Ysrcpnettv
YSR Congress Party Twitter YS Jagna Twitter

YSR Congress

Flash News >>>>
             శివకోడు నుంచి 195వరోజు ప్రజాసంకల్పయాత్ర ప్రారంభం                               ఉక్కు ప‌రిశ్ర‌మ సాధ‌న‌కు ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాదరెడ్డి రెండో రోజు నిరాహార దీక్ష‌కు అనూహ్య మద్దతు                                రాజోలు నియోజ‌క‌వ‌ర్గంలో వైయ‌స్ జ‌గ‌న్‌కు ఘ‌న స్వాగ‌తం                               వైయ‌స్‌ జగన్‌మోహన్‌ రెడ్డి చేపట్టిన పాదయాత్ర 194వ రోజు నాగుల్లంక శివారు నుంచి ప్రారంభం                               30న అనంత‌పురంలో న‌య వంచ‌న దీక్ష: వైయ‌స్ఆర్‌సీపీ నేత బొత్స స‌త్య‌నారాయ‌ణ‌                               ప్రతిదేవాలయ బోర్డులోనూ ఒక నాయీ బ్రహ్మణుడిని సభ్యుడిగా నియమిస్తాం: వైయ‌స్ జ‌గ‌న్ హామీ                               నాయీబ్రహ్మణుల పట్ల సచివాలయం సాక్షిగా నిన్న ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రవర్తించిన తీరును చూసి విస్తుపోయాను: వైయ‌స్ జ‌గ‌న్‌                               వైయ‌స్ జ‌గ‌న్ స‌మ‌క్షంలో వైయ‌స్ఆర్‌సీపీలో చేరిన వంద మంది అగ్ని కుల క్ష‌త్రియులు                               తనపై నిరాధార ఆరోపణలు చేసిన యరపతినేని , రవీంద్రకుమార్‌లపై సభా హక్కుల ఉల్లంఘన కింద చర్యలు తీసుకోవాలి: ఎమ్మెల్యే బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి                  
    Show Latest News
డ‌ల్లాస్ ద‌గా..?

Published on : 09-May-2017 | 14:24
 

- పెట్టుబడుల పేరుతో చంద్ర‌బాబు భూదందా
- అమ‌రావ‌తి భూములు అమ్ముకునేందుకే అమెరికాకి
- పెట్టుబ‌డుల‌న్నీ బోగ‌స్ .. ఒప్పందాలు ఉత్త మాట‌లే
- అవి కంపెనీలు కాదు.. కేవ‌లం క‌న్స‌ల్టెన్సీలు

పెట్టుబ‌డుల పేరుతో చంద్ర‌బాబు ఆడిన డ్రామా ప్ర‌పంచానికి తెలిసిపోయింది. రాజ‌ధాని భూములు కొన్న‌వారికి కంపెనీలు ఇచ్చేందుకు పెట్టుబ‌డులు వ‌స్తున్నాయంటూ ప‌చ్చ మీడియా చేసిన ఆర్భాటం బట్టబయలైంది. యూఎస్ ఐసీఎస్ దాడులతో చంద్ర‌బాబు ప‌రువు బ‌జారున ప‌డింది. అమెరికా టీడీపీలో రాజుకున్న విభేదాలు బాబును రోడ్డున ప‌డేశాయి. క‌వ‌ర్ చేసుకునేందుకు తాపత్ర‌య ప‌డిన ప‌చ్చ మీడియా భూముల వ్య‌వ‌హారంలో వారి పేరు రావ‌డంతో నోరు క‌ట్టేసుకుంది. నిజం నిప్ప‌లాంటిద‌ని దాచ‌డం సాధ్యంకాద‌ని తెలుగు త‌మ్ముళ్ల‌కు తెలిసేలా జ‌రిగిన వ్య‌వ‌హారంతో బాబుకు మైండ్ బ్లాంక్ అయ్యింది. వారి ద‌రిద్రాన్ని.. తెలుగు ప్ర‌జ‌ల‌కు తెలియ‌డంతో వైయ‌స్ ఆర్‌సీపీ మీద‌కు నెట్టి బ‌య‌ట‌ప‌డ‌దామ‌నుకుని చేసిన ప్ర‌య‌త్నం బాబుతోపాటు పచ్చ మీడియాను ఇరుకున ప‌డేసింది. 

అంతా #APNRT క‌నుస‌న్న‌ల్లోనే...
చంద్ర‌బాబు విశాఖ ఉడాలో ప్రారంభించిన 9 ఐటీ కంపెనీలు #APNRT #ITServe(IT Serve Alliance and Andhra Pradesh Non Resident Telugu (APNRT Society) అనే సంస్థ ద్వారా ప్రారంభించింది. 
విశాఖ‌లో జ‌రిగిన 2#CII స‌మ్మిట్లు కూడా అదే #APNRT సంస్థ ద్వారా నిర్వ‌హించింది. 
మొన్న విజ‌య‌వాడ # మేధా ట‌వ‌ర్స్లో లోకేష్ ప్రారంభించిన ఐటీ కంపెనీలు కూడా ఇదే #APNRT  సంస్థ ద్వారా జ‌రిగింది. 
ఈ #APNRT  సంస్థ నిర్వ‌హ‌కులు రాంచౌద‌రి య‌ల‌మంచిలి, భాస్క‌ర్ చౌద‌రి దూసి, శ్రీకాంత్ చైద‌రి .. ఈ పేర్లు చాల‌నుకుంటా వాళ్ల‌కే ఎందుకు ఇచ్చాడు అని చెప్ప‌డానికి ..???
ఇక‌పోతే చంద్ర‌బాబు అమెరికా టూర్ మొత్తం కోఆర్డినేట్ చేస్తున్న వేమూరి రవి చౌద‌రి.. ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి ఎండీ రాధాకృష్ణ ద‌గ్గ‌రి బంధువు.. రాజ‌ధాని అమ‌రావతిలో ప్ర‌క‌టించ‌క‌ముందే అక్క‌డి భూములు త‌క్కువ రేటుకు కొని .. ఇప్ప‌డు ఆ భూములు అక్క‌డ కంపెనీల‌కు ఎక్కువ రేటుకి అమ్ముకోవ‌డానికి చంద్ర‌బాబు ప‌ర్య‌ట‌న అనేది ఒప్పుకోక త‌ప్ప‌ని నిజం. ఈ స్కాంలో చంద్ర‌బాబు నారా, ర‌వి చౌద‌రి వేమూరి ఇద్ద‌రూ పార్ట్‌న‌ర్స్‌.. 

పెట్టుబ‌డులు డ‌ల్లాస్ నుంచే ఎందుకంటే..?
 ఏ నగరంలో లేని విధంగా కేవలం డల్లాస్‌లోనే ఇన్ని ఎంఓయూలు డ్రామా ఎందుకు జరగుతున్నది..? డల్లాస్‌ కంపెనీస్ అమరావతిలో బ్రాంచెస్‌ ఎందుకు తెరుస్తున్నాయి. దీని వెనుకున్న మతలబేంటి..? అమరావతిని రాజధానిగా ప్రకటించడానికి ముందే రవి వేమూరి భూములు కొనుకున్నారని ఓ ప్రముఖ పత్రిక ప్రచురించింది. ఈ వార్త రాగానే వివాదం పెద్దది అవుతుందని గ్రహించి రవి వేమూరి ఆ భూములను అ డల్లాస్‌ కంపెనీల ఓనర్లకి రాత్రికి రాత్రే అమ్ముకున్నాడని తెలుస్తుంది. అవి కొన్నందుకు ప్రతిఫలంగా ఇప్పడు ఎంఓయూల పేరిట ల్యాండ్స్, ఐటీ పార్కులో ఆఫీసులు ఇప్పించాడు. డల్లాస్‌ కంపెనీలో ఎంఓయూల పేరిట చంద్రబాబు చేయబోతున్న సంతకాలన్నీ అవే. ముందు కంపెనీ పేరుమీద ఒక ఇన్వెస్ట్‌మెంట్‌ ప్రపోజల్‌ పెట్టండి.. ముఖ్యమంత్రి సమక్షంలో సంతకాలు చేయండి మిగతాది నేను చూసుకుంటా అనేది ఒప్పందం. ఈ డల్లాస్‌ కంపెనీలు ముఖ్యమంత్రితో ఒప్పందాలని, ఫొటోలని తమ మార్కెటింగ్‌కి వాడుకుని ఇంకొంతమంది అమాయకులను అభ్యర్థులను తన కంపెనీల్లో కన్సల్టెంట్‌లుగా చేర్చుకుని లాభపడతాయి. అంతకన్నా ఒరిగేదేమీ లేదు. 

క‌మీష‌న్ల వ్యాపారం.. 
డల్లాస్‌ నగరం నుండి అమరావతిలో కూడా బ్రాంచ్‌ తెరిచామని చెబుతున్న కంపెనీల్లో తొంభై శాతం కంపెనీలు వెయ్యి చదరపు అడుగుల ఆఫీసుల్లో నిర్వహించే స్టాఫింగ్‌ కంపెనీలే తప్ప సొంతంగా ఉద్యోగాలు ఇప్పించేవి కావు అనేది బహిరంగ రహస్యం. తమ వద్ద పనిచేసే హెచ్‌–1బి వీసా ఉద్యోగులను క్లయింట్‌ కంపెనీలకు ఉద్యోగాలకు పంపి ఆ బిల్లింగులతో తమ వాటా కమీషన్‌ తీసుకునే ఈ చిన్నస్థాయి కంపెనీలు రాష్ట్రంలో లక్షలాది ఉద్యోగాలు ఎలా కల్పిస్తాయో ఆ దేవుడికే తెలియాలి. వీళ్లు తెచ్చిన ఉద్యోగాలేంటి అంటే – విజయవాడ ఐటీ పార్కులో ముఖ్యమంత్రి ప్రారంభించిన కంపెనీల ఆఫీసుల్లో తలా నలుగురు రిక్రూటర్లను నియమించుకుని వాళ్లతో అమెరికాలో ఉన్న తమ కన్సల్టెంట్‌లని అమెరికాలోనే ఉద్యోగాల్లో ప్లేస్‌మెంట్‌ చేసుకుంటున్నారు. ఇదా ఐటీ ఉద్యోగాల కల్పన అంటే .. 

సంబంధిత వార్తలు

Home  |  News  |  Downloads  |  Gallery  |  Contact Us  |   Sitemap  

Official Website of YSR Congress Party
Copyright © 2011 ysrcongress.com