Ysrcpnettv
YSR Congress Party Twitter YS Jagna Twitter

YSR Congress

Flash News >>>>
             టీడీపీ నేతలు ఇంకా ప్యాకేజీ గురించి మాట్లాడటం సిగ్గుచేటుఐ ఒంగోలు ఎంపీ వైవీ సుబ్బారెడ్డి                                వైయస్‌ఆర్‌ సీపీ, బీజేపీ కలిసిపోయాయని ఆరోపణలు చేసిన చంద్రబాబు అరుణ్‌జైట్లీతో రహస్య భేటీపై ప్రజలకు సమాధానం చెప్పాలి: వైవీ సుబ్బారెడ్డి                               ఎన్‌డీఏ స‌ర్కార్‌కు చిత్త‌శుద్ధి ఉంటే ప్ర‌త్యేక హోదాపై స‌భ‌లో చ‌ర్చించాలి: ఎంపీ వైవీ సుబ్బారెడ్డి                               మొద‌లైన జాతీయ ర‌హ‌దారుల దిగ్బంధం కార్య‌క్రమం                               118వ రోజు ప్ర‌జా సంక‌ల్ప యాత్ర పోలిరెడ్డిపాలెం శివారు నుంచి ప్రారంభం                               అవిశ్వాస తీర్మానంపై చర్చ జరిగేదాకా మేం పోరాడుతూనేఉంటాం: ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి                                అవిశ్వాసంపై సభలో నాలుగు సార్లూ ఒకే డ్రామా నడిచింది: ఎంపీ వైవీ సుబ్బారెడ్డి                               చంద్రబాబు తరహాలో లాలూచీ రాజకీయాలు చేయడం తమకు రాదని, నాలుగేళ్లుగా ఒకే మాట మీద ఉన్నాం: ఎంపీ అవినాష్‌ రెడ్డి                               హోదా వద్దు.. ప్యాకేజీ కావాలన్న బాబుకు నైతిక విలువలు ఉన్నాయా?: ఎంపీ విజ‌య‌సాయిరెడ్డి                 
    Show Latest News
అప్పులాంధ్రప్రదేశ్

Published on : 13-Oct-2017 | 15:44
 

ఆదాయం అదఃపాతాళంలో ఉంది. అప్పులు ఆకాశానికెక్కుతున్నాయి. కాని ఆంధ్రప్రదేశ్ మాత్రం అభివృద్ధి చెందిపోతోంది. కంగారు పడకండి. అదంతే. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాయాజాలమే ఇది.  అందినకాడికి అప్పులు తెచ్చి, ఆదాయాన్ని ఆడంబరాలకు ఖర్చులు పెట్టి రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చారు.  చివరికిప్పుడు తీరిగ్గా లెక్కలు కట్టుకుంటున్నారు. 

పైగా, అప్పులు చేయందే అభివృద్ధి ఎలా అంటూ ప్రశ్నించారు వ్యవసాయశాఖా మంత్రి పత్తిపాటి పుల్లారావు. ఆర్థిక మంత్రిగారైతే అప్పుల మీద బతికేస్తున్నాం అంటూ దర్జాగా చెప్పేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ ఏర్పడినప్పుడు 16వేల కోట్ల ఆర్థిక లోటు ఉంది. ఇప్పుడది 20వేల కోట్లకు చేరింది. ఇక అప్పులైతే ఏకంగా లక్షా ఇరవై రెండు వేల కోట్లకు చేరాయి. ఆర్థికంగా అత్యంత దారుణమైన పరిస్థితుల్లో ఎపి ఉన్నదన్నది సుప్పష్టం.

ఇక నిబంధనలకు నీళ్లొదిలి ఇష్టారాజ్యంగా అప్పులు తేవడమే కాక, అనవసర వ్యయాలు కూడా ఉండటంతో కేంద్రం నుంచి టిడిపి ప్రభుత్వానికి ఒత్తిడి కూడా ఎక్కువైంది. ఉత్పాదక రంగాలు, ఆదాయాన్నిచ్చే వాటిపై, ఆస్తుల కల్పనలపై ఏమాత్రం ఖర్చు చేయకుండా, అనుత్పాదక రంగంపై అధికంగా ఖర్చులు పెట్టడంతో, అప్పులు బారెడు, ఆస్తులు మూరెడు అయ్యింది పరిస్థితి. 

ఈ ఆర్థిక సంవత్సరంలో 16,100 కోట్ల అప్పు చేసింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. ఇవి కాక 2800 కోట్లు నాబార్డు నుంచి కూడా రుణాలు తీసుకుంది. ఈ ఆర్థిక సంవత్సరంలో 23000 వేల కోట్ల అప్పును బడ్జెట్ లో ప్రతిపాదించారు. అయితే ఆరు నెలల వ్యవధిలోనే అప్పులు ఎక్కువగా తీసేసుకోవడంతో, 14వ ఆర్థిక సంఘం నిబంధనలను మించి అప్పులు పెరిగిపోయాయి. ప్రస్తుతం మరో 4000వేల కోట్లు విడుదల చేయమని రాష్ట్ర ఆర్థిక శాఖ కేంద్రాన్ని కోరింది. కాని కేంద్రం నిర్మొహమాటంగా తిరస్కరించింది. గత రెండేళ్లతో పాటు ఈ ఏడాదికి సంబంధించి  రాష్ట్ర స్థూల ఉత్పాదకత, అప్పుల వివరాలూ  పంపాలని, ఆ తర్వాతే మిగిలిన అప్పు గురించి ఆలోచిద్దామంటూ చెప్పేసింది. 

సంబంధిత వార్తలు

Home  |  News  |  Downloads  |  Gallery  |  Contact Us  |   Sitemap  

Official Website of YSR Congress Party
Copyright © 2011 ysrcongress.com