Ysrcpnettv
YSR Congress Party Twitter YS Jagna Twitter

YSR Congress

Flash News >>>>
             కొయ్యాన‌పేట నుంచి వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి 296వ రోజు ప్ర‌జా సంక‌ల్ప యాత్ర ప్రారంభం                               నాలుగేళ్లుగా దళితుల సమస్యలపై చంద్రబాబు స్పందించలేదని, ఎన్నికలకు 6 నెలల ముందు ఎస్టీలకు మంత్రి పదవి ఇచ్చారు: టీజేఆర్ సుధాక‌ర్‌బాబు                               వైయ‌స్ జ‌గ‌న్ స‌మ‌క్షంలో రాజ‌మండ్రికి చెందిన బీసీ సంఘం రాష్ట్ర అధ్య‌క్షుడు మార్గాని నాగేశ్వ‌ర‌రావు, భ‌ర‌త్ వైయ‌స్ఆర్ సీపీలో చేరిక‌                               కేంద్ర మంత్రి అనంత్‌కుమార్ మృతికి వైయ‌స్ జ‌గ‌న్ సంతాపం                               వైయ‌స్‌ జగన్ ప్ర‌జా సంక‌ల్ప యాత్ర 295వ రోజు సాలూరు నియోజకవర్గం, పాయకపాడు నుంచి ప్రారంభం                               వైయ‌స్ జగన్ ప్ర‌జా సంక‌ల్ప యాత్ర‌ పున:ప్రారంభం                               చంద్రబాబు ముందు రాష్ట్రం సంగతి చూడు.. తర్వాత దక్షిణాది రాష్ట్రాల పర్యటన చేద్దువు: ఎస్సీ సెల్‌ రాష్ట్ర అధ్యక్షుడు మేరుగ నాగార్జున                                వైయ‌స్‌ జగన్‌పై హత్యాయత్నంలో కుట్ర ఉంది.. ఏపీ ప్రభుత్వం, పోలీసుల అజమాయిషీ లేని విచారణ సంస్థల చేత దర్యాప్తు జరిపించాలి: వైయ‌స్‌ జగన్‌ తరపు న్యాయవాది                               కత్తి మెడపై తగిలి ఉంటే వైయ‌స్‌ జగన్‌ ప్రాణాలే పోయి ఉండేవి: వైయ‌స్‌ జగన్‌ తరపు న్యాయవాది ఆందోళన                  
    Show Latest News
తిరిగొచ్చినరోజు

Published on : 14-May-2018 | 23:13
 


ఏలూరు నేడో చారిత్రక ఆనవాలు. ప్రజా నాయకుల లక్షణాలకు లక్షణమైన రుజువుగా నిలిచిన నగరం. ఓ కుటుంబం, రాష్ట్రాన్నే తన కుటుంబంగా భావించి, తమ కష్టాలను కూడా లెక్క చేయకుండా ప్రజల కోసం నడిచిన చరిత్రను గుర్తు చేసే అపురూప ఘట్టం. నాడు షర్మిల, నేడు వైఎస్ జగన్...ఇద్దరూ ఆ రాజన్న ముద్దుబిడ్డలు. తండ్రిలాగే ఆ పిల్లలిద్దరూ కూడా తమ అడుగులను జనం వేపే వేసారు. ఎన్ని కష్టాలకోర్చైనా సరే అక్రమాలను, అన్యాయాలను ఎదిరించారు.

నాటి చరిత్ర

2013 మే నెలలో ఇదే ఏలూరు లో వైయస్ రాజశేఖర్ రెడ్డి కుమార్తె, వైయస్ జగన్ సోదరి షర్మిల మరో ప్రజాప్రస్థానం 2000కిలో మీటర్ల మైలు రాయిని చేరుకుంది. ప్రజలతో మమేకం అవుతూ, వారి గోడు వింటూ, నాటి కాంగ్రెస్ సర్కార్ తో అంటకాగుతూ టిడిపి సాగిస్తున్న కుట్రల రాజకీయాలను ఎండగడుతూ సాగిన షర్మిల పాదయాత్రను ప్రజలు జ్ఞాపకం చేసుకుంటున్నారు. ప్రజా సమస్యల పై సమరశంఖం పూరిస్తూ ఓ మహిళ పాదయాత్ర చేయడం, అందులోనూ 2000కిలోమీటర్లు విరామం లేకుండా నడవడం చూసి దేశమే విస్తుపోయింది.ఏలూరు కామవరపుకోట మండలం రావికంపాడులో 2000కిలోమీటర్ల పాదయాత్ర ఘట్టానికి జ్ఞాపికగా24 అడుగుల వైయస్  విగ్రహాన్ని ఆవిష్కరించారు.మహా రక్తదాన శిబిరాన్నినిర్వహించారు.ఆ నాడు ఏలూరు ప్రజలనే కాదు, పశ్చిమ గోదావరి వాసులనే కాదు, యావత్ఆంధ్రరాష్ట్రాన్నిఉద్దేశించి షర్మిల చేసిన ప్రసంగం ఓ యువతి ఆత్మ విశ్వపు బావుటా లా వేదిక పై రెపరెపలాడింది. ‘నేనురాజన్నకూతుర్ని, జగనన్నచెల్లెల్ని, ఇడుపులపాయలోనాన్నగారి సాక్షిగా మొదలు పెట్టిన ఈ పాదయాత్ర వినోదమో, విహారమోకాదు,నిరసనయాత్ర. అన్నివర్గాలనూవంచిస్తున్న కిరణ్ సర్కార్, ప్రజాపక్షాన ఉండాల్సిన ప్రతిపక్షంలో ఉండి ప్రభుత్వంతో కుమ్మక్కైన చంద్రబాబుకు వ్యతిరేకంగా జరుగుతున్న యాత్ర అంటూ రాజన్న కుమార్తె చేసిన ఉద్వేగ భరిత ప్రసంగం ప్రశంసలందుకుంది. తాను జగనన్నవదిలినబాణాన్నని, వైయస్ఆర్ కుటుంబంపై పైకక్షకట్టి, జగనన్నను జైలుకు పంపినంత మాత్రాన అక్రమాలకు అడ్డులేకుండా పోదు, ఉదయించే సూర్యుణ్ణి ఆపలేరు, జగనన్నను ఎవరూ ఆపలేరు. అన్నవస్తారు…రాజన్నరాజ్యంతెస్తారు…మాపై, మా కుటుంబం పై అంతులేని అభిమానాన్ని కురిపిస్తున్న మీఅందరికీ శిరసువంచి నమస్కరిస్తున్నాను అంటూ ఆ అడపడుచు చేసిన ప్రసంగానికి గుండెలు బరువెక్కని తెలుగువారు లేరు. నాడు వైయస్ వారసురలిగా, వైయస్ జగన్ ప్రతినిధిగా  ప్రజా క్షేత్రంలో పాదయాత్ర చేసిన షర్మిల రగిలే ఓ అగ్నికణం.తన కుటుంబానికి జరిగిన అన్యాయం ఒకవైపు, అక్రమంగా కేసులు బనాయించి సోదరుడిని జైలుపాలు చేసిన ప్రభుత్వ కుతంత్రాలు మరోవైపు…అయినా అంతటి బాధను గుండెల్లో అదిమిపెట్టి, అందరి కోసం తానై నడిచింది ఆమె. పార్టీ అధినేత లేక, ప్రభుత్వ దమన నీతితో డీలాపడుతున్న పార్టీకి కొత్త ఊపిరి తెచ్చారు షర్మిల. తన పాదయాత్రతోనవజాతపార్టీలో పేరుకోబోతున్న నైరాశ్యాన్నిపటాపంచలు చేసారు. కొత్త ఉత్సాహాన్నితెచ్చారు.పార్టీ అధ్యక్షుడు దూరంగా ఉన్నా, ప్రజలకు ఎంతో దగ్గరగా ఉన్నాడనే విషయాన్నినిరూపించారు షర్మిల. కష్టాల్లో లక్ష్మణుడు రాముడి వెంట నడిచాడు, నేడు షర్మిల తన సోదరుడి ఛాయలా రాష్ట్రమంతా నడిచింది. వైఎస్కుటుంబంఅంటేప్రజాకుటుంబంఅనినిరూపించింది.

చరిత్ర పునరావృతం 

నేటికీ రాష్ట్రంలో పరిస్థితులు అలాగే ఉన్నాయి, నాడుకేంద్రంలో, రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ వైయస్ కుటుంబం పై కక్షకట్టింది. కాంగ్రెస్ తో  చేతులు కలిపిన ప్రధాన ప్రతిపక్షం టిడిపి వారికి వత్తాసు పలికింది.కిరణ్ సర్కార్ చేసే అక్రమాలపై చంద్రబాబు నోరెత్తడు. అసెంబ్లీసాక్షిగా ఈ రెండు పార్టీల ఒప్పందం బట్టబయలైంది కూడా. నేడు రాష్ట్రంలో చంద్రబాబు సర్కార్ ఉంది. కేంద్రంలోఉన్నఎన్ డిఎ సర్కార్ తో బాబు నిన్నటి దాకా మిత్రపక్షంగానే ఉన్నాడు. నాడు కుట్రల కోసం కాంగ్రెస్ ను వాడుకున్నట్టే, నేడు స్కాములు, అవినీతి, నిధుల కోసం ఎన్డీయెను వాడుకున్నాడు.రాష్ట్ర ప్రయోజనాలను ఢిల్లీగల్లీలో  పాతరేసేశాడు. రాష్ట్రాన్ని రావణకాష్టం చేసేసాడు. కుల రాజకీయాలు, దళితులపై దాడులు, పథకాలనునీరుగార్చడం, ప్రాజెక్టుల్లోకమీషన్లు, భూదందాలు, ఆక్రమణలు,నిధుల దోపిడీ ఒకటారెండా…నాటికంటే నాలుగు రెట్లు ఎక్కువ అవినీతి నేటి విభజన తర్వాతి ఆంధ్రప్రదేశ్ లో పెరిగిపోయింది. ఇలాంటి స్థితిలో ప్రజల మనో ధైర్యం సన్న గిల్లకుండా ఉండేదుకు, వారికి మంచి రోజులు, సుపరిపాలన వస్తాయనే నమ్మకాన్ని కలిగించేందుకు ప్రజాసంకల్పాన్ని సంకల్పించారు వైయస్ జగన్. ఆ మహత్తర నిర్ణయం కోట్లాది మంది తెలుగు వారి హృదయాలను గెలుచుకుంది. యువనేత అడుగులో అడుగయ్యేందుకు రాష్ట్రం అంతా ఉవ్విళ్లూరుతోంది. ఆయన అడుగు పెట్టేచోట అంతులేని ఆత్మవిశ్వాసం ప్రజల్లోకనిపిస్తోంది.అది ఆయువనేత కలిగించిన ధైర్యం.తమ కోసం ఓ నాయకుడున్నాడని, తమ కష్టం వింటాడని, కన్నీళ్లు తుడుస్తాడని, రేపు అండగా నిలుస్తాడని నమ్మే కోట్లాది ప్రజల గుండెచప్పుడు పాదయాత్ర అడుగుల సడిలో వినిపిస్తోంది.2000 కిలోమీటర్ల మైలురాయి కేవలం ఓ ప్రయాణ ఘట్టం మాత్రమే. ఇకపై సాగే ప్రజా సంకల్పం భవిష్యత్  రాజకీయ రణరంగాన్నిమలుపు తిప్పే మరోచరిత్రకు శ్రీకారం కావచ్చు. వైయస్ జగన్ ప్రతి అడుగూ ప్రజల వైపే…అధికారం అనేది ప్రజల సేవకు ఓ అవకాశం మాత్రమే అని నమ్మే ఆ యువనేత ప్రజాసంకల్పం దిగ్విజయంగా ముందుకు సాగాలని కోరుకుంటూ…జనం కోసం జగన్…జగన్ కోసం జనం…

 

సంబంధిత వార్తలు

Home  |  News  |  Downloads  |  Gallery  |  Contact Us  |   Sitemap  

Official Website of YSR Congress Party
Copyright © 2011 ysrcongress.com