Ysrcpnettv
YSR Congress Party Twitter YS Jagna Twitter

YSR Congress

Flash News >>>>
             రాష్ట్ర విభజన జరుగకూడదని చంద్రబాబు ఎప్పుడైనా అన్నారా? - బొత్స సత్యనారాయణ                               చ‌ంద్ర‌బాబు జీవితం అంతా వెన్నుపోటు రాజకీయమే- తమ్మినేని సీతాారాం                               ప్రజా సంకల్ప యాత్ర నుంచి దృష్టి మళ్లించడానికి అధికార పార్టీ కుయుక్తులు- వాసిరెడ్డి పద్మ                               సంక్షేమ హాస్టళ్లను మూసి వేస్తున్నారు-వైయస్ జగన్                               బాబును సీఎం కుర్చీ నుంచి దించితేనే మంచి రోజులు-వైయస్ జగన్                               తూ.గో డీసీసీ మాజీ అధ్యక్షుడు వైయ‌స్ఆర్‌సీపీలో చేరిక‌                               ప్రజల సమస్యలన్నింటినీ అధికారంలోకి వచ్చాక పరిష్కరిస్తాం..మీడియా తో వైయస్ జగన్ మోహన్ రెడ్డి                               హోదా కోసం నిస్వార్థంగా పోరాడుతున్నాం-ఎంపి వైవీ సుబ్బారెడ్డి                               ఎవరు ఏ సమస్య చెప్పినా..వినడానికి నేను సిద్ధం..వైయస్ జగన్                 
    Show Latest News
పాల‌న‌ గాలికొదిలి విదేశీ పర్యటనలు

Published on : 11-May-2017 | 11:30
 

ప్ర‌కాశంః ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు రాష్ట్ర ప‌రిపాల‌న‌ను గాలికొదిలేసి విదేశీ ప‌ర్య‌ట‌న‌ల పేరుతో ప్ర‌జాధ‌నాన్ని దుర్వినియోగం చేస్తున్నాడ‌ని వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్ర‌కాశం జిల్లా చీరాల నియోజ‌క‌వ‌ర్గ స‌మ‌న్వ‌య‌క‌ర్త య‌డం బాలాజీ విమ‌ర్శించారు. చంద్ర‌బాబు మూడేళ్ల ప‌రిపాల‌న‌లో ప్ర‌జ‌ల‌కొరిగింది ఏమీలేద‌న్నారు. వేట‌పాలెం మండ‌లం రామ‌న్న‌పేట గ్రామ పంచాయ‌తీ ప‌రిధిలోని స‌మైఖ్య‌న‌గ‌ర్‌లో య‌డం బాలాజీ ఆధ్వ‌ర్యంలో గ‌డ‌ప గ‌డ‌ప‌కూ వైయ‌స్ఆర్ కార్య‌క్ర‌మాన్ని నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా గ్రామ‌స్థులు ఆయ‌న‌కు స‌మ‌స్య‌ల‌ను మొర‌పెట్టుకున్నారు. జ‌న్మ‌భూమి క‌మిటీల పేరుతో టీడీపీ నేత‌లు అర్హులైన వారికి సంక్షేమ ప‌థ‌కాలు అంద‌కుండా చేస్తున్నార‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. అనంత‌రం య‌డం బాలాజీ మాట్లాడుతూ... టీడీపీ ప‌రిపాలన అంతా అవినీతిమ‌యంగా త‌యారైంద‌ని ఆరోపించారు. వైయ‌స్ఆర్ సీపీ అధ్య‌క్షులు వైయ‌స్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డిని ముఖ్య‌మంత్రిని చేసుకుంటే ప్ర‌జా స‌మ‌స్య‌లు ప‌రిష్కారం అవుతాయ‌ని, దివంగ‌త మ‌హానేత రాజ‌న్న ప‌రిపాల‌న మ‌ళ్లీ తిరిగొస్తుంద‌న్నారు. కార్య‌క్ర‌మంలో పార్టీ నాయ‌కులు కోలుకుల వెంక‌టేష్‌, పింజ‌ల శార‌దాంబ త‌దిత‌రులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

Home  |  News  |  Downloads  |  Gallery  |  Contact Us  |   Sitemap  

Official Website of YSR Congress Party
Copyright © 2011 ysrcongress.com