Ysrcpnettv
YSR Congress Party Twitter YS Jagna Twitter

YSR Congress

Flash News >>>>
             పారాది నుంచి వైయ‌స్ జ‌గ‌న్ 290వ రోజు ప్ర‌జా సంక‌ల్ప యాత్ర ప్రారంభం                               గుంటూరు జిల్లా టీడీపీ మాజీ అధ్యక్షుడు మల్లాది శివన్నారాయణ, చిలకలూరిపేట టీడీపీ మాజీ అధ్యక్షుడు శివయ్య, జి.వెంకట్రావు, కె.కాంతారావులు వైయ‌స్ఆర్‌సీపీలో చేరిక‌                               దేశంలో, రాష్ట్రంలో ఇలాంటి అబద్ధపు ముఖ్యమంత్రి ఎక్కడా లేరని, గల్ఫ్‌ దేశాల్లో ఇలాంటి అబద్ధాల ముఖ్యమంత్రిని ఎప్పుడో ఉరి తీసేవారు: ఎమ్మెల్యే ర‌వీంద్ర‌నాథ్‌రెడ్డి                               చంద్రబాబు..నీకిదే ముఖ్యమంత్రిగా చివరి అవకాశం...నిన్ను దగ్గరగా గమనించిన మనిషిగా చెబుతున్నా: త‌మ్మినేని సీతారాం                               శ్రీకాకుళం ఉద్యమాల పురిటిగడ్డ...ఎంతమందిపై కేసులు పెడతావ్. : త‌మ్మినేని సీతారాం                               నీళ్లో రామచంద్ర అని అడుగుతున్నవారికి వారి దాహార్తి తీరుస్తారే కాని వారిని సైతం బుల్డోజర్‌ తో తొక్కిస్తా అని అనగల ధైర్యం చంద్రబాబుకే ఉంది: భూమ‌న క‌రుణాక‌ర్‌రెడ్డి                               వైయ‌స్ జ‌గ‌న్‌ను క‌లిసిన మ‌ధువాడ అన్న‌దాత‌లు                               టీడీపీ తోక పత్రికలో 108 దుస్థితిపై వచ్చిన కథనాలను ఏమంటారు.. అది నిజం కాకపోతే ఆ వార్తలను ఎందుకు ఖండించలేదు: సుధాక‌ర్‌బాబు                               - విజ‌య‌న‌గ‌రం జిల్లా చీపురుప‌ల్లి నియోజ‌క‌వ‌ర్గంలోని ఆనంద‌పురం క్రాస్ వ‌ద్ద 3100 కిలోమీట‌ర్ల వ‌ద్ద వేప మొక్క‌ను నాటిన వైయ‌స్ జ‌గ‌న్‌                 
    Show Latest News
ఆదాయం కోసం అమరావతికి రమ్మంటారా?

Published on : 19-Jan-2018 | 22:22
 

– ఉపాధి అవకాశాలు లేకుండా ప్రజలెలా వస్తారు
– లెక్కల్లో తప్ప వాస్తవంలో కనపడని అభివృద్ధి
– అన్ని ప్రధాన రంగాల్లోనూ వెనుకబాటే
– నాలుగేళ్లలో చంద్రబాబు సాధించింది శూన్యం

వాళ్లతో తిరిగితే వీళ్లు వాళ్లవుతారనే మాట నిజమే కానీ.. చంద్రబాబును కలిసిన మనుషులు మాత్రం క్షణాల్లో అచ్చం ఆయనలాగే మాట్లాడటం మాత్రం ఆశ్చర్యకరం. చంద్రబాబు మాటతీరు తెలుగు ప్రజలకు కొత్తేమీ కాదు. గొప్పలు చెప్పుకోవడం, కళ్లార్పకుండా అబద్ధాలు చెప్పడంలో ఆయన్ను మించిన వారు లేరు. అయితే నీతి అయోగ్‌ ఉపా«ధ్యక్షుడు రాజీవ్‌కుమార్‌ను చూస్తుంటే చంద్రబాబు ప్రభావం ఆయన మీద కూడా ఏమైనా పనిచేసిందా అని డౌటనుమానం కలుగుతుంది. హైదరాబాద్‌లో ఉన్న తెలుగోళ్లంతా ఏపీకి వస్తే ఆదాయం పెరుగుతుందంటూ మరోవైపు ,  వృద్ధిరేటు 12 నుంచి 15 శాతం ఉన్న ఏపీకి చేయూత అనవసరం అంటూ చేసిన వ్యాఖ్యలు పరస్పరం విరుద్ధంగా ఉన్నాయి. చంద్రబాబు ముఖ్యస్తుతి కోసం చేసినట్టుగా ఉన్నా  ఎన్నో అనుమానాలు రేకెత్తిస్తున్నాయి. 
వృద్ధి రేటు గురించి...
చంద్రబాబు అందించిన లెక్కల ప్రకారం ఏపీ జీడీపీ అంత ఘననీయంగా పెరిగిపోతున్నప్పుడు ఆంధ్రప్రదేశ్‌ నిధుల పరంగా మిగులు రాష్ట్రంగా ఉండాలి. రాష్ట్ర విభజన తర్వాత ఏపీ వాటా కింద రూ. 90 వేల కోట్లు అప్పులు వస్తే.. మూడున్నరేళ్లలో దాన్ని మరో లక్షా 20 వేల కోట్లు కలిపి 2 లక్షల కోట్లకు చేరేదా. జీడీపీ ప్రకారం మిగుల బాట పట్టాలి. 
వృద్ధిరేటు  విధంగా పెరిపోతున్నప్పుడు పెట్టుబడుల కోసం 16 సార్లు విదేశీ పర్యటనలు, విశాఖలో భాగస్వామ్య సదస్సులు, పదుల కోట్లు ఖర్చు పెట్టి దావోస్‌ టిక్కెట్‌లు కొనాల్సిన అవసరం ఏముంది. మరి ఆయా పర్యటనలతో ఏం సాధించినట్టు. తెచ్చి పెట్టుబడులన్నీ ఏమైనట్టు. లక్షల కోట్లు తెచ్చామని చెప్పిన మాటలు ఉత్తదనేగా. గతంలో వైయస్‌ఆర్‌ సీఎంగా ఉండగా ఇలాంటి భాగస్వామ్య సదస్సులు నిర్వహించలేదు, దావోస్‌లకు పరుగులు పెట్టలేదు, అన్నిసార్లు విదేశాలకు ప్రత్యేక విమానాల్లో తిరగనేలేదు. ఎక్కడా అభివృద్ధి కార్యక్రమాలు ఆగిన దాఖలాలు లేవు. పెట్టుబడుల కోసం ఎవర్నీ దేబిరించిన సంఘటన లేదు. అలాగని పెట్టుబడిదారులు రాలేదా.. పరిశ్రమలు పెట్టలేదా. ? 

హైదరాబాద్‌ వదిలి రావాలా..?
నీతి అయోగ్‌ ఉపాధ్యక్షుడు రాజీవ్‌ కుమార్‌ చెప్పిన మరో విషయం ఏపీ ప్రజలంతా హైదరాబాద్‌ను వదిలి అమరావతికి వచ్చేస్తే 40 శాతం ఆదాయం పెరుగుతుందని. ఈయన వ్యాఖ్యలు వినడానికి కొంచెం చౌకబారుగా అనిపించినా.. అనుమానాలు కూడా కలగకమానవు. అభివృద్ధిలో దూసుకుపోతున్నప్పుడు బతుకుదెరువు కోసం వెళ్లినోళ్లను రమ్మనడం చూస్తుంటే అప్పుల్లో ఉన్నాం బాబూ మీరొచ్చి ట్యాక్సులు కట్టి ఉద్ధరించండి అని దేబిరించుకున్నట్టే ఉంది. చంద్రబాబు ప్రభుత్వం చెప్పుకుంటున్నట్టు వృద్ధి రేటు అంత ఎక్కువగా ఉంటే ఇలాంటి దేబిరింతలు అవసరం లేదు. ఉద్యోగరీత్యా బతుకుదెరువు కోసం వెళ్లినోళ్లను తిరిగి రమ్మనాల్సిన అగత్యం పట్టదు. పొట్టకూటి కోసం పక్క రాష్ట్రాలకు జనం వలసలు పెట్టేవాళ్లు కాదు. వ్యవసాయంలో రెండకెల వృద్ధిరేటు చూపిస్తున్న ముఖ్యమంత్రికి రాయలసీమలో కరువు, రాష్ట్రవ్యాప్తంగా రైతు ఆత్మహత్యలు కనపడటం లేదా. పక్కనే ఉన్న చంద్రబాబు నీతిఅయోగ్‌ ఉపాధ్యక్షుడి మాటలను ఖండించకపోవడం ఆశ్చర్యకరం. ఇదంతా చూస్తుంటే ఆడలేక మద్దెల ఓడు అన్నట్టుంది. 

అవకాశాలు లేకుండా ఎలా ..?
ఏపీలో వనరులు అపారంగా ఉంటే పెట్టుబడులు పెట్టాలని.. ఏపీకి తిరిగి రావాలని ఎవరూ పిలవాల్సిన పనిలేదు. ఓటుకు నోటు కేసులో దొరికిపోయిన చంద్రబాబు హడావుడిగా ఏపీకి తరలిపోవడానికి నిర్ణయించుకున్నప్పడు ఉద్యోగులను  అమరావతికి రప్పించడానికి పడిన పాట్లు అన్నీ ఇన్నీ కావు. ప్రత్యేక రైలు, వారానికి రెండు రోజులు సెలవులంటూ చాలా మాటలే చెప్పారు. అయినా ఉద్యోగులు పూర్తి స్థాయిలో రావడానికి చాలా కాలమే పట్టింది. హడావుడిగా రైతుల నుంచి భూములు లాక్కుని అంతర్జాతీయ రాజధాని పేరుతో వందల కోట్లు ఖర్చు పెట్టినా తాత్కాలిక బిల్డింగ్‌లు కూడా చక్కగా కట్టలేకపోయారు. అందరికీ ఆమోదయోగ్యమైన నిర్ణయం తీసుకోకుండా ఒక వర్గానికి న్యాయం చేసేలా చంద్రబాబు వ్యవహరిస్తున్నారనే అపవాదు కూడా లేకపోలేదు. కొత్త రాజధాని నిర్మాణం అంటే రియల్‌ ఎస్టేట్‌ రంగం ఆకాశంలో ఉంటుందని అంతా భావించారు. కానీ అది బేస్‌మెంట్‌ కూడా దాటలేదు. శాంతి భద్రతలు కూడా సరిగా లేవు. టీడీపీ నాయకులే వేధింపులకు గురిచేస్తున్నారు. వనజాక్షి, ఐపీఎస్‌ బాలసుబ్రహ్మణ్యం వంటి ప్రభుత్వ ఉద్యోగులకే రక్షణ లేకుండా పోయింది. స్కూలు, కాలేజీల్లో వసతులు లేకపోయినా ఫీజులు ఆకాశాన్నంటాయి. ఇప్పటివరకు హైదరాబాద్‌ కేంద్రంగానే అన్ని ప్రధాన ఆస్పత్రులు నడుస్తున్నాయి. ఏవైనా అత్యవసర ఆరోగ్య పరిస్థితులు తలెత్తినప్పుడు అందరూ హైదరాబాద్‌కే వస్తారు. ఇలాంటి పరిస్థితుల్లో ఆరోగ్యశ్రీని ఏపీకే పరిమితం చేసినప్పుడు ఏం ఉందని ఏపీకి వస్తారో రాజీవ్‌కుమార్‌కు చంద్రబాబుకే తెలియాలి. 

సంబంధిత వార్తలు

Home  |  News  |  Downloads  |  Gallery  |  Contact Us  |   Sitemap  

Official Website of YSR Congress Party
Copyright © 2011 ysrcongress.com