Ysrcpnettv
YSR Congress Party Twitter YS Jagna Twitter

YSR Congress

Flash News >>>>
             ఈవీఎంలకు ట్యాంపరింగ్‌ చేయడం బాబుకు బాగా తెలుసు: ఎంపీ విజ‌య‌సాయిరెడ్డి                               వైయ‌స్ జ‌గ‌న్‌ను క‌లిసిన తుపాను బాధితులు                               చ‌ల్ల‌వానిపేట నుంచి వైయ‌స్ జ‌గ‌న్ 324వ రోజు ప్రజాసంకల్పయాత్ర ప్రారంభం                               వ‌ర‌ల్డ్ టూర్ ఫైన‌ల్స్ టైటిల్ గెలిచిన భార‌తీయ ఫ్లేయ‌ర్‌గా చ‌రిత్ర సృష్టించిన పీవీ సింధుకు వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్షులు, ఏపీ ప్ర‌తిప‌క్ష నేత వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి అభినంద‌న‌లు                                అమరజీవికి జ‌న‌నేత వైయ‌స్ జ‌గ‌న్‌ ఘ‌న‌ నివాళి                               టీఆర్‌ఎస్‌ ప్రభుత్వంతో అన్ని అంశాల్లో రాజీపడింది చంద్రబాబే: బొత్స సత్యనారాయణ                               రాష్ట్రాన్ని చంద్రబాబు ఎంత భ్రష్టుపట్టించారో, కేసీఆర్ అంత నష్టపరిచారు: బొత్స స‌త్య‌నారాయ‌ణ‌                               ఆంధ్రప్రదేశ్‌కి ప్రత్యేక హోదా కల్పించాలని కోరుతూ పార్లమెంట్ వద్ద వైయ‌స్ఆర్‌ సీపీ ఎంపీలు ధర్నా                               ప్రజలకు ఎన్ని అబద్దాల చెప్పినా వింటారనే నాయకులకు తెలంగాణ ప్రజలు గట్టిగా బుద్ది చెప్పారు : వైయ‌స్ జ‌గ‌న్‌                 
    Show Latest News
బాబు అవకాశవాదం

Published on : 08-Oct-2018 | 14:52
 

 


చంద్రబాబు అవకాశవాదానికి పెట్టిన మారు పేరు ప్రజాస్వామిక అవసరం. చంద్రబాబు పొత్తులన్నీ చారిత్రక అవసరాలు, ప్రజాస్వామిక అవసరాలుగా పేరు మార్చుకుంటాయి. కూటమి రాజకీయాలకు చంద్రబాబు పెట్టింది పేరు. ఇన్నేళ్ల రాజకీయ మనుగడలో టిడిపిని ఒంటరిగా గెలిపించిన చరిత్ర బాబు జీవితంలోనే లేదు. తెలుగువాడి ఆత్మగౌరవం అనే నినాదంతో తెలుగునాట విజయదుంధుభులు మోగించిన ఎన్టీఆర్ ప్రభంజనాన్ని ఎవ్వరూ మర్చిపోలేరు. సొంత మామగారిని వంచించి, ఓ మహత్తర రాజకీయ చరిత్రను లిఖించిన పార్టీ ని కబ్జా చేసిన చంద్రబాబు నాటి నుండి నేటిదాకా పోత్తులతోనే సార్వత్రిక ఎన్నికల్లో నెగ్గుకొస్తున్నారు. 

కేంద్ర ఆధిపత్యంతో రాష్ట్రాల స్వయం ప్రతిపత్తిని భూస్థాపితం చేసిన కాంగ్రెస్ కు వ్యతిరేకంగా పుట్టిన పార్టీ టిడిపి. నేడు చంద్రబాబు తిరిగి అదే కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకుంటూ ఆ పార్టీ సిద్ధాంతపు వెన్ను విరిచేశాడు. తన గెలుపు కోసం పార్టీ మూలాలనే నాశనం చేసిన చంద్రబాబు స్వప్రయోజనాల కోసం విలువలకు ఎప్పుడో తిలోదకాలిచ్చేశాడు.
1995లో మామకు వెన్నుపోటు పొడిచి ఎన్నికలు లేకుండానే ముఖ్యమంత్రి అయ్యాడు చంద్రబాబు. ఆ సమయంలో కూడా వామపక్షాల మద్దతు తీసుకున్నాడు.
ఆ తర్వాత 1999లో లోక్ సభ ఎన్నికలతో పాటే ఎపిలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో చంద్రబాబు ముందస్తుగానే బిజెపితో పొత్తు కదుర్చుకున్నాడు. కార్గిల్ సెంటిమెంట్ తో బలంగా ఉన్నబిజెపి అండతో అధికారంలోకి వచ్చాడు.

2004 లో సార్వత్రిక ఎన్నికల్లోనూ చంద్రబాబు మరోసారి బిజెపితోనే పొత్తు పెట్టుఉన్నాడు.  కానీ తొమ్మిదేళ్ల బాబు పాలనలో నరకం చూసిన ప్రజలు బాబును తృణీకరించారు. పదేళ్లపాటు అధికారానికి దూరంగా పెట్టారు.

2009 ఎన్నికల్లోనూ బాబు సింగిల్ గా పోటీ చేసింది లేదు. ప్రత్యేక రాష్ట్రం కోరితో ఉన్న టిఆర్ఎస్ ని, వామపక్షాలను కలుపుకుని మహాకూటమి అంటూ దండెత్తి వచ్చినా ప్రజలు చంద్రబాబును నమ్మలేదు. 

2014లో మరోసారి చంద్రబాబు బిజెపి పంచన చేరారు. 2009 ఎన్నికల్లో బిజెపితో కలిసి ఓడినప్పుడు ఆ పార్టీని చెడ తిట్టి, మరెప్పుడూ బిజెపితో పొత్తు పెట్టుకోమని ప్రతిజ్ఞ చేసిన బాబు, అవన్నీ మర్చిపోయి 2014 లో మోదీ తో కలిసి విభజన తర్వాత జరిగిన తొలిఎన్నికలో పోటీ చేసాడు. దేశవ్యాప్తంగా ఉన్న మోదీ ప్రభంజనం, క్రేజ్ టిడిపికి కలిసి వచ్చాయి. దాంతోపాటే ఓట్లను చీల్చేందుకు పవన్ కళ్యాణ్ జన సేన పార్టీతోనూ పొత్తు పెట్టుకున్నాడు. అంతులేని హామీలు గుప్పించి 2014లో అధికారంలోకి వచ్చాడు. 
ఏనాడూ చంద్రబాబు ఎన్నికలను ఒంటరిగా ఎదుర్కునే ప్రయత్నమే చేయలేదు. మొన్న ఎన్డీయే కూటమి నుండి బయటకు వచ్చిన టిడిపి నేడు కాంగ్రెస్ తో చెట్టాపట్టాలేసుకుంటోంది. తెలంగాణాలో భూస్థాపితం అయిన పార్టీని తిరిగి బతికించుకునేందుకు చివరకు అక్కడి ప్రభుత్వంలో ఉన్న పార్టీతోనూ పొత్తు కోసం వెంపర్లాడింది టిడిపి. ఈ విషయాన్ని స్వయంగా ఇద్దరు ముఖ్యమంత్రులూ అంగీకరించారు.
ఎన్నికల్లో గెలిచేందుకు, అధికారాన్ని చేపట్టేందుకు టిడిపి చేస్తున్న అవకాశవాద రాజకీయ పొత్తులే ఇవి. కానీ చంద్రబాబు మాత్రం వాటిని చారిత్రక అవసరాలనీ, ప్రజాస్వామ్యానికి కావాల్సిన కూటములని చెబుతూ వస్తుంటాడు. 

నలభై ఏళ్ల అనుభవం, అంతకు మించి చరిత్ర వున్న టిడిపి పొత్తుల కోసం ఆర్రులు చాస్తుంటే కొత్తగా పుట్టిన పార్టీ అయ్యి ఉండి కూడా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తొలి ఎన్నికల్లోనూ ఎవ్వరితోనూ పొత్తులను కోరలేదు. ఒంటరిగా బరిలో దిగింది. జాతీయ, రాష్ట్రీయ పార్టీల కూటములను ఢీకొట్టింది. అందరు కలిసి పోటీ చేసినా, సింగిల్ గా ఎదురొడ్డి గట్టి పోటీనిచ్చింది. 2శాతం ఓటింగ్ తేడాతో అధికారానికి దూరమైనా ఎన్నికల పోరాటంలో సముఉజ్జీగా నిలిచింది.  2019 మరోసారి ఎన్నికల ఘంటా మోగిన వేల చంద్రబాబు మరోసారి జాతీయ పార్టీలతో, స్థానిక పార్టీలతో పొత్తులు చేసుకుంటున్నాడు. కూటముల కోటలు కట్టుకుంటున్నాడు. వైఎస్ జగన్ మోహన రెడ్డి మాత్రం మళ్లీ తన సత్తా చాటేందుకు, సింహంలా సింగిల్ గా వస్తున్నాడు. ఈసారి ఎందరు కలిసి గుంపుగా వచ్చినా వార్ వన్ సైడే అని జగన్ చేస్తున్న ప్రజా సంకల్ప యాత్ర రుజువు చేస్తోంది. గెలుపు రూపంలో అది వాస్తవమయ్యే కాలం దగ్గర్లో ఉంది. 
 

Labels : chandrababu, tdp, bjp, congress

సంబంధిత వార్తలు

Home  |  News  |  Downloads  |  Gallery  |  Contact Us  |   Sitemap  

Official Website of YSR Congress Party
Copyright © 2011 ysrcongress.com