Ysrcpnettv
YSR Congress Party Twitter YS Jagna Twitter

YSR Congress

Flash News >>>>
             పారాది నుంచి వైయ‌స్ జ‌గ‌న్ 290వ రోజు ప్ర‌జా సంక‌ల్ప యాత్ర ప్రారంభం                               గుంటూరు జిల్లా టీడీపీ మాజీ అధ్యక్షుడు మల్లాది శివన్నారాయణ, చిలకలూరిపేట టీడీపీ మాజీ అధ్యక్షుడు శివయ్య, జి.వెంకట్రావు, కె.కాంతారావులు వైయ‌స్ఆర్‌సీపీలో చేరిక‌                               దేశంలో, రాష్ట్రంలో ఇలాంటి అబద్ధపు ముఖ్యమంత్రి ఎక్కడా లేరని, గల్ఫ్‌ దేశాల్లో ఇలాంటి అబద్ధాల ముఖ్యమంత్రిని ఎప్పుడో ఉరి తీసేవారు: ఎమ్మెల్యే ర‌వీంద్ర‌నాథ్‌రెడ్డి                               చంద్రబాబు..నీకిదే ముఖ్యమంత్రిగా చివరి అవకాశం...నిన్ను దగ్గరగా గమనించిన మనిషిగా చెబుతున్నా: త‌మ్మినేని సీతారాం                               శ్రీకాకుళం ఉద్యమాల పురిటిగడ్డ...ఎంతమందిపై కేసులు పెడతావ్. : త‌మ్మినేని సీతారాం                               నీళ్లో రామచంద్ర అని అడుగుతున్నవారికి వారి దాహార్తి తీరుస్తారే కాని వారిని సైతం బుల్డోజర్‌ తో తొక్కిస్తా అని అనగల ధైర్యం చంద్రబాబుకే ఉంది: భూమ‌న క‌రుణాక‌ర్‌రెడ్డి                               వైయ‌స్ జ‌గ‌న్‌ను క‌లిసిన మ‌ధువాడ అన్న‌దాత‌లు                               టీడీపీ తోక పత్రికలో 108 దుస్థితిపై వచ్చిన కథనాలను ఏమంటారు.. అది నిజం కాకపోతే ఆ వార్తలను ఎందుకు ఖండించలేదు: సుధాక‌ర్‌బాబు                               - విజ‌య‌న‌గ‌రం జిల్లా చీపురుప‌ల్లి నియోజ‌క‌వ‌ర్గంలోని ఆనంద‌పురం క్రాస్ వ‌ద్ద 3100 కిలోమీట‌ర్ల వ‌ద్ద వేప మొక్క‌ను నాటిన వైయ‌స్ జ‌గ‌న్‌                 
    Show Latest News
కళ్లుండి చూడలేక..చెవులుండి వినక

Published on : 23-Jul-2018 | 14:35
 దృతరాష్ట్రుడికి వారసులైతే ఎట్లా?

పార్లమెంటులో అవిశ్వాసం పెట్టి తల్లడిల్లిపోతూ...తలకిందులైపోతుంటే..జగన్‌ ఎక్కడ? అంటూ ముఖ్యమంత్రి చంద్రబాబుగారు అమరావతిలో కూర్చుని ప్రశ్నించారు. నిజంగా ఈ నాలుగేళ్ల కాలంలో అవిశ్వాసం పెట్టడానికి దారిచూపింది...వైయస్‌ జగన్‌ కాదా? నిజాన్ని కనలేని, వినలేని మీకు ’ప్రత్యేకహోదా’ ప్రాధాన్యతను అరటిపండు వలిచిచెప్పినట్టుగా, అసెంబ్లీ సాక్షిగా ఎన్నిసార్లు విపక్షనాయకుడు వినిపించలేదు. కళ్లు తెరిపించాలని ప్రయత్నించలేదు. ఆందోళనలు, నిరాహారదీక్షలు, బంద్‌లు నిర్వహించలేదు. పార్లమెంటులోనే ప్రత్యేకహోదాపై కేంద్రవైఖరికి నిరసనగా పార్లమెంటులో అవిశ్వాసం పెట్టేందుకు అవకాశం ఇమ్మని నోటీసులు ఇవ్వలేదు. అందుకు అవకాశం రాకపోతే..వైసీపీ ఎంపీలు రాజీనామా చేయలేదా? ఢిల్లీలోనే అమరణ నిరాహారదీక్షకు కూర్చోలేదా?
ఇంతగా ప్రత్యేకహోదా అంశాన్ని సజీవంగా వుంచిన వైఎస్‌జగన్‌...ఎక్కడ? ఎక్కడ? అని  కలవరపడిపోయిన చంద్రబాబుగారు, ఆయన అంతేవాసులు...ప్రజాప్రయోజనాలకు సంబంధించి విపక్షనాయకుడు అసెంబ్లీలో మాట్లాడిన ప్రతిసారి అధికారపక్షం ఎలా అడ్డుకుందో? ఎలా ఎకసెక్కాలతో సభను పక్కదారి పటించిందో ఐదుకోట్లమంది ప్రజలు చూడలేదా? వినలేదా?
ఎల్లకాలం ఒకేరకంగా వుండదని, ప్రజలెప్పుడూ మోసపోతూనే వుండరన్నదానికి నిన్న జనసేన అధ్యక్షుడి రాజధాని ప్రజాసమావేశమే సాక్ష్యం. జగన్‌ అసెంబ్లీలో మాట్లాడకుండా, ప్రభుత్వాన్ని నిలదీయకుండా అసెంబ్లీ సమావేశాలను బాయ్‌కాట్‌ చేయడంపై విరుచుకపడాలని ప్రయత్ని స్తే, సభలోని జనమే..ఆయన్ను ఎక్కడ మాట్లాడించారంటూ? పవన్‌గారినీ నిలదీయలేదా? అయినా మాట్లాడాల్సిందే నంటూ తనదైన గబ్బర్‌సింగ్‌ డైలాగులు పవన్‌ కొట్టలేదా?రాష్ట్రప్రభుత్వం నాలుగేళ్లుగా సంక్షేమపథకాలను నీరుగారుస్తున్న వైనాన్ని, ఇసుక, మట్టిని తవ్విపోసుకుంటూ సాగిస్తున్న అవినీతిని, పోలవరంపై గద్దల్లా వాలి దోచుకోవాలనే ప్రయత్నాలనీ, వందరకాల పంటలు, మూడు పంటలు పండే రాజధాని భూముల్ని..రియల్‌ఎస్టేట్‌ వ్యాపారంగా మార్చేసిన బాబుగారిని అడుగడుగునా నిలదీస్తూ పోయిన వైయస్‌ జగన్‌ను ప్రశ్నించే అర్హత ఎవరికుంది?
ఐదుకోట్ల ఆంధ్రుల కష్టనష్టాలను పట్టించుకోని కేంద్రప్రభుత్వం, లాలూచీ వ్యవహారాలతోనే రేపటి ఎన్నికల్లోనూ గెలవాలని ’వైస్రాయ్‌ ఎపిసోడ్‌’ అనుభవజ్ఞుడి పాచికల పర్వం...అవశేష ఆంద్రప్రదేశ్‌ను దిక్కుతోచని పరిస్థితుల్లో పడేస్తే...కాడిని భుజాన వేసుకుని, నేనున్నానంటూ భరోసాగా ప్రజలతో, ప్రజల మధ్య నడుస్తున్న వైయస్‌ జగన్‌ ప్రజాబాట ఆశలు రేకెత్తిస్తోంది.  ప్రజలకిచ్చిన మాట తప్పని, హామీలు మరవని ’మనందరి ప్రభుత్వం’ కోసం చిత్తశుద్దితో అడుగులేస్తున్న వైయస్‌ జగన్‌ వర్సెస్‌ అదర్‌ పార్టీస్‌ అన్నది ఇప్పుడు ఎపీలో పొలిటికల్‌ సీనేరియో!
ప్రత్యేక హోదాపై కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని చంద్రబాబు వెన్నుపోటు రాజకీయాలకు నిరసనగా వైయస్‌ఆర్‌సీపీ అధినేత వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ఈ నెల 24న ఏపీ బంద్‌కు పిలుపునిచ్చారు. అన్ని పార్టీలు,  ప్రజా సంఘాలు కలిసి రావాలి ఆయన విజ్ఞప్తి చేశారు. ప్రజల కోసం, రాష్ట్ర ప్రయోజనాల కోసం తలపెట్టిన బంద్‌లో కధం తొక్కే శక్తులే అసలు సిసలు మనుషులని తేలిపోయే సందర్భం ఇదే. 
Labels : ysrcp, tdp, chandra babu

సంబంధిత వార్తలు

Home  |  News  |  Downloads  |  Gallery  |  Contact Us  |   Sitemap  

Official Website of YSR Congress Party
Copyright © 2011 ysrcongress.com