Ysrcpnettv
YSR Congress Party Twitter YS Jagna Twitter

YSR Congress

Flash News >>>>
             తుమ్మికాపాలెం నుంచి వైయ‌స్ జ‌గ‌న్ 270వ రోజు ప్రజాసంకల్పయాత్ర ప్రారంభం                               ప్రజా సంకల్ప యాత్రలో చారిత్రాత్మక ఘట్టం. 3000 కిలోమీటర్ల మైలురాయి చేరుకున్న వైయస్‌ జగన్‌                                వైయ‌స్‌ జగన్‌మోహన్‌ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర విజయనగరం లోకి ప్రవేశం                               దేశపాత్రునిపాలెం వద్ద 3వేల కిలోమీటర్ల పైలాన్‌ ఆవిష్కరణ                               ఏపీలో వ్యవసాయ రంగం కుదేలు కావడానికి చంద్రబాబు అనుసరిస్తున్న విధానాలే కారణం: వైయ‌స్ఆర్‌సీపీ రైతు విభాగం అధ్యక్షుడు ఎంవీఎస్‌ నాగిరెడ్డి                                సంక్షేమ రాజ్యం రావాలంటే వైఎస్‌ జగన్‌ సీఎం కావాలి.. కావాల్సిందే: బొత్స సత్యానారాయణ                                ఇంటికో రేటు.. పెన్షన్‌కో రేటు వసూలు: వైయ‌స్ఆర్‌సీపీ సీనియ‌ర్ నాయ‌కులు బొత్స స‌త్య‌నారాయ‌ణ‌                               కాగ్‌ నివేదికలో పోలవరం అవినీతి బట్టబయలు అయింది: ఎమ్మెల్యే బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి                                వైయ‌స్‌ జగన్‌ పాదయాత్రలో ఊళ్లకు ఊళ్లు కదిలివస్తున్నాయి.. దేశంలోనే వైయ‌స్‌ జగన్‌ వంటి ప్రజాదరణ కలిగిన నేత మరొకరు లేరు: తలశిల రఘురాం                 
    Show Latest News
టీడీపీవి వంచన యాత్రలు

Published on : 30-Nov-2016 | 18:36
 

కదిరి: తెలుగుదేశం పార్టీ గత కొద్ది రోజులుగా చేపట్టిన జనచైతన్య యాత్రలకు జనమెవ్వరూ హాజరు కావడం లేదని, అవి టీడీపీ వంచన యాత్రలని ఉరవకొండ వైయస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యే విశ్వేశ్వర్‌రెడ్డి మండిపడ్డారు. టీడీపీ సభ్యత్వ నమోదు కార్యక్రమాలకు అధికారులు ఎందుకు హాజరవుతున్నారో అర్థం కావడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. గడప గడపకు వైయస్‌ఆర్‌ కార్యక్రమంలో భాగంగా బుధవారం ఆయన కదిరి నియోజకవర్గం గాండ్లపెంట మండలంలో పర్యటించారు. వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కదిరి నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్‌ సిద్దారెడ్డి స్వగృహంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడారు. ‘ఎన్నికలకు మునుపు చంద్రబాబు నాయుడు ప్రజలకిచ్చిన ఒక్క హామీ కూడా నెరవేర్చలేదని ఫైర్ అయ్యారు. 

తమ అధినేత వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఇచ్చిన పిలుపు మేరకు జూలై 8 నుంచి గడప గడపకూ వైయస్‌ఆర్‌ కార్యక్రమాన్ని నిర్వీరామంగా కొనసాగిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమానికి ప్రతి నియోజకవర్గంలోనూ ప్రజల నుంచి అనూహ్య స్పందన లభిస్తోందని విశ్వేశ్వర్‌రెడ్డి తెలిపారు. ఎన్నికలెప్పుడొస్తాయా..చంద్రబాబును ఎప్పుడు ఇంటికి సాగనంపుదామా అని ప్రజలు ఎదురు చూస్తున్నారని పేర్కొన్నారు. ఈ ప్రభుత్వం ఇప్పటిదాకా ప్రజలకు ఉపయోగపడే ఒక్క పనికూడా చేయలేదు అని విమర్శించారు. చంద్రబాబు హయాంలో వ్యవసాయ రంగం పూర్తిగా నిర్వీర్యమై పోయిందని  ఆందోళన వ్యక్తం చేశారు. కరువు సహాయక చర్యలు చేపట్టడంతో రాష్ట్ర సర్కారు పూర్తిగా విఫలమైందని ధ్వజమెత్తారు. 

ఏపీకి ప్రత్యేకహోదా ఇవ్వాల్సిందేనని కేంద్రాన్ని గట్టిగా ప్రశ్నించడానికి చంద్రబాబు గొంతు మూగబోయిందని దుయ్యబట్టారు. ఆయన ఓటుకు కోట్లు కేసులో పీకల్లోతు ఇరుక్కుపోవడం వలన రాష్ట్ర భవిష్యత్‌ను కేంద్రం వద్ద తాకట్టు పెట్టారని విమర్శించారు.  టీడీపీ ప్రభుత్వ హయాంలో ఉద్యోగాలొస్తాయన్న  యువత ఆశలు వదులుకోవల్సిందే అన్నారు. నోట్ల రద్దును తాము వ్యతిరేకించడం లేదు కానీ దాని మూలంగా సామాన్య, మధ్య తరగతి ప్రజలు 20 రోజులుగా చాలా ఇబ్బందులు పడుతున్నారని ఆయన గుర్తు చేశారు. సమావేశంలో వైయస్‌ఆర్‌సీపీ కదిరి నియోజకవర్గ సమన్వయకర్త పివి.సిద్దారెడ్డి, రాష్ట్ర కార్యదర్శి వజ్రభాస్కరరెడ్డి, కౌన్సిలర్లు పాల్గొన్నారు.















 

సంబంధిత వార్తలు


ప్రతి ఇంటికీ నవరత్నాలు
YSRCP Navaratna YS Rajashekar Reddy YS Rajashekar Reddy Emperor of Corruption YS Rajashekar Reddy Central Assistance to AP Prajalachentha
Home  |  News  |  Downloads  |  Gallery  |  Contact Us  |   Sitemap  

Official Website of YSR Congress Party
Copyright © 2011 ysrcongress.com