Ysrcpnettv
YSR Congress Party Twitter YS Jagna Twitter

YSR Congress

Flash News >>>>
             మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు పేరును పశ్చిమ గోదావరి జిల్లాకు పెడతామని వైయ‌స్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రకటించడంపై సర్వత్రా హర్షం                                వైయ‌స్‌ జగన్‌ పాదయాత్రతో దిగొచ్చిన ఏపీ సర్కార్‌, ఆక్వా రైతుల స‌మ‌స్య‌ల‌పై సీఎం స‌మీక్ష‌                               వైయ‌స్‌ జగన్‌మోహన్‌ రెడ్డిని క‌లిసిన ప్రముఖ నటుడు, దర్శకుడు పోసాని కృష్ణమురళి                                ఆకివీడు నుంచి వైయ‌స్ జ‌గ‌న్ 172వ రోజు ప్ర‌జా సంక‌ల్ప యాత్ర ప్రారంభం                               ప‌శ్చిమ గోదావ‌రి జిల్లాకు అల్లూరి సీతారామారాజు పేరు: వైయ‌స్ జ‌గ‌న్‌                               ఆక్వా రైతులకు విద్యుత్తు చార్జీలు 4.75 పైసలు నుండి 1.50 పైసలు వరకు తగ్గిస్తాం: వైయ‌స్ జ‌గ‌న్ హామీ                               టీటీడీ వివాదంపై పూర్తి స్థాయిలో విచారణ జరిపితే వాస్తవాలు వెలుగులోకి వస్తాయి: ఎంపీ వ‌ర‌ప్ర‌సాద్‌                               చంద్ర‌బాబుకు సింగిల్ పోటీ చేసే ధైర్యం లేదు: అంబ‌టి రాంబాబు                               పెదకాపవరం గ్రామ శివారులో రొయ్యల చెరువు క్షేత్రాన్ని సందర్శించిన వైయ‌స్ జ‌గ‌న్‌                 
    Show Latest News
ట్రిబ్యునల్‌ తీర్పుతో ఏపీకి తీరని నష్టం
వైయస్ఆర్‌ సీపీ సీజీసీ, పీఏసీ సభ్యుడు మైసూరారెడ్డి

Published on : 29-Nov-2013 | 15:03
 

హైదరాబాద్, 29 నవంబర్ 2013: కృష్ణాజలాల పంపిణీపై బ్రిజేష్‌ కుమార్‌ ట్రిబ్యునల్‌ ఇచ్చిన తీర్పు వల్ల ఆంధ్రప్రదేశ్‌కు తీరని నష్టం జరిగిందని వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కేంద్ర పాలక మండలి, రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యుడు ఎంవీ మైసూరారెడ్డి ఆందోళన వ్యక్తంచేశారు. ఈ తీర్పును సవరించకపోతే రాష్ట్రానికి తీరని అన్యాయం జరుగుతుందని ఆయన అన్నారు. ఈ తీర్పుతో రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం తేటతెల్లం అయిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా మేల్కొని, తక్షణమే సుప్రీంకోర్టును ఆశ్రయించి, ట్రిబ్యునల్ తీర్పుపై స్టే ‌తేవాలని సూచించారు. బ్రిజేష్‌కుమార్‌ ట్రిబ్యునల్‌ తుది తీర్పు అనంతరం మైసూరారెడ్డి పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు.

ఆంధ్రప్రదేశ్‌కు జరిగిన అన్యాయాన్ని సవరించలేకపోయారని, పాత తీర్పునే మరోసారి ఇచ్చారు తప్ప మార్పేమీ లేదని మైసూరారెడ్డి విచారం వ్యక్తంచేశారు. కాకపోతే రాజోలిబండ డైవర్షన్‌ స్కీమ్‌ (ఆర్‌డీఎస్)కు 4 టీఎంసీల నీటిని అదనంగా కేటాయించాన్నారు. చంద్రబాబు నాయుడి హయాంలోనే కృష్ణానదిపై అక్రమ నిర్మాణాలు జరిగాయని మైసూరారెడ్డి అన్నారు. ప్రధాన ప్రతిపక్షంగా టీడీపీ పూర్తిగా విఫలమైందన్నారు. కృష్ణా డెల్టా రైతులను మెట్ట పంటల వైపు మళ్ళించాలని చంద్రబాబు నాయుడు ఆనాడే చెప్పారన్నారు. మిగులు జలాల పంపిణీ, ఆలమట్టి ఎత్తు పెంపుపై ట్రిబ్యునల్ ఎదుట‌ మన రాష్ట్రం తీవ్రస్థాయిలో ఎన్ని అభ్యంతరాలు వ్యక్తం చేసినా.. వాటిని పరిగణనలోకి తీసుకోకుండా కృష్ణా జలాలపై ట్రిబ్యునల్ తీర్పు‌ ఇచ్చిందని ఆవేదన వ్యక్తంచేశారు.

సంబంధిత వార్తలు

Home  |  News  |  Downloads  |  Gallery  |  Contact Us  |   Sitemap  

Official Website of YSR Congress Party
Copyright © 2011 ysrcongress.com