Ysrcpnettv
YSR Congress Party Twitter YS Jagna Twitter

YSR Congress

Flash News >>>>
             బీజేపీ, టీడీపీల‌కు కాంగ్రెస్ గ‌తే ప‌డుతుంది: అంబ‌టి రాంబాబు                               హజీజ్‌పురం గ్రామంలో పొగాకు రైతులు వైయ‌స్ జ‌గ‌న్‌ను కలిసి వారి సమస్యలను చెప్పుకున్నారు.                               రామపురంలో దివ్యాంగులు వైయ‌స్ జ‌గ‌న్‌ను క‌లిసి త‌మ స‌మ‌స్య‌లు చెప్పుకున్నారు.                                వైయ‌స్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు వైయ‌స్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర 95వ రోజు పెద్దఅలవలపాడు శివారు నుంచి ప్రారంభ‌మైంది.                               క‌నిగిరి నియోజ‌క‌వ‌ర్గంలోకి ప్ర‌వేశించిన ప్ర‌జా సంక‌ల్ప యాత్ర‌..వైయ‌స్ జ‌గ‌న్‌కు ఘ‌న స్వాగ‌తం                               ప్ర‌త్యేక హోదా రాక‌పోవ‌డానికి చంద్ర‌బాబు విల‌న్ నంబ‌ర్ వ‌న్‌: వైయ‌స్ఆర్‌సీపీ అధికార ప్ర‌తినిధి పార్థ‌సార‌ధి                               కె. అగ్ర‌హారంలో వైయ‌స్ జ‌గ‌న్‌కు ఘ‌న స్వాగ‌తం                               ఎవ‌రు ముందుకు వ‌చ్చినా.. రాక‌పోయినా తాము మాత్రం కేంద్ర ప్ర‌భుత్వంపై మార్చి 21న అవిశ్వాస తీర్మానం పెడ‌తాం: వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియ‌ర్ నాయ‌కుడు పెద్దిరెడ్డి రామ‌చంద్రారెడ్డి                                చెరువుకొమ్ముపాలెం చేరుకున్న వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి                 
    Show Latest News
ప్రత్యేక హోదా ఏపీకి సంజీవనే

Published on : 03-Apr-2017 | 17:02
 

చంద్రబాబు అధికారంలోకి వచ్చి మూడేళ్లు కావొస్తోంది. ఈ మూడేళ్లలో రాష్ట్రానికి ఎన్ని పరిశ్రమలు వచ్చాయి.. ఎంతమందికి ఉద్యోగాలు వచ్చాయనేది ఎవరికీ ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదు. మీ ఇంట్లోనో.. మీ ఊర్లోనో.. మీకు తెలిసిన వాళ్లకో ఉద్యోగాలు వచ్చాయో లేదో తెలుసుకుంటే సరిపోతుంది. విశాఖలో జరిగిన భాగస్వామ్య సదస్సులు, దావోస్‌లో చంద్రబాబు హాజరైన తోటకూర పప్పు మీటింగ్‌లతో మనకు వంద ఉద్యోగాలు కూడా రాలేదని ఆర్టీఐ చట్టం ద్వారానే తెలిసింది. ఇలాంటి పరిస్థితుల్లో ఏపీకి ప్రత్యేక హోదా ఉండి ఉంటే లక్షల్లో ఉద్యోగాలు లభించేవన్నది వాస్తవం. ఇది మాటల్లో చెప్పేది కాదు.. ప్రత్యేక హోదా ఉన్న ఉత్తరాఖండ్, హిమాచల్‌ ప్రదేశ్‌ రాష్ట్రాల్లో జరిగే వృద్ధిని చూస్తేనే సరిపోతోంది. ప్రత్యేక హోదా ఏమన్నా సంజీవనా అని ప్రశ్నించే చంద్రబాబు ఎన్నికలకు ముందు ప్రత్యేక హోదా సాధిస్తామని మోడీతో కలిసి ఎందుకు ఓట్లడిగారు. ప్యాకేజీతోనే అన్నీ సమకూరేటట్టయితే వెంకయ్య నాయుడు పదేళ్లు కాదు పదిహేనేళ్లు కావాలని ఎందుకు డిమాండ్‌ చేసినట్టు. అంటే పార్లమెంట్‌ సాక్షిగా ఐదున్నర కోట్ల మందికి ఒక ప్రధాన మంత్రి ఇచ్చిన హామీకి దిక్కులేదా..? తిరుపతి వెంకన్న సాక్షిగా ఇప్పటి ప్రధాన మంత్రి మోడీ, ముఖ్యమంత్రి చంద్రబాబు ఇచ్చిన హామీ గెలిచాక పనైపోయిందిలే.. జనాలు ఏం చేస్తారులే అనుకుంటున్నారా..? ప్రత్యేక హోదా ఇవ్వడానికి చట్టాలు అడ్డొస్తున్నాయని చెప్పుకుంటున్న వెంకయ్య, చంద్రబాబులు నియోజకవర్గాల పునర్విభజన కోసం ఎందుకు పట్టుబడుతున్నట్లు. పునర్విభజన జరగదని కేంద్ర మంత్రి రాతపూర్వకంగా రాసిచ్చినా రాజ్యాంగ సవరణలు, సెక్షన్‌ల మార్పు చేస్తే సరిపోతుందని పచ్చ పత్రికల్లో ఎందుకు రాయించుకుంటున్నారు. ఆ సవరణలేవో ప్రత్యేక హోదా కోసం చేయిస్తే సరిపోతుంది కదా. పోనీ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కంటే నియోజకవర్గాల పునర్విభజన అతి ముఖ్యమైన అంశమా..? 


ప్రత్యేక హోదా వలన ఏపీకే కాకుండా సామాన్యుడికి కలిగే ప్రయోజనాలు చూద్దాం.. 

–  ఐదున్నర కోట్ల ప్రజానీకంతో 972 కి.మీ. సముద్రతీరం ఉన్న ఆంధ్రప్రదేశ్‌ కు ప్రత్యేక హోదా లభిస్తే అది పెద్ద సంజీవనే అవుతుంది.
– ప్రత్యేక హోదా ఉన్న రాష్ట్రాలకు కేంద్ర నిధులు 90 శాతం గ్రాంట్లు గాను, 10 శాతం అప్పుగాను వస్తాయి. గ్రాంట్ల ద్వారా వచ్చిన సొమ్మును తిరిగి చెల్లించనక్కర్లేదు. 
– పరిశ్రమలకు భారీగా రాయితీలిస్తారు. 100 శాతం ఎక్సైజ్‌ డ్యూటీ మినహాయింపు లభిస్తుంది. ఇన్‌కమ్‌ ట్యాక్స్‌లో కూడా 100 శాతం రాయితీ ఉంటుంది. పన్ను మినహాయింపులు, రీయింబర్స్‌ మెంట్‌లు దక్కితే... పారిశ్రామికవేత్తలు రెక్కలు కట్టుకొని వచ్చి వాలిపోతారు. 
–  ప్రత్యేక హోదాతో పెద్ద సంఖ్యలో పరిశ్రమలు వస్తాయి. లక్షల సంఖ్యలో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు స్థానిక యువత దక్కుతాయి.
– యువత కూడా స్మాల్‌ స్కేల్‌ ఇండ్రíస్టీలు నెలకొల్పి ఉద్యోగాలిచ్చే స్థాయికి ఎదుగుతారు. ఇలాంటి పరిశ్రమలతోనే రాష్ట్రాభివృద్ధి వేగంగా జరుగుతుందని మేధావులు చెబుతున్నారు. 
– ప్రత్యేకహోదా పొందిన ఉత్తరాఖాండ్‌ రాష్ట్రంలో 2 వేల పరిశ్రమలు వచ్చాయి. తద్వారా ఉపాధి అవకాశాలు 490 శాతం పెరిగాయి. 
– ఆంధ్ర ప్రదేశ్‌ కంటే వెనకబడిన రాష్ట్రమైన హిమాచల్‌ ప్రదేశ్‌ కు ప్రత్యేకహోదా వల్ల 10 వేల పరిశ్రమలు వచ్చాయి. 

– ప్రత్యేకహోదాతో ఏపీలోని 13 జిల్లాలు సరిసమానంగా అభివృద్ధి చెందుతాయి. ముఖ్యంగా రాయలసీయ, ఉత్తరాంధ్ర జిల్లాలు ఆర్థికంగా మెరుగుపడతాయి. పక్క రాష్ట్రాలకు వలస పోయే పరిస్థితికి ఫుల్‌స్టాప్‌ పెట్టవచ్చు. 
–  పన్నురాయితీలు, ప్రోత్సాహకాల వల్ల మనం కొనుగోలు చేస్తున్న అనేక వస్తువుల ధరలు సగానికి తగ్గుతాయి.
– ప్రత్యేక హోదా వస్తే ఏపీకి కరెంటు సగం ధరకే 20 ఏళ్ల పాటు లభ్యమవుతుంది. 
–  ప్రత్యేక హోదా వల్ల రైతులకు కూడా అనేక ప్రయోజనాలు చేకూరుతాయి..ఇక వ్యవసాయానికి కావలసిన ట్రాక్టర్లు, పవర్‌ స్ప్రేయర్లు లాంటివి ఎస్సీ ఎస్టీ రైతులకి 50శాతం సబ్సిడీ, మిగిలిన రైతులు లోను తీసుకుంటే 90 శాతం వడ్డీ మినహాయింపుతోపాటు 10శాతం గ్రాంట్‌ ఇస్తుంది. 

సాక్ష్యాలివిగో..
టీడీపీ ఎంపీ సుజనాచౌదరి స్వయానా ఈ రాయితీలను చూపి ఉత్తరాఖండ్‌లో యూనివర్సల్‌ ప్లాంట్‌ ఏర్పాటు చేశారు. పారిశ్రామిక వేత్తగా వుండి ఎంపీ అయిన గల్లా జయదేవ్‌ కూడా ఉత్తరాఖండ్‌లో తమ అమరరాజా బ్యాటరీస్‌ కోసం స్థలం కొన్నారే? అదే చోట శివశక్తి బయోప్లాంటెక్‌ యూనిట్‌ పెట్టారు. ఇంకో ఎంపీ సీఎం రమేష్‌ రాయతీలున్నాయనే కదా ఈశాన్య రాష్ట్రాల్లో విద్యుత్‌ ప్లాంట్‌ నెలకొల్పారు. 

ప్రత్యేక హోదాతో ఇన్ని లాభాలున్నాయని తెలిసినా చంద్రబాబు ప్రభుత్వం మాత్రం కేంద్రం ఇచ్చే ప్యాకేజీకి అంగీకరిచింది. అయితే ప్రత్యేక ప్యాకేజీ నాయకుల జేబుల్లోకి వెళ్లేది తప్ప దానివలన సామాన్య ప్రజలకు ప్రయోజనం ఏమాత్రం ఉండదనేది అందరికీ తెలిసిన వాస్తవం. ప్రత్యేక హోదా సంజీవని అయితే.. ప్యాకేజీ మాత్రం ఐసు గడ్డ సామెతను గుర్తుకు తెస్తుంది. కేంద్రం ఇచ్చే ప్యాకేజీ చేతులు మారి చివరికి మిగిలేది నోటి బొట్టు మాత్రమే. ఒకవేళ ఇక్కడికి ఎంఎన్‌సీ కంపెనీలొచ్చినా దాని హెడ్‌ ఆఫీస్‌ ఉండే చోటనే వారు ట్యాక్సులు కడతారు. సో.. ప్రభుత్వానికి ఒరిగేది శూన్యం. ఉద్యోగాలు కూడా స్థానికులకే ఇస్తారన్న గ్యారంటీ లేదు. 
Labels : special status, ap, tdp, bjp

సంబంధిత వార్తలు

Home  |  News  |  Downloads  |  Gallery  |  Contact Us  |   Sitemap  

Official Website of YSR Congress Party
Copyright © 2011 ysrcongress.com