Ysrcpnettv
YSR Congress Party Twitter YS Jagna Twitter

YSR Congress

Flash News >>>>
             చంద్ర‌బాబు ముస్లింల ద్రోహి: ఎమ్మెల్యే ముస్త‌ఫా                               బీజేపీ, టీడీపీలు ఏపీ ప్ర‌జ‌ల‌ను మోసం చేశాయి: మ‌ల్లాది విష్ణు                               కేంద్రంపై పోరాటం చేసే ద‌మ్ము, ధైర్యం చంద్ర‌బాబుకు ఉందా?: వెల్లంప‌ల్లి శ్రీ‌నివాస్‌                               వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని రాజకీయంగా ఎదుర్కోలేక తప్పుడు ఆరోపణలు చేస్తూ టీడీపీ నేత‌లు పైశాచిక ఆనందం పొందుతున్నారు: వాసిరెడ్డి పద్మ                               ప్ర‌త్యేక హోదా సాధ‌న‌కు ఎమ్మెల్యే ప‌ద‌వికి రాజీనామా చేసేందుకు సిద్ధమే: ఆదిమూల‌పు సురేష్‌                               బీజేపీ, టీడీపీల‌కు కాంగ్రెస్ గ‌తే ప‌డుతుంది: అంబ‌టి రాంబాబు                               హజీజ్‌పురం గ్రామంలో పొగాకు రైతులు వైయ‌స్ జ‌గ‌న్‌ను కలిసి వారి సమస్యలను చెప్పుకున్నారు.                               రామపురంలో దివ్యాంగులు వైయ‌స్ జ‌గ‌న్‌ను క‌లిసి త‌మ స‌మ‌స్య‌లు చెప్పుకున్నారు.                                వైయ‌స్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు వైయ‌స్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర 95వ రోజు పెద్దఅలవలపాడు శివారు నుంచి ప్రారంభ‌మైంది.                 
    Show Latest News
బాబు అండ్ కో భ్రష్టు రాజకీయాలు

Published on : 13-Jul-2017 | 16:17
 

– ప్రలోభాలు, బెదిరింపులతో ఓట్ల ఆరాటం 
– టీడీపీ రౌడీయిజానికి ప్రజల బెంబేలు 
– ఇప్పటికే మంత్రులు, ఎమ్మెల్యేల మోహరింపు 
– ఓటమి భయంతో దాడులు, అర్ధరాత్రి సోదాలు 

అధికారం ఉన్నంతకాలం అడ్డగోలుగా దోచుకుంటూ, రాజభోగాలు అనుభవిస్తూ, ఎన్నికలొచ్చినప్పుడు జనాలకు డబ్బులు గుమ్మరించి ఓట్లు దండుకోవాలనే సిద్ధాంతంతో టీడీపీ అడ్డదారులు తొక్కుతోంది. అధికారంలోకి వచ్చిన మూడేళ్లలో ప్రజలకు చేసింది లేకపోగా.. అడ్డమైన పనికిరాని ప్రాజెక్టుల పేరుతో ప్రజల ఆస్తుల స్వాహా చేసేసిన బాబు అండ్‌ కో ఇప్పుడు నంద్యాల ఎన్నికలు రావడంతో మేకతోలు కప్పుకుని ఓట్ల కోసం జనంలోకి దిగారు.  చోటా మోటా గల్లీ లీడర్లను డబ్బులు, ఇతరత్రా అవసరాలు చూపించి లొంగదీసుకుంటోంది. మాట వినని వారిపై బెదిరింపులు, దాడులకు దిగుతోంది. ప్రజామోదంతో.. ప్రజలకు సేవ చేసి వారి మద్ధతుతో గెలవాల్సిన సీటును ప్రలోభాలు, అరాచకాలతో చేజిక్కించుకోవాలనే  కుట్ర రచన చేస్తుంది. కాదు కూడదంటే కేసులు పెడతామంటూ బెదిరిస్తోంది. విలువలను తుంగలో తొక్కి అన్ని అడ్డదారులనూ వెదుకుతోంది. మంత్రులనూ రంగంలోకి దింపి కుతంత్రాల పావులు కదిపింది. రాష్ట్రంలోని రాజకీయపరిస్థితుల్లో  ప్రతిష్టాత్మకంగా మారిన ఉప ఎన్నికలో కూడా సత్తా చాటుకోలేక సర్వశక్తులూ ఒడ్డి గెలుపు కోసం పడరాని పాట్లు పడుతోంది. చంద్రబాబు సర్కారు సాగిస్తున్న కుత్సిత రాజకీయం ఏవగింపు కలిగిస్తోంది. ప్రతిపక్ష కార్యకర్తలు, ఓటర్ల కొనుగోలుకు రూ.100 కోట్లు కేటాయించారని టీడీపీ నేతలే చెప్పుకుంటున్నారు. ఒక్క నంద్యాల ఉప ఎన్నిక కోసమే ఇంతగా ఖర్చు చేస్తుంటే.. రేపటి ఎన్నికల్లో 175 నియోజకవర్గాల్లో  ఎన్ని వేల కోట్లు వెదజల్లుతుందోనని ప్రజలు చర్చించుకుంటున్నారు.

మాట వింటే సరి.. లేదంటే దాడులే.. 
నంద్యాల ఉప ఎన్నికలో గెలవడానికి  పచ్చచొక్కాలు చేస్తున్న అక్రమాలకు  అడ్డు లేకుండా పోతోంది. పార్టీ మారేందుకు సిద్ధపడే నేతలకు తాయిలాలను ప్రకటిస్తోంది. ఒకవేళ పార్టీ మారేందుకు ముందుకు రాకపోతే అర్దరాత్రి వేళల్లో పోలీసులతో సోదాలు నిర్వహిస్తూ బెదిరింపులకు దిగుతోంది.  రూ.1100 కోట్లతో నంద్యాలను అభివృద్ధి చేస్తున్నామని రోజూ ముగ్గురు మంత్రులు పర్యటించడం అక్కడి ప్రజల్లో టిడిపి పై  ఏవగింపు కలిగిస్తోంది.  ఇన్నాళ్లు గుర్తుకురాని మేము ఎన్నికలొచ్చినప్పుడే అవసరమయ్యామా అంటూ బహిరంగంగానే విమర్శిస్తున్నారు. ఓటమి భయం ఉండబట్టే కదా నోటిఫికేషన్‌ కూడా విడుదల కాకుండానే టీడీపీ నాయకులు ఎన్నికల ప్రచారం మొదలు పెట్టారని విమర్శిస్తున్నారు. ఎప్పుడూ ఈ ప్రాంతంలో కనపడని నాయకులు నిద్ర లేవకముందే తమ గుమ్మాల్లో ప్రత్యక్షం కావడంతో నోరెళ్లబెతున్నారు. 

మొదలు పెట్టిందే ముఖ్యమంత్రి...
నంద్యాల ఉప ఎన్నికల్లో గెలిచే పరిస్థితి లేదనుకున్న సీఎం చంద్రబాబు తొలుత ఏకంగా ప్రజలపైనే బెదిరింపులకు దిగారు. నంద్యాల పర్యటన సందర్భంగా ‘నేను వేసిన రోడ్లపై నడుస్తూ, నేను ఇచ్చిన పింఛన్‌ తీసుకుంటూ నాకు ఓటు వేయరా’ అని ప్రశ్నించారు. ఓటు వేయకపోతే పింఛను తీసుకోవద్దని.. రోడ్లపై నడవద్దని హూంకరించారు. ఇక్కడితో మొదలైన బెదిరింపుల పర్వం కాస్తా ప్రలోభాలకూ దారి తీసింది. మరోవైపు ఓటుకు తాను రూ.5 వేలైనా ఇవ్వగలనని పేర్కొనడం ద్వారా నంద్యాల ఉప ఎన్నికల్లో నిధుల వరద పారించనున్నట్టు చంద్రబాబు స్పష్టం చేశారు. వైఎస్సార్‌ కాంగ్రెస్‌పార్టీకి చెందిన కౌన్సిలర్‌ ఇంట్లో అర్ధరాత్రి సమయంలో సోదాలు నిర్వహించారు. పార్టీ మారావు కదా అని బెదిరింపులకు దిగారు. పక్కనే ఉన్న బంధువుల ఇళ్లల్లోనూ సోదాలు నిర్వహించారు. బలవంతంగా తలుపులు తెరిపించి, ఇంటిలో ఆయుధాలు, కోట్ల డబ్బు ఉందంటూ పోలీసులు దౌర్జన్యానికి తెగబడ్డారు.  తప్పులను ఎత్తిచూపితే సొంత పార్టీకి చెందిన నేతలకు కూడా బెదిరింపుల పర్వం తప్పడం లేదు. గతంలో ఆర్యవైశ్య వర్గానికి చెందిన గంగిశెట్టి విజయ్‌కుమార్‌పై జరిగిన దాడి వివరాలను సామాజిక మాధ్యమాల్లో షేర్‌ చేసిన మైనార్టీ నేత ఎంబీటీ బాబును ఫోన్‌లో అధికార పార్టీ నేత ఏవీ సుబ్బారెడ్డి బెదిరించారు.

ఏకంగా ‘చెప్పుతో కొడతా నా కొ....’ అని బెదిరించారు. తాను మంచోడిని కాదని, పోలీసులకూ భయపడనని అంతుచూస్తామని హెచ్చరించారు. ప్రజాదరణ ఉన్న మార్క్‌ఫెడ్‌ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పీపీ నాగిరెడ్డికి అనేక ఆశలు చూపుతూ పార్టీ మారాలని  మంత్రులు ఒత్తిళ్లు తెస్తున్నారు. మరోవైపు పార్టీ మారే వారికి భారీగా నజరానాలతో పాటు పదవుల ఆఫర్లు ఇస్తున్నారు. ఇన్నాళ్లుగా కనీసం పట్టించుకోని మాజీ మంత్రి ఫరూక్‌కు  గవర్నర్‌ కోటాలో ఎమ్మెల్సీ ప్రకటించాలని నిర్ణయించారు.

పదవుల పంపకం కూడా ఇప్పుడే..
ఇక నౌమోన్‌ను ఉర్దూ అకాడమీ చైర్మన్‌గా నియమించారు. మైనార్టీల ఓట్లకు గాలం వేసేందుకు ఈ చర్యలు తీసుకున్నారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. గతంలో టీడీపీ జిల్లా అధ్యక్షుడిగా ప్రకటించి.. ఇవ్వకుండా మరీ అవమానించిన సోమిశెట్టి వెంకటేశ్వర్లుకే మళ్లీ జిల్లా అధ్యక్ష పగ్గాలు అప్పగించారు. ‘కుడా’ చైర్మన్‌గా కూడా ప్రకటించి ఆర్యవైశ్య ఓట్లకు గాలం  వేస్తున్నారు. ఇక కులాల వారీగా సంక్షేమ పథకాలు ప్రకటిస్తూ ఆకర్షించే ప్రయత్నాలకు అధికార పార్టీ తెరలేపింది.  

అనుకూల అధికారుల నియామకం
నంద్యాల ఉప ఎన్నిక నేపథ్యంలో అధికా ర పార్టీ అనుకూల అధికారులను జిల్లాలో నియమించుకుంది. పోలీసు యంత్రాం గంలో డీఐజీ మొదలు, డీఎస్పీ.. సీఐల వరకు అనుకూలంగా వ్యవహరించే అధి కారులను నియమించుకుందన్న ఆరోప ణలు వినిపిస్తున్నాయి. జిల్లాలో చాలా రోజులుగా ఉన్న ఓ డీఎస్పీని బదిలీ చేయకుండా కేవలం నంద్యాల డీఎస్పీని మాత్రమే బదిలీ చేయడం గమనార్హం.  నంద్యాల నియోజకవర్గంలో సీఐగా నియ మితులైన ఒక అధికారిని కాదని ఆయన స్థానంలో రాత్రికి రాత్రే మరో అధికారిని నియమించారు. తద్వారా ఉప ఎన్నికల్లో పోలీసులను ప్రయోగించి ప్రతిపక్ష నేతలను, కార్యకర్తలను భయపెట్టి గెలవాలని అధికార పార్టీ భావిస్తోంది. 

సంబంధిత వార్తలు

Home  |  News  |  Downloads  |  Gallery  |  Contact Us  |   Sitemap  

Official Website of YSR Congress Party
Copyright © 2011 ysrcongress.com