Ysrcpnettv
YSR Congress Party Twitter YS Jagna Twitter

YSR Congress

Flash News >>>>
             ప్రజలకు ఎన్ని అబద్దాల చెప్పినా వింటారనే నాయకులకు తెలంగాణ ప్రజలు గట్టిగా బుద్ది చెప్పారు : వైయ‌స్ జ‌గ‌న్‌                               లగడపాటి రాజకీయ విశ్లేషకుడు ఎప్పుడు అయ్యాడా? అని ఆశ్చర్యం వేసింది: వైయ‌స్ జ‌గ‌న్‌                               కాంగ్రెస్‌, టీడీపీ జిమ్మిక్కులను ప్రజలను తిప్పికొట్టారు: వైయ‌స్ జ‌గ‌న్‌                               చంద్రబాబు, కాంగ్రెస్ అనైతిక పొత్తుకు ప్రజలు వ్యతిరేకంగా తీర్పు ఇచ్చారు: వైయ‌స్ జ‌గ‌న్                                భస్మాసురుడు చేయి పెట్టినా.. చంద్రబాబు కాలు పెట్టినా అంతా బుడిదే: వైయ‌స్ జ‌గ‌న్‌                               నందగిరి పేట నుంచి వైయ‌స్ జ‌గ‌న్‌ 319వ రోజు ప్రజాసంకల్పయాత్ర ప్రారంభం                               హిందూపురం టీడీపీ మాజీ ఎమ్మెల్యే అబ్దుల్‌ గని వైయ‌స్ఆర్‌సీపీలో చేరిక‌                               ప‌వ‌న్‌కు చిత్త‌శుద్ది ఉంటే చంద్ర‌బాబు అవినీతిపై నిల‌దీయాలి: ఎమ్మెల్యే ఆదిమూల‌పు సురేష్‌                               డాక్టర్ బీఆర్ అంబేద్కర్‌కు వైయ‌స్ జగన్ నివాళులు                 
    Show Latest News
కాంగ్రెస్‌తో దోస్తీకి బాబు తహతహ

Published on : 24-May-2018 | 14:38
 

– కుమారస్వామి ప్రమాణ స్వీకార సభలో బయటపడిన బాబు నైజం
– రోటీన్‌కి భిన్నంగా రాహుల్‌ కలిసి చేతులూపిన(హస్తం) బాబు 


ఏరు దాటక ముందు ఓడ మల్లన్న.. ఏరు దాటాక బోడి మల్లన్న అన్న రీతిలో చంద్రబాబు పూటకో మాట చెబుతూ ఒక్కో ఎన్నికకు ఒక్కో పార్టీతో పొత్తు పెట్టుకుంటున్నాడు. ఏ పార్టీతో పొత్తు పెట్టుకోవాలి అనేది ఆ పార్టీ సొంత విషయమే అయినా.. అందుకు ఆయన చెప్పే మాటలు.. చేస్తున్న పనులు తెలుగు ప్రజలకు చిరాకు తెప్పిస్తున్నాయి. 2014 ఎన్నికలకు ముందు చంద్రబాబుకి మోడీ బాహుబలిలాగా కనిపించాడు.. పదేళ్లు ప్రతిపక్షంలో కూర్చుని అధికారం లేక మొహం వాచిపోయిన చంద్రబాబుకు మోడీ దేవుడిలా కనిపించాడు. తిట్టిన నోటితోనే పొగడటం.. పొగిడిన నోటితోనే తిట్టడం చంద్రబాబుకు వెన్నతో పెట్టిన విద్య. అధికారం చేజిక్కించుకోవడం మాత్రమే బాబు ఎజెండా దాని కోసం ఏమైనా చెబుతారు.. ఎవర్నయినా తిడతారు.. అవసరమనిపిస్తే తిట్టినోళ్లనే తిరిగి పొగుడుతాడు. బాబుకు ఇదేమీ కొత్తకాదు. ఏ నోటితో ప్రధాని నరేంద్రమోడీని అరెస్టు చేయిస్తానని అన్నాడో అదే నోటితో మోడీని దేవుడ్ని చేసి ఆకాశానికి ఎత్తేశాడు. పొగిడినప్పుడు బాబు ప్రభ వెలిగిపోతోంది.. తిట్టినప్పుడు మోడీ ప్రభ వెలిగిపోతోంది. గెలిచి తీరాలంటే బీజేపీ పంచన చేరాల్సిన గత్యంతరం లేని పరిస్థితుల్లో అబద్ధపు హామీలిచ్చి తిరుమల వెంకన్న సాక్షిగా జనం నెత్తిన శఠగోపం పెట్టాడు. నాలుగేళ్లు ఆ పార్టీతో కాపురం చేసి.. కేంద్రంలో పదవులు అనుభవించిన బాబు ప్రత్యేక హోదా నెపం చూపించి బయటకొచ్చాడు. అధికారంలో ఉన్నన్నాళ్లు ప్రత్యేక హోదా పేరెత్తితే అరెస్టులు అన్న చంద్రబాబు.. ప్రతిపక్ష నాయకుడు  వైయస్‌ జగన్‌ పోరాటంతో హోదా సెంటిమెంట్‌ జనాల్లోకి వెళ్లిందని గుర్తించి యూటర్న్‌ తీసుకున్నాడు. ప్రత్యేక హోదా రాకపోవడానికి బీజేపీని కారణంగా చూపిస్తూ తప్పించుకునే వ్యూహాలు సిద్ధం చేసుకున్నాడు. 29 సార్లు ఢిల్లీ వెళ్లిన బాబు.. సీట్లు పెంపు గురించి మాట్లాడే తప్ప ఏనాడూ విభజన హామీలు ప్రత్యేక హోదా గురించి కేంద్రాన్ని ప్రశ్నించలేదని బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ఇటీవలే చెప్పుకొచ్చారు. గతంలో ప్యాకేజీ ఇచ్చినప్పుడు వెంకయ్య నాయుడు, అరుణ్‌జైట్లీకి సన్మానాలు చేసిన విషయం జనం మరిచిపోలేదు. హోదా కంటే ప్యాకేజీనే బాగుందని బాబు చెప్పిన మాటలు.. కేంద్రం చాలా ఇచ్చిందని చెప్పిన విషయాలు అందరికీ గుర్తే. అయితే తన చేతకాని తనాన్ని బీజేపీ మీద నెట్టేసే నెపంతో చంద్రబాబు కేంద్రం నుంచి వైదొలిగాడనేది అందరికీ తెలుసు. అనుకూల మీడియాలో తననొక ఛాంపియన్‌గా ప్రజెంట్‌ చేసుకునేందుకు కనీసం ఏడాది సమయం అవసరమని గ్రహించి తప్పుకున్నాడు తప్ప.. రాష్ట్ర ప్రయోజనాల కోసం మాత్రం కాదు. 
కాంగ్రెస్‌ను తిట్టి రాహుల్‌తో చెట్టపట్టాల్‌..
రాష్ట్రాన్ని కాంగ్రెస్‌ నిలువునా చీల్చిందని.. అశాస్తీ్రయంగా విడగొట్టిందని మోడీతో కలిసి 2014కి ముందు చంద్రబాబు గగ్గోలు పెట్టాడు. పవన్‌ కల్యాణ్, మోడీ, వెంకయ్య నాయకులతో కలిసి తిరుపతి వెంకన్న సాక్షిగా రాష్ట్రానికి 15 ఏళ్లు ప్రత్యేక హోదా సాధిస్తామని చంద్రబాబు డాంభికాలు పోయాడు. రాష్ట్రాన్ని విడగొట్టినందుకు కాంగ్రెస్‌ తగిన మూల్యం చెల్లించుకున్నదని ప్రతి మీటింగ్‌లోనూ తిట్టిపోశాడు. అదే చంద్రబాబు నిన్నటికి నిన్న బెంగళూరులో కుమారస్వామి ప్రమాణస్వీకారానికి హాజరై రాహుల్‌తో చేతులు కలిపాడు. ఆయన్ను అభినందిస్తూ కనిపించాడు. కొన్ని రోజులుగా చంద్రబాబు కాంగ్రెస్‌తో జట్టు కట్టబోతున్నాడంటూ ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఇది ప్రాధాన్యం దక్కించుకుంది. బహిరంగ సభుల్లో ఎపుడూ రెండు వేళ్లు చూపించే చంద్రబాబు.. అందుకు భిన్నంగా రాహుల్‌తోపాటు హస్తం చూపించడం అందరూ గమనించారు. 

Labels : congress, tdp, chandrababu

సంబంధిత వార్తలు

Home  |  News  |  Downloads  |  Gallery  |  Contact Us  |   Sitemap  

Official Website of YSR Congress Party
Copyright © 2011 ysrcongress.com