Ysrcpnettv
YSR Congress Party Twitter YS Jagna Twitter

YSR Congress

Flash News >>>>
             వ‌ర‌ద‌ విపత్తుతో తల్లడిల్లుతున్న కేరళ ప్రజలకు కేంద్ర ప్రభుత్వం పునరావాస సహాయం కల్పించాలి: వైయ‌స్ జ‌గ‌న్                                ఈ కష్టకాలంలో నా ఆలోచనలు, ప్రార్థనలు కేరళ ప్రజలతో ఉన్నాయి: వైయ‌స్ జ‌గ‌న్‌                               కేర‌ళ వ‌ర‌ద‌లు హృద‌యాన్ని క‌ల‌చివేస్తున్నాయి: వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ట్వీట్‌                               సీఐడీ టీడీపీ తోక సంస్థ‌: కాసు మ‌హేష్‌రెడ్డి                               న‌ర్సీప‌ట్నం మెట్ట‌పాలెం క్రాస్ నుంచి వైయ‌స్ జ‌గ‌న్ 239వ రోజు ప్రజాసంకల్పయాత్ర ప్రారంభం                               వైయ‌స్‌ జగన్‌మోహన్‌ రెడ్డి చేపట్టిన పాదయాత్ర 238వ రోజు గురువారం ఉదయం విశాఖపట్నం జిల్లా నాతవరం మండలం డి. ఎర్రవరం నుంచి ప్రారంభం                               రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు 72వ స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి                               వైయ‌స్ఆర్‌సీపీ ఆధ్వ‌ర్యంలో ఘ‌నంగా స్వాతంత్ర్య దినోత్స‌వ వేడుక‌లు                               విశాఖ జిల్లా ఎర్రవరంలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న ఏపీ ప్రతిపక్షనేత, వైయ‌స్ఆర్‌సీపీ అధినేత వైయ‌స్‌ జగన్‌మోహన్‌ రెడ్డి                  
    Show Latest News
చేనేతలకు వైయస్‌ఆర్‌ భరోసా

Published on : 07-Aug-2018 | 14:32
 


1)  సాహసోపేత పాదయాత్రలో చేనేతల అవస్థలు కళ్లారా చూసిన వై.యస్‌ఆర్‌.. అధికారంలోకి రాగానే (2004) భేషరతుగా 327 కోట్లు చేనేత రుణమాఫీ చేసి, 3 లక్షల మంది చేనేతలకి లబ్ధి చేకూర్చారు.

2) అత్యంత వెనకబడిన 143 మందికి చేనేత కార్మికులని గుర్తించి సీఎం రిలీఫ్‌ ఫండ్‌ ద్వారా ఒక్కొక్కరికి రూ.25 వేలు ఇచ్చారు.

3)  తెలుగుదేశం ప్రభుత్వంలో ఆత్మహత్య చేసుకున్న 200 మంది సిరిసిల్ల చేనేత కార్మికులకి ఒక్కొక్కరికి రూ. 1.50 లక్షలు ఇచ్చారు.

4) 2009లో మళ్లీ వైయస్‌ఆర్‌ అధికారంలోకిSరాగానే చేనేతలకు రూ.312 కోట్లు రుణమాఫీ చేస్తునట్టు జి.ఒ పాస్‌ చేశారు.ఇలా చేసిన కొద్ది రొజులకే వై.యస్‌ చనిపొతే ఆ హామీని కాంగ్రెస్‌ ప్రభుత్వం పట్టించుకొలేదు

5) చేనేత కార్మికులకి ఆర్థిసాన్‌ క్రెడిట్‌ కార్డ్‌ స్కీం ద్వారా పావలా వడ్డీ రుణాలు ఇచ్చారు

6) చేనేతలకి మాత్రం 50 ఏళ్లు దాటితే వారిని పెన్షన్‌ స్కీంలో చేర్చి నెలకు 200 రూపాయల పెన్షన్‌ ఇచ్చారు. (మిగతవారికి మాత్రం 65 ఏళ్ల్ళు దాటితేనే పెన్షన్‌ ) చంద్రబాబు ఆనాడు చేనేతలకి 65 ఏళ్లు వచ్చాక 30 వేల మందికి మాత్రమే పెన్షన్‌ ఇచ్చారు. కానీ వై.యస్‌ 50 ఏళ్ల్ళ వారి నుండి పెన్షన్‌ ఇచ్చారు. వీరి సంఖ్య 70 వేలు

7) అంత్యో్యదయ యోజన పథకం ద్వారా చేనేతలకి 35 కిలొల బియ్యం ఇచ్చి వారి ఆకలి తీర్చారు.

8) చేనేతలు అధికంగా ఉన్న సిరిసిల్ల మండలంలో 5 వేల మందికి ఇందిరమ్మ ఇళ్లు  మంజూరు చేసి కట్టిన ఘనత వై.యస్‌ ది

9) చంద్రబాబు హయాంలో ఆప్కోలో 47 కోట్ల టర్నోవర్‌ ఉండేది. వై.యస్‌ దానిని రూ. 250 కోట్లకు పెంచారు.

10) నల్గొండ జిల్లా పోచంపల్లి మండలం కనుముక్కల గ్రామంలో 24 ఎకరాలలో రూ. 43 కోట్లు వెచ్చించి టెక్స్‌టైల్‌ పార్క్‌ పెట్టారు దీని ద్వారా‡ 10 వేల మంది నేతన్నలకి ఉపాధి దొరికి నెలకు 5 వేలు లబ్ది పొందారు

11) నేతన్న పిల్లలకు కూడా వై.యస్‌ ఫీజ్‌ రీయంబర్స్‌ మెంట్‌ వర్తించింది.  

12) అమెరికాకి వై.యస్‌ వ్యవసాయ సదస్సుకి వెళ్లినప్పుడు అందరూ సార్‌ ఇది అమెరికా సూటు వేసుకోండి అంటే.. నేను తెలుగువాడిని, ఆంధ్రుడుని, రైతు బిడ్డను అని చేనేత నేసిన ఖద్దరు మాత్రమే ధరించారు. 

13) ప్రభుత్వ ఉద్యోగులందరూ వారానికి రెండు రోజులు నేతన్నలు నేసిన బట్టలు కట్టుకుని రావాలి అని డ్రెస్‌ కొడ్‌ పెట్టి – దీనికి ఒక జి.ఒ పాస్‌ చేసారు వై.యస్‌ ( నేతన్నల కష్టం కి లబ్ది కల్పించాలి అని చేసిన పని ఇది)

14) ఏటా ఆగస్టు ఏడున చేనేత దినోత్సవం జరపాలని 2009లో వై.యస్‌ హయాంలోనే ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. 

సంబంధిత వార్తలు

Home  |  News  |  Downloads  |  Gallery  |  Contact Us  |   Sitemap  

Official Website of YSR Congress Party
Copyright © 2011 ysrcongress.com