Ysrcpnettv
YSR Congress Party Twitter YS Jagna Twitter

YSR Congress

Flash News >>>>
             నంద్యాలకు దొంగల ముఠా నాయకుడు వస్తున్నాడు..ప్రజలారా బాబు మోసపూరిత మాటలు నమ్మవద్దుః బొత్స                               వైయస్ జగన్ సమక్షంలో పార్టీలో చేరిన నంద్యాల మాజీ ఎమ్మెల్యే సంజీవరెడ్డి                               దేవరపల్లి ఘటనపై కేంద్రమంత్రి రాజ్ నాథ్ సింగ్, ఎస్సీ కమిషన్ ఛైర్మన్ కఠారియాకు ఫిర్యాదు చేసిన ఎంపీ వైవీ                               బాబు తన రాజకీయ స్వార్థం కోసం దళితులపై దాడులు చేయిస్తున్నాడుః బత్తుల                               చంద్రబాబు తన పాలనలో కులవివక్షను పెంచిపోషిస్తున్నాడుః బత్తుల                               రాష్ట్రపతి ఎన్నికల్లో రామ్ నాథ్ కోవింద్ ఘన విజయం..వైయస్ జగన్ హర్షం                               జగనన్న వస్తే టీడీపీకి పుట్టగతులుండవని బాబు భయపడుతున్నాడుః భూమన                               వైయస్‌ఆర్‌ దానకర్ణుడు... చంద్రబాబు కుంభకర్ణుడుః భూమన                               వైయస్సార్సీపీ నుంచి గెలిచి బాబు సంకలో దూరి మంత్రులుగా కొనసాగడం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడమేః అంబటి                 
    Show Latest News
సంక్షేమ పథకాల అమలులో పక్షపాతం

Published on : 15-Jul-2017 | 19:12
 

– గడపగడపకూ వైయస్సార్‌లో ప్రజల ఆవేదన
వాకాడు : ప్రభుత్వం నుంచి అరకొరగా అమలయ్యే సంక్షేమ పథకాలను అమలు చేయడంలో టీడీపీ నాయకులు పక్షపాతం చూపుతున్నారని గంగన్నపాళెం ప్రజలు ఆవేదన వ్యక్తం చేశారు. శనివారం మండలంలోని గంగన్నపాళెం, వాలమేడు గ్రామాల్లో వైయస్సార్‌సీపీ మండల కన్వీనర్‌ నేదురుమల్లి ఉదయ్‌శేఖర్‌రెడ్డి ఆధ్వర్యంలో గడపగడపకూ వైయస్సార్‌ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ గూడూరు నియోజకవర్గ సమన్వయకర్త మేరిగ మురళీధర్‌ ఇంటింటికీ తిరిగి ప్రభుత్వ వైఫల్యాలను వివరిస్తూ ప్రజాబ్యాలెట్‌ అందజేశారు. గ్రామంలోని పలు సమస్యలపై ప్రజలు ఎకరువు పెట్టారు. కరువుతో గ్రామంలో కూలి పనులు లేక ప్రజలు అల్లాడుతుంటే కనీసం ఉపాధి పనులు కూడా చూపకపోతే తాము ఎలా బతకాలంటూ మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే పక్కాగృహాలు, సీసీ రోడ్లు, డ్రైనేజ్‌ వ్యవస్థ, తాగునీరు తదితర సమస్యలతో అల్లాడుతున్నామని ప్రజలు వాపోయారు. తాగునీరు అందక డబ్బులు పెట్టి క్యాన్‌లు కొనుగోలు చేసి గొంతు తడుపుకోవాల్సిన దుస్థితి ఏర్పడిందని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. వార్ధా తుపాన్‌ సమయంలో తమ పొలాలు కోతకు గురై తీవ్రంగా నష్టపోయినా ప్రభుత్వం ఒక్క పైసా కూడా పరిహారం చెల్లించలేదని రైతులు వాపోయారు. మేరిగి మురళీధర్‌ స్పందిస్తూ తమ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి అయితే అన్ని సమస్యలు తీరిపోతాయని ప్రజలకు భరోసా ఇచ్చారు. అన్ని వర్గాల ప్రజలు లబ్ధి పొందే విధంగా ప్లీనరీలో ప్రవేశపెట్టిన 9 పథకాలను మురళీధర్‌ ప్రజలకు వివరించారు. కార్యక్రమంలో నాయకులు పల్లంపర్తి గోపాల్‌రెడ్డి, తిరుమూరు వెంకటకృష్ణారెడ్డి, కాశీపురం శ్రీనివాసులు, ఖాజా, రాయిపు రవీంద్ర, పూనమల్లి బాలకృష్ణ, చెల్లా జనార్దన్, ముడి పెంచలయ్య తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

Emperor of Corruption YS Rajashekar Reddy YS Rajashekar Reddy Central Assistance to AP
Prajalachentha Epaper Youtube
Home  |  News  |  Downloads  |  Gallery  |  Contact Us  |   Sitemap  

Official Website of YSR Congress Party
Copyright © 2011 ysrcongress.com