Ysrcpnettv
YSR Congress Party Twitter YS Jagna Twitter

YSR Congress

Flash News >>>>
             త్వరలోనే బీసీ గర్జన చేపట్టి బీసీ డిక్లరేషన్ ప్రకటిస్తాంః వైయస్ జగన్                               చంద్రబాబు ఫ్యాక్షన్ పాలన చేస్తున్నాడుః వైయస్ జగన్                               ఒక్కసారి వైయస్ఆర్ సువర్ణయుగాన్ని గుర్తుకు తెచ్చుకోండి..బీసీల సమావేశంలో వైయస్ జగన్                               ప్రతి బీసీ సొదరుడి మొహంలో చిరునవ్వులు చూడడమే తన లక్ష్యంః వైయస్ జగన్                               మైదుకూరు నియోజకవర్గం కానగూడురులో బీసీలతో వైయస్ జగన్ ఆత్మీయ సమ్మేళనం                               7వరోజు దిగ్విజయంగా వైయస్ జగన్ ప్రజాసంకల్ప యాత్ర                               బోటు ప్రమాదంపై వైయస్ జగన్ మోహన్ రెడ్డి దిగ్భ్రాంతి                               అధికారంలోకి వస్తే అర్హులైనవారందరికీ పెన్షన్లు అందిస్తాం- వైయస్ జగన్ మోహన్ రెడ్డి                               'టీడీపీకి దమ్ముంటే జగన్ సవాల్ స్వీకరించాలి'- బుగ్గన రాజేంద్ర ప్రసాద్                 
    Show Latest News
ప్ర‌జా సంక్షేమ‌మే వైయ‌స్ఆర్‌సీపీ ధ్యేయం

Published on : 13-Sep-2017 | 18:43
 

కొల్లూరు (మంగ‌ళ‌గిరి): చ‌ంద్ర‌బాబు నాయుడు ఎన్నిక‌ల ముందు ఎన్నో వాగ్దానాలు చేసి ఏ ఒక్క‌టీ నెర‌వేర్చ‌లేద‌ని, అలాంటి స‌ర్కార్‌ను గ‌ద్దె దించాల్సిన అవ‌స‌రం ఎంతైనా ఉంద‌ని వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ  వేమూరు నియోజ‌క‌వ‌ర్గ స‌మ‌న్వ‌య‌క‌ర్త మేరుగ నాగార్జున అన్నారు. బుధవారం కొల్లూరులో వైయ‌స్ఆర్ కుటుంబ కార్య‌క్ర‌మాన్ని ప్రారంభించిన అనంత‌రం ఆయ‌న మాట్లాడుతూ వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ ధ్యేయం ప్ర‌జా సంక్షేమ‌మే అని అన్నారు. అయితే ఇప్పుడు  టీడీపీ నేతలు అక్రమాలతో కోట్లు దోచుకుతింటున్నారని విమర్శించారు. పేద, మద్యతరగతి ప్రజల కనీస అవసరాలను ప్రభుత్వం పట్టించుకోకుండా సంక్షేమ పథకాలను నీరుగారుస్తుందన్నారు.  వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి నేతృత్వంలోని వైయ‌స్ఆర్‌సీపీ అధికారంలోకి వస్తే చేపట్టనున్న పథకాల గురించి ఆయన ఇంటింటికి తిరిగి వివరించారు. నవరత్నాల పథకాల వల్ల ప్రజలకు చేకూరనున్న లబ్ధి గురించి మహిళలకు తెలియజేశారు. ప్రజా ఆమోదంతో ఇంటింటికి రాజన్న స్టిక్కర్లు అంటించి సభ్యత్వ నమోదు చేపట్టారు. మండలంలోని పోలింగ్‌బూత్‌ కమిటీలు సైనికుల్లా ఇంటింటికి తిరిగి ప్రభుత్వ వైపల్యాలను వివరించాలని నాగార్జున సూచించారు.

సంబంధిత వార్తలు

Home  |  News  |  Downloads  |  Gallery  |  Contact Us  |   Sitemap  

Official Website of YSR Congress Party
Copyright © 2011 ysrcongress.com