Ysrcpnettv
YSR Congress Party Twitter YS Jagna Twitter

YSR Congress

Flash News >>>>
             కడప స్టీల్ ప్లాంట్‌ను ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేస్తూ వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ శనివారం కడపలో మహా ధర్నా                               చింత‌ల‌ప‌ల్లి నుంచి 196వ రోజు ప్రజాసంకల్పయాత్ర ప్రారంభం                               దేశంలోనే సీనియర్‌ నాయకుడిని అని చెప్పుకునే చంద్రబాబు యూటర్న్‌ ఎందుకు తీసుకున్నారు: ఉమ్మారెడ్డి వెంక‌టేశ్వ‌ర్లు                               రాష్ట్ర ప్రయోజనాల పరిరక్షణ కోసమే రాజీనామాలు చేశాం: మేకపాటి రాజమోహన్‌రెడ్డి                               ప్రత్యేక హోదా కోసం పోరాటం కొనసాగిస్తూ ఉంటామని, సాధించే వరకు తమ పోరాటం ఆగదు : మిథున్‌ రెడ్డి                                వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి రాష్ట్ర ప్రజల హితం కోరి తీసుకున్న నిర్ణయానికి కట్టుబడి ఎంపీ ప‌ద‌వుల‌కు రాజీనామా చేశాం: ప‌్ర‌త్యేక‌హోదా కోసం రాజీనామా చేసిన ఎంపీలు                               వైయ‌స్ఆర్‌ సీపీ లోక్‌సభ సభ్యుల రాజీనామాలను ఆమోదించిన‌ స్పీకర్‌ సుమిత్రా మహాజన్                                శివకోడు నుంచి 195వరోజు ప్రజాసంకల్పయాత్ర ప్రారంభం                               ఉక్కు ప‌రిశ్ర‌మ సాధ‌న‌కు ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాదరెడ్డి రెండో రోజు నిరాహార దీక్ష‌కు అనూహ్య మద్దతు                  
    Show Latest News
ప్ర‌జా సంక్షేమాన్ని గాలికొదిలేసిన బాబు

Published on : 17-Jul-2017 | 11:35
 

శ్రీ‌కాకుళం: చ‌ంద్ర‌బాబు పేద ప్ర‌జ‌ల సంక్షేమాన్ని గాలికొదిలేసి అవినీతి, అక్ర‌మాల‌తో రాష్ట్రంలో ప‌రిపాల‌న చేస్తున్నాడ‌ని వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్య‌క్షురాలు రెడ్డి శాంతి విమ‌ర్శించారు. శ్రీ‌కాకుళం జిల్లా పాత‌ప‌ట్నం నియోజ‌క‌వ‌ర్గ ప‌రిధిలోని ఎల్ఎన్ పేట మండ‌లం కృష్ణాపురం గ్రామంలో రెడ్డి శాంతి ఆధ్వ‌ర్యంలో గ‌డ‌ప‌ గ‌డ‌ప‌కూ వైయ‌స్ఆర్ కార్య‌క్ర‌మం నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా ఆమె స్థానిక ప్ర‌జ‌లు ఎదుర్కొంటున్న స‌మ‌స్య‌లను అడిగి తెలుసుకున్నారు. అనంత‌రం రెడ్డి శాంతి మాట్లాడుతూ.. చంద్ర‌బాబు త‌నకున్న అనుభ‌వాన్ని దోపిడీకి ఉప‌యోగిస్తున్నాడ‌ని ఆరోపించారు. ప్ర‌జ‌లంతా స‌మ‌స్య‌ల వ‌ల‌యంలో కొట్టుమిట్టాడుతుంటే సీఎం త‌న‌కు ప‌ట్ట‌న‌ట్లు వ్య‌వ‌హ‌రిస్తున్నాడ‌ని మండిప‌డ్డారు. రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీకి నూక‌లు చెల్లాయ‌ని, రానున్న‌ది మ‌హానేత వైయ‌స్ఆర్ పాల‌న అని వారికి భ‌రోసా ఇచ్చారు. కార్య‌క్ర‌మంలో పార్టీ నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

Home  |  News  |  Downloads  |  Gallery  |  Contact Us  |   Sitemap  

Official Website of YSR Congress Party
Copyright © 2011 ysrcongress.com