Ysrcpnettv
YSR Congress Party Twitter YS Jagna Twitter

YSR Congress

Flash News >>>>
             ప్రజలకు ఎన్ని అబద్దాల చెప్పినా వింటారనే నాయకులకు తెలంగాణ ప్రజలు గట్టిగా బుద్ది చెప్పారు : వైయ‌స్ జ‌గ‌న్‌                               లగడపాటి రాజకీయ విశ్లేషకుడు ఎప్పుడు అయ్యాడా? అని ఆశ్చర్యం వేసింది: వైయ‌స్ జ‌గ‌న్‌                               కాంగ్రెస్‌, టీడీపీ జిమ్మిక్కులను ప్రజలను తిప్పికొట్టారు: వైయ‌స్ జ‌గ‌న్‌                               చంద్రబాబు, కాంగ్రెస్ అనైతిక పొత్తుకు ప్రజలు వ్యతిరేకంగా తీర్పు ఇచ్చారు: వైయ‌స్ జ‌గ‌న్                                భస్మాసురుడు చేయి పెట్టినా.. చంద్రబాబు కాలు పెట్టినా అంతా బుడిదే: వైయ‌స్ జ‌గ‌న్‌                               నందగిరి పేట నుంచి వైయ‌స్ జ‌గ‌న్‌ 319వ రోజు ప్రజాసంకల్పయాత్ర ప్రారంభం                               హిందూపురం టీడీపీ మాజీ ఎమ్మెల్యే అబ్దుల్‌ గని వైయ‌స్ఆర్‌సీపీలో చేరిక‌                               ప‌వ‌న్‌కు చిత్త‌శుద్ది ఉంటే చంద్ర‌బాబు అవినీతిపై నిల‌దీయాలి: ఎమ్మెల్యే ఆదిమూల‌పు సురేష్‌                               డాక్టర్ బీఆర్ అంబేద్కర్‌కు వైయ‌స్ జగన్ నివాళులు                 
    Show Latest News
హోదా రావడం బాబుకు ఇష్టం లేదా

Published on : 07-Jun-2018 | 15:47
 – హోదా సెంటిమెంట్‌ ఢిల్లీకి వినపడకుండా వ్యూహ రచన 
– ఎన్నికలొస్తే వైయస్‌ఆర్‌సీపీ ఎంపీలు గెలుస్తారని బాబు భయం
– అందుకే పోటీకి నిలిపి.. నంద్యాల తరహాలో గెలవాలని కుట్ర
– రాజకీయం కోసం ఏపీ ప్రయోజనాలు తాకట్టు 


వైయస్‌ఆర్‌సీపీ ఎంపీల రాజీనామాలను లోక్‌సభ స్పీకర్‌ సుమిత్రా మహాజన్‌ ఆమోదించిన సందర్భంగా పార్టీ అధినేత వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మాట్లాడిన మాటలు ఇప్పుడు వైరల్‌ అవుతున్నాయి. మా ఎంపీలు రాజీనామా చేసిన స్థానాల్లో ఎలా పోటీ పెడతారని అడిగిన ప్రశ్ననే ఏపీ ప్రజలు సమర్థిస్తున్నారు. రాజకీయ కారణాలతో కాకుండా ఏపీ ప్రయోజనాల కోసం ప్రత్యేక హోదా నినాదంతో  రాజీనామా చేసిన ఎంపీలకు మీరిచ్చే గౌరవం ఇదేనా అని అందరూ చంద్రబాబును ప్రశ్నిస్తున్నారు. ఒక ముఖ్యమంత్రి అయి ఉండి కూడా ఆయన చేయలేకపోయిన పనిని ప్రతిపక్ష పార్టీ చేసిందనే అక్కసుతో చంద్రబాబు రాష్ట్రానికి తీరని ద్రోహం చేస్తున్నారనేది నిజం. రాజకీయ వైరుధ్యాలు ఎన్ని ఉన్నా ఉమ్మడి ప్రయోజనం కోసం రాజకీయాలను పక్కన పెట్టి అన్ని పార్టీలు ఒక్కడవడం పక్కన ఉన్న దక్షిణాది రాష్ట్రాల్లో చూస్తున్నాం. కానీ మన రాష్ట్రంలో మాత్రం చంద్రబాబు తన పంతం నెగ్గించుకోవడానికి ఏపీకి సంజీవని లాంటి ప్రత్యేక హోదాను పణంగా పెడుతున్నారు. హోదా రావాల్సిన చాలా సందర్భాలను బాబు స్వయం కృతాపరాధం, అవినీతి కారణంగా నీరుగారిపోయాయి. నాలుగేళ్లుగా హోదా కోసం పోరాడుతున్న జగన్, ప్రతిపక్షాలను అణచివేస్తూ వచ్చారు. హోదా కోసం పట్టుబట్టాల్సింది పోయి ఓటుకు నోటు కేసుకు భయపడి ప్యాకేజీకి అంగీకారం తెలిపారు. ప్రతిపక్ష ఎంపీలతో కలిసి రాజీనామా చేయాల్సినప్పుడు కలిసి నడవలేదు. ప్రతిపక్షం కేంద్ర మీద అవిశ్వాసం పెపడతానంటే.. బీజేపీ ప్రభుత్వం పడిపోతుందా అని ఎగతాళిగా మాట్లాడారు. ఇన్ని కీలక సందర్భాల్లో ప్రత్యేక హోదా రాకుండా అడ్డుపడిన చంద్రబాబు... కేంద్రంతో జగడమాడి యూ టర్న్‌ తీసుకున్నారు. అలా అని హోదా సాధించడం ఇష్టమా అంటే అదీ లేదు. ఏపీకి హోదా రాకపోయినా పర్లేదు కానీ.. వైయస్‌ఆర్‌సీపీకి మాత్రం క్రెడిట్‌ దక్కకూడదు అనే నిర్ణయంతో చంద్రబాబు అనుక్షణం బాధావేశాలతో నలిగిపోతున్నారు. ఇప్పుడు ఎంపీల రాజీనామా ఆమోదాన్ని కూడా జీర్ణించుకోలేకపోతున్నారు. ఎలాగైనా నంద్యాల ఎన్నికల మాదిరిగానే డబ్బులు వెచ్చించి గెలవాలని కుట్రలు పన్నుతున్నారు. ఏపీకి ప్రత్యేక హోదా రావడం ఇష్టం లేదన్నట్టుగానే వ్యవహరిస్తున్నారు. రోజుకో మాట.. పూటక ప్రకటనో.. సందర్భానికో అజెండాతో తెలుగు ప్రజల మనోభావాలతో ఆడుకోవడం చంద్రబాబు నాయకత్వంలోని తెలుగుదేశం ప్రభుత్వానికి అలవాటైంది. ఏపీకి ప్రత్యేక హోదా రాకపోవడానికి చంద్రబాబే కారణమని ఆంధ్రాలో చిన్న పిల్లాడిని అడిగినా చెబుతాడు. నాలుగేళ్లు హోదా పేరెత్తితే కళ్లురిమిన చంద్రబాబు.. తప్పనిసరి పరిస్థితుల్లో యూ టర్న్‌ తీసుకున్నారు.  పార్టీని పతనావస్థ నుంచి గట్టెక్కించడానికి ప్రత్యేక హోదాకు జై అన్న చంద్రబాబు అక్కడా చిత్తశుద్ధిని ప్రదర్శించలేకపోతున్నారు. తన ద్వంద్వ ప్రమాణాలతో ఏపీ ప్రజల ఆకాంక్షను అవమానపరిచేలా వ్యవహరిస్తున్నారు. ప్రత్యేక హోదా కోసం  వైయస్‌ జగన్‌ పిలుపునిచ్చినప్పుడే టీడీపీ ఎంపీలు రాజీనామా చేసి ఉంటే పరిస్థితి మరోలా ఉండేదని... కేంద్రంపై ఒత్తిడి పెరిగి ప్రత్యేక హోదా వచ్చేదని ఏపీ ప్రజల అభిప్రాయం. అయితే చంద్రబాబు మాత్రం తనకే సొంతమైన మాట మార్పిడి ధోరణితో ప్రజలను గందరగోళానికి గురి చేశారు. ప్రతిపక్ష వైయస్‌ఆర్‌సీపీకి మంచి పేరొస్తదనే భయంతో ఆంధ్రుల ప్రత్యేక హోదా ఆకాంక్షకు ఢిల్లీలో పార్లమెంట్‌ సాక్షిగా నిలువునా పాతరేశారు. అవిశ్వాసానికి వైయస్‌ఆర్‌సీపీ సిద్ధమైనప్పుడు వ్యంగ్యంగా మాట్లాడిన బాబు.. ఆ తర్వాత తానే టైంపాస్‌ అవిశ్వాస డ్రామాలాడారు. 

సంబంధిత వార్తలు

Home  |  News  |  Downloads  |  Gallery  |  Contact Us  |   Sitemap  

Official Website of YSR Congress Party
Copyright © 2011 ysrcongress.com