్టించుకున్న పాపాన పోలేదు. చివరికి సొంత ఊరు కుప్పంలో కూడా ఎలాంటి అభివృద్ధి పనులు చేయని మోసగాడు, రేపు నంద్యాలకు ఏం చేస్తాడని నమ్మాలి అని ప్రజలు బహిరంగంగానే విమర్శిస్తున్నారు. పరిపాలనా వికేంద్రీకరణ ద్వారా రాష్ట్రం అంతా సుపరిపాలన అందుబాటులోకి తేవడమే వైయస్ జగన్ లక్ష్యం. అందుకే 13గా ఉన్న జిల్లాలను అధికారంలోకి వచ్చిన వెంటనే 25గా చేస్తానన్నారు.  మోడల్ టౌన్ గా నంద్యాలను తయారు చేస్తామన్నారు. హామీలంటే తూట్ల జల్లెడలా కాకుండా సరైన విధంగా ఉండాలని జగన్ అభిప్రాయ పడ్డారు. రోడ్ల విస్తరణ చేస్తే బాధితులకు సరైన పరిహారం అందాలి. పేదలకు ఇళ్లు నిర్మిస్తే వారికి ఆ ఇంటి రిజిస్ట్రేషన్ తో సహా జరగాలి. స్కీమ్ ల్లో స్కామ్ లు, బినామీల చేతులు లేకుండా ఉండాలి. అప్పుడే అభివృద్ధి పథకాలు అందరికీ అందినట్టు. అటువంటి పరిపాలన చంద్రబాబు జీవితకాలంలో చేయడు. నోరు తెరిస్తే అబద్ధం తప్ప నిజం మాట్లాడని చంద్రబాబు ప్రజలకు ఇచ్చిన మాటను ఏనాడూ నిలబెట్టుకున్న పాపాన పోలేదు. శిల్పా చక్రపాణి రెడ్డి అన్నట్టు జగన్ మొండోడు. అనుకున్నది చేస్తాడు. అన్నది చేసి చూపిస్తాడు. ఇచ్చిన మాటను నిలబెట్టుకునేందుకు ఎంత దూరమైనా నడుస్తాడు. రెండు నాలుకలతో మాట్లాడి, పది తలల రావణాసురుడిలా ప్రవర్తించే చంద్రబాబు పాలనకు, ప్రజల కోసమే అనుక్షణం జీవించిన వైయస్సార్ పాలనకు పోలికే లేదు. రేపు జగనన్న రాబోతున్నాడు. వైయస్సార్ పాలన తేబోతున్నాడు. నవరత్నాలతో గడప గడపలో సంతోషాలను నింపబోతున్నాడు. ఇది ప్రజల నమ్మకం. ప్రజా సంబరం. 

సంబంధిత వార్తలు

Home  |  News  |  Downloads  |  Gallery  |  Contact Us  |   Sitemap  

Official Website of YSR Congress Party
Copyright © 2011 ysrcongress.com