Ysrcpnettv
YSR Congress Party Twitter YS Jagna Twitter

YSR Congress

Flash News >>>>
             ఇల్లు,పింఛన్,ఆరోగ్యశ్రీకార్డు ఇలా ఏమీ కావాలన్నా 72 గంటల్లోనే ఇప్పిస్తాం- వైయస్‌ జగన్‌                                పేదలకు 200 యూనిట్ల కరెంటు ఉచితం- వైయస్‌ జగన్‌                                డిసెంబర్‌ 4వ తేదీ నుంచి అనంతపురం జిల్లాలో ప్రజా సంకల్పయాత్ర                                పిల్లలను ధైర్యంగా బడికి పంపండి -వైయ‌స్ జ‌గ‌న్                               నాలుగు విడతులుగా రుణాలన్నీ మాఫీ చేస్తా- వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి                                దివ్యాంగుల‌ను అన్ని విధాల ఆదుకుంటా- వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి హామీ                                నాలుగు విడ‌త‌లుగా డ్వాక్రా రుణాల‌న్నీ మాఫీ చేస్తా- వైయస్ జగన్ మోహన్ రెడ్డి                               త్వరలోనే బీసీ గర్జన చేపట్టి బీసీ డిక్లరేషన్ ప్రకటిస్తాంః వైయస్ జగన్                               చంద్రబాబు ఫ్యాక్షన్ పాలన చేస్తున్నాడుః వైయస్ జగన్                 
    Show Latest News
తొలిరోజు ప్లీనరీ విశేషాలు

Published on : 08-Jul-2017 | 18:24
 

హైదరాబాద్‌: వైయస్సార్సీపీ జాతీయ ప్లీనరీ తొలిరోజు విజయవంతంగా సాగింది. తెలుగు రాష్ట్రాల అభివృద్ధి, తెలుగు ప్రజల శ్రేయస్సే లక్ష్యంగా ప్రజావ్యతిరేక పాలన సాగిస్తున్న ప్రభుత్వంపై నిరంతరం ప్రజల పక్షాన పోరాడుతున్న వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ...నేటి  ప్లీనరీలో పలు తీర్మానాలపై చర్చించి ఆమోదించింది. తొలిరోజు ప్లీనరీకి సంబంధించిన అప్ డేట్స్ ఈవిధంగా ఉన్నాయి. 

తొలిరోజు ప్లీనరీ..
సాయంత్రం 5.55 గంటలు: మొదటి రోజు ముగిసిన కార్యక్రమం. రేపు ఉదయం 9 గంటలకు రెండో రోజు కార్యక్రమాలు ప్రారంభమవుతాయని ప్రకటించిన ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు. 

సాయంత్రం 5.20 గంటలు:  దగాపడ్డ డ్వాక్రా మహిళల తీర్మానాన్ని బలపరిచిన  ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరీ
సాయంత్రం 4.58 గంటలు:  దగాపడ్డ డ్వాక్రా మహిళల తీర్మానాన్ని ప్లీనరీలో ప్రవేశపెట్టిన ఎమ్మెల్యే రోజా

సాయంత్రం 4.49 గంటలు:  అనంతపురం జిల్లా సమస్యలపై తీర్మానం ప్రవేశపెట్టిన  శంకర్‌నారాయణ
సాయంత్రం 4.43 గంటలు:  చేనేత కార్మికుల సమస్యలపై తీర్మానాన్ని బలపరిచిన వైయస్‌ఆర్‌ సీపీ నేత మోహన్‌రావు
సాయంత్రం 4.33 గంటలు:  చేనేత కార్మికుల ఇక్కట్లపై తీర్మానాన్ని ప్రవేశపెట్టిన ఎంపీ బుట్టా రేణుక.. చేనేత కార్మికులకు ప్రభుత్వం ఆర్థిక సాయం చేయాలని, దళారులు లేని మార్కెట్‌ సౌకర్యం కల్పించాలని విజ్ఞప్తి..

సాయంత్రం 4.28 గంటలు: నెల్లూరు జిల్లా సమస్యలపై తీర్మానం ప్రవేశపెట్టిన ఎమ్మెల్యే కాకాని గోవర్ధన్‌రెడ్డి
సాయంత్రం 4.20 గంటలు:  ప్లీనరీలో  వైయస్‌ఆర్‌సీపీ నేత రెహమాన్‌ ప్రసంగం
సాయంత్రం 4.13 గంటలు:  మైనారిటీ సమస్యపై ప్లీనరీలో మాట్లాడిన మైనారిటీ సెల్‌ అధ్యక్షుడు నదీమ్‌ అహ్మద్‌

సాయంత్రం 4.02 గంటలు:  ప్లీనరీలో ప్రసంగించిన  జోగి రమేశ్‌
మధ్యాహ్నం 3.54 గంటలు: ప్రజాసంక్షేమంపై తీర్మానాన్ని జంగా కృష్ణమూర్తి
మధ్యాహ్నం 3.43 గంటలు: ప్రజాసంక్షేమంపై తీర్మానాన్ని బలపరిచిన మాజీ ఎమ్మెల్యే బాలరాజు

మధ్యాహ్నం 3.33 గంటలు: ప్రజాసంక్షేమంపై తీర్మానం ప్రవేశపెట్టిన  మేరుగు నాగార్జున

మధ్యాహ్నం 3.25 గంటలు: ఏపీలో ఆటవిక పరిపాలనపై పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రవేశపెట్టిన తీర్మానాన్ని బలపరుస్తూ ప్రసంగించిన  వెల్లంపల్లి శ్రీనివాస్‌
మధ్యాహ్నం 2.56 గంటలు: చంద్రబాబు ఆటవిక పాలన గురించి వివరించిన  పార్టీ ప్రధాన కార్యదర్శి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి
మధ్యాహ్నం 2:46 గంటలు: ఎంపీ మేకపాటి రాజమోహన్‌ రెడ్డి ప్రవేశపెట్టిన రాజకీయ తీర్మానాన్ని బలపరుస్తూ ప్రసంగించిన ఎమ్మెల్యే కొడాలి నాని
మధ్యాహ్నం 2:25 గంటలు: రాజకీయ తీర్మానం ప్రవేశపెట్టిన ఎంపీ మేకపాటి రాజమోహన్‌ రెడ్డి

మధ్యాహ్నం 2:10 గంటలు: ‘చంద్రబాబు అవినీతి చక్రవర్తి’ పుస్తకంపై వివరణ ప్రారంభించిన అంబటి రాంబాబు
మధ్యాహ్నం 2:07 గంటలు: చంద్రబాబు అవినీతి చక్రవర్తి (ఎంపరర్‌ ఆఫ్‌ కరప్షన్‌)​ పుస్తకాన్ని ఆవిష్కరించిన వైయస్ జగన్‌ మోహన్‌ రెడ్డి. మూడేళ్లలో చంద్రబాబు నాయుడు చేసిన రూ.3,75,000కోట్ల అవినీతిని ఈ పుస్తకంలో ఆధారాలతో సహా వెల్లడించినట్లు తెలిపిన వైయస్‌ జగన్‌.
మధ్యాహ్నం 1:55 గంటలు: పార్టీ ప్రధాన కార్యదర్శి నివేదికను ప్రవేశ పెట్టిన ధర్మాన ప్రసాదరావు
మధ్యాహ్నం 1:45 గంటలు: ప్లీనరీలో ప్రజా ప్రాతినిధ్య చట్టం సెక్షన్‌ 29 సీ ప్రకారం మూడేళ్ల పార్టీ జమా ఖర్చుల నివేదికను ప్రవేశపెట్టిన  పార్టీ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి ప్రవేశపెట్టారు.
 
మధ్యాహ్నం 1:30గంటలు: వ్యవసాయ సమస్యలపై తీర్మానం ప్రవేశపెట్టిన వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ రైతు విభాగం అధ్యక్షుడు నాగిరెడ్డి
మధ్యాహ్నం 1:20గంటలు: విజయనగరం జిల్లా తీర్మానం ప్రవేశ పెట్టిన జిల్లా అధ్యక్షుడు బీ చంద్రశేఖర్‌

మధ్యాహ్నం 1:15 గంటలు: పశ్చిమ గోదావరి జిల్లా తీర్మానం ప్రవేశ పెట్టిన జిల్లా అధ్యక్షుడు ఆళ్ల నాని

మధ్యాహ్నం 1:05 గంటలు: తూర్పుగోదావరి జిల్లా తీర్మానం ప్రవేశపెట్టిన జిల్లా అధ్యక్షుడు కన్నబాబు

మధ్యాహ్నం 1గంటలు: విశాఖపట్నం తీర్మానం ప్రవేశపెట్టిన జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్‌నాథ్‌

మధ్యాహ్నం 12:55 గంటలు: శ్రీకాకుళం జిల్లాకు సంబంధించిన తీర్మానం ప్రవేశపెట్టిన జిల్లా అధ్యక్షురాలు రెడ్డి శాంతి
మధ్యాహ్నం 12:53 గంటలు : పూర్తయిన ప్లీనరీ ప్రసంగం. ప్లీనరీ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్న ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు
మధ్యాహ్నం: 12:45 గంటలు: ప్లీనరీ ప్రారంభ ఉపన్యాసాన్ని ప్రారంభించిన పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి
మధ్యాహ్నం 12: 40 గంటల: ప్లీనరీలో నేతలు, పార్టీ కార్యకర్తలతో ప్రమాణం చేయించిన  పార్టీ ప్రధాన కార్యదర్శి భూమన కరుణాకర్‌ రెడ్డి
మధ్యాహ్నం 12: 37 గంటలు: దివంగతులైన పార్టీ నేతలు, కార్యకర్తలకు నివాళులు

మధ్యాహ్నం 12:30 గంటలు: పార్టీ జాతీయ అధ్యక్ష ఎన్నికకు ప్రకటన విడుదల చేసిన  పార్టీ  ఎమ్మెల్సీ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు. నేడు నామినేషన్ల స్వీకరణ.  రేపు సాయంత్రం జాతీయ అధ్యక్ష ఎన్నికల ఫలితాలు ప్రకటిస్తామని వెల్లడి
మధ్యాహ్నం 12:19 గంటలు: ప్లీనరీలో సర్వమత ప్రార్థనలు

మధ్యాహ్నం 12: 17 గంటలు: వేదికవద్ద వైయస్‌ రాజశేఖర్‌ రెడ్డి విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించిన వైయస్‌ జగన్‌, పార్టీ నాయకులు
మధ్యాహ్నం 12:15 గంటలు: వేదిక పైకి చేరుకుని పార్టీ నాయకులకు, ప్రతినిధులకు, కార్యకర్తలకు, అభిమానులకు ఇతర శ్రేణులకు అభివాదం చేసిన వైయస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి

మధ్యాహ్నం 12:05 గంటలు: జాతీయ ప్లీనరీ ప్రాంగణంలో వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ  జెండా ఆవిష్కరించిన వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి

ఉదయం 11:58 గంటలు: ప్లీనరీ ప్రాంగణానికి చేరుకున్న వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి. ప్రాంగణమంతటా పార్టీ శ్రేణుల ఉత్సాహం, కోలాహలం

ఆకర్షిస్తున్న ఫొటో గ్యాలరీ: ప్లీనరీ ప్రాంగణంలో ఏర్పాటుచేసిన మ‌హానేత డాక్ట‌ర్ వైయస్ రాజ‌శేఖర్‌ రెడ్డి ఫొటో గ్యాల‌రీ బాగా ఆకర్షిస్తోంది. అలాగే, వేదికముందు ఏర్పాటుచేసిన వంద వైయస్‌ఆర్‌ విగ్రహాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.

కళాకారుల పాటలతో హోరెత్తిన ప్రాంగణం: భారీగా తరలివచ్చిన పార్టీశ్రేణులు, అభిమానులతో వైయస్ఆర్ ప్లీనరీ ప్రాంగణం కిక్కిరిసిపోయింది. కళాకారులు పాటలతో హోరెత్తించారు. వైయస్ఆర్ జయంతి సందర్భంగా మహానేతను స్మరించుకుంటూ ప్లీనరీ ఉత్సాహంగా కనిపించింది. .

పార్టీ ప్రతినిధుల నమోదు ప్రారంభం: వైయస్సార్సీపీ జాతీయ ప్లీనరీ సమావేశానికి ప్రతినిధుల రాక మరింత ఊపందుకుంది. రిజిస్ట్రేషన్ ప్రక్రియ మొదలైంది.

ఉదయం 10:30 గంటలు: గన్నవరం చేరుకున్న వైయస్‌ జగన్ మోహన్‌రెడ్డి. ఘనస్వాగతం పలికిన ఎమ్మెల్యే కొడాలి నాని, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ధర్మాన కృష్ణదాస్‌, జోగి రమేష్‌, వెల్లంపల్లి శ్రీనివాస్‌, దుట్టా రామచంద్రరావు, బుడ్డి చంద్రశేఖర్‌, స్థానిక నేతలు. 

ఉదయం 9:30 గంటలు: కడప నుంచి ప్రత్యేక విమానంలో గన్నవరం బయల్దేరిన వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి
ఉదయం 9:00 గంటలు: ఇడుపుల పాయ నుంచి కడప ఎయిర్‌పోర్టుకు బయల్దేరిన వైయస్‌ జగన్‌. అక్కడి నుంచి ప్రత్యేక విమానంలో గన్నవరం 
ఉదయం 8.30 గంటలు: ఇడుపుల పాయ వైయస్‌ఆర్‌ ఘాట్‌ ప్రాంగణంలో వైయస్‌ఆర్‌ విగ్రహానికి కుటుంబ సభ్యుల పుష్పాంజలి. పూలమాలను వేసి అంజలి ఘటించిన వైయస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి.

ఉదయం 8.00 గంటలు: ఇడుపుల పాయ వైయస్‌ఆర్‌ ఘాట్‌కు చేరుకున్న వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత వైయస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి. వైయస్‌ఆర్‌ ఘాట్‌ వద్ద కుటుంబ సభ్యులతో కలిసి ఘన నివాళులు.

Home  |  News  |  Downloads  |  Gallery  |  Contact Us  |   Sitemap  

Official Website of YSR Congress Party
Copyright © 2011 ysrcongress.com