Ysrcpnettv
YSR Congress Party Twitter YS Jagna Twitter

YSR Congress

Flash News >>>>
             రాష్ట్రంలో కరువు తాండవం చేస్తుంటే పట్టించుకోని చంద్రబాబు.. జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పుతానంటూ డ్రామాలు ఆడుతున్నారు: వైయ‌స్ జ‌గ‌న్‌                               వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత సీపీఎస్‌ రద్దు చేస్తాం: వైయ‌స్ జ‌గ‌న్ హామీ                               వైయ‌స్ జ‌గ‌న్‌ను క‌లిసిన ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త కొండవీటి జ్యోతిర్మయి                                ‘నాపై జరిగిన హత్యాయత్నంలో చంద్రబాబుకు ఎలాంటి ప్రమేయం లేకపోతే.. స్వతంత్ర దర్యాప్తు సంస్థతో కేసు విచారణ చేయించొచ్చు కదా’ : వైయ‌స్ జ‌గ‌న్‌                                చంద్రబాబు రాజ్యాంగ వ్యవస్థలను నిర్వీర్యం చేస్తున్నారు: ఆనం రామనారాయణ రెడ్డి                               ఏ విచారణకైనా సిద్ధమని చెప్పే ధైర్యం చంద్రబాబుకు ఉందా ?: అంబటి రాంబాబు సవాల్‌                                పచ్చచొక్కాల కోసమే ప్రభుత్వ పథకాలు: వైవీ సుబ్బారెడ్డి                               బిడ్డ పుట్టి ఓటు హక్కు వచ్చిన తర్వాత తనకే ఓటు వేస్తారని చంద్రబాబు పేర్కొనడం హాస్యాస్పదం: పేర్నినాని                               వైయ‌స్ జ‌గ‌న్ బాలల దినోత్సవ శుభాకాంక్షలు                  
    Show Latest News
చంద్రన్నవిలేజ్ మాల్ అంతాగోల్ మాల్

Published on : 13-Dec-2017 | 22:38
 

చంద్రన్నవిలేజ్ మాల్ అంతాగోల్ మాల్

 నిరుపేదలకు అధిక ధరల నుండి ఊరట కల్పించేందుకు ప్రభుత్వాలు సబ్సిడీతో అందించే సరుకుల పంపిణీ వ్యవస్థ చౌకధర దుకాణాలు. చౌకడిపోలు అని పిలిచే వీటి ద్వారా పూర్వం ప్రభుత్వాలు బియ్యం, నూనెలు, కిరోసిన్, పప్పు దినుసులు, గోధుమలు, పిండి మొదలైన సరుకులు అతి చౌక ధరకకు అందించే వారు. రేషన్‌ కార్డుల ఆధారంగా నెలవారీ వీటిని సరఫరా చేసేవారు. పెద్ద మొత్తంలో రైతులు, వ్యాపారుల నుంచి సరుకును ప్రభుత్వమే కొనుగోలు చేసి సబ్సిడీ ద్వారా పేదలకు అందించిన అద్భుత మార్గం చౌక డిపోలు. ఇప్పుడు వాటికి చంద్రగ్రహణం పట్టింది. కార్పొరేట్‌ సామ్రాజ్యాన్ని ఏలుతూ, పేదలను తన అధికారంతో అణిచివేసే చంద్రబాబు పాలనలో చౌక డిపోలు ఖరీదైన మాల్స్‌ గా రూపాతరం చెందుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా 28వేల పైచిలుకు ఉన్న చౌక డిపోలు ఆధునీకరణ పేరుతో టిడిపి కనుసన్నల్లో సాగే కార్పొరేట్‌ సంస్థల చేతుల్లోకి మారిపోతున్నాయి. 

కార్పొరేట్‌ గుత్తాధిపత్యం

చంద్రన్న విలేజ్‌ మాల్స్‌... ఈ పేరుతో రిలయన్స్, ఫ్యూచర్‌ వంటి కార్పొరెట్‌ సంస్థలకు గంపగుత్తగా చిల్లర వ్యాపారాన్ని అప్పనంగా అందించేశారు చంద్రబాబు. అందులో బాబుకు స్వలాభం లేకపోలేదు. ఫ్యూచర్‌ గ్రూప్స్‌ అనేది చంద్రబాబు హెరిటేజ్‌ తో వ్యాపార ఒప్పందాలున్న వాటాదారు సంస్థ. పట్నాల్లో, ఓ మాదిరి నగరాల్లో మాల్స్‌ రిటైల్‌ వ్యాపారాన్ని కుదేలు చేస్తున్నాయి. ఇంకా ఇవి పల్లెలకు పాకలేదు. ఇప్పుడు చంద్రన్న విలేజ్‌ మాల్‌ రూపంలో గ్రామాల్లోని చిల్లర వ్యాపారాలన్నీ త్వరలో దివాళా తీయనున్నాయి. చంద్రబాబు సర్కార్‌ అధికారంలో కి వచ్చాక చౌక ధరల డిపోల ద్వారా బియ్యం తప్ప మరేమీ రేషన్‌ కార్డులున్న వారికి అందడం లేదు. పండగలప్పుడు ఇస్తున్న ప్రత్యేక సరుకులు కూడా పరమ నాసిరకంగా ఉండటంతో వాటిని తీసుకోవడానికి ఎవరూ ముందుకు రావడం లేదు. నాణ్యతలేని నాసిరకం సరుకులను వ్యాపారుల నుంచి కొని ప్రజలకు అంటగట్టారన్న విమర్శలు ఎదుర్కొంది టిడిపి ప్రభుత్వం. 

అవసరాలు పట్టవు – ఆర్భాటాలే

చంద్రన్న విలేజ్‌ మాల్స్‌ ను అందంగా తీర్చిదిద్దాలని, 500 రకాల ప్రోడక్టŠస్‌ ను అందుబాటులో ఉంచాలని చౌక డిపోలకు ఆర్డర్లు వేసింది ప్రభుత్వం. అంత పెట్టుబడి ఎక్కడినుండి తేవాలని అని అడగక ముందే బ్యాంకుల నుంచి ముద్ర రుణాలు ఇప్పిస్తున్నట్టు ప్రకటించింది. అందుకు ప్రభుత్వమే ష్యూరిటీ కూడా ఇచ్చింది. అసలిదంతా ఎందుకు...ప్రభుత్వమే ఆ ఖర్చుతో పేదలకు అవసరమైన నిత్యావసరాలను సబ్సిడీలో చౌక డిపో ద్వారా అందిచవచ్చు కదా..లేదు...కేవలం కార్పొరేట్లను, వారి వెనకుండి తాను చిల్లర వ్యాపారంలోని లాభాలను ఆర్జించడమే ధ్యేయంగా చంద్రబాబు ఈ కుట్రకు తెరతీసాడు. దీనివల్ల ఏళ్లకు ఏళ్లుగా తరతరాలుగా గ్రామాల్లో వ్యాపారాలు చేసుకుని బతుకుతున్న చిరువ్యాపారులు, చిల్లర దుకాణాల వారు సర్వ నాశనం అవడం ఖాయం అంటున్నారు ఆర్థిక వేత్తలు. ఒకప్పుడు బ్రిటిష్‌ వారు భారతదేశాన్ని ఎలా విడతలవారీగా ఆక్రమించుకున్నారో... అలాగే గ్రామీణ చిరువ్యాపారులను నాశనం చేసి చిల్లర దుకాణాల వ్యాపారాన్నీ , బాబు అలాగే కబ్జా చేస్తున్నాడని వారంటున్నారు.  

పచ్చ దుకాణాలు..పార్టీ ఆఫీసులు

మొదటి దశగా 6500 చౌకదుకాణాలను చంద్రన్న విలేజ్‌ మాల్స్‌ గా రూపొందించారు. చౌక డిపోలన్నిటికీ పసుపు రంగు పులిమేసారు. చంద్రబాబు బొమ్మతో పెద్దపెద్ద ఫొటోలు పెట్టారు. ఇవి చౌక డిపోలా లేక, టిడిపి పార్టీ స్థానిక కార్యాలయాలా అనిపించేలా తయారు చేశారు. ఇదంతా పార్టీ ప్రచారం కోసంగా కనిపిస్తుందే తప్ప ప్రజా పంపిణీ వ్యవస్థలా కనిపించడమే లేదన్నది ప్రజల వాదన. 

డిస్కౌంట్‌ మాయాజాలం

 Mఖ్క ధరలపై 4 నుంచి 35 శాతం డిస్కౌంట్‌ ఉంటుందని, సరుకులు నాణ్యంగా ఉంటాయని చెబుతున్నారు. అసలు చౌక డిపోల్లో 80శాతం డిస్కౌంట్‌ తో దొరికే సరుకులన్నిటినీ బందు పెట్టి 35 శాతం డిసౌంట్‌ తో సరుకులు కొనుక్కోమనడం అన్యాయం. పైగా రేషన్‌ కార్డుతో సంబంధం లేకుండా ఎవ్వరైనా ఇక్కడ కొనుగోలు చేయచ్చు అని ప్రకటించారు. ఇక రేషన్‌ కార్డు ఉన్నప్పటికీ మాల్స్‌ లో ఉన్న ఖరీదుకే ప్రజలు వస్తువులను కొనుగోలు చేయాలి. అసలు Mఖ్క అంటేనే తయారీ, రవాణా, లాభాలు, ఎ ఖీ (పన్నులు) కలిపి ప్రదర్శించే రేటు. తక్కువ ధర పేరుతో పేదలకు అందిచే వస్తువులన్నీ ఆ బడా కంపెనీలు నిర్ణయించిన ధరల ఆధారంగానే ఉంటాయి. అంటే 35 శాతం డిస్కౌంట్‌ ఇచ్చే ముందు వస్తువు ఖరీదుకు రెట్టింపు చెప్పే అవకాశం వారికెప్పుడూ ఉంటుంది. కొత్త సంవత్సరం కానుకంటూ చంద్రబాబు మొదలు పెట్టిన ఈ మాల్స్‌ సామాన్యుల పాలిట శరాఘాతాలే అన్న విమర్శలు సర్వత్రా వినిపిస్తున్నాయి.

  

Labels : YS Jagan, YSRCP , NCBN

సంబంధిత వార్తలు

Home  |  News  |  Downloads  |  Gallery  |  Contact Us  |   Sitemap  

Official Website of YSR Congress Party
Copyright © 2011 ysrcongress.com