Ysrcpnettv
YSR Congress Party Twitter YS Jagna Twitter

YSR Congress

Flash News >>>>
             సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ, చంద్రబాబు మధ్య బంధం తేలతెల్లమవుతోంది: వాసిరెడ్డి పద్మ                                నచ్చితే నంది.. నచ్చకపోతే పందిలా తెలుగుదేశం పార్టీ పత్రికల తీరు: వాసిరెడ్డి పద్మ                               ఫీజు రీయింబ‌ర్స్‌మెంట్ ప‌థ‌కాన్ని నిర్వీర్యం చేస్తూ పేద‌ల‌కు ఉన్న‌త చ‌దువులు దూరం చేస్తున్న వైఖ‌రికి నిర‌స‌న‌గా వైయ‌స్‌ఆర్ విద్యార్ధి విభాగం ఆధ్వర్యంలో అన్ని జిల్లా కేంద్రాల‌లో అక్టోబ‌ర్ 25వ తేదీన ఫీజుపోరు : విజ‌య‌సాయిరెడ్డి                               జననేత వైయ‌స్ జ‌గ‌న్ ప్ర‌జా సంక‌ల్ప యాత్ర 292వ రోజు సాలూరు శివారు నుంచి ప్రారంభం                               చంద్రబాబు రాజకీయ జీవితమంతా రక్త చరిత్రే: భూమన కరుణాకర్‌రెడ్డి                                వైయస్‌ జగన్‌ను కలిసిన సాక్షార భారత్‌ గ్రామ కో–ఆర్డినేటర్లు                               తుని రైలు దహనం ఘటన వెనుక చంద్రబాబు హస్తం లేదా: భూమన కరుణాకర్‌రెడ్డి                                గుంటూరు జిల్లా టీడీపీ మాజీ అధ్యక్షుడు మల్లాది శివన్నారాయణ, చిలకలూరిపేట టీడీపీ మాజీ అధ్యక్షుడు శివయ్య, జి.వెంకట్రావు, కె.కాంతారావులు వైయ‌స్ఆర్‌సీపీలో చేరిక‌                               దేశంలో, రాష్ట్రంలో ఇలాంటి అబద్ధపు ముఖ్యమంత్రి ఎక్కడా లేరని, గల్ఫ్‌ దేశాల్లో ఇలాంటి అబద్ధాల ముఖ్యమంత్రిని ఎప్పుడో ఉరి తీసేవారు: ఎమ్మెల్యే ర‌వీంద్ర‌నాథ్‌రెడ్డి                 
    Show Latest News
మెట్రో పేరు కోసం చంద్రబాబు పాట్లు

Published on : 01-Dec-2017 | 08:25
 

ఇష్టం వచ్చినట్టు మాట్లాడేవాళ్ల నాలికకు నరం లేదు అంటారు. మరి నోట్లో నరాలు తెగేన్ని అబద్ధాలు ఆడేవాళ్లని చంద్రబాబు అనాలేమో…! మెట్రో రైలు హైదరాబాద్ కు రావడానికి కారణం నేనే అంటూ చంద్రబాబు చెబుతుంటే విన్న విలేఖరులు కూడా విస్తుబోయారు. నాటి కేంద్ర ప్రభుత్వం మెట్రో ప్రాజెక్టును బెంగుళూరు, అహ్మదాబాదులకు మాత్రమే సాంక్షన్ చేస్తే అందులో హైదరాబాద్ పేరును కూడా చేర్చడానికి తానెంతో పోరాడానని చెప్పుకొచ్చారు చంద్రబాబు. 
అసలు నిజం ఏమిటంటే హైదరాబాద్ మెట్రో గురించి నిర్ణయం తీసుకునేటప్పుడు చంద్రబాబు ప్రతిపక్షంలో ఉన్నారు. ఊరుకుంటే గోల్కొండ కోటను, చౌమహల్లా పాలెస్ నూ నేనే కట్టించానని చెప్పుకోగలడు చంద్రబాబు అంటున్నారు కొందరు సొంత పార్టీ నేతలు. 

నిజానికి హైదరాబాద్ లో మెట్రో ప్రాజెక్టు నిర్మాణానికి బీజం పడింది వైయస్సార్ హయాంలోనే. అధికారంలోకి వచ్చిన వెంటనే హైదరాబాద్ ట్రాఫిక్ పై దృష్టిసారించారు వైయస్ రాజశేఖర్ రెడ్డి. 2005, 2006లో ఫ్లైఓవర్లు నిర్మించారు. పంజాగుట్ట, నల్గొండ క్రాస్ రోడ్స్, మెహిదీపట్నం ఫ్లై ఓవర్లను త్వరితంగా పూర్తి చేసి ప్రజలకందించారు. దాని తర్వాత అధికారులతో చర్చించి మెట్రో రైలు ప్రతిపాదన చేసారు. అప్పటి కేంద్ర ఆర్థికశాఖ కార్యదర్శి మాంటెక్ సింగ్ అహ్లువాలియా, సీనియర్ ఐఎఎస్ అధికారి గజేంద్ర హల్దియా, పురపాలక శాఖ కార్యదర్శి ఎస్పీసింగ్ తో వరుస సమావేశాలు జరిపారు. హైదరాబాద్ ఫ్లైఓవర్ల నిర్మాణాన్ని సమర్థవంతంగా నిర్వహించిన GHMC అడిషనల్ కమీషనర్ ఎన్వీఎస్ రెడ్డిని మెట్రో ప్రాజెక్టుకు ఎంపిక చేసారు.

ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యంతో ముందుకెళ్లాలని నిర్ణయం తీసుకున్నారు. అధికారులతో చర్చించి నిర్మాణ వ్యయం, అనుమతులు, భూ సమీకరణ వంటి విషయాలపై స్పష్టత తీసుకున్నారు వైయస్సార్. 2008లో పిపిపి పద్ధతిలో బిడ్లు పిలిచింది నాటి వైయస్సార్ గవర్నమెంట్. 72కి.మీల మేర మూడు రూట్లలో నిర్మాణం, అంచనా వ్యయం 12132 కోట్ల రూపాయిలుగా ప్రకటించారు. రిలయిన్స్ తో సహా దేశవ్యాప్తంగా ఉన్న బడా కంపెనీలెన్నో బిడ్లు దాక్షలు చేసాయి. 

సత్యం అనుబంధ సంస్థ అయిన మేటాస్ సర్కారు మెట్రో ఖర్చే ఏదీ భరించాల్సిన అవసరం లేదంటూ బిడ్ ఇచ్చింది. 2008 సెప్టెంబర్ 19న మేటాస్ తో రాష్ట్ర ప్రభుత్వం అధికారిక ఒప్పందం కూడా జరిగింది. కానీ మాతృ సంస్థ సత్యం అనూహ్యంగా దెబ్బతినడంతో మేటాస్ వెనక్కి తగ్గింది. దాంతో 2009లో ప్రభుత్వం మేటాస్ తో ఒప్పందం రద్దు చేసుకుని, 2010లో అంచనా వ్యయాన్ని 14,132 కోట్లకు పెంచి రెండోసారి టెండర్లు పిలిచింది. అప్పటికి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు రోశయ్య ముఖ్యమంత్రిగా ఉన్నారు. 2010 సెప్టెంబర్ లో మెట్రో రైలు నిర్మాణ ఒప్పందం ఎల్ అండ్ టి తో జరిగింది. ఆ సమయంలో కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. ప్రతిపక్ష పార్టీ నాయకుడిగా ఉన్న చంద్రబాబు ఎవరికి చెప్పి, హైదరాబాద్ కు  మెట్రో ప్రాజెక్టును సాంక్షన్ చేయించారా అని జనాలు జుట్టు పీక్కుంటున్నారు. 

Labels : YS Jagan, YSRCP , Metro, NCBN

సంబంధిత వార్తలు

Home  |  News  |  Downloads  |  Gallery  |  Contact Us  |   Sitemap  

Official Website of YSR Congress Party
Copyright © 2011 ysrcongress.com