Ysrcpnettv
YSR Congress Party Twitter YS Jagna Twitter

YSR Congress

Flash News >>>>
             పోలవం ప్రాజక్ట్ పై ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు..ముడుపుల కోసమే పోలవరంః పార్థసారధి                               కాపులను లాఠీలతో హింసిస్తారా...బాబును కాపు జాతి క్షమించదుః బొత్స సత్యనారాయణ                               ముద్రగడ పద్మనాభంను ఎందుకు హౌస్ అరెస్ట్ చేశారు : వైయస్ జగన్                               మిమ్మల్ని ప్రశ్నిస్తున్నందుకు అరెస్టులు, హౌస్‌ అరెస్టులు, బైండోవర్లు చేస్తారా?: వైయస్ జగన్                               తప్పు చేస్తున్నారు చంద్రబాబు గారు..మీరిచ్చిన హామీనే కదా కాపులు అడుగుతుందిః వైయస్ జగన్                               ముద్రగడ పాదయాత్ర పట్ల చంద్రబాబు నియంతృత్వ ధోరణిపై వైయస్ జగన్ ట్వీట్                               పోలీసుల లాఠీలతో ప్రభుత్వాన్ని నడపాలనుకుంటే గడాఫికి పట్టిన గతే బాబుకు పడుతుందిః అంబటి                               చంద్రబాబు దళిత వ్యతిరేక పాలనః వైవీ సుబ్బారెడ్డి                               మహిళలపై పోలీసుల అరాచకం..దళితులపై దాడి సిగ్గుచేటుః వైవీ సుబ్బారెడ్డి                 
    Show Latest News
టీడీపీలో ఓటమి గుబులు

Published on : 13-Jul-2017 | 12:01
 

– 2019 ఎన్నికలపై ఆశలు వదులుకుంటున్న తెలుగు తమ్ముళ్లు
– ప్లీనరీ విజయం చూసి తట్టుకోలేకపోతున్న టీడీపీ 
– వైయస్‌ఆర్‌సీపీలోకి చేరికలు ఉంటాయనే  ఆవేదన 

ఆడలేక మద్దెల ఓడు అన్నట్టు తయారైంది టీడీపీ నాయకుల వ్యవహారం. ఒకవైపు రాష్ట్రంలో వైయస్‌ జగన్‌కు వస్తున్న క్రేజ్‌ను ఎలా ఆపాలో అర్థంకాక చస్తుంటే మధ్యలో ఈ ప్రశాంత్‌ కిషోర్‌ ఎవ్రరా బాబూ అని తెలుగు దేశం నాయకులు, తెలుగు తమ్ముళ్లు గొంతు చించుకుంటున్నారు. పార్టీ ప్లీనరీలో జగన్‌ పొలిటికల్‌ స్ట్రాటజిస్ట్‌ ప్రశాంత్‌ కిషోర్‌ను పార్టీ శ్రేణులకు అలా పరిచయం చేశారో లేదో అట్నుంచి తీవ్రంగా ప్రకంపనలు పుట్టుకొచ్చాయి. 

అంత అక్కసు ఎందుకో.. 
పొలిటికల్‌ స్ట్రాటజిస్ట్‌గా ప్రశాంత్‌కిషోర్‌ని నియమించుకున్నారని.. జగన్‌నకు సత్తా లేదని టీడీపీ నాయకులు చేస్తున్న వింత వాదన కాసేపు పక్కన పెడితే.. ప్రశాంత్‌ కిషోర్‌ అనే వ్యక్తి  ఒక రాజీయ వ్యూహకర్త (పొలిటికల్‌ స్ట్రాటజిస్ట్‌). రాజకీయ పార్టీల గెలుపుకోసం పనిచేయడం ఆయన వృత్తి. నిద్ర లేస్తే డ్యాష్‌ బోర్డులు, ఎమ్మెల్యేల పనితీరు మీద సర్వేలు అంటూ హడావుడి చేసే చంద్రబాబుకు ఇవేవీ కొత్తగా కనిపించేది కాదు. కాకపోతే ఇంటిలిజెన్స్‌ వర్గాలతో చంద్రబాబు సర్వే చేయించుకుంటే.. ఇక్కడ వైయస్‌ జగన్‌ ప్రతిపక్ష నాయకుడు కాబట్టి ప్రశాంత్‌ కిషోర్‌ లాంటి ఒక స్ట్రాటజిస్ట్‌తో తన అవసరాలకు అనుగుణంగా పనులు చేయించుకుంటారు. పార్టీతో సంబంధం లేకుండా స్వతంత్రంగా,  తాను ఇవ్వాలనుకున్న ఫీడ్‌ బ్యాక్‌ను అందజేయడం ఆయన పని. నచ్చితే వాడుకుంటారు. నచ్చకపోతే పక్కన పెడతారు. కానీ టీడీపీ నాయకులు మాత్రం జగన్‌ సత్తాకు.. ప్రశాంత్‌ కిషోర్‌కు ముడిపెట్టి కోడి గుడ్డు మీద ఈకలు పీకే పని పెట్టుకున్నారు.

చంద్రబాబు మోడీతో జట్టుకట్టినప్పుడు..
ప్రధాని నరేంద్ర మోడీని ప్రధాన మంత్రిని చేయడంలో.. నితీష్‌కుమార్‌ను బీహార్‌ పీఠంపై కుర్చోబెట్టడంతోపాటు.. పంజాబ్‌లో కెప్టెన్‌ అమరీందర్‌సింగ్‌ను సీఎంను చేయడంలో ప్రశాంత్‌ కిషోర్‌ పాత్రను కాదనలేం. అదే ఇప్పుడు టీడీపీ నాయకుల భయం. అసలే కదనోత్సాహంతో దూసుకుపోతున్న వైయస్‌ఆర్‌ సీపీ శ్రేణులకు ప్రశాంత్‌ రాకతో మరింత అదనపు బలం చేకూరడం వారిని తీవ్రంగా ఇబ్బంది పెడుతోంది. ప్రశాంత్‌ కిషోర్‌కు మోడీతోపాటు ఉత్తరాది రాష్ట్రాల సీఎంలతో ఉన్న సాన్నిహిత్యం జగన్‌ను లాభించకూడదనేది వారి అభిమతంగా కనిపిస్తోంది.

వాస్తవాలు మరిచిన పచ్చమీడియా
టీడీపీ నాయకులు ఎంత మాట్లాడితే అంతా ప్రచారం చేసేసి పబ్బం గడిపే పచ్చ మీడియా మాత్రం వాస్తవాలను  మరిచిపోయినట్టుంది. అవసరాల కోసం, అధికారం కోసం జట్టు కట్టడం.. అవసరం తీరాక వదిలేయడం బాబుకు అలవాటన్న సంగతి గుర్తుకు రావడం లేదేమో. ఎన్టీఆర్‌కి వెన్నుపోటు పొడిచి చంద్రబాబు తొలిసారిగా ఎలా అధికారం చేజిక్కించుకున్నారో అందరికీ తెలుసు. 1999లో బాబు నాయకత్వంలో ఎన్నికలకు వెళ్లాల్సినప్పుడు ఒంటరిగా వెళ్తే గెలవలేమని భయపడి అప్పటికే కార్గిల్‌ యుద్ధంతో దేశవ్యాప్తంగా పేరు తెచ్చుకున్న వాజ్‌పేయి నాయకత్వంలోని బీజేపీతో జట్టు కట్టి గెలిచింది. 2004లోనూ అదే చేశారు. తనపై జరిగిన బాంబు దాడితో సానుభూతిని సంపాదించి గెలుద్దామని చూసి ముందస్తు ఎన్నికలకు వెళ్లిన చంద్రబాబు.. బీజేపీని కూడా ఒప్పించి వారి ఓటమికి కూడా కారణమయ్యాడు. మళ్లీ 2009లో అంతకాలం అంటకాగిన బీజేపీని వదిలి పెట్టి.. మతతత్వ పార్టీ అని తిట్టిపోసారు. మహాకూటమి పేరుతో టీఆర్‌ఎస్, వామపక్షాలతో జట్టుకట్టి ఘోరంగా ఓడిపోయాడు. మోడీ ఏపీకి వస్తే అరెస్టు చేస్తా.బీజేపీ మతతత్వ పార్టీ అని తిట్టిపోసి, 2014 ఎన్నికల ముందు మోడీ మేనియా చూసి సిగ్గులేకుండా ఆయనతో వేదిక పంచుకుని.. మోడీని తిట్టిన అదే నోటితో ఏడు కొండల వెంకన్న సాక్షిగా మోడీని పొగిడాడు. 2009లో పవన్‌ కళ్యాన్‌తో తిట్టించుకుని.. కాపుల ఓట్ల కోసం.. కాపులను బీసీల్లో చేరుస్తామని చెప్పి  మళ్లీ  చంద్రబాబు గెలిచిన ప్రతిసారీ ఎవరో ఒకరి ప్రాప్తమే తప్ప బాబు ఎప్పుడూ సొంతంగా వెళ్లి గెలిచింది లేదు. అదే వైయస్‌ఆర్‌ 2009లో సొంతంగా పోటీ చేసి ప్రభంజనం సృష్టించారు. మొదటి సారి సార్వత్రిక  ఎన్నికల్లో 2014లో కూడా వైయస్‌ జగన్‌ ఒంటరిగానే పోటీ చేసి ప్రజా మద్ధతు సాధించారు. కేవలం రెండు శాతం ఓట్లతో వెనుకబడినా మొత్తంగా టీడీపీకి వచ్చిన మెజారిటీ ఒక్క కడపలో వైయస్‌ జగన్‌ ఎంపీగా పోటీ చేసినప్పుడు వచ్చినంత మెజారిటీ కూడా రాలేదు. అయితే చంద్రబాబు అంతగా ఉలిక్కిపడటానికి కూడా కారణం కూడా లేకపోలేదు. ఎందుకంటే అసలే ప్లీనరీ విజయంతో కొండంత ఉత్సాహంతో చెలరేగిపోతున్న వైయస్‌ఆర్‌సీపీని చూసి టీడీపీ నాయకులు పార్టీ ఫిరాయిస్తారనేది ఆయన భయం. వందల కోట్లు ఖర్చు పెట్టి కొనుక్కుంటే ఆ డబ్బంతా వృథా అయ్యే ప్రమాదముందనేది ఆయన ఆలోచన. అదే ఇప్పుడు చంద్రబాబు భయానికి అసలు కారణం.

సంబంధిత వార్తలు

Emperor of Corruption YS Rajashekar Reddy YS Rajashekar Reddy Central Assistance to AP
Prajalachentha Epaper Youtube
Home  |  News  |  Downloads  |  Gallery  |  Contact Us  |   Sitemap  

Official Website of YSR Congress Party
Copyright © 2011 ysrcongress.com