Ysrcpnettv
YSR Congress Party Twitter YS Jagna Twitter

YSR Congress

Flash News >>>>
             వివిధ అంశాలపై నేతలతో చర్చించిన వైయస్ జగన్                               పార్టీ ముఖ్య నేతలతో వైయస్ జగన్ సమావేశం                               చంద్రబాబు వేల కోట్లు మింగేసిన రాజకీయ మాంసాహారిః అంబటి                               సదావర్తి దేవుడి భూములను లోకేష్ దోచుకునే ప్రయత్నం చేశారుః అంబటి                               కేసీ కెనాల్, తెలుగుగంగకు నీరివ్వాలని డిమాండ్ చేస్తూ మైదుకూరులో వైయస్‌ఆర్‌ సీపీ ధర్నా                               పార్టీ సీనియర్లు, ముఖ్య నేతలతో వైయస్ జగన్ భేటీ.."వైయస్ఆర్ కుటుంబం"పై సమీక్ష                               వైయస్ఆర్ కుటుంబంలో 38లక్షల మంది చేరిక                               చంద్రబాబు అరాచకాలు, అంకెల గారడీకి యనమల అసిస్టెంట్ః కొరుముట్ల                                సదావర్తి భూ కుంభకోణంపై సీబీఐ విచారణ జరిపించాలిః ఆర్కే                 
    Show Latest News
నవరత్నాలతో ఉజ్వల భవిష్యత్తు

Published on : 09-Sep-2017 | 18:00
 

వైయ‌స్ఆర్‌సీపీ రాష్ట్ర ప్ర‌చార కార్య‌ద‌ర్శి గోపాల్‌రెడ్డి
ఆదోని:  వైయ‌స్ఆర్ కాంగ్రెస్‌ పార్టీ అధినేత వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రక‌టించిన‌ నవరత్నాల పథకాలతో ప్ర‌జ‌ల‌కు ఉజ్వల భవిష్యత్తు వుంటుందని పార్టీ రాష్ట్ర ప్రచార కమిటీ కార్యదర్శి గోపాల్‌రెడ్డి, పట్టణ గౌరవ అధ్యక్షుడు చంద్రకాంత్‌రెడ్డి అన్నారు. రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం నవరత్నాల పథకాలను అమలు చేయడం జరుగుతుందన్నారు. శనివారం ఆదోని ప‌ట్ట‌ణంలోని ద్వారకా ఫంక్షన్‌ హాలులో బూత్‌ కమిటీ సభ్యుల సమావేశాన్ని నిర్వహించారు. ఈసందర్భంగా వారు మాట్లాడారు. నవరత్నాల పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్దామన్నారు. బూత్‌ కమిటీ సభ్యులదే ప్రధాన పాత్ర అన్నారు. ప్రతి ఇంటికి వెళ్లి వారి స్థితిగతులను తెలుసుకోవడం, కుటుంబ సభ్యుల వివరాలు, నవరత్నాల పథకాలను వారికి వివరిచాలన్నారు. అధికార పార్టీ టీడీపీ అవలంభిస్తున్న ప్రజా వ్యతిరేఖ విధానాలను వివరించాలని సూచించారు. 2019 ఎన్నికల్లో ఎమ్మెల్యేగా సాయిప్రసాద్‌రెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించి, వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డిని సీఎం చేయడమే పార్టీ నాయకులు, కార్యకర్తల ముఖ్య కర్తవ్యమన్నారు. ఐదెకరాల లోపు వున్న సన్నా, చిన్న కారు రైతులకు ఏటా పన్నెండున్న వేల చొప్పున నాలుగేళ్లలో రూ. 50 వేల చెల్లింపు, డ్వాక్రా పొదుపు సంఘాల మహిళలకు రూ.15 వేల కోట్ల రుణాల మంజూరు, పింఛన్‌దారులకు వెయ్యి నుంచి రూ.2 వేలు అందజేయడం జరుగుతుందన్నారు. భూమిలేని నిరుపేదల కుటుంబాల్లో ఆనందాన్ని నింపడం, పిల్లల చదువులకు ప్రతి కుటుంబానికి ఏడాదికి పది నుంచి 20 వేల తల్లుల చేతికే అందజేయడం, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, మత్సకారులు, నాయి బ్రాహ్మణులు, రజకులు తదితర వర్గాలకు భరోసా జరుగుతుందన్నారు. అర్హులైన పేదలందరికీ పక్కా ఇళ్లు నిర్మిస్తామన్నారు. ఆరోగ్యశ్రీ పథకం పునఃప్రారంభించి దివంగత సీఎం వైఎస్‌ రాజశేఖరరెడ్డి పరిపాలనను తిరిగి తీసుకొస్తామన్నారు. 108 అంబులెన్స్‌ 20 నిముషాల్లోనే బాధితుల వద్దకు వచ్చేలా చూస్తారని, 104కు పూర్వ వైభవం, ఆయా పాథకాలన్నింటికి బడ్జెట్‌లో నిధుల కేటాయింపు జరుగుతుందన్నారు. ఫీజ్‌ రీఎంబర్స్‌మెంట్‌తోపాటు భోజన వసతి, ఏటా రూ.20 వేలను విద్యార్థికి ఇచ్చేలా పథకాన్ని రూపొందించారన్నారు. జలయజ ్ఞం ప్రాజెక్టు కింద సాగు నీటి పథకాలను పూర్తి చేయడం, మూడు దశల్లో మద్యం నిషేదం అమలు చేస్తూ కుటుంబ ఆప్యాయతలను సాధిస్తామన్నారు. సమావేశంలో పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి సలీం, కార్యవర్గ సభ్యులు కామాక్షి తిమ్మప్ప, జిల్లా కార్యదర్శి ప్రసాదరావు, పారిశ్రామికవేత్త రవిరెడ్డి, మాజీ సర్పంచ్‌ శేషిరెడ్డి, పట్టణ అధ్యక్షుడు దేవా, విద్యార్థి విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు రఘునాథ్‌రెడ్డి, ఫయాజ్‌ అహ్మద్, మార్కెట్‌యార్డు మాజీ వైస్‌ చైర్మన్‌ రాముడు, నాయకులు వైపి. గంగాధర్, ఎస్సీ సెల్‌ పట్టణ అధ్యక్షుడు క్రిష్ణమోహన్, డా. భాస్కర్, మున్సిపల్‌ మాజీ వైస్‌ చైర్మన్‌ సునార్‌ అబ్దుల్‌ఖాదర్, సూరి, జైపాల్, రహమాన్, చాంద్‌బాష తదితరులు పాల్గొన్నారు. 

సంబంధిత వార్తలు

Home  |  News  |  Downloads  |  Gallery  |  Contact Us  |   Sitemap  

Official Website of YSR Congress Party
Copyright © 2011 ysrcongress.com