Ysrcpnettv
YSR Congress Party Twitter YS Jagna Twitter

YSR Congress

Flash News >>>>
             కర్ణాటక ఎన్నికలు ముగిసి 40 రోజులు కావొస్తోంది.. మరి బాబు చెప్పిన కేసులేమైనట్లు?: బొత్స స‌త్య‌నారాయ‌ణ‌                               ఉక్కు ఫ్యాక్టరీ కోసం టీడీపీ నేతలు దొంగ దీక్షలు: మాజీ ఎంపీ మిథున్‌రెడ్డి                               వైయ‌స్‌ జగన్‌ 198వ రోజు పాదయాత్ర సోమవారం ఉదయం మామిడికుదురు నుంచి ప్రారంభం                               కడపలో ఉక్కు ఫ్యాకర్టీ నిర్మిస్తే యువతకు ఉద్యోగాలు దొరుకుతాయి, ప్రజలకు ఉపాధి లభిస్తుంది: ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి                               కడప స్టీల్ ప్లాంట్‌ను ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేస్తూ వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ శనివారం కడపలో మహా ధర్నా                               చింత‌ల‌ప‌ల్లి నుంచి 196వ రోజు ప్రజాసంకల్పయాత్ర ప్రారంభం                               దేశంలోనే సీనియర్‌ నాయకుడిని అని చెప్పుకునే చంద్రబాబు యూటర్న్‌ ఎందుకు తీసుకున్నారు: ఉమ్మారెడ్డి వెంక‌టేశ్వ‌ర్లు                               రాష్ట్ర ప్రయోజనాల పరిరక్షణ కోసమే రాజీనామాలు చేశాం: మేకపాటి రాజమోహన్‌రెడ్డి                               ప్రత్యేక హోదా కోసం పోరాటం కొనసాగిస్తూ ఉంటామని, సాధించే వరకు తమ పోరాటం ఆగదు : మిథున్‌ రెడ్డి                  
    Show Latest News
రాజీనామాలపై నీచ టీడీపీ రాజకీయం

Published on : 08-Jun-2018 | 10:44
 

మేకపాటి రాజమోహన్ రెడ్డి, వైవీ సుబ్బారెడ్డి, వరప్రసాద్, వైఎస్ అవినాశ్ రెడ్డి, మిథున్ రెడ్డి... రాష్ట్రం అంతా హోరెత్తుతున్న పేర్లు ఇవి. ప్రత్యేక హోదా సాధన కోసం పార్లమెంటులో గర్జించిన ఈ సింహాలు, అవిశ్వాసంతో కేంద్రాన్ని ఢీకొట్టిన చిరుతపులులు, రాజీనామాలతో రాష్ట్రం కంటే పదవులు ముఖ్యం కాదని నిరూపించిన అసలైన నేతలు. ఏప్రిల్ 6న రాజీనామాలు చేసిన వైఎస్సార్ కాంగ్రెస్ ఎంపీలను స్పీకర్ సుమిత్రా మహాజన్  ’భావోద్వేగంతో రాజీనామాలు చేసినట్టుంది. మళ్లీ ఒకసారి ఆలోచించుకుని రండి’ అని చెప్పారు. నెల రోజుల తర్వాత కూడా తమ నిర్ణయంలో మార్పు లేదని చెప్పి ఆ రాజీనామాలను ఆమోదింపచేసుకున్నారు ఎంపీలు. తమ ఎంపీలను చూసి గర్వంగా ఉందని అన్నారు వైఎస్సార్ కాంగ్రెస్ అధినేత, ఎపి ప్రతిపక్ష నేత వైఎస్ జగన్. రాజకీయ ప్రయోజనాల కంటే ప్రజలే ముఖ్యం అందుకే తమ ఎంపీల త్యాగం వృద్ధా కాదు అని ప్రకటించారు. 

టీడీపీ కలవరం

ఎంపీలు రాజీనామాలు చేసిన తర్వాత కూడా టీడీపీ నేతలు దీన్ని డ్రామా అంటూ ప్రచారం చేయడానికి విఫల ప్రయత్నాలు చేస్తున్నారు. ఒక వర్గం మీడియా వైఎస్సార్ సిపి ఎంపీల రాజీనామాలపై చేస్తున్న రాజకీయాలను చూసి వైఎస్ జగన్ సైతం సీరియస్ గా స్పందించారు. హోదా కోసం త్యాగం చేసిన ఎంపీలకు విలువ ఇవ్వాలన్న కనీస బాధ్యత చంద్రబాబుకు లేదా అని ప్రశ్నించారు. హోదా విషయంలో యూ టర్న్ తీసుకున్న చంద్రబాబు ఎంపీల రాజీనామా విషయంలో కూడా ఆలోచన మార్చుకుని ఉండొచ్చు కదా అన్నది ప్రజల మాట. కానీ చంద్రబాబు హోదాపై నోటి మాటలతో కాలం వెళ్లబుచ్చుతూ, కేంద్రంలో పదవులను మాత్రం కాపాడుకుంటున్నాడు. బాబు చిత్తశుద్ధి ఏపాటిదో దీనితోనే అర్థం అవుతుంది. హోదా కోసం, విభజన హామీల కోసం దీక్షలంటూ నానా హడావిడీ చేసి, కోట్లు తగలేసిన చంద్రబాబు, హోదా కోసం రాజీనామాలు చేసిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీల నిజాయితీని శంకించడం విడ్డూరం. 

బురద మాటలు

ఎంపీ గల్లా జయదేవ్ ఎంపీలు రాజీనామా చేస్తే ఏమొస్తుంది అన్నాడు. కేసుల మాఫీ కోసం వైఎస్ జగన్ ఎంపీల తో రాజీనామా డ్రామా అని మంత్రి శిద్ధ రామయ్య నోరు పారేసుకున్నాడు. రాజ్యసభ సభ్యుడు సిఎం రమేణ్  పార్లమెంటు లో ప్రధానిని విమర్శించలేక వైసీపీ ఎంపీలు రాజీనామా చేసారన్నాడు. జూపూడి ప్రభాకర్ వైఎస్ జగన్ దిల్లలీలో మోదీ ఇంటి ముందు ధర్నా చేయాలని డిమాండ్ చేసాడు. అవిశ్వాసమే ఓ బూటకమని కంభపాటి రామ్మోహనరావు విమర్శించాడు. చివరకి వైఎస్సార్ కాంగ్రెస్ ఎంపీల రాజీనామాలు ఆమోదం పొందుతాయని అర్థం అయిన వెంటనే చంద్రబాబు ఉప ఎన్నికలు రావనే ఎంపీలు రాజీనామాలు చేసారని నీచమైన విమర్శలకు సైతం పాల్పడ్డాడు.

వాస్తవాలు చూస్తే  నిజంగా ఉప ఎన్నికలు రావనే ప్రతిపక్ష పార్టీ ఎంపీలు రాజీనామాలు చేస్తే, మరి ఉప ఎన్నికల్లో పోటీకి సిద్ధం అని చంద్రబాబు ఎందుకన్నట్టు? హోదా కోసం ఉద్యమించి, రాజీనామాలు చేసిన ఎంపీల స్థానాల్లో ఉప ఎన్నికలకు పోటీ చేయడం అంటే చంద్రబాబు హోదా కు తిలోదకాలు ఇచ్చినట్టే కదా. హోదా కావాలంటూ ప్రజల ముందు డ్రామాలు ఆడుతూ, హోదా ఉద్యమం కోసం పదవులు త్యాగం చేసిన వారిని అవమానిస్తున్నట్టే కదా. ఇక టీడీపీ నేతల నాలుకలు తాటిమట్టల్లా మారడం వెనుక ఉన్న ఒకే ఒక్క కారణం ప్రతిపక్ష పార్టీకీ, ఆ పార్టీ అధినేతకు ప్రజల్లో రోజురోజుకూ పెరుగుతున్న ఆదరణ. అన్ని  జిల్లాల్లోనూ ప్రజా సంకల్ప యాత్ర ప్రజామోదంతో దూసుకు వెళ్లడం చూసి ఓర్వలేనితనం. ఎంపీల రాజీనామాల ద్వారా ప్రజల్లోకి వెళ్లడాన్ని సహించలేక, తెలుగు తమ్ముఇలాంటి నీచమైన విమర్శలకు సైతం దిగజారారు. నిజంగా కేసుల మాఫీ కోసమే అయితే వైఎస్ జగన్ కేంద్రంలో ఉన్న బీజేపీతో స్నేహంగా ఉంటాడు కానీ, వ్యతిరేకంగా అవిశ్వాసం పెడతారా? వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్రంపై అవిశ్వాసం పెట్టడం వల్ల ఎన్డీయే ప్రభుత్వం పడిపోతుందా అన్న టీడీపీ అధినేత ఎందుకు తాను ప్రత్యేకంగా అవిశ్వాసం పెట్టాడో ఈ నేతలు చెప్పగలరా? ప్రధానిని విమర్శించ లేక రాజీనామాలు అనడంలోనే తెలుగు తమ్ముళ్ళు చేసిన పనులు ప్రజలకు గుర్తుకు వస్తాయి. పార్లమెంట్ లో ప్రధానిని నేరుగా కలిసి విజయసాయి రెడ్డి హోదా గురించి అడిగనప్పుడు, ప్రధానిని విజయసాయి రెడ్డి ఎందుకు కలిసాడంటూ యాగీ చేసారు పచ్చతమ్ముళ్లు. ఎ1గాఉన్న వ్యక్తితో ప్రధాని చనువుగా ఉన్నారని ఓ ఎంపీని నోటికొచ్చినట్టు విమర్శించారు. ప్రధాని లేనప్పుడు ఆయన ఇంటి ముందు హడావిడి చేసి పారిపోయిన టీడీపీ ఎంపీలు ధైర్యంగా రాజీనామాలు చేసిన వైఎస్సార్సీపీ ఎంపీలను ఎద్దేవా చేయడం చూసి ప్రజలే విస్తుపోతున్నారు. 
ఆడలేక మద్దెల ఓడన్నట్టు తాము రాజీనామాలు చేయక పోగా, వైసీపీ ఎంపీల రాజీనామాల వల్ల ప్రయోజనం లేదనడం ప్రభుత్వం చేతగాని తనానికి నిదర్శనం. అందుకే ప్రతిపక్ష నేత ఓ మాటన్నారు  మంచి చేస్తే శభాష్ అనండి. ఫ్యూచర్ జనరేషన్ కి అది స్ఫూర్తి అవుతుంది. లేదంటే రాజకీయాలంటే భవిష్యత్తులో ఛీ అనే రోజు వస్తుంది అని. 

 

సంబంధిత వార్తలు

Home  |  News  |  Downloads  |  Gallery  |  Contact Us  |   Sitemap  

Official Website of YSR Congress Party
Copyright © 2011 ysrcongress.com