Ysrcpnettv
YSR Congress Party Twitter YS Jagna Twitter

YSR Congress

Flash News >>>>
             పార్లమెంట్‌ ఆవరణలోని గాంధీ విగ్రహం వద్ద వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నేతల‌ ధర్నా                                వైయ‌స్‌ జగన్‌ 216వ రోజు పాదయాత్ర ప్రారంభం                               కాకినాడ న‌గ‌రంలో సాయంత్రం వైయ‌స్ జ‌గ‌న్ బ‌హిరంగ స‌భ‌                               అవిశ్వాసానికి అనుమతివ్వడం టీడీపీ-బీజేపీ మ్యాచ్‌ ఫిక్సింగ్‌కు నిదర్శనం: మాజీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి                               బీజేపీ అధ్యక్షుడు అమిత్‌షా, టీడీపీ రాజగురువుతో ఎందుకు చర్చలు జరిపారు, వాటి వెనుక ఉన్న రహష్యాన్ని బయటపెట్టాలి: అంబ‌టి రాంబాబు                               క‌ర‌కుదురు నుంచి వైయ‌స్ జ‌గ‌న్ 214వ రోజు ప్రజాసంకల్పయాత్ర ప్రారంభం                               ఎన్నిక‌ల‌కు సిద్ద‌మా చంద్ర‌బాబు?: వైయ‌స్ఆర్‌సీపీ నాయ‌కుడు పార్థ‌సార‌ధి                               మై డియ‌ర్ మార్తాండామ్ మూవీ టీజ‌ర్ విడుద‌ల చేసిన వైయ‌స్ జ‌గ‌న్‌                               వైయ‌స్‌ జగన్‌ను కలిసిన 104 సిబ్బంది                  
    Show Latest News
కులం కత్తులు దూస్తున్న చంద్రబాబు

Published on : 31-Jul-2017 | 17:05
 

– జనాలను కులాల పేరుతో విభజన 
– నంద్యాల ప్రచారంలో మరోసారి బుక్కయిన బాబు 
– ముస్లింల ఓట్ల కోసం చంద్రబాబు జిమ్మిక్కులు 
– ఓటమి తప్పదని తెలిసీ కులాల కుంపట్లు రాజేస్తున్న సీఎం


చెప్పేది శ్రీరంగ నీతులు.. దూరేది అవేవో అన్నట్టుగా చంద్రబాబు చెప్పే మాటలకు చేసే పనులకు కనీసం పొంతన లేకుండా ఉంది. ఎన్నికలొచ్చినప్పుడు జనాలను కులాల వారీగా విభజించి కులానికొక హామీలు గుప్పించి అధికారంలోకొచ్చాడు. మొన్నటి 2014 టీడీపీ ఎన్నికల మ్యానిఫెస్టోను గమనిస్తే ఈ విషయం స్పష్టం. దాదాపు 36 కులాలకు ఏవేవో చేస్తామని హామీలిచ్చి పట్టించుకోలేదు. ముఖ్యంగా కాపులకిచ్చిన హామీలు గమనిస్తేనే అసలు విషయం తెలుస్తుంది. ఎన్నికలప్పుడు కాపులను బీసీలను చేస్తామని గట్టిగా హామీ ఇచ్చి చివరికి గెలిచాక ఏం చేశాడో అందరూ చూస్తున్నారు. తుని ఘటనను చూపించి కాపు యువతను బెదిరిస్తున్నదీ జనాలకు తెలిసిందే. దీక్షకు పూనుకున్న ముద్రగడ పద్మనాభం కుటుంబాన్ని ఎంత వేధిస్తున్నారో కాపు సమాజానికి తెలియంది కాదు. కమిషన్ల పేరుతో కాలక్షేపం చేస్తున్న చంద్రబాబును నిలదీసినందుకు ఎన్ని కష్టాలు పడుతున్నారో చూస్తూనే ఉన్నాం. తమకిచ్చిన హామీని నెరవేర్చమని కోరినందుకు కిర్లంపూడిని 30 వేల మంది పోలీసులను మోహరించి ఒక కశ్మీర్‌లా మార్చేసింది చంద్రబాబు కాదా. కర్నూలు, అనంతపురం వెళ్లినప్పుడు బోయలను ఎస్టీల్లో చేరుస్తామని చెప్పి ఇంతవరకు దానిమీద కదలిక లేదు. కాపుల ఉద్యమాన్ని అణచివేసేందుకు బీసీలను ఎగదోస్తున్నాడిప్పుడు. 
నంద్యాలలోనూ కుల విభజనే..
తాజాగా నంద్యాల ఉపపోరు విషయంలో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు కులాన్ని చాలా గట్టి ఆయుధంగా వాడుతున్నాడు. బలిజల ఓట్ల కోసం కళ్యాణ మండపాలు కట్టిస్తానని రూ. 3 కోట్లు కేటాయించాడు. కులం, మతం ప్రాతిపదికన ఓట్లు అడగకూడదు.. అని ఈసీ రోజూ పోరుతున్నా, అలా అడగడం నేరం అని చెబుతున్నా.. బాబు అలాంటి మాటలను లెక్కజేసే స్థితిలోలేడు. నంద్యాలను కులాల వారీగా వర్గాల వారీగా బాబు విడదీసి చూస్తున్నాడని స్పష్టం అవుతోంది. ముస్లిం మైనారిటీ నేతలతో బాబు మాట్లాడిన తీరు వీడియోల్లో కూడా రికార్డు అయ్యింది. 
ముస్లిం ఓట్ల కోసం దిగజారిపోయాడు..
ముస్లిం ఓట్లు యాభై ఏడువేల చిల్లర ఉన్నాయని.. అవన్నీ ఒక్కటి కూడా పక్కకుపోకుండా టీడీపీకే పడాలని బాబు ఆ మత పెద్దలకు స్పష్టం చేశాడు. మరి రాజకీయ నేతలు కుల రాజకీయాలు, మత రాజకీయాలు చేస్తారు.. అనేది అందరి అభిప్రాయమూ. అయితే బాబు దర్జాగా, మరీ బరితెగించి... ఇలాంటి రొచ్చు రాజకీయం చేస్తుండటం గమనార్హం. ప్రార్థనలే చేస్తారో.. కన్వీన్స్‌ చేస్తారో... ముస్లిం ఓట్లన్నీ టీడీపీకే పడాలి అని బాబు అంటున్నాడు. వాళ్లు వేస్తేనే.. నేను మీకు ఏమైనా చేస్తాను.. అని బాబు చెబుతున్నారు. ఒక ముఖ్యమంత్రి మాట్లాడాల్సిన మాటేనా అది? పంచాయతీ బోర్డు సర్పంచ్‌ కూడా ఇంతకన్నా కొంచెం డిప్లొమాటిక్‌గా మాట్లాడతాడు. బాబు మాత్రం.. మరీ తెగించేశాడు.

కేవలం ముస్లిం ఓట్లనే కాదు.. అన్ని ఓట్లనూ బాబు కులాల వారీగానే విడదీశాడు. ముస్లిం ఓట్లు, బలిజల ఓట్లు, రెడ్ల ఓట్లు, బీసీల ఓట్లు, వైశ్యుల ఓట్లు.. ఇలా అన్నమాట. ఇదీ బాబుగారి లెక్క. బలిజలతో ఒక సమవేశం పెట్టిస్తున్నాడు, టీజీ వెంకటేష్‌ను పిలిపించి వైశ్యులతో మీటింగ్‌ పెట్టించాడు. బీసీల ఓట్లకు ప్రతినిధి కాలువ శ్రీనివాసులు అట, ముస్లిం ఓట్లకు ఫరూక్‌.. ఇదీ బాబుగారి లెక్క.

మరి బాబుగారు హామీ ఇచ్చిన కాపు రిజర్వేషన్ల గురించి ఎవరైనా అడిగితే.. కులచిచ్చు పెడుతున్నారు..అంటూ బాబు రంకెలు వేస్తారు. తను మాత్రం సమాజాన్ని పూర్తిగా కులాల వారీగా విడగొట్టే.. ఒక్కో కులానికీ ఒక్కోరిని ప్రతినిధిగా మార్చేసి.. మొత్తం మ్యానిపులేట్‌ చేయాలని చూస్తున్నాడు. మరి ఈ జనరేషన్‌లో కూడా కులం ఆయుధంగా నెగ్గుకురావొచ్చా? నంద్యాల ఫలితమే ఈ సందేహాన్ని తీర్చాలి.

సంబంధిత వార్తలు

Home  |  News  |  Downloads  |  Gallery  |  Contact Us  |   Sitemap  

Official Website of YSR Congress Party
Copyright © 2011 ysrcongress.com