Ysrcpnettv
YSR Congress Party Twitter YS Jagna Twitter

YSR Congress

Flash News >>>>
             సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ, చంద్రబాబు మధ్య బంధం తేలతెల్లమవుతోంది: వాసిరెడ్డి పద్మ                                నచ్చితే నంది.. నచ్చకపోతే పందిలా తెలుగుదేశం పార్టీ పత్రికల తీరు: వాసిరెడ్డి పద్మ                               ఫీజు రీయింబ‌ర్స్‌మెంట్ ప‌థ‌కాన్ని నిర్వీర్యం చేస్తూ పేద‌ల‌కు ఉన్న‌త చ‌దువులు దూరం చేస్తున్న వైఖ‌రికి నిర‌స‌న‌గా వైయ‌స్‌ఆర్ విద్యార్ధి విభాగం ఆధ్వర్యంలో అన్ని జిల్లా కేంద్రాల‌లో అక్టోబ‌ర్ 25వ తేదీన ఫీజుపోరు : విజ‌య‌సాయిరెడ్డి                               జననేత వైయ‌స్ జ‌గ‌న్ ప్ర‌జా సంక‌ల్ప యాత్ర 292వ రోజు సాలూరు శివారు నుంచి ప్రారంభం                               చంద్రబాబు రాజకీయ జీవితమంతా రక్త చరిత్రే: భూమన కరుణాకర్‌రెడ్డి                                వైయస్‌ జగన్‌ను కలిసిన సాక్షార భారత్‌ గ్రామ కో–ఆర్డినేటర్లు                               తుని రైలు దహనం ఘటన వెనుక చంద్రబాబు హస్తం లేదా: భూమన కరుణాకర్‌రెడ్డి                                గుంటూరు జిల్లా టీడీపీ మాజీ అధ్యక్షుడు మల్లాది శివన్నారాయణ, చిలకలూరిపేట టీడీపీ మాజీ అధ్యక్షుడు శివయ్య, జి.వెంకట్రావు, కె.కాంతారావులు వైయ‌స్ఆర్‌సీపీలో చేరిక‌                               దేశంలో, రాష్ట్రంలో ఇలాంటి అబద్ధపు ముఖ్యమంత్రి ఎక్కడా లేరని, గల్ఫ్‌ దేశాల్లో ఇలాంటి అబద్ధాల ముఖ్యమంత్రిని ఎప్పుడో ఉరి తీసేవారు: ఎమ్మెల్యే ర‌వీంద్ర‌నాథ్‌రెడ్డి                 
    Show Latest News
జల్సా నాయుడు

Published on : 10-Aug-2018 | 15:06
 

సొంత రాష్ట్రంలో విచ్చలవిడి ఖర్చులు చేసి ప్రజా ధనాన్ని మంచినీళ్లలా ఖర్చుపెట్టే చంద్రబాబు పక్క రాష్ట్రానికి అతిధిగా వెళ్లి కూడా తన బుద్ధి మార్చుకోలేదు. ఖరీదైన ముఖ్యమంత్రి, ఖర్చుదారు చంద్రబాబు అని దేశమంతా ఆడిపోసుకున్నా బాబుగారి తీరు మారదు. పోనీలే పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి, మనకోసం సొంత ఉద్యోగులను ప్రచారానికి కూడా పంపినవాడు అని మిత్ర ధర్మం కొద్ది కర్ణాటక ప్రభుత్వం ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం రోజు అతిధిగా పిలిస్తే నాలుగు గంటల పుణ్యానికి 8 లక్షల పైన చమురు వదిలించాడు. వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన అనేక మంది అతిధులు ఖర్చు అంతా కలిపినా బాబుగారి సింగిల్ బిల్ లో సగం కూడా తేలలేదు. సమాచార హక్కు చట్టం ద్వారా తెలుసుకున్న ఈ వివరాలను బెంగుళూరు మిర్రర్ అనే కర్ణాటక పత్రిక బయట పెట్టింది. దాంతో దేశమంతా ఈ విషయం గురించే చర్చించుకుంటోంది. ప్రాజెక్టులకు, ప్రజల సంక్షేమానికి నిధులు లేవంటూ ఇలా విచ్చలవిడి ఖర్చులు పెట్టడానికి జనాల సొమ్ము తేరగా వచ్చిందా అంటూ అందరూ ఆడిపోసుకుంటున్నారు. అయినా ఇవన్నీ మన బాబుగారి తలకెక్కుతాయా ఏంటి ? ఆఫీసు నుంచి ఇంటికి వెళ్లడానికే హెలికాప్టర్ ఎక్కే మన ముఖ్యమంత్రికి నాలుగు గంటల హోటల్ రూములో 8 లక్షల ఖర్చు ఓ లెక్కలోనిదా ?

గతంలో సిద్దరామయ్య గాని, యడ్యూరప్ప గాని తమ ప్రమాణ స్వీకార సమయంలో పిలిచిన అతిధులకు సంబంధించిన ఖర్చులేమి గవర్నమెంటు నుంచి పెట్టించలేదు. కాంగ్రెస్, జేడీఎస్ కలిసి ఏర్పాటు చేసిన కర్ణాటక ప్రభుత్వంలో ప్రజల సొమ్మును జల్సారాయుళ్ల పాలు చేస్తున్నారు. నిజానికి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్న పార్టీలు తాము పిలుచుకున్న అతిధులకు అయ్యే ఖర్చులను పార్టీ తరపునే భరించాలి. కానీ టీడీపీ లాంటి పార్టీతో చెట్టాపట్టాలేసుకు తిరిగే పార్టీలు జనం సొమ్ముతో జల్సాలు చేయడం గురించి ఆశ్చర్యపోనక్కర్లేదు. ఎందుకంటే బాబుగారితో తిరుగుతుంటే ఆ బుద్ధులు ఆ మాత్రం అంట కుండా ఉంటాయా ? మొత్తానికి కర్ణాటక ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం బాబుగారి జల్సాకి, కర్ణాటక జేబు చిల్లుకి కారణం అయ్యిందన్నమాట. దేశ వ్యాప్తంగా ఖరీదైన బాబుగారి కధంతా ఇంకోసారి చర్చకు వచ్చింది. 

Labels : chandra babu, ap cm,
Home  |  News  |  Downloads  |  Gallery  |  Contact Us  |   Sitemap  

Official Website of YSR Congress Party
Copyright © 2011 ysrcongress.com