Ysrcpnettv
YSR Congress Party Twitter YS Jagna Twitter

YSR Congress

Flash News >>>>
             విశాఖలో నేడు వైయ‌స్ఆర్‌సీపీ సమావేశం                               వైయ‌స్ జ‌గ‌న్‌ను క‌లిసిన ఎంపీటీసీలు                               బ్లాక్‌ డే (బిజిలీ బంద్‌)’ కు సహకరించాలని పార్టీ శ్రేణులకు వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ పిలుపు                               గోపవరపుగూడెం నుంచి ప్రజాసంకల్పయాత్ర 144వ రోజు పాద‌యాత్ర ప్రారంభం                               నీరు-చెట్టు పథకం కింద టీడీపీ నేతలు కోట్ల రూపాయలు కొల్లగొడుతున్నారు: వైయ‌స్ జ‌గ‌న్‌                               నీరు- చెట్టు పేరుతో రూ.కోట్లు కొల్ల‌గొడుతున్న టీడీపీ నేత‌లు: వైయ‌స్ జ‌గ‌న్‌                               గుడిని, గుడిలో లింగాన్ని మింగిన ఘ‌న‌త చంద్ర‌బాబుదే: వైయ‌స్ జ‌గ‌న్‌                               వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి చేప‌ట్టిన ప్ర‌జా సంక‌ల్ప యాత్ర 143వ రోజు అగిరిప‌ల్లి శివారు నుంచి ప్రారంభం                               ఏపీకి జ‌రిగిన అన్యాయానికి నిర‌స‌న‌గా ఏప్రిల్ 30న వంచ‌న దినం : వైయ‌స్ఆర్‌సీపీ సీనియ‌ర్ నేత‌లు బొత్స సత్య‌నారాయ‌ణ‌, ధ‌ర్మాన ప్ర‌సాద‌రావు                 
    Show Latest News
రాజ్యసభ పోటీలో వైయస్ఆర్‌సీపీ పాల్గొనదు
ప్రకటించిన పార్టీ సీజీసీ సభ్యుడు మైసూరారెడ్డి

Published on : 23-Jan-2014 | 19:20
 

హైదరాబాద్, 23 జనవరి 2014: రాజ్యసభ ఎన్నికలకు దూరంగా ఉండాలని వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నిర్ణయించింది. అలాగే వైయస్ఆర్‌సీపీ ఎమ్మెల్యేలెవరూ రాజ్యసభ ఎన్నికల్లో పాల్గొనకూడదని కూడా నిర్ణయించింది. పార్టీ కేంద్ర పాలక మండలి సభ్యుడు డాక్టర్‌ ఎంవీ మైసూరారెడ్డి గురువారం విడుదల చేసిన ఒక ప్రకటనలో ఈ విషయం స్పష్టం చేశారు.

రాజ్యసభ ఎన్నికలలో సొంతంగా అభ్యర్థిని నిలబెట్టి గెలిపించుకునేంత సంఖ్యబలం వైయస్ఆర్‌సీపీకి లేనందున పోటీ చేయడంలేదని పేర్కొన్నారు. మరెవరి బలం మీదో ఆధారపడి అభ్యర్థిని నిలబెట్టడం అంటే కుమ్మక్కు రాజకీయాల్లో భాగం అవుతుందని వైయస్ఆర్‌సీపీ అభిప్రాయం అన్నారు.

అలాంటి రాజకీయాలను విభజనకు అనుకూలంగా ఉన్న మూడు పార్టీలు చేస్తున్నాయని మైసూరారెడ్డి తన ప్రకటనలో పేర్కొన్నారు. నిజానికి ఇద్దరు అభ్యర్థులను గెలిపించుకునే బలం టీడీపీకి లేకపోయినా కాంగ్రెస్‌ సభ్యుల మద్దతు మీద ఆధారపడి, ముందుగానే కాంగ్రెస్‌తో మాట్లాడుకున్న ప్రకారం రెండవ అభ్యర్థిని నిలబెడుతోందని ఆరోపించారు. ఈ చర్య ముమ్మాటికీ కుమ్మక్కు రాజకీయానికి నిదర్శనం అని తెలిపారు. రాష్ట్ర విభజన అంశం నుంచి ప్రజల దృష్టిని మరల్చేందుకు అధికార కాంగ్రెస్‌ పార్టీ ఈ రాజ్యసభ ఎన్నికలను ఒక పథకం ప్రకారం వాడుకుంటోందని ఆరోపించారు.

టీఆర్ఎస్‌కు కూడా రాజ్యసభ అభ్యర్థిని గెలిపించుకునే సంఖ్యాబలం లేదని మైసూరా తెలిపారు. అయినా కాంగ్రెస్, టిఆర్ఎస్‌లు కలిసికట్టుగా అభ్యర్థిని నిలబెడుతున్నాయని స్పష్టం అవుతోందన్నారు. టిఆర్ఎస్‌ అభ్యర్థి గెలిచేందుకు కూడా కాంగ్రెస్‌ సహకరించడం అంతే విభజనకు నేరుగా మద్దతు ఇవ్వటమే అవుతుందని ఆయన తెలిపారు. విభజన లేఖలు ఇచ్చిన ఈ మూడు పార్టీలు రాజ్యసభ ఎన్నికల్లో అభ్యర్థులను పంచుకోవడాన్ని రాష్ట్ర ప్రజలు సహించబోరని వైయస్ఆర్‌సీపీ భావిస్తోందని తన ప్రకటనలో మైసూరా పేర్కొన్నారు.

సంబంధిత వార్తలు

Home  |  News  |  Downloads  |  Gallery  |  Contact Us  |   Sitemap  

Official Website of YSR Congress Party
Copyright © 2011 ysrcongress.com