Ysrcpnettv
YSR Congress Party Twitter YS Jagna Twitter

YSR Congress

Flash News >>>>
             వైయ‌స్ జగన్‌కు కలిసిన చెరుకు రైతులు                               మహిళలకు చంద్రబాబు క్షమాపణ చెప్పాలి - వాసిరెడ్డి పద్మ                               బాబువి దౌర్జన్యపోకడలు-అంబటి రాంబాబు                               ఫిరాయింపు ఎంపీలపై అనర్హత వేటు వేయాలి- స్పీకర్ కు ఎంపి వైవి సుబ్బారెడ్డి వినతి                               కరెవాండ్లపల్లి క్రాస్ చేరుకున్న వైయ‌స్ జగన్ ప్రజ సంకల్పయాత్ర                               కడపలో వైయస్‌ఆర్‌ సీపీ నిరసన                               దుర్గమ్మ ఆగ్రహానికి ఈ ప్రభుత్వం కూలిపోవడం ఖాయం-వెల్లంపల్లి శ్రీనివాస్                               జనం మధ్యనే జననేత నూతన సంవత్సర వేడుకలు                               పిట్టల దొర వచ్చాడు..శివన్నకు సినిమా చూపించాడు - వైయస్ జగన్ మోహన్ రెడ్డి                 
    Show Latest News
రైతుల సంక్షేమం పట్టని రాక్షస సర్కారు

Published on : 23-Dec-2017 | 15:09
 


– ఓటేయించుకుని వేధిస్తున్న చంద్రబాబు
– రుణమాఫీ పేరు చెప్పి రైతులకు కుచ్చుటోపీ 
– బాబు కమీషన్ల కక్కుర్తితో ఏపీకి తీవ్ర అన్యాయం
– పోలవరం నిర్మాణాన్ని ప్రశ్నార్థకం చేసిన సీఎం
జాతీయ రైతు దినోత్సవం సందర్భంగా ప్రత్యేక కథనం

రైతన్న కనుమరుగైపోతున్నాడు. వ్యవ‘సాయం’ అందక  సాగుకు దూరమవుతున్నాడు. రోజురోజుకు కుంగిపోతున్నాడు. జీవన పోరాటం కోసం వ్యవసాయంలోకి దిగితే అప్పుల బాధలు తట్టుకోలేక బతుకుపోరాటాన్ని మధ్యలోనే ఆపేస్తున్నాడు. అతివృష్టి, అనావృష్టి వంటి ప్రకృతి ప్రకోపాలతోపాటు.. ప్రభుత్వం వైఖరితో వ్యవసాయం చేయలేక ప్రత్యామ్నాయ మార్గాలను వెతుకుతున్నాడు. పదెకాల కంటే ఎక్కువ భూములున్న రైతులు దాదాపు పదేళ్ల నుంచే వ్యవసాయాన్ని మానేసి కౌలుకిచ్చి వ్యాపారాలు చేసుకుంటుండగా.. భూముల్లేని, రెండు మూడెకరాల పొలాలున్న చిన్నచిన్న కౌలు రైతులు మాత్రమే వేరే మార్గం దొరక్క వ్యవసాయమే జీవనాధారంగా బతుకున్నారు. జాతీయ రైతు దినోత్సవం సందర్భంగా ప్రత్యేక కథనం.. 
ఓట్ల కోసం దొంగ హామీలు
ఆంధ్రప్రదేశ్‌ పూర్తిగా వ్యవసాయాధారిత రాష్ట్రం. దాదాపు 65 మంది వ్యవసాయం, దాని అనుబంధ రంగాల మీదే ఆధారపడి జీవిస్తున్నారు. ఇంత భారీ స్థాయిలో ఉన్న వ్యవసాయ రంగంపై చూపుతున్న వివక్ష కారణంగా రైతు బలవన్మరణాలు చేసుకోక తప్పడం లేదు. 2014 ఎన్నికలకు ముందు వస్తున్నా మీకోసం అంటూ పాదయాత్ర చేసిన చంద్రబాబు రైతన్నను కలిసి మొసలి కన్నీరు కార్చాడు. మీకు అండగా ఉంటానని కాకమ్మ కబుర్లు చెప్పాడు. అధికారంలోకి వస్తూనే బేషరతుగా రుణమాఫీ చేస్తానని హామీ ఇచ్చాడు. చంద్రబాబు చెప్పినట్టే చేసుంటే ఇప్పుడాయన గురించి మరోలా చెప్పుకోవాల్సి వచ్చేది. రుణమాఫీ చేస్తానని చెప్పిన మనిషి అధికారంలోకి వచ్చాక రోజుకో రకం మాటలతో రైతులను అవమానించాడు. రైతులకు అంత ఆశ పనికి రాదని ఒకసారి.. రుణమాఫీ మొత్తం చేశానని ఒకసారి.. మొత్తం చేస్తానని నేనెక్కడ చెప్పానని మరోసారి.. ఐదు విడతల్లో చేస్తామని ఇంకోసారి.. ఇలా ఒక్కోసారి ఒక్కోరకంగా నాలుకను మడతేస్తూనే ఉన్నారు. ఒక పక్క పేద రాష్ట్రం అంటూనే తన జల్సాలకు డబ్బులు ఖర్చు చేయడం చూసి రైతుల గుండెల మండాయి. కొందరు నీరసించిపోయారు. మొదటి రెండేళ్లు రుణమాఫీ చేస్తాడేమోనని ఎదురు చూసిన ప్రజలు చివరికి ఆశలొదిలేసుకున్నారు. తొలిసారి జరిగిన రుణమాఫీ కూడా ప్రతిపక్ష నాయకుడు వైయస్‌ జగన్‌ కల్పించుకుని ధర్నాలు, నిరాహార దీక్షలు చేసేదాకా జరగలేదంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. ప్రతిపక్ష నాయకుడే పోరాడకపోయుంటే చంద్రబాబులో చలనం ఉండేది కాదని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఎన్నికల ముందు మీరు బ్యాంకు రుణాలు కట్టవద్దని.. అధికారంలోకి వచ్చాక మొత్తం మాఫీ చేస్తామని చెప్పిన చంద్రబాబు నిండా ముంచేశాడు. కొత్తకొత్త కొ్రరీలు పెడుతూ రైతుకు వ్యవసాయమంటేనే అనాసక్తి కలిగేలా చేశాడు. ఐదు విడతల్లో రుణ మాఫీ అన్నాడు. లబ్ధిదారుల జాబితా పేరుతో సమయాన్ని గణనీయంగా తగ్గించాడు. అసలు రైతులు అవునా కాదా అని విచారణ పేరుతో 87 లక్షలున్న రైతులను 27 లక్షలుగా చూపించాడు. ఇలా రైతును తీవ్రంగా దెబ్బతీశాడు. చివరికి విభజన హామీలో భాగంగా మనకు దక్కాల్సిన పోలవరం ప్రాజెక్టును కూడా అనుమానంలో పడేశాడు. కమీషన్ల కోసం కక్కుర్తిపడి తెచ్చుకున్న ప్రాజెక్టును ప్రశ్నార్థకం చేశాడు. వైయస్‌ హయాంలో దాదాపు 60 శాతం పూర్తియిన పనులను ముందుకు తీసుకెళ్లేందుకు మనసు చాలడంలేదు.  కుటిల యత్నాలతో ప్రాజెక్టు అంచనాలను 16 వేల కోట్ల నుంచి 58 వేల కోట్లకు పెంచేసి ప్రాజెక్టు పూర్తవడం భ్రమే అని తీరుకు తీసుకొచ్చాడు. ఐదు దశాబ్దాల పోలవరం కలను సాకారం చేసేందుకు వైయస్‌ఆర్‌ భగీరథ ప్రయత్నం చేసి అన్ని అనుమతులు సాధించి 60 శాతం పనులు పూర్తిచేస్తే చంద్రబాబు మాత్రం ధనార్జనే ధ్యేయంగా పోలవరాన్ని అటకెక్కించాడు. 
పరిహారం చెల్లింపుల్లోనూ పరిహాసం
ప్రాజెక్టుల కోసం భూములిచ్చిన రైతులకు దక్కాల్సిన పునరావాసం, పరిహారం చెల్లింపుల్లో తీవ్ర జాప్యం జరుగుతోంది. ఇక్కడా చంద్రబాబు తన అతి తెలివి ప్రదర్శించి లబ్ధిదారుల జాబితాను ఎంతవరకు తగ్గించాలో అన్ని ప్రయత్నాలు చేశాడు. ఆఖరికి ఆత్మహత్యలు చేసుకున్న రైతులకు దక్కాల్సిన పరిహారం విషయంలోనూ రైతులను తీవ్రంగా అవమానించాడు. అప్పులపాలై ఆత్మహత్యలు చేసుకుంటే మద్యం తాగి.. కుటుంబ తగాదాలతో చనిపోతున్నారంటూ కొత్త పలుకులు పలుతుకున్నారు. విచారణ కోసం బాధితుల కుటుంబాలనే కలవాల్సిన అ«ధికారులు.. తమ వద్దకే పిలిపించుకుని రకరకాల ప్రశ్నలతో వేధిస్తున్నారు. నిబంధనల ప్రకారం చనిపోయిన వెంటనే చెల్లించాల్సిన పరిహారాన్ని వారికి దక్కకుండా చేస్తున్నారు. 


సంబంధిత వార్తలు

Home  |  News  |  Downloads  |  Gallery  |  Contact Us  |   Sitemap  

Official Website of YSR Congress Party
Copyright © 2011 ysrcongress.com