Epaper      Ysrcpnettv
YSR Congress Party Twitter YS Jagna Twitter

YSR Congress

Flash News >>>>
             శింగనమల సమన్వయకర్త జొన్నలగడ్డ పద్మావతి మేలుకొలుపు పాదయాత్ర ప్రారంభం                               ప్రజా సమస్యలను పరిష్కరించాలని కోరుతూ వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ పోరుబాట                                నారాయణరెడ్డి హత్య కేసుపై సీబీఐ విచారణ జరిపించాలిః వేణుగోపాలకృష్ణ                               ప్రజల మన్ననలు పొందలేక చంద్రబాబు ప్రత్యర్థులను అంతమొందించాలని చూస్తున్నాడుః వేణుగోపాలకృష్ణ                               కరువు నివారణ చర్యలు చేపట్టడంలో బాబు సర్కారు విఫలమైందిః కాకాని గోవర్ధన్ రెడ్డి                               పట్టిసీమ ప్రాజెక్ట్ వల్ల బాబు, లోకేష్ ల గ్రోత్ రేటు పెరిగిందే తప్ప రైతులు, ప్రజల గ్రోత్ రేటు పెరగలేదుః కన్నబాబు                               అవినీతి, హత్యల్లో చంద్రబాబు ఏపీని నంబర్ వన్ చేశాడుః దాడిశెట్టి రాజా                               నష్టాల్లో ఉందని ఆర్టీసీని మూసేస్తారా..? ప్రభుత్వ ఆస్తులను అమ్మేస్తారా బాబుః పద్మ                               ప్రభుత్వ పాఠశాలలను నారాయణ విద్యాసంస్థలకు కట్టబెట్టే ప్రయత్నం జరుగుతోందిః వాసిరెడ్డి పద్మ                 
    Show Latest News
బాబు.. బాగా బిజీ

Published on : 15-May-2017 | 14:39
 

– ఢిల్లీ ఎయిర్‌పోర్టు నుంచి అదృశ్యం
– అమిత్‌షా, అరుణ్‌జైట్లీలతో ములాఖత్‌..?
– ఫైవ్‌ స్టార్‌ హోటల్‌లో మరికొందరితో మంతనాలు
– వేర్వేరు విమానాల్లో ఢిల్లీకి చేరిన సుజనా, లోకేష్‌ 

వైయస్‌ జగన్‌ ప్రధానితో భేటీ కావడంతో ఏపీ రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. జగన్‌ ఇచ్చిన షాక్‌తో టీడీపీ నాయకులు జాతకాలు, వాస్తుదోషాలు చూపించుకుంటూ జ్యోతిష్యుల చుట్టూ తిరిగేస్తున్నారు.  అమెరికా పర్యటనను ఎంజాయ్‌ చేసొద్దామనుకుని వెళ్లిన చంద్రబాబు చెమటలు తుడుచుకుంటూ సరాసరి ఢిల్లీలో ఫ్లైట్‌ దిగేలా చేశాడు. వేకువజామున  ఫ్లైట్‌ దిగిన చంద్రబాబు మీడియాకు సైతం కనిపించకుండా పరారయ్యాడు. 

ఆ ఆరు గంటలు ఏమయ్యాడంటే...
వైయస్‌ జగన్‌ మోడీని కలిసిన తరువాత చోటుచేసుకుంటున్న పరిణామాలతో తీవ్ర కలత చెందిన బాబు అమెరికా నుండి వచ్చీ రాగానే ఎయిర్‌పోర్టు నుండే ఎవ్వరికీ కనిపించకుండా మాయమైపోయారు. ఆఖరికి అధికారులకి, మీడియాకి , సెక్యూరిటీ సిబ్బందికి కూడా తెలియకుండా రహస్య ప్రదేశానికి వెళ్లిపోయారు. బయట వేచి చూస్తున్న మీడియాకి మాత్రం ముఖ్యమంత్రి వీఐపీ లాంజిలో ఉన్నట్లు తప్పుడు సమాచారం ఇచ్చారు. విశ్వసనీయ సమాచారం మేరకు సుజనాని, లోకేష్‌ని వెంటబెట్టుకొని ఈడీ, సీబీఐకి చెందిన కొందరు అధికారులతో బాబు భేటీ అయినట్లు వార్తలు వెలువడుతున్నాయి. అనంతరం అరుణ్‌జైట్లీ, అమిత్‌షాలనున కలిసినట్లు ఢిల్లీ వర్గాల నుంచి అందుతున్న సమాచారం. వాళ్లందరితో సమావేశాలు ముగించుకున్న ముఖ్యమంత్రి ఒక ఫైవ్‌ స్టార్‌ హోటల్‌లో సుప్రీంకోర్టు జడ్జిలతో సమావేశమైనట్లు వినికిడి. ఈ మొత్తం ఎపిసోడ్లో చంద్రబాబు ఎవ్వరికి కనీసం ఫోన్లో కూడా అందుబాటులో లేరు. మొత్తానికి చంద్రబాబు తనకి వ్యతిరేకంగా ఢిల్లీ స్థాయిలో ఎవరో ఉన్నత స్థాయిలో ఉన్నవాళ్లే పావులు కదుపుతున్నారని.. ఈసారి తనకు ఉచ్చు గట్టిగానే బిగుసుకునే ప్రమాదం ఉందని గ్రహించ్ ఉంటాడు. చంద్రబాబు ఫైట్‌ దిగే సమయానికి సుజనా చౌదరి, లోకేష్‌లు వేర్వేరు విమానాల్లో పేరున్న తాజా, మాజీ సీబీఐ అధికారులను వెంటబెట్టుకుని వెళ్లినట్టు ప్రచారం సాగుతోంది. వైయస్‌ జగన్‌.. ప్రధానిని కలిసే విషయం తనకు ముందే ఎందుకు చెప్పలేదని సుజనాపై చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారని కూడా తెలుస్తుంది. 

మీడియాకు తప్పుడు సమాచారం ఇచ్చి.. 
అమెరికా పర్యటన ముగించుకుని ఢిల్లీ చేరుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కొన్ని గంటలపాటు ఎవరికీ అందుబాటులో లేకుండా అదృశ్యమయ్యారు. మధ్యాహ్నం మూడు గంటల సమయానికి ఢిల్లీ ఎయిర్‌పోర్టుకు చేరుకున్న చంద్రబాబు బృందం అక్కడి నుంచి నేరుగా విజయవాడ రావాల్సి వుంది. ఢిల్లీ ఎయిర్‌ పోర్టుకు చేరుకున్నట్టుగా 3.15కు ఒకసారి, ఢిల్లీ నుంచి నేరుగా విజయవాడ వెళుతున్నట్టు 3.55కు ఒకసారి మీడియాకు అధికార వర్గాల ద్వారా సమాచారం అందించారు. కానీ రాత్రి తొమ్మిది గంటల వరకూ సీఎం ఎయిర్‌పోర్టు లాంజ్‌లోనే ఉన్నట్టు ముఖ్యమంత్రి ప్రభుత్వ, ప్రైవేటు సిబ్బంది మీడియాను నమ్మించారు. సాయంత్రానికే రాష్ట్రానికి చేరుకుంటారని షెడ్యూలులో ఉన్నా.. దాన్ని పక్కనపెట్టి అత్యవసరంగా, రహస్యంగా మంతనాలు జరపడం ఆసక్తి కలిగించింది. చంద్రబాబు రాత్రి 9.30 గంటల సమయంలో ఢిల్లీ నుంచి విజయవాడ బయలుదేరారు. 

సంబంధిత వార్తలు

Home  |  News  |  Downloads  |  Gallery  |  Contact Us  |   Sitemap  

Official Website of YSR Congress Party
Copyright © 2011 ysrcongress.com