Ysrcpnettv
YSR Congress Party Twitter YS Jagna Twitter

YSR Congress

Flash News >>>>
             ప్రతిదేవాలయ బోర్డులోనూ ఒక నాయీ బ్రహ్మణుడిని సభ్యుడిగా నియమిస్తాం: వైయ‌స్ జ‌గ‌న్ హామీ                               నాయీబ్రహ్మణుల పట్ల సచివాలయం సాక్షిగా నిన్న ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రవర్తించిన తీరును చూసి విస్తుపోయాను: వైయ‌స్ జ‌గ‌న్‌                               వైయ‌స్ జ‌గ‌న్ స‌మ‌క్షంలో వైయ‌స్ఆర్‌సీపీలో చేరిన వంద మంది అగ్ని కుల క్ష‌త్రియులు                               తనపై నిరాధార ఆరోపణలు చేసిన యరపతినేని , రవీంద్రకుమార్‌లపై సభా హక్కుల ఉల్లంఘన కింద చర్యలు తీసుకోవాలి: ఎమ్మెల్యే బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి                                ప్రఖ్యాత మిమిక్రీ కళాకారుడు స్వర బ్రహ్మ నేరెళ్ల వేణు మాధవ్ మృతి ప‌ట్ల వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు వైయస్‌ జగన్ మోహ‌న్ రెడ్డి సంతాపం                               పి.గ‌న్న‌వ‌రం నుంచి 193వ రోజు ప్ర‌జా సంక‌ల్ప యాత్ర ప్రారంభం                               నాయి బ్రాహ్మణులు కనీస వేతనాల కోసం అడిగితే సీఎం వీధి రౌడీలా దిగజారి మాట్లాడారన్నారు: జోగి ర‌మేష్‌                               లాలూచీ రాజకీయాలు చంద్రబాబుకు వెన్నతో పెట్టిన విద్య : వైయ‌స్ఆర్‌సీపీ అధికార ప్రతినిధి బత్తుల బ్రహ్మానందరెడ్డి                               ఆత్రేయపురం నుంచి 190వ రోజు ప్రజాసంకల్పయాత్ర ప్రారంభం                 
    Show Latest News
జాతీయ ప్లీనరీలో జిల్లా తీర్మానాల ఆమోదం

Published on : 10-Jul-2017 | 17:24
 

గుంటూరు వేదికగా వైయస్‌ఆర్‌ జయంతి సందర్భంగా రెండ్రోజుల పాటు జరిగిన వైయస్సార్సీపీ జాతీయ ప్లీనరీకి  పార్టీనేతలు, కార్యకర్తలు భారీగా తరలివచ్చారు. ఇప్పటికే  ఆయా జిల్లాల్లో జరిగిన తీర్మాణాలు విజయవంతం కావడంతో జాతీయ స్థాయి ప్లీనరీపై అంచనాలు భారీగా నెలకొన్నాయి. అందుకు అనుగుణంగానే ప్లీనరీ విజయవంతం అయ్యింది. ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టారు. పార్టీ బలోపేతం, ప్రజా సమస్యల పరిష్కారం కోసం అధినేత వైయస్ జగన్ పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు.  జాతీయ స్థాయి ప్లీనరీలో ఆయా జిల్లాల అధ్యక్షలు చేసిన ముఖ్యతీర్మాణాలు... 

-‘అనంత’కు నీళ్లిచ్చిన అపర భగీరథుడు వైయస్సార్‌
– ప్లీనరీలో అనంతపురం జిల్లా అధ్యక్షుడు శంకరనారాయణ

అనంతపురం జిల్లా తీర్మాణాలనను వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు శంకర నారాయణ ప్రవేశపెట్టారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. హంద్రీ– నీవా పథకాన్ని చేపట్టి అనంతపురం జిల్లాకు 3.45 లక్షల ఎకరాలకు సాగునీరు ఇచ్చిన అపర భగీరథుడు వైఎస్‌ రాజశేఖరరెడ్డి అనంతపురం జిల్లా సమస్యలపై ఆయన వైయస్‌ఆర్‌సీపీ జాతీయ ప్లీనరీలో పలు తీర్మానాలను ప్రవేశపెట్టారు. జిల్లాలోని 3.45 లక్షల ఎకరాలకు సాగునీరు అందించారని కొనియాడారు. అనంతపురం జిల్లాలో తీవ్ర కరువు పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి హంద్రీ–నీవా పథకానికి రూపకల్పన చేసి, తద్వారా డిస్ట్రిబ్యూటరీల ద్వారా జిల్లాకు నీళ్లు ఇవ్వాలని నిర్ణయించారన్నారు. అయితే చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాత హంద్రీ– నీవా ద్వారా కేవలం రిజర్వాయర్లును నింపేందుకు నిర్ణయం తీసుకున్నారన్నారు. వైఎస్సార్‌ హయాంలో తీసుకున్న మేరకు హంద్రీ–నీవా ద్వారా డిస్ట్రిబ్యూటరీల ద్వారా నీళ్లిచ్చేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. రాష్ట్ర విభజన అనంతరం సీఎం చంద్రబాబు అనంతపురం జిల్లాకు ఇచ్చిన 21 హామీల నెరవేర్చాలన్నారు.

అనంతపురం జిల్లా ప్రతి ఏడాది కరువు, కాటకాలతో అల్లాడిపోతోందని, వాటిని ఎదుర్కొనేందుకు జిల్లా అభివృద్ధికి ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. వైఎస్సార్‌ హయాంలో కరువుతో సతమతమయ్యే అనంత రైతాంగాన్ని ఆదుకునేందుకు పాడిపరిశ్రమను అభివృద్ధి చేశారన్నారు. అదేవిధంగా హార్టీకల్చర్‌ను ప్రోత్సహించేందుకు 90 శాతం సబ్సిడీతో డ్రిప్, స్ప్రింక్లర్లు ఇచ్చి ఆదుకున్నారన్నారు. అయితే చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాత జిల్లాను పూర్తిగా నిర్లక్ష్యం చేశారన్నారు. వేరుశనగ రైతులను ఆదుకునేందుకు ప్రధానమంత్రి పంటల బీమా పథకం అమలయ్యేలా చూడాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. తీవ్ర కరువు పరిస్థితుల వల్ల అనంతపురం జిల్లా రైతులు కర్ణాటక, కేరళ తదితర రాష్ట్రాలకు వెళ్లి తప్పని పరిస్థితుల్లో భిక్షాటన చేస్తున్నారనీ, అలాంటి వారిని ఆదుకునేందుకు స్థానికంగానే ఉపాధి కల్పించాలని ప్రభుత్వానికి సూచించారు.
=================
విజయడైరీని తిరిగి తెరిపించాలి
చిత్తూరు జిల్లా అధ్యక్షుడు నారాయణస్వామి
తంబళ్లపల్లి ఫ్లోరైడ్‌ సమస్యను పరిష్కరించాలి
హంద్రీనీవా ప్రాజెక్టు పూర్తిచేయాలి
గాజు మండలం, చిత్తూరు షుగర్‌ ఫ్యాక్టరీని పూర్తి చేయాలి
విజయడైరీని తిరిగి తెరిపించాలి 
గాలేరు–నగరి ప్రాజెక్టును పూర్తిచేయాలి
ఎన్టీఆర్‌ జలాశయం ద్వారా చెరువులకు నీళ్లందించాలి
మదనపల్లె, శ్రీకాళహస్తిలో భూ దందాలపై విచారణ జరిపించాలి
డిగ్రీ, పాలిటెక్నిక్‌ కళాశాలలు ఏర్పాటు చేయాలి
తిరుపతికి స్మార్ట్‌ సిటీగా అభివద్ధి చేయాలి

తూర్పులో హెల్త్‌ ఎమర్జెన్సీ ప్రకటించాలి 
జాతీయ ప్లీనరీలో తూర్పు గోదావరి జిల్లా అధ్యక్షడు కన్నబాబు 

వైయస్‌ఆర్‌సీపీ జాతీయ ప్లీనరీలో తూర్పు గోదావరి జిల్లాను పట్టిపీడిస్తున్న సమస్యలను జిల్లా అధ్యక్షుడు కురసాల కన్నబాబు ప్రస్తావించారు. 
–పౌష్టికాహారం లోపంతో చాపరాయి వంటి గిరిజన గ్రామాలకు చెందిన వారంతా మృత్యువాత పడుతున్నారని, కనీస సౌకర్యాల్లేక సతమతమవుతున్నారని, గిరిజనులను ఆదుకోవాలని కోరారు. మరణాలు సంభవిస్తున్న ప్రతిసారీ ఏజెన్సీలో వైఎస్‌ జగ¯Œ  మోహ¯Œ రెడ్డి ఏజెన్సీలో పర్యటించి, గిరిజనులకు సహాయం చేసి భరోసా ఇచ్చారే తప్ప ప్రభుత్వం సాయం అందించలేదన్నారు. తూర్పు గోదావరి జిల్లాలో వెంటనే హెల్త్‌ ఎమర్జెన్సీని ప్రకటించాలని డిమాండ్‌ చేశారు. 
– గోదావరి డెల్లా ఆధునికీకరణ దారుణంగా తయారైందని, వైయస్‌ఆర్‌  హయాంలో గొప్పగా చేపట్టిన కార్యక్రమాన్ని చంద్రబాబు పాలనలో అధ్వానంగా మార్చారని, ఆధునికీకరణ జరిగేలా చూడాలని కోరారు. 
– ఇంటి పన్నులు భారీగా పెంచేశారని, ఇందిరమ్మ ఇళ్లకు రూ.100గా ఉన్న పన్నును రూ.1000 వరకూ చేశారని, పెంచిన పన్నును ఉపసంహరించుకోవాలని ఈ సందర్భంగా కన్నబాబు ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. 
– పోలవరం, పట్టిసీమ, పురుషోత్తపురం ప్రాజెక్టుల్లో అవినీతికి పాల్పడుతున్నారని, కాసుల కోసం అన్నట్టుగా పనులు చేపడుతున్నారని,  కాంట్రాక్టులు, ముడుపుల కోసం కాకుండా నిర్వాసితుల కోసం ఆలోచించాలని కోరుతూ తీర్మానం ప్రవేశం పెట్టారు. 
– కోనసీమలో కొబ్బరి పరిశోధన కేంద్రం ఏర్పాటు చేయాలని, నర్సరీ రైతులకు ఉచిత విద్యుత్తు అందించాలని, లంక గ్రామాల్లో కోతలను అరికట్టేందుకు గ్రోయిన్లు నిర్మించాలని, కాటవరం, చాగల్నాడు. కలవచర్ల ఎత్తిపోతల పథకాలు నిర్మించాలని, ర్యాలీ గ్రామంలో ప్రభుత్వ జూనియర్‌ కళాశాల ఏర్పాటు చేయాలని, జగ్గంపేటలో 30 పడకల ఆసుపత్రి నిర్మించాలని, కాకినాడ స్మార్ట్‌ సిటీ అభివృద్ధికి సంబంధించి శ్వేతపత్రం విడుదల చేయాలని, ధాన్యం కొనుగోలు కేంద్రాల్లోనూ, మండపేట ఇళ్ల నిర్మాణాల్లో జరిగే అక్రమాలపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని, మత్స్యకారుల సమస్యల పరిష్కారానికి తక్షణమే స్పందించాలని, టెండర్లు లేకుండా నామినేష¯Œ  పద్ధతుల్లో చేపడుతున్న పనులు రద్దు చేయాలని, బీసీల అభివృద్ధిపైన టీడీపీ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని, తక్షణమే సానుకూలంగా స్పందించాలంటూ తదితర డిమాండ్లు చేశారు. దివీస్‌ పరిశ్రమకు వ్యతిరేకంగా పోరాడుతున్న ప్రజలకు అండగా ఉంటామని తెలిపారు. వీటికి జాతీయ ప్లీనరీలో ఆమోదం తెలపాలని నాయకులను కోరారు. 

రిలయన్స్‌ కోసం తీసుకున్న భూములు తిరిగి ఇప్పించాలి
– నెల్లూరు జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్‌రెడ్డి

నెల్లూరు జిల్లా పార్టీ అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్  రెడ్డి జిల్లాకు సంబంధించిన కీలక అంశాలపై పార్టీ అధినేత, ప్రధాన ప్రతిపక్ష నేత వైయస్ జగన్  సమక్షంలో జాతీయ ప్లీనరీలో తీర్మానాలు ప్రవేశపెట్టారు. జిల్లాలోని 10 నియోజకవర్గాల్లో గల ప్రధాన సమస్యలను తీర్మానాల జాబితాలో చేర్చారు. 
– సంగం–నెల్లూరు బ్యారేజి పనులు పూర్తి చేయాలని, మెట్ట ప్రాంతాలకు నీరివ్వాలని తీర్మానం ప్రవేశపెట్టనున్నారు. రిలయ¯Œ ్స థర్మల్‌ విద్యుత్‌ ప్రాజెక్ట్‌ కోసం తీసుకున్న వేలాది ఎకరాల భూములను రైతులకు తిరిగి అప్పగించాలని, దుగ్గరాజపట్నం, రామాయపట్నం పోర్టు పనులను వెంటనే ప్రారంభించి సకాలంలో పూర్తి చేయాలని, సోమశిల హైలెవల్‌ కెనాల్‌ పనులను పూర్తి చేయాలని, కోవూరు చక్కెర కర్మాగారాన్ని తక్షణమే తెరిచి, రైతులకు బకాయిలు చెల్లించాలనే డిమాండ్లను తీర్మాణాలుగా ప్రవేశపెట్టారు. 
– పులికాట్‌ సరస్సు ముఖ ద్వారంలో పూడిక తొలగింపు పనులు పూర్తి చేయాలని, సోమశిల, స్వర్ణముఖి లింక్‌ కెనాల్‌ పనులు పూర్తి చేయాలని, రూ.110 కోట్ల ఆర్థిక భారం నుంచి నెల్లూరు నగరపాలక సంస్థను గట్టెక్కించాలని, నడికుడి–కాళహస్తి రైల్వేలై¯Œ  పనులు పూర్తి చేయాలనే తదితర డిమాండ్లతో కూడిన తీర్మానాలను ప్లీనరీ ముందుంచారు. 

ఉద్దానం కిడ్నీ సమస్యలకు పరిష్కారం చూపాలి
శ్రీకాకుళం జిల్లా అధ్యక్షురాలు రెడ్డి శాంతి

టీడీపీ మూడేళ్ల పాలనలో శ్రీకాకుళం జిల్లాలో అన్ని వర్గాలవారు తీవ్ర అగచాట్లు పడుతున్నారని వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ జిల్లా అధ్యక్షురాలు రెడ్డి శాంతి తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీ అధినేత  ఆదేశాలనుసారం జిల్లా సమస్యలపై ఆరు తీర్మానాలను ప్లీనరీలో ప్రవేశపెట్టారు. 
– ముందుకు సాగని సాగునీటి ప్రాజెక్టుల పనులు, అప్పుల సహా రైతుల కష్టాలు, కిడ్నీ రోగుల ఆవేదన, మత్స్యకారుల సమస్యలు, గిరిజనులకు దూరమైన సంక్షేమం, చేనేతకారుల ఇబ్బందులను ఈ తీర్మానాల ద్వారా ప్రస్తావించారు. ఇప్పటికైనా చంద్రబాబు ప్రభుత్వం వాటన్నింటినీ పరిష్కరించాలని డిమాండ్‌ చేశారు.        
– దివంగత ముఖ్యమంత్రి వైయస్సార్‌ తలపెట్టిన  వంశధార ఫేజ్‌–2 ప్రాజెక్టు, ఆఫ్‌షోర్‌ ప్రాజెక్టు పనులతో పాటు మడ్డువలస, నారాయణపురం ఆనకట్టల ఆధునికీకరణ పూర్తి చేయాలని టీడీపీ ప్రభుత్వాన్ని డిమాండు చేశారు. జిల్లాలో మూడు లక్షల మంది మత్స్యకారుల పరిస్థితి నడిసంద్రంలో నావలా మారిందన్నారు. వారికి మరపడవలు, వలలు ఇస్తామని, కోల్డ్‌ స్టోరేజ్‌లు, జెట్టీలు నిర్మిస్తామని, 50 సంవత్సరాలకే పింఛను ఇస్తామని చంద్రబాబు పలు హామీలు ఇచ్చారని గుర్తు చేశారు. అంతేకాదు వారి సమస్యలపై చట్టసభలో వినిపించేందుకు వీలుగా ఒకరికి ఎమ్మెల్సీగా అవకాశం ఇస్తామని నమ్మించి మోసం చేశారని విమర్శించారు. ఉద్దానం ప్రాంతంలో 1.50 లక్షల మంది కారణం తెలియని కిడ్నీ రోగం బారిన పడ్డారని, వారిని ఆదుకునేందుకు శాశ్వత చర్యలు గాకుండా కంటితుడుపు చర్యలకే పరిమితమైందన్నారు. జిల్లాలో రెండు లక్షల మంది గిరిజనులకు సంక్షేమానికి వినియోగించాల్సిన సబ్‌ప్లా¯Œ  నిధులు పక్కదారి పట్టాయని చెప్పారు.
దాదాపు 300 గిరిజన గ్రామాలకు రోడ్డు సౌకర్యమే లేదన్నారు. రక్షిత తాగునీరు, సకాలంలో వైద్యం అందట్లేదన్నారు. ఇప్పటికీ చలమల్లో బురదనీరే గతి అవుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లాలో మరో 50 వేల చేనేత కుటుంబాలు దీనావస్థలో ఉన్నాయని చెప్పారు. సిక్కోలు బ్రాండ్‌ పొందూరు ఖద్దరు ప్రపంచ ప్రసిద్ధి పొందినా ఆ పరిశ్రమపై ఆధారపడిన వారి సంక్షేమానికి టీడీపీ ప్రభుత్వం ఎలాంటి చర్యలూ తీసుకోలదన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో వైఎస్‌ జగ¯Œ ను తామంతా భగవంతుడు పంపిన దూతగా భావిస్తున్నామని, ఆయన ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత రాజశేఖరరెడ్డి మాదిరిగా జిల్లాను అన్ని రంగాల్లోనూ అభివద్ధి చేస్తారని రెడ్డి శాంతి ఆశాభావం వ్యక్తం చేశారు.

విశాఖ భూకబ్జాపై విచారణ చేపట్టాలి
విశాఖ జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్‌నాథ్‌

ముఖ్యమంత్రి చంద్రబాబు, ఆయన తనయుడు లోకేష్‌తో సహా అధికార పార్టీ మంత్రులు, ప్రజాప్రతినిధులు గడిచిన మూడేళ్లుగా విశాఖ జిల్లాను దోచుకుతింటున్నారని వైయస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్‌నాథ్‌ ఆరోపించారు. సంచలనం సృష్టించిన విశాఖ భూ కుంభకోణంపై సీబీఐ విచారణ వేసి తీరాల్సిందేనని ఆయన డిమాండ్‌ చేశారు. ఎంతో సుందరమైన విశాఖను నేడు భూ కబ్జాలు, భూ దందాలు, సెటిల్‌మెంట్స్‌ కేంద్రంగా మార్చేశారని ఆరోపించారు.
– లక్షల కోట్ల విలువైన భూములను కబ్జా చేయడమే కాకుండా ప్రభుత్వ భూముల రికార్డులను ట్యాంపరింగ్‌ చేసి కాజేస్తున్నారన్నారు. ఈ కుంభకోణంపై వైఎస్సార్‌సీపీ అలుపెరగని పోరాటం చేస్తోందన్నారు. 
– ఎంపీ విజయ సాయిరెడ్డి ఆధ్వర్యంలో అఖిలపక్షం ముదుపాక భూములను పరిశీలించి భూ బాధితులకు అండగా నిలిచిందన్నారు.
–  సేవ్‌ విశాఖ అంటూ విశాఖలో నిర్వహించిన మహాధర్నాలో పార్టీ అధ్యక్షులు వైఎస్‌ జగ¯Œ మోహ¯Œ రెడ్డి పాల్గొని భూ బాధితులకు భరోసా కల్పించారన్నారు. 
– ఈ కుంభకోణం వెనుక అధికార పార్టీ మంత్రులు, ప్రజాప్రతినిధుల హస్తం ఉన్నందున సిట్‌ విచారణను తక్షణమే నిలిపివేసి సీబీఐ దర్యాప్తు చేయించా లని ప్లీనరీలో తీర్మానం ప్రవేశపెడుతున్నట్టు అమర్‌నాథ్‌ ప్రకటించారు.

గిరిజన యూనివర్శిటీ, వైద్య కళాశాల ఏర్పాటు చేయాలి
 విజయనగరం జిల్లా అధ్యక్షుడు బెల్లాన చంద్రశేఖర్‌ విజ్ఞప్తి

‘ఇంకా మా జిల్లా వెనుకబడే ఉంది. 1979లో జిల్లా ఏర్పాటు అయినా ఎటువంటి అభివృద్ధికి నోచుకోలేదు. వైయస్ జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత మా సమస్యలన్నీ తీర్చాలి’ అని వైయస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు బెల్లాన చంద్రశేఖర్‌ అన్నారు. గుంటూరు నాగార్జున యూనివర్సిటీ ఎదురుగా జరుగుతున్న పార్టీ జాతీయ ప్లీనరీ వేదికపై జిల్లాకు సంబంధించి పలు అంశాలను శనివారం ఆయన ప్రస్తావించారు. జిల్లాలో 9 నియోజకవర్గాలకు సంబంధించి ఆరు అంశాలపై తీర్మానం చేశారు. జిల్లా ప్లీనరీలో చేసి న తీర్మానాలను జాతీయ ప్లీనరీలో ప్రవేశపెట్టేందుకు అవకాశం కల్పించిన పార్టీ అధినేతకు తొలుత ఆయన కృతజ్ఞతలు తెలిపారు.

 గిరిజన వర్శిటీకి తొలి ప్రాధాన్యం
వైయస్సార్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన వెంటనే విజయనగరం జిల్లాలో గిరిజన యూనివర్సిటీని ఏర్పాటు చేయాలని బెల్లాన కోరారు. జిల్లా ప్రధాన కేంద్రమైన విజయనగరం పట్టణంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఇంత వరకూ లేదనీ... 2004–2009 లో దివంగత ముఖ్యమంత్రి  వైఎస్‌ రాజశేఖరరెడ్డి హయాంలో వర్షాధారం మీద, చెరువుల మీద ఆధారపడ్డ రైతాంగానికి తోటపల్లి కాలువ, రామతీర్థసాగర్‌లకు నిధులు కేటాయించారని తోటపల్లి పనులు 90శాతం పూర్తి చేశారని కానీ ప్రస్తుత తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పాటై మూడేళ్లయినా మిగతా 10 శాతం పనులూ పూర్తికాలేదన్నారు. తోటపల్లి ప్రాజెక్టును పూర్తి చేసి రైతులకు సాగునీటి సమస్య లేకుండా చేయాలని కోరారు. జిల్లాలో 8 మండలాలు గిరిజన ప్రాంతాల్లో ఉన్నాయని, వారికి వైద్యం అందుబాటులో లేదన్నారు. వీరికి వైద్య సౌకర్యాలు అందుబాటులోకి తీసుకు వచ్చేలా వైద్య కళాశాలను జిల్లాలో ఏర్పాటు చేయాలని కోరారు.
హోదాతోనే భవిత
ఉత్తరాంధ్ర వెనుకబాటు తనంతో ఉందనీ... ప్రత్యేక హోదా వల్ల విద్యార్థులకు, యువతకు ఉద్యోగ అవకాశాలు వచ్చే అవకాశం ఉందని, మూతపడిన పరిశ్రమలు తెరిపించే అవకాశం ఉంటుందని ప్లీనరీ వృష్టికి తీసుకొచ్చారు. 

జగన్‌ సీఎం అయితేనే పోలవరం పూర్తి
పశ్చిమ గోదావరి జిల్లా అధ్యక్షుడు ఆళ్ల నాని 
వైయస్ జగన్ ముఖ్యమంత్రి అయితేనే పోలవరం ప్రాజెక్ట్‌ నిర్మాణం పూర్తి అవుతుందని అన్నారు.  కమీషన్ల కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎంతకైనా దిగజారుతారన్నారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం నత్తనడకన సాగుతోందని విమర్శించారు.  ఈ సందర్భంగా ఆళ్ల నాని జిల్లాకు సంబంధించిన తీర్మానాలను ప్రవేశపెట్టారు.
–  రూ.16 వేల కోట్ల అంచనాలతో ఉన్న పోలవరం ప్రాజెక్టును రూ.40 వేల కోట్లకు పెంచి కమీషన్లు దండుకుంటున్నారని మండిపడ్డారు
– పోలవరం ప్రాజెక్ట్‌ అంచనాలను 16వేల కోట్ల నుంచి రూ.40వేల కోట్లకు పెంచారన్నారు. కొల్లేరు వాసుల సమస్యలను చంద్రబాబు ఇప్పటివరకూ పరిష్కరించలేదని, కాంటురు పరిధిని 5వ కాంటురు నుంచి 3వ కాంటురు తగ్గించాలన్నారు. చింతలపూడి ఎత్తిపోతల కోసం ముఖ్యమంత్రి ఒక్క అడుగు కూడా వేయలేదన్నారు. పోలీసులను అడ్డుపెట్టి ఆక్వా ఫ్యాక్టరీల నిర్మాణాలకు చంద్రబాబు కొమ్ముకాస్తున్నారని ఆళ్ల నాని ధ్వజమెత్తారు. తుందుర్‌ురలో ఆక్వా ఫ్యాక్టరీ నిర్మాణాన్ని వెంటనే ఆపాలని ఆయన డిమాండ్‌ చేశారు. 

నీచాతి నీచంగా చంద్రబాబు హామీలు
కర్నూలు జిల్లా అధ్యక్షుడు గౌరు వెంకటర్‌ రెడ్డి 
ఎన్నికల్లో గెలవడానికి ఎన్నో అబద్ధపు హామీలిచ్చిన చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తరువాత కూడా అనేక తప్పుడు హామీలు ఇస్తున్నాడని వైయస్‌ఆర్‌ సీపీ కర్నూలు జిల్లా అధ్యక్షుడు గౌరువెంకట్‌రెడ్డి అన్నారు. నీచాతి నీచంగా చంద్రబాబు హామీలు ఇస్తున్నాడని మండిపడ్డారు. డాక్టర్‌ వైయస్‌ రాజశేఖరరెడ్డి హయాంలో అనేక సంక్షేమాలు చేపట్టారని గుర్తు చేశారు. ప్రభుత్వ నిర్లక్ష్యంతో కర్నూలు జిల్లాలో సాగు కుంటుపడిందన్నారు. తాగునీరు లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారన్నారు. జిల్లాలో అనేక ప్రభుత్వ స్థలాలు ఉన్నాయని వాటిలో పరిశ్రమలు ఏర్పాటు చేయాలన్నారు. అదే విధంగా ప్రత్యేక హోదా సాధన కోసం జననేత వెంట పోరాడేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. 
––––––––––––
పులిచింతల ఫలాలు రైతులకు అందడం లేదు
గుంటూరు జిల్లా తీర్మానాలు చదివిన లేళ్ల అప్పిరెడ్డి

దివంగత నేత వైయస్‌ఆర్‌ చలువతో పులిచింతల పనులు ప్రారంభమయ్యాయి. ఆయన హయాంలోనే ఆ ప్రాజెక్టు పూర్తయ్యింది. కానీ దురదృష్టవశాత్తు రాష్ట్రంలోని తెలుగుదేశం ప్రభుత్వం తెలంగాణ ప్రాంతానికి, రైతాంగానికి కట్టాల్సిన నష్టపరిహారం కట్టకపోవడంతో 45 టీఎంసీల నీటిని నిల్వ చేసుకునే అవకాశం ఉన్నా.. అలాంటి పరిస్థితులు లేకపోవడం ఏపీ రైతాంగం చేసుకున్న దురదష్టం. ఇప్పటికైనా పరిహారం చెల్లించి రైతులకు నీటిని ఇప్పించాలి. 
2. నాగార్జున సాగర్‌ ప్రాజెక్టుకు సంబంధించి కుడికాల్వలో గుంటూరు, ప్రకాశం జిల్లా రైతాంగానికి తాగు, సాగు నీరు అందించేది. మూడు సంవత్సరాల నుంచి నీరందండం లేదు. వెంటనే కుడి కాల్వ నుంచి నీటిని రైతాంగానికి అందించాలి. 
–––––––––––––––
వెలిగొండ ప్రాజెక్టు పూర్తిచేయాలి
ప్రకాశం జిల్లా అధ్యక్షుడు బాలినేని శ్రీనివాస్ రెడ్డి
1. మహానేత వైయస్‌ రాజశేఖరరెడ్డి హాయాంలో వెలుగుగొండ ప్రాజెక్టు కోసం రూ. 16 వందల కోట్లు ఖర్చు చేశారని గుర్తు చేశారు. ప్రస్తుతం చంద్రబాబు పరిపాలనలో ప్రాజెక్టును పట్టించునే నాధుడే కరవయ్యాడన్నారు. వెలుగొండ ప్రాజెక్టు పూర్తి వైయస్‌ జగన్ తోనే సాధ్యమన్నారు. 
2. జిల్లాకు రామయ్యపట్నం పోర్టు వస్తుందని ఆశించాం. నెల్లూరు జిల్లా దుగ్గిరాజుపట్నానికి ట్రాన్స్ ఫర్‌ చేశారు. కొన్ని కారణాలతో నెల్లూరు జిల్లాలో కూడా రద్దు అయ్యిందని, రామయ్యపట్నం పోర్టును ప్రకాశం జిల్లాకు కేటాయించే విధంగా తీర్మానం చేశామన్నారు. పోర్టు వస్తే జిల్లాలో ఉద్యోగ అవకాశాలు, ఇండస్ట్రీలు వస్తాయన్నారు. అదే విధంగా ప్రకాశం జిల్లాను వెనుకబడిన జిల్లాగా గుర్తించాలన్నారు. 
3. దొనకొండ ప్రాంతంలో ఇండస్ట్రీ కారిడర్‌ అని ప్రభుత్వం ప్రకటించింది .కానీ ఇప్పటి వరకు ఒక్క పరిశ్రమ వచ్చిన పాపాన పోలేదన్నారు. దొనకొండ అభివద్ధి వైయస్‌ జగన్ తోనే సాధ్యమని ప్రజలంతా పూర్తి విశ్వాసంతో ఉన్నారన్నారు.   

కృష్ణా జిల్లా తీర్మాణాలు...
చంద్రబాబుది దుష్ట పరిపాలన
కృష్ణా జిల్లా అధ్యక్షుడు పార్ధసారథి
మహాభారతంలో  దుష్ట దుర్యోధనుడుకు వెన్నుపోటు దారుడైన చంద్రబాబుకు దగ్గరి సారూప్యం ఉంది. ఆనాడు మాయజూదంతో ఏవిధంగా అధికారం చేజిక్కుంచున్నారో ఇక్కడ కూడా అలవి కాని హామీలతో బాబు అధికారంలోకి వచ్చిన సంగతి మన అందరికీ తెలుసు. ప్రజల సంక్షేమాన్ని పక్కకు బెట్టి, రాష్ట్రాన్ని సింగపూర్‌  రాబంధులకు అప్పగించి, ప్రతిపక్షాన్ని అణచివేసే కుట్రపూరరిత చర్చలు తప్ప మరోటి చేసిందేమీ లేదు. అధికారంలోకి వచ్చిన  తరువాత వైయస్సార్‌ సిపికి చెందిన 17 మందిని పొట్టన పెట్టుకున్నారన్నారు. 
ప్రవేశపెట్టిన తీర్మాణాలు.. 
– కృష్ణా జిల్లాలో రైతులకు ఇన్‌పుట్‌ సబ్సిడీ బకాయిలున్నాయి.
– సుబాబుల్‌ పంట 4 వేలకు పెంచాము, ఈ రోజును వాటిని కొనే దిక్కు లేకున్నా, చేష్టలుడిగి కూర్చింది. 
– అన్ని పంటలకు గిట్టుబాటు ధరలు కల్పించాలి.
– విజయవాడలో ఇళ్ల కోసం స్థల కొరత ఉంది. దానిని తీర్చాలి. 
– విజయవాడంలోస్వచ్ఛ భారత్‌ అంటున్నారు. డంపింగ్‌ యార్డును  తరలించాలి. 

Home  |  News  |  Downloads  |  Gallery  |  Contact Us  |   Sitemap  

Official Website of YSR Congress Party
Copyright © 2011 ysrcongress.com