Ysrcpnettv
YSR Congress Party Twitter YS Jagna Twitter

YSR Congress

Flash News >>>>
             వైయ‌స్ జ‌గ‌న్‌ను క‌లిసిన మ‌ధువాడ అన్న‌దాత‌లు                               టీడీపీ తోక పత్రికలో 108 దుస్థితిపై వచ్చిన కథనాలను ఏమంటారు.. అది నిజం కాకపోతే ఆ వార్తలను ఎందుకు ఖండించలేదు: సుధాక‌ర్‌బాబు                               - విజ‌య‌న‌గ‌రం జిల్లా చీపురుప‌ల్లి నియోజ‌క‌వ‌ర్గంలోని ఆనంద‌పురం క్రాస్ వ‌ద్ద 3100 కిలోమీట‌ర్ల వ‌ద్ద వేప మొక్క‌ను నాటిన వైయ‌స్ జ‌గ‌న్‌                               3100 కిలోమీట‌ర్ల మైలు రాయి చేరుకున్న వైయ‌స్ జ‌గ‌న్ ప్ర‌జా సంక‌ల్ప యాత్ర‌.                               క‌రువు మండ‌లాల కుదింపు దారుణం: వైయ‌స్ఆర్‌సీపీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి భూమ‌న క‌రుణాక‌ర్‌రెడ్డి                               ఐటీ దాడులపై చంద్రబాబు నానా యాగీ చేస్తున్నారు: ఎమ్మెల్యే ఆదిమూల‌పు సురేష్‌                               పోలీసుల‌ను చంద్ర‌బాబు త‌న సొంత ప్ర‌యోజ‌నాల కోసం వాడుకుంటున్నారు: ఎమ్మెల్యే ఆదిమూల‌పు సురేష్‌                               చీపురుప‌ల్లి నియోజ‌క‌వ‌ర్గంలోకి వైయ‌స్ జ‌గ‌న్ ప్ర‌జా సంక‌ల్ప యాత్ర‌                               చంద్రబాబు నిజ స్వరూపాన్ని తెలంగాణ సీఎం కేసీఆర్‌ బయటపెట్టారు: జోగి ర‌మేష్‌                 
    Show Latest News
విజయనగరం జిల్లాకు ఒరగబెట్టిందేమీ లేదు
టిడిపిపై బొత్స ధ్వజం

Published on : 16-May-2018 | 21:39
 

 తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో , నాలుగేళ్ల కాలంలో విజయనగరం జిల్లాకు ఒరిగిందేమీ లేదనీ, రాష్ట్రాన్ని పూర్తిగా అథోగతి పాలు చేశారని వైయస్ ఆర్ కాంగ్రెస్ సీనియర్ నాయకులు బొత్స సత్యనారాయణ మండిపడ్డారు. కేంద్ర కేబినెట్ లో నాలుగేళ్ల పాటు మంత్రిగా ఉన్న అశోక్ గజపతిరాజు , జిల్లా సమస్యలపై ఒక్కసారైనా చర్చించారా అని నిలదీస్తూ, ఆయన అలా చేసి ఉంటే తాను తలదించుకుంటానని అన్నారు. వైయస్ ఆర్ కాంగ్రెస్ పిలుపు మేరకు  విజయనగరం జిల్లాలో జరిగిన వంచన పై గర్జన నిరసన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.

నాలుగేళ్ల కాలంలో జిల్లాను ఏం అభివృద్ధి చేశారో చెప్పాలని డిమాండ్ చేస్తూ, కోట సుందరీకరణ,స్టేడియం అభివృద్ధి తప్ప ఇంకేమీ చేయలేదని అన్నారు. జిల్లాలో ఇసుక మాఫియాను ప్రోత్సహిస్తున్నారని ఆరోపించారు. రైతులు నష్టపోతుంటే కనీసం నష్టపరిహారం అందించలేదని, జిల్లాలో రెండు షుగర్ ఫ్యాక్టరీలు ఉంటే ఒకదానిని మూసేశారన్నారు. బొబ్బిలి షుగర్ ఫ్యాక్టరీకి 7 కోట్ల రూపాయలు బకాయిలు ఉన్నాయని తెలిపారు. 

ప్రతిపక్షంపై అవినీతి ఆరోపణలు చేస్తున్న టీడీపీ నేతలు నాలుగేళ్ల అధికారంలో ఎందుకు నిరూపించలేకపోయారని నిలదీశారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో శాంతి భద్రతలు క్షీణిస్తున్నాయని, చిన్నారులపై అత్యాచారాలు పెరిగిపోతున్నాయని ఆయన ఆందోళనవ వ్యక్తం చేశారు. అత్యాచారాల నివారణకు చైతన్యం రావాల్సింది ప్రజల్లో కాదని, చంద్రబాబు నాయుడు కేబినేట్లో మార్పు రావాలని ఎద్దేవా చేశారు.

సంబంధిత వార్తలు

Home  |  News  |  Downloads  |  Gallery  |  Contact Us  |   Sitemap  

Official Website of YSR Congress Party
Copyright © 2011 ysrcongress.com