Ysrcpnettv
YSR Congress Party Twitter YS Jagna Twitter

YSR Congress

Flash News >>>>
             ప‌శ్చిమ గోదావ‌రి జిల్లాకు అల్లూరి సీతారామారాజు పేరు: వైయ‌స్ జ‌గ‌న్‌                               ఆక్వా రైతులకు విద్యుత్తు చార్జీలు 4.75 పైసలు నుండి 1.50 పైసలు వరకు తగ్గిస్తాం: వైయ‌స్ జ‌గ‌న్ హామీ                               టీటీడీ వివాదంపై పూర్తి స్థాయిలో విచారణ జరిపితే వాస్తవాలు వెలుగులోకి వస్తాయి: ఎంపీ వ‌ర‌ప్ర‌సాద్‌                               చంద్ర‌బాబుకు సింగిల్ పోటీ చేసే ధైర్యం లేదు: అంబ‌టి రాంబాబు                               పెదకాపవరం గ్రామ శివారులో రొయ్యల చెరువు క్షేత్రాన్ని సందర్శించిన వైయ‌స్ జ‌గ‌న్‌                               పెద్ద కాప‌వ‌రం నుంచి 171వ రోజు ప్ర‌జా సంక‌ల్ప యాత్ర ప్రారంభం                               టీడీపీనే పిల్ల కాంగ్రెస్‌ అని బెంగళూరులో కార్యక్రమం సందర్భంగా స్పష్టమైంది: ల‌క్ష్మీ పార్వ‌తి                               కాంగ్రెస్‌తో చంద్రబాబుకు లోపాయికారి ఒప్పందాలు: వైయ‌స్ఆర్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లక్ష్మీపార్వతి                               స‌రిప‌ల్లి నుంచి వైయ‌స్ జ‌గ‌న్ 170వ రోజు ప్రజాసంకల్పయాత్ర ప్రారంభం                  
    Show Latest News
ఏరు దాటాడు.. మాట మార్చాడు

Published on : 07-Sep-2017 | 16:23
 

– ఎన్నికల హామీలపై మాట తప్పిన చంద్రబాబు
– ఉమ్మడి రాష్ట్రంలో ఇచ్చానని బొంకుడు
– పార్టీ మేనిఫెస్టో తయారైంది విభజన గెజిట్‌ వచ్చాకనే
– ప్రజలను మానసికంగా మోసం చేసే పనిలో బాబు 
– ఆంధ్రుల ఆత్మగౌరవానికి తూట్లు 

ఏరు దాటక ముందు ఓడ మల్లన్న.. ఏరు దాటాక బోడి మల్లన్న చందం చేసేశాడు జనాన్ని చంద్రబాబు. నాలుగు దశాబ్దాల రాజకీయ అనుభవం జనాన్ని అవహేళనగా చేసి మాట్లాడుతోంది. ఆంధ్రుల ఆత్మగౌరవం పేరు చెప్పుకుని పార్టీ పెట్టుకున్న తెలుగుదేశం అధికారంలోకి వచ్చాక అదే ప్రజలను మరీ దారుణంగా చూస్తోంది. తమ చేతకాని తనాన్ని కప్పి పుచ్చుకోవడానికి ఏపీ ప్రజలతో ఆటాడుకుంటున్నారు. ముఖ్యంగా రాష్ట్రం విడిపోయాక గత మూడేళ్లుగా పరిస్థితులు మరింత దారుణంగా తయారైనాయి. నమ్మినోడే నట్టేట ముంచేస్తున్నాడు. ఐదుకోట్ల ఆంధ్రులకు ఇచ్చిన హామీలకు దిక్కులేకుండా చేశారు. ఎన్నికలకు ముందు తిరుపతి వేంకటేశ్వరుడి సాక్షిగా ఇచ్చిన ప్రత్యేక హోదాని పద్ధతి ప్రకారం అటకెక్కించారు. ఆంధ్రుల ఆత్మగౌరవాన్ని ఢిల్లీకి తాకట్టు పెట్టారు.  బేషరతుగా రుణమాఫీ, నిరుద్యోగ భృతి, డ్వాక్రా రుణాల మాఫీ, దళితులకు మూడెకరాల పొలం, పక్కా ఇళ్లు, కాపులను బీసీల్లో చేర్చడం వంటి హామీలతో చంద్రబాబు ప్రజలను మోసం చేశారు. ఇన్ని హామీలను నెరవేర్చడం సాధ్యమేనా అని ఎన్నికల కమిషన్‌ అడిగితే నా అనుభవం ముందు ఇవన్నీ పిల్లాటలన్నట్టు ఈసీకి లేఖ కూడా రాశాడు. ఇప్పుడు తొండాటకు దిగాడు. జనాలను మానసికంగా మోసం చేసేందుకు సిద్ధమయ్యాడు.

రాష్ట్రం విడిపోయిన తర్వాతనే.. చంద్రబాబు పూర్తి స్పృహలో ఉండే అన్ని హామీలూ ఇచ్చారు. రెండు తెలుగు రాష్ట్రాలకూ వేర్వేరుగా మేనిఫెస్టోలనూ విడుదల చేశారు. ‘2014 మార్చి 1న రాష్ట్ర విభజన చట్టం గెజిట్‌ విడుదల కాగా చంద్రబాబు మార్చి 31న రెండు మేనిఫెస్టోలను విడుదల చేశారు. అందులో వందలాది హామీలను పొందుపరిచారు. ఇపుడు మూడున్నరేళ్లు పూర్తయిన తర్వాత ఆ హామీలన్నిటికీ తిలోదకాలివ్వడమే కాక తాను ఉమ్మడి రాష్ట్రంలో ఆ హామీలిచ్చానని బొంకుతున్నారు. 

విభజన తర్వాతే టీడీపీ మేనిఫెస్టోలు
ఉమ్మడి రాష్ట్రంలో ఉండగా హామీలిచ్చానని చంద్రబాబు అబద్ధాలు చెప్పారు. 2014 ఫిబ్రవరిలో రాష్ట్ర విభజన చట్టం ఆమోదం పొందింది. మార్చి ఒకటో తేదీన రాష్ట్రపతి సంతకం పూర్తయి కేంద్ర ప్రభుత్వం గెజిట్‌ చేశారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు విడివిడిగా మేనిఫెస్టోలను బాబు విడుదల చేశారు. టీడీపీ నేతలు ముద్దు కృష్ణమ నాయుడు (ఏపీ), రావుల చంద్రశేఖరరెడ్డి (తెలంగాణ)ని చెరోవైపు నిలబెట్టుకుని ఫొటోలు కూడా తీయించుకున్నారు. నిజాలు ఇంత నిఖార్సుగా ఉంటే రాష్ట్రం ఉమ్మడిగా ఉన్నప్పుడు హామీలిచ్చానని చంద్రబాబు ఎలా అబద్ధాలు చెబుతారు? 

ప్రధాన హామీలపై ఊరూవాడా ప్రచారం 
రైతు రుణమాఫీ, డ్వాక్రా రుణమాఫీ, ఇంటికో ఉద్యోగం, నెలకు రూ. 2వేల చొప్పున నిరుద్యోగ భృతి, బెల్టుషాపుల రద్దు, కాపులకు రిజర్వేషన్‌.. ఏపీకి ప్రత్యేక హోదా... వంటి హామీలపై ఊరూవాడా ఫ్లెక్సీలు వాటికి లైట్లు.. గోడలపై రాతలు.. టీవీల్లో ప్రకటనలతో  హోరెత్తించారు. ఎన్నికల సభల్లో చంద్రబాబు ఊదరగొట్టారు. పాంప్లేట్లు వేసి మరీ ఇంటింటికీ పంచారు. ఇదంతా రాష్ట్ర విభజన జరిగిన తర్వాతనే.. ఎన్నికల ప్రచారంలోనే ఈ హామీలన్నీ ఇచ్చారు. రాష్ట్రం విడిపోయిందనీ, జూన్‌ 2నుంచి రెండూ వేర్వేరు రాష్ట్రాలుగా ఉంటాయని అందరికీ తెలుసు. అయినా చంద్రబాబు మూడున్నరేళ్లు పొద్దుపుచ్చి హామీలన్నీ తుంగలో తొక్కి ఇపుడు అలా అనుకోలేదని, ఉమ్మడి రాష్ట్రంలో ఇచ్చానని అబద్దమాడుతున్నారు. 

సంబంధిత వార్తలు

Home  |  News  |  Downloads  |  Gallery  |  Contact Us  |   Sitemap  

Official Website of YSR Congress Party
Copyright © 2011 ysrcongress.com