Ysrcpnettv
YSR Congress Party Twitter YS Jagna Twitter

YSR Congress

Flash News >>>>
             పారాది నుంచి వైయ‌స్ జ‌గ‌న్ 290వ రోజు ప్ర‌జా సంక‌ల్ప యాత్ర ప్రారంభం                               గుంటూరు జిల్లా టీడీపీ మాజీ అధ్యక్షుడు మల్లాది శివన్నారాయణ, చిలకలూరిపేట టీడీపీ మాజీ అధ్యక్షుడు శివయ్య, జి.వెంకట్రావు, కె.కాంతారావులు వైయ‌స్ఆర్‌సీపీలో చేరిక‌                               దేశంలో, రాష్ట్రంలో ఇలాంటి అబద్ధపు ముఖ్యమంత్రి ఎక్కడా లేరని, గల్ఫ్‌ దేశాల్లో ఇలాంటి అబద్ధాల ముఖ్యమంత్రిని ఎప్పుడో ఉరి తీసేవారు: ఎమ్మెల్యే ర‌వీంద్ర‌నాథ్‌రెడ్డి                               చంద్రబాబు..నీకిదే ముఖ్యమంత్రిగా చివరి అవకాశం...నిన్ను దగ్గరగా గమనించిన మనిషిగా చెబుతున్నా: త‌మ్మినేని సీతారాం                               శ్రీకాకుళం ఉద్యమాల పురిటిగడ్డ...ఎంతమందిపై కేసులు పెడతావ్. : త‌మ్మినేని సీతారాం                               నీళ్లో రామచంద్ర అని అడుగుతున్నవారికి వారి దాహార్తి తీరుస్తారే కాని వారిని సైతం బుల్డోజర్‌ తో తొక్కిస్తా అని అనగల ధైర్యం చంద్రబాబుకే ఉంది: భూమ‌న క‌రుణాక‌ర్‌రెడ్డి                               వైయ‌స్ జ‌గ‌న్‌ను క‌లిసిన మ‌ధువాడ అన్న‌దాత‌లు                               టీడీపీ తోక పత్రికలో 108 దుస్థితిపై వచ్చిన కథనాలను ఏమంటారు.. అది నిజం కాకపోతే ఆ వార్తలను ఎందుకు ఖండించలేదు: సుధాక‌ర్‌బాబు                               - విజ‌య‌న‌గ‌రం జిల్లా చీపురుప‌ల్లి నియోజ‌క‌వ‌ర్గంలోని ఆనంద‌పురం క్రాస్ వ‌ద్ద 3100 కిలోమీట‌ర్ల వ‌ద్ద వేప మొక్క‌ను నాటిన వైయ‌స్ జ‌గ‌న్‌                 
    Show Latest News
బ్రిజేష్ ట్రిబ్యునల్ తీర్పుపై విజయమ్మ ధర్నాలు
బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ తీర్పుపై ‌వైయస్ఆర్‌సీపీ కార్యక్రమాలు

Published on : 03-Dec-2013 | 16:44
 

హైదరాబాద్, 3 డిసెంబర్ 2013: కృష్ణా జలాల పంపిణీపై బ్రిజేష్ కుమార్ ట్రిబ్యున‌ల్ ఇచ్చిన తీర్పుకు నిరసనగా వై‌యస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మూడు ప్రాజెక్టుల దగ్గర ధర్నాలు చేపడుతున్నట్లు పార్టీ కేంద్ర పాలక మండలి సభ్యుడు ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు తెలిపారు. పార్టీ గౌరవ అధ్యక్షురాలు‌ శ్రీమతి వైయస్ విజయమ్మతో పాటు ఆయా జిల్లాల రైతాంగం కూడా పెద్ద ఎత్తున పాల్గొననున్నారని చెప్పారు. కృష్ణా - గుంటూరు జిల్లాల మధ్యన ఉన్న పులిచింతల ప్రాజెక్టు వద్ద బుధవారంనాడు ధర్నా చేపట్టనున్నారు. వైయస్ఆర్‌ జిల్లా గండికోట ప్రాజెక్టు సమీపంలో గురువారంనాడు, 6వ తేదీన మహబూబ్‌నగర్‌ జిల్లాలోని జూరాల ప్రాజెక్టు వద్ద ఆమె ధర్నాలు చేస్తారని ఉమ్మారెడ్డి తెలిపారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన పార్టీ నాయకులు గుర్నాథ్‌రెడ్డి, గట్టు రామచంద్రరావుతో కలిసి మీడియా సమావేశంలో మాట్లాడారు.

ఈ ధర్నాల సందర్భంగా బ్రిజేష్‌కుమార్‌ ట్రిబ్యునల్‌ తీర్పు పూర్వాపరాలు, బచావత్‌ అవార్డు, అంతకు ముందు నుంచీ కృష్ణా నదీ జలాల విషయంలో ఉన్న వివాదాల పరిష్కారానికి ప్రభుత్వాలు చేపట్టిన కార్యాచరణ లాంటి పలు అంశాలను వివరించనున్నట్లు తెలిపారు. బ్రిజేష్‌కుమార్‌ ట్రిబ్యునల్‌ తీర్పుపై తీవ్ర నిరసన తెలియజేస్తామన్నారు. బ్రిజేష్‌కుమార్‌ తీర్పుపై ప్రభుత్వం వెంటనే స్పందించి, అది అమలు కాకుండా సుప్రీం కోర్టు నుంచి స్టే తీసుకోవాలని, కేంద్ర ప్రభుత్వం దీనిని గెజెట్‌లో ప్రకటించకుండా ఉండేలా స్టే తీసుకోవాలనే డిమాండ్లతో ప్రాజెక్టుల వద్ద తమ పార్టీ ధర్నాలు నిర్వహించాలని నిర్ణయించిందని చెప్పారు.
ఈ ధర్నాల్లో ప్రాంతాలు, పార్టీలకు అతీతంగా ప్రజలు, రైతులు పాల్గొని మన రాష్ట్రానికి జరగబోతున్న నష్టాన్ని అడ్డుకోవాలని ఉమ్మారెడ్డి విజ్ఞప్తి చేశారు.

సంబంధిత వార్తలు

Home  |  News  |  Downloads  |  Gallery  |  Contact Us  |   Sitemap  

Official Website of YSR Congress Party
Copyright © 2011 ysrcongress.com