Ysrcpnettv
YSR Congress Party Twitter YS Jagna Twitter

YSR Congress

Flash News >>>>
             పార్లమెంట్‌ ఆవరణలోని గాంధీ విగ్రహం వద్ద వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నేతల‌ ధర్నా                                వైయ‌స్‌ జగన్‌ 216వ రోజు పాదయాత్ర ప్రారంభం                               కాకినాడ న‌గ‌రంలో సాయంత్రం వైయ‌స్ జ‌గ‌న్ బ‌హిరంగ స‌భ‌                               అవిశ్వాసానికి అనుమతివ్వడం టీడీపీ-బీజేపీ మ్యాచ్‌ ఫిక్సింగ్‌కు నిదర్శనం: మాజీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి                               బీజేపీ అధ్యక్షుడు అమిత్‌షా, టీడీపీ రాజగురువుతో ఎందుకు చర్చలు జరిపారు, వాటి వెనుక ఉన్న రహష్యాన్ని బయటపెట్టాలి: అంబ‌టి రాంబాబు                               క‌ర‌కుదురు నుంచి వైయ‌స్ జ‌గ‌న్ 214వ రోజు ప్రజాసంకల్పయాత్ర ప్రారంభం                               ఎన్నిక‌ల‌కు సిద్ద‌మా చంద్ర‌బాబు?: వైయ‌స్ఆర్‌సీపీ నాయ‌కుడు పార్థ‌సార‌ధి                               మై డియ‌ర్ మార్తాండామ్ మూవీ టీజ‌ర్ విడుద‌ల చేసిన వైయ‌స్ జ‌గ‌న్‌                               వైయ‌స్‌ జగన్‌ను కలిసిన 104 సిబ్బంది                  
    Show Latest News
ఇళ్ల నిర్మాణం ఒక మాయ

Published on : 07-Jul-2018 | 11:12
 

– చెప్పింది 19 లక్షలు.. కట్టింది 1.47 లక్షలు

– నిర్మాణంలో మరో 2.24 లక్షల ఇళ్లు 

– నాలుగేళ్లలో నాలుగు లక్షలు కూడా దాటని నిర్మాణాలు 

– సొంత పథకాలకు మళ్లించిన కేంద్రం నిధులు 

– లబ్ధిదారుల నుంచి భారీగా లంచాల వసూలు

– ఎన్నికలు సమీపిస్తుండటంతో కొత్త నాటకం 

 తలదాచుకునేందుకు గూడు లేని నిరుపేదలకు ఇళ్లు కట్టించి ఇవ్వడంలో రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా వైఫల్యం చెందింది. చంద్రబాబు తన వైఫల్యాన్ని కప్పిపుచ్చుకునేందుకు ఒకేరోజు 3 లక్షల ఇళ్ల గృహ ప్రవేశాలంటూ చేసిన ప్రచారం.. ప్రచార ఆర్భాటంగానే మిగిలింది. వాస్తవ లెక్కలు చూస్తే మరోసారి పేదలను మోసం చేసేందుకు చంద్రబాబు ప్రభుత్వం వ్యూహ రచన చేసినట్టుగా స్పష్టమవుతోంది. కాగితపు లెక్కలకు వాస్తవ పరిస్థితులకు పూర్తి భిన్నంగా ఉంది. వివరాలను ఒక్కసారి విశ్లేషిస్తే బాబు మోసం బయటపడుతుంది. 

2019 నాటికి 19 లక్షలు ఇళ్ల నిర్మాణం ఎలా సాధ్యం?

చంద్రబాబు గత నాలుగేళ్లుగా కట్టిన ఇళ్లకు సంబంధించి వాస్తవాలు పరిశీలిస్తే 

సోషియో ఎకనమిక్‌ సర్వే(2017–18) ప్రకారం.. 

2014–15లో కట్టిన మొత్తం ఇళ్లు: 29,342

2015–16లో కట్టిన మొత్తం ఇళ్లు: 65,551

2016–17లో కట్టిన మొత్తం ఇళ్లు: 52,867

అంటే మూడేళ్లలో గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో కట్టిన ఇళ్లు: మొత్తం: 1,47,760

2017–18లో(డిసెంబరు 2017 వరకు) నిర్మాణంలో ఉన్న ఇళ్లు: మొత్తం: 2,24,491

– ఎన్టీఆర్‌ రూరల్‌ హౌసింగ్‌ పథకం కింద  ఏడాదికి 2 లక్షల ఇళ్ల చొప్పున 2017–18లో 2 లక్షలు , 2018–19లో 2 లక్షలు ఇళ్లను రూ. 6 వేల కోట్లతో నిర్మించాలి. 2018–19 ఆర్థిక సంవత్సరానికి  సంబంధించి డిసెంబరు 2017 నాటికి కేవలం 26, 586 ఇళ్లను మాత్రమే పూర్తి చేశారు. 

– అయితే 2019 నాటికి 19 లక్షల ఇళ్ల నిర్మాణాలను పూర్తి చేస్తామని చంద్రబాబు గొప్పగా ప్రచారం చేస్తున్నారు. 

ఇప్పటికి కట్టినవి, కట్టేవి అన్నీ చూసినా మూడున్నర లక్షలకు మించలేదు. మరి 2019కి కేవలం ఏడాది కూడా లేదు. అలాంటిది 19 లక్షల ఇళ్లు ఎలా నిర్మిస్తారు? ఎప్పుడు నిర్మిస్తారు? ఇది జనాన్ని మోసం చేయడమే. ఎన్నికల్లో లబ్ధిపొందడానికి టీడీపీ ఆడుతున్న కపట నాటకం. 

కేంద్రం నిధుల దుర్వినియోగం

చంద్రబాబు ఇళ్ల నిర్మాణ పథకంపై తీవ్ర స్థాయి విమర్శలు వస్తు్న్నాయి.  తమ వద్ద చంద్రబాబు అవినీతికి సంబంధించి ఆధారాలున్నాయంటూ కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి తీవ్ర ఆరోపణలు చేస్తోంది. ఇళ్ల నిర్మాణానికి 3202 కోట్లు కేటాయిస్తే కేవలం రూ. 1072 కోట్లు మాత్రమే ఖర్చు చేశారు. ఇళ్ల నిర్మాణ పథకంలో భారీగా అవినీతి అక్రమాలు జరిగాయని కేంద్రం ఇచ్చిన నిధులను దారి మళ్లించి పథకాన్ని నిర్వీర్యం చేశారని అంటున్నారు. దేశంలోనే ఏపీ రాష్ట్రానికి అత్యధికంగా 7.42 లక్షల ఇళ్లను మంజూరు చేస్తూ.. ప్రతి లబ్ధిదారుడికి లక్షన్నర చొప్పున సబ్సిడీ అందుతోంది.  చదరపు అడుగు నిర్మాణానికి రూ. 1300లకు మించి కూడా ఖర్చు కాని వాటికి  ఏపీలో లబ్ధిదారుల నుంచి రూ.2400 వరకు వసూలు చేస్తున్నారు.

ఇళ్ల నిర్మాణ పథకంలో అవినీతిని, జన్మభూమి కమిటీలు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ లబ్ధిదారుల నుంచి లంచాలు వసూలు చేస్తున్న తీరును ప్రజా సంకల్పయాత్రలో ప్రతిపక్ష నేత వైయస్ జగన్ మోహన్ రెడ్డి ఎండగడుతున్నారు.  రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ పథకాలు టీడీపీ కార్యకర్తలకు తప్ప నిజమైన పేదలకు దక్కకుండా చేస్తున్న వైనాన్ని కూడా ఆయన ప్రజల కళ్లకు కట్టినట్లు వివరిస్తున్నారు. ఈ అవినీతి ఆరోపణలకు సమాధానం చెప్పే ధైర్యం చంద్రన్న బాబుకు  లేదు. చంద్రన్న ఇళ్ల పథకమంతా మాయా లెక్కలే. 

Labels : YSRCP, YS Jagan, NCBN, TDP

సంబంధిత వార్తలు

Home  |  News  |  Downloads  |  Gallery  |  Contact Us  |   Sitemap  

Official Website of YSR Congress Party
Copyright © 2011 ysrcongress.com