Epaper      Ysrcpnettv
YSR Congress Party Twitter YS Jagna Twitter

YSR Congress

Flash News >>>>
             చంద్రబాబు పత్రికా స్వేచ్ఛను హరించేందుకు కుట్ర చేస్తున్నాడుః అంబటి రాంబాబు                               ఎప్పుడు ఎన్నికలు జరిగినా టీడీపీ తుక్కుతుక్కుగా ఓడిపోవడం ఖాయంః అంబటి రాంబాబు                               చంద్రబాబు రాజకీయ వ్యభిచారం చేస్తున్నాడుః వాసిరెడ్డి పద్మ                               భవిష్యత్తులో బాబు జైలుకెళ్లడం ఖాయంః వైయస్సార్సీపీ నేతలు                               అవినీతి అంటేనే చంద్రబాబు నాయుడు..రూ.2లక్షల కోట్లు అవినీతికి పాల్పడ్డాడుః వెల్లంపల్లి శ్రీనివాస్                               జాతీయ పార్టీలు హోదా గురించి మాట్లాడేలా చేద్దాంః వైయస్ జగన్                               చంద్రబాబు,వెంకయ్యనాయుడులు ఇద్దరూ ఐదుకోట్లమందికి వెన్నుపోటు పొడిచారుః వైయస్ జగన్                               తెలుగుదేశం పార్టీని బాబు తెలుగుద్రోహుల పార్టీగా మార్చాడుః వైయస్ జగన్                               హోదా కోసం ధర్నా చేస్తే పిల్లలని కూడా చూడకుండా పీడీయాక్ట్ పెట్టాలని బాబు ఆదేశాలు జారీ చేస్తున్నాడుః వైయస్ జగన్                 
    Show Latest News
ప్రజలు దుర్భర పరిస్థితుల్లో ఉన్నారు

Published on : 07-Jan-2017 | 12:20
Share    

అనంతపురంః అర్బన్ నియోజకవర్గ ఇంచార్జ్, మాజీ ఎమ్మెల్యే గుర్నాథరెడ్డి పట్టణంలోని డివిజన్ లలో నిర్వహిస్తున్న గడపగడపకు వైయస్ఆర్ కార్యక్రమానికి విశేష స్పందన లభిస్తోంది. వైయస్సార్సీపీ నేతలకు ప్రజలు నీరాజనం పడుతున్నారు. ఈ సందర్భంగా గుర్నాథరెడ్డి మాట్లాడుతూ...ఎక్కడికెళ్లినా సమస్యలే దర్శనమిస్తున్నాయని అన్నారు.  పింఛన్లు అందడం లేదు. రేషన్ ఇవ్వడం లేదని మహిళలు వాపోతున్నారని పేర్కొన్నారు.  స్టోర్ ల దగ్గర మహిళలు ఉదయం నుంచి సాయంత్రం దాకా ఉన్నా వేలిముద్రలు పడడం లేదని వెనక్కిపంపుతున్నారని, పరిస్థితిని చక్కదిద్దాలని ప్రభుత్వానికి సూచించారు. తాగునీటి సమస్య తీవ్రంగా ఉందని, ప్రజలు దుర్భర పరిస్థితులు  ఎదుర్కొంటున్నారని చెప్పారు. నగరపాలక సంస్థ తీరును ప్రజలు పూర్తిగా వ్యతిరేకిస్తున్నారన్నారు.  వైయస్ఆర్ ఉన్నప్పుడే అన్ని సమస్యలు పరిష్కరించేవాడని ప్రజలంతా అంటున్నారని, కనీస వసతులు కల్పించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు.   మహిళలు, వృద్ధులు, విద్యార్థులు, నిరుద్యోగులు ప్రతీ ఒక్కరూ బాబు పాలనపై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారని, టీడీపీకి తగిన గుణపాఠం చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారని తెలిపారు.

సంబంధిత వార్తలు

Home  |  News  |  Downloads  |  Gallery  |  Contact Us  |   Sitemap  

Official Website of YSR Congress Party
Copyright © 2011 ysrcongress.com