Ysrcpnettv
YSR Congress Party Twitter YS Jagna Twitter

YSR Congress

Flash News >>>>
             వ‌ర‌ద‌ విపత్తుతో తల్లడిల్లుతున్న కేరళ ప్రజలకు కేంద్ర ప్రభుత్వం పునరావాస సహాయం కల్పించాలి: వైయ‌స్ జ‌గ‌న్                                ఈ కష్టకాలంలో నా ఆలోచనలు, ప్రార్థనలు కేరళ ప్రజలతో ఉన్నాయి: వైయ‌స్ జ‌గ‌న్‌                               కేర‌ళ వ‌ర‌ద‌లు హృద‌యాన్ని క‌ల‌చివేస్తున్నాయి: వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ట్వీట్‌                               సీఐడీ టీడీపీ తోక సంస్థ‌: కాసు మ‌హేష్‌రెడ్డి                               న‌ర్సీప‌ట్నం మెట్ట‌పాలెం క్రాస్ నుంచి వైయ‌స్ జ‌గ‌న్ 239వ రోజు ప్రజాసంకల్పయాత్ర ప్రారంభం                               వైయ‌స్‌ జగన్‌మోహన్‌ రెడ్డి చేపట్టిన పాదయాత్ర 238వ రోజు గురువారం ఉదయం విశాఖపట్నం జిల్లా నాతవరం మండలం డి. ఎర్రవరం నుంచి ప్రారంభం                               రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు 72వ స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి                               వైయ‌స్ఆర్‌సీపీ ఆధ్వ‌ర్యంలో ఘ‌నంగా స్వాతంత్ర్య దినోత్స‌వ వేడుక‌లు                               విశాఖ జిల్లా ఎర్రవరంలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న ఏపీ ప్రతిపక్షనేత, వైయ‌స్ఆర్‌సీపీ అధినేత వైయ‌స్‌ జగన్‌మోహన్‌ రెడ్డి                  
    Show Latest News
ముస్లిం ఓట్ల కోసం బాబు వెంపర్లాట

Published on : 03-Aug-2018 | 10:15
 

మోడీని తిట్టు.. ముస్లిం ఓట్లు పట్టు- ఇది బాబు సిద్ధాంతం 

2019 ఎన్నికలే లక్ష్యంగా ఆరోపణలు 

 

తిమ్మిని బమ్మిని , బమ్మిని తిమ్మిని చేసైనా సరే ప్రజలను నమ్మించాలన్న నమ్మించే తత్వం చంద్రబాబుది. జనానికి అవసరమా కాదా అనేది పట్టించుకోడు.., నమ్ముతారో, నవ్వుతారోనని భయంలేదు.., తన దగ్గరున్న ఆలోచనలను  సొమ్ము చేసుకోవాలి అనేదే చంద్రబాబు సిద్దాంతం. తన వాదనే అత్యంత పవిత్రమైందిగా నమ్మించడానికి ఎన్ని కట్టు కథలైనా అల్లుతాడు. ఇప్పుడు చంద్రబాబు అదే పనిలో ఉన్నాడు. నిన్న మొన్నటిదాకా మోడీని మేధావి, కారణజన్ముడు అని పొగిడాడు. నాదీ మోడీది విడదీయరాని బంధమని.. అమరావతిని అద్భుత రాజధానిగా తీర్చిదిద్దడం మా ఇద్దరితోనే సాధ్యమని నమ్మబలికాడు. నాలుగేళ్లు బీజేపీతో కాపురం చేసిన చంద్రబాబు ప్రత్యేక సాధనలో ఘోరంగా విఫలం చెంది ఆ నెపాన్ని బీజేపీ మీదకు నెట్టేందుకు  ఎన్నికలకు కొద్ది నెలల ముందు ఎన్‌డీఏ నుంచి బయటకొచ్చాడు. 

 గడిచిన నెల రోజులుగా చంద్రబాబు వారంలో రెండు రోజులు బహిరంగ సభలు నిర్వహిస్తున్నాడు. వేదికెక్కిన ప్రతిసారీ మోడీని తిట్టడం మొదటు పెట్టాడు. పార్లమెంట్‌లో అవిశ్వాస తీర్మానం సందర్భంగా తనను ఉద్దేశించి మోడీ చేసిన వ్యాఖ్యలను కూడా ఓట్లుగా మలచుకోవాలని చంద్రబాబు కలలు కంటున్నాడు. నాకు రాజకీయాలు తెలియవా.., అదృష్టం కొద్దీ మోడీ ప్రధాని అయ్యాడు.., నన్ను వైయస్‌ఆర్‌సీపీ ట్రాప్‌లో పడ్డానని అంటాడా.. ఇలా ఎక్కిన వేదికా దిగిన వేదికా అని తేడా లేకుండా మైకు దొరికిన ప్రతిసారీ చంద్రబాబుకు మోడీని తిట్టడమే పని. ఎప్పుడూ లేనిది చంద్రబాబు.. ఇప్పుడే ఎందుకిలా మోడీని విమర్శిస్తున్నాడు అని లోతుగా విశ్లేషిస్తే దీని వెనుక ముస్లిం ఓట్లను ప్రభావితం చేయాలని బాబు స్కెచ్‌ వేశాడు. ముస్లింలు వ్యతిరేకంచే మోడీని తిడితే ముస్లింలను టీడీపీకి దగ్గర చేసుకోవచ్చన్నది ఆయన అభిప్రాయం కావొచ్చు. మొన్నటి ఎన్నికల్లో వైయస్‌ఆర్‌సీపీకి అండగా ఉన్న ముస్లిం ఓటు బ్యాంకును దగ్గర చేసుకోవాలన్నదే బాబు వ్యూహంగా తెలుస్తుంది. గడిచిన ఎన్నికల్లో బీసీలు ఎలాగూ చంద్రబాబుకు ఓటెయ్యలేదు. రిజర్వేషన్లు ఇస్తామని కాపులకు దేసిన ద్రోహంతో వారి ఓట్లు పడతాయని కూడా చంద్రబాబులో ఆశలు సన్నగిల్లింది. దీంతో మిగిలిన ముస్లింల ఓట్లే టార్గెట్‌గా చంద్రబాబు.. మోడీని టార్గెట్‌  చేసినట్టుగా అర్థమవుతుంది. ఆంధ్రాలో మోడీని తిడుతున్న చంద్రబాబు.. ఢిల్లీలో బీజేపీ నేతలతో అదే స్నేహాన్ని కొనసాగిస్తున్నారు. తమ ప్రభుత్వంపై చంద్రబాబు అవిశ్వాసం పెట్టినా కేంద్ర హోంమంత్రి మాత్రం  పార్లమెంట్‌లో చంద్రబాబును స్నేహితుడే అని చెప్పడం అందర్నీ ఆశ్చర్యానికి గురి చేసింది. ఈ ఒక్క సంఘటన చాలు బాబు యుద్ధం ఎలాంటిదో. 

 

Labels : YSRCP, YS Jagan, NCBN, TDP

సంబంధిత వార్తలు

Home  |  News  |  Downloads  |  Gallery  |  Contact Us  |   Sitemap  

Official Website of YSR Congress Party
Copyright © 2011 ysrcongress.com