Ysrcpnettv
YSR Congress Party Twitter YS Jagna Twitter

YSR Congress

Flash News >>>>
             రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు 72వ స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి                               వైయ‌స్ఆర్‌సీపీ ఆధ్వ‌ర్యంలో ఘ‌నంగా స్వాతంత్ర్య దినోత్స‌వ వేడుక‌లు                               విశాఖ జిల్లా ఎర్రవరంలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న ఏపీ ప్రతిపక్షనేత, వైయ‌స్ఆర్‌సీపీ అధినేత వైయ‌స్‌ జగన్‌మోహన్‌ రెడ్డి                                నర్సీపట్నం నియోజకవర్గం గన్నవరం మెట్ట వద్ద విశాఖ జిల్లాలోకి అడుగుపెట్టిన జననేత వైయ‌స్ జ‌గ‌న్ పాద‌యాత్ర‌                               వైయ‌స్‌ జగన్‌మోహన్‌ రెడ్డి చేపట్టిన ప్ర‌జా సంక‌ల్ప యాత్ర‌ 237వ రోజు కాకరపల్లి నుంచి ప్రారంభం                               వైయ‌స్ఆర్‌సీపీ నిజనిర్ధారణలో భాగంగా గుంటూరు జిల్లా గురజాల వెళ్తున్న మాజీ ఎమ్మెల్సీ కృష్ణారెడ్డి అరెస్ట్                                వైయ‌స్ఆర్‌సీపీ నిజనిర్ధారణలో భాగంగా గుంటూరు జిల్లా గురజాల వెళ్తున్న పార్టీ సీనియర్‌ నేత బొత్స సత్యనారాయణను కాజా టోల్‌గేట్‌ వద్ద అడ్డుకున్న పోలీసులు                                ఆగ‌స్టు 15వ తేదీ నుంచి ప్ర‌కాశం జిల్లాలో మాజీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి పాద‌యాత్ర‌                               రేపు గుర‌జాల‌లో వైయ‌స్ఆర్‌సీపీ నిజ‌నిర్ధార‌ణ క‌మిటీ ప‌ర్య‌ట‌న‌                 
    Show Latest News
అంతులేని అవినీతి పాలన

Published on : 25-Jul-2017 | 18:50
 

– ‘పసుపు’ సూత్రదారులను తప్పించేందుకు యత్నాలు
–మంత్రి సోమిరెడ్డికి దోచుకోవడమే అలవాటుగా మారింది
– విచారణ చేయించే ధైర్యం చంద్రబాబుకు ఉందా..?
–వైయస్సార్‌సీపి జిల్లా అధ్యక్షులు గోవర్దన్‌రెడ్డి

నెల్లూరు(సెంట్రల్‌)తెలుగుదేశం పర్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అవినీతికి అడ్డాగా మారి పాలన సాగుతోందని వైయస్సార్‌సీపి జిల్లా అధ్యక్షులు , సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి గోవర్దన్‌రెడ్డి ధ్వజమెత్తారు. నెల్లూరులోని మాగుంట లే అవుట్‌లో ఉన్న పార్టీ కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో టిడిపి నాయకులు చేస్తున్న అవినీతి, అక్రమాలపై తీవ్ర స్థాయిలో విమర్శించారు. చంద్రబాబు సిఎంగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి అనేక కుంభకోణాలు జరుగుతున్నాయన్నారు. ప్రధానంగా అన్నంపెట్టే రైతులను కూడా తెలుగు తమ్ముళ్లు వదలకుండా మోసం చేయడం సిగ్గుచేటన్నారు. పసుపు కొనుగోలు పేరుతో కోట్లరూపాయల కుంభకోణానికి తెరలేపారన్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల పేరుతో పసుపు కొనుగోళ్లలో కోట్లలో చేతులు మారాయని ఆరోపించారు. రైతులను రుణమాఫీ విషయంలో మోసం చేసిన టిడిపి నాయకులు పసుపు కుంభకోణం పేరుతో మరొక మోసం చేశారని ఆరోపించారు.

పసుపు సూత్రదారులను తప్పించేందుకు యత్నాలు
పసుపు కుంభకోణంలో పసుపు చొక్కా వేసుకున్న వారు ప్రధాన సూత్రదారులుగా ఉండడంతో వారిని తప్పించమని తీవ్ర స్థాయిలో ఒత్తిడులు అధికారులపై వస్తున్నాయన్నారు. దీంతో పలువురు అధికారులు కూడా విచారణ కొనసాగిస్తున్నామని చెపుతున్నారే తప్ప ఇప్పటి వరకు ఏ ఒక్కరిపైనా చర్యలు తీసుకున్న పాపాన పోలేదన్నారు. టీడీపీ నేతలు కుంభకోణంలో ఉన్నారని సాక్షాత్తు ఆ పార్టీకి చెందిన జిల్లా ముఖ్యనేతలే చెపుతున్నారని, ఎందుకు వారిపై చర్యలు తీసుకోవడం లేదని అధికారులను ప్రశ్నించారు. దాదాపుగా 300 ఎకరాలకు గాను 1211 ఎకరాలలో పంట వేసినట్లు నకిలీ పేర్లతో తక్కువ ధరకు నాసిరకం సరుకును తీసుకుని వచ్చారన్నారు.  ధాన్యం కొనుగోలు కేంద్రాలలో విక్రయాలు చేసిన వారిపై ఎందుకు చర్యలు తీసుకోకుండా మౌనంగా ఉన్నారో అధికారులు సమాధానం చెప్పాలన్నారు.

దోచుకోవడం మంత్రికి అలవాటుగా మారింది..
గతంలో మంత్రిగా పనిచేసిన సమయంలో కూడా సోమిరెడ్డి నకిలీ ఎరువుల కుంభకోణంలో కోట్లరూపాయలు దోచుకున్నారని, ఇప్పుడు కూడా వ్యవసాయ శాఖ మంత్రిగా ధాన్యం కొనుగోలు కేంద్రాల పేరుతో పుసుపు కుభంకోణం చేసి కోట్లు దోచుకుని దాచుకుంటున్నారని ఆరోపించారు. తాము నిప్పులాంటి మనుషులమని చెప్పుకొస్తున్న చంద్రబాబు, సోమిరెడ్డి వారిపై వస్తున్న ఆరోపణలపై ఎందుకు నోరుమెదపడం లేని ప్రశ్నించారు. నీరుచెట్టులో కోట్లాది రూపాయల కుంభకోణం బయటపడిందన్నారు. వాటిపై కూడా అధికారులు ఎవరిపై చర్యలు తీసుకోకుండా వదిలేశారన్నారు. ఇప్పుడు కూడా పసుపు కుంభకోణాన్ని పక్కదారి పట్టించేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తున్నారని ఆరోపించారు. తనపై వస్తున్న ఆరోపణలపై విచారణ చేయించుకుని నిజాయితీని నిరూపించే వరకు సోమిరెడ్డి తన మంత్రి పదవికి రాజీనామా చేయాలని డిమాండ్‌ చేశారు. ఈ విషయంపై చంద్రబాబు విచారణ చేయించి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. ఈ సమావేశంలో వెంకటాచలం జెడ్పీటీసి వెంకటశేషయ్య, మెట్టా విష్టువర్దన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

Home  |  News  |  Downloads  |  Gallery  |  Contact Us  |   Sitemap  

Official Website of YSR Congress Party
Copyright © 2011 ysrcongress.com